ప్రత్యేక హోదా కోసం ఆమరణదీక్ష
నెల్లూరు(సెంట్రల్): రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ ఆంధ్ర రాష్ట్ర ప్రజా సమితి వ్యవస్థాపకుడు పెళ్లకూరు సురేంద్రరెడ్డి ఆమరణ దీక్ష చేపట్టారు. నెల్లూరు కొండాయపాళెం గేటు వద్ద ఉన్న తన కార్యాలయంలో మంగళవారం ఆయన దీక్షలో కూర్చున్నారు. రాష్ట్ర విభజన సమయంలో కొందరి స్వార్ధంతో ఆంధ్రా ప్రజలకు తీరని అన్యాయం జరిగిందన్నారు. ప్రత్యేక హోదా ఇస్తేనే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రాష్ట్రం అబివృద్ధి చెందుతుందన్నారు. ప్రత్యేక హోదా కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధమని ఆయన చెప్పారు. ఆయన వెంట సాల్మాన్‌రాజ్, తిరుపతియాదవ్, జయబాబు, ఉదయ్‌కుమార్ తదితరులు ఉన్నారు.