సీఎం సెటిల్‌మెంట్లు చేయడం దారుణం | criminal cases should be filed against tdp leaders: mla anil kumar yadav | Sakshi
Sakshi News home page

సీఎం సెటిల్‌మెంట్లు చేయడం దారుణం

Published Mon, Mar 27 2017 3:48 PM | Last Updated on Sat, Aug 18 2018 5:15 PM

సీఎం సెటిల్‌మెంట్లు చేయడం దారుణం - Sakshi

సీఎం సెటిల్‌మెంట్లు చేయడం దారుణం

అమరావతి: రవాణా శాఖ కమీషనర్ బాలసుబ్రహ్మణ్యంపై టీడీపీ నేతలు కేశినేని నాని, బోండా ఉమామహేశ్వర రావు దౌర్జన్యం చేసి క్షమాపణ చెబితే సరిపోతుందా అని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ విమర్శించారు. టీడీపీ నేతలు రవాణా శాఖ కమీషనర్‌ గన్‌మెన్‌ను నెట్టివేశారని, వాళ్లు కానిస్టేబుల్‌కు క్షమాపణ చెప్పారా అని ప్రశ్నించారు.

సోమవారం ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద అనిల్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో చట్టం లేదా? అధికార పార్టీకి చట్టం వర్తించదా అన్ని ప్రశ్నించారు. అధికార పార్టీకి ఒక న్యాయం, మిగతావారికి మరో న్యాయమా అని నిలదీశారు. సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు సెటిల్‌మెంట్లు చేయడం దారుణమని విమర్శించారు. దాడికి పాల్పడిన టీడీపీ నేతలపై క్రిమినల్ కేసులు పెట్టాలని అనిల్ కుమార్ యాదవ్ డిమాండ్ చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement