అర్హులందరికీ ఇళ్లు మంజూరు చేయాలి
ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌యాదవ్
నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): జన్మభూమి కమిటీలతో సంబంధం లేకుండా అర్హులందరికీ ఇళ్లు మంజూరు చేయాలని నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌యాదవ్ పేర్కొన్నారు. ఆరో డివిజన్లో డిప్యూటీ మేయర్ ముక్కాల ద్వారకానాథ్ ఆధ్వర్యంలో పక్కాగృహాల దరఖాస్తులను శెట్టిగుంట రోడ్డులోని సత్రంబడిలో గురువారం ఉచితంగా ఆన్‌లైన్లో నమోదు చేశారు. రసీదులను డివిజన్ ప్రజలకు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే అనిల్ మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇళ్లు లేని వారికి గృహ వసతిని కల్పిస్తామన్నాయని, దీనికి సంబంధించిన దరఖాస్తులను ఆన్‌లైన్లో చేసుకోవాలనే అంశాన్ని గుర్తించి డిప్యూటీ మేయర్ ఆధ్వర్యంలో సుమారు వెయ్యి దరఖాస్తులను పొందుపర్చామని వివరించారు.
రిజిస్ట్రేషన్‌కు ఇతర కేంద్రాల్లో రూ.వంద ఖర్చవుతోందని, డివిజన్లోని ప్రజలపై ఆ భారం పడకుండా డిప్యూటీ మేయర్ కార్యక్రమాన్ని నిర్వహించడాన్ని అభినందించారు. పేదలకు ఎన్ని ఇళ్లు ఇస్తామనే అంశాన్ని ప్రభుత్వం స్పష్టం చేయకపోవడం బాధాకరమన్నారు. నగరంలోని 54 డివిజన్లలో దాదాపు లక్ష మందికిపైగా దరఖాస్తు చేసుకున్నారని వివరించారు. రాజకీయాలకతీతంగా జన్మభూమి కమిటీలను పక్కనబెట్టి అర్హులందరికీ గృహ వసతిని కల్పించాలని డిమాండ్ చేశారు. కార్పొరేటర్ ఓబిలి రవిచంద్ర, దేవరకొండ అశోక్, నాయకులు శివకుమార్, తులసి, మద్దినేని శ్రీధర్, హరీష్, చిరంజీవి, సునీల్, సునీత, మల్లి, తదితరులు పాల్గొన్నారు.
చెత్త సేకరణకు చర్యలు చేపట్టాలి
చెత్త సేకరణకు కార్పొరేషన్ ప్రత్యేక చర్యలు చేపట్టాలని నెల్లూరు నగర ఎమ్మెల్యే డాక్టర్ అనిల్‌కుమార్‌యాదవ్ తెలిపారు. 46వ డివిజన్ కార్పొరేటర్ వేలూరు సుధారాణి ఆధ్వర్యంలో చెత్త సేకరణకు అవసరమైన రెండు రిక్షా బండ్లు, డస్ట్‌బిన్లను మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లుకు ఎమ్మెల్యే అనిల్, డిప్యూటీ మేయర్ ముక్కాల ద్వారకానాథ్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. డివిజన్ నుంచి రూ.కోటికిపైగా పన్నులు కార్పొరేషన్‌కు వస్తున్నాయని, అయితే డివిజన్లో అభివృద్ధి పనులకు రూ.19 లక్షలనే వెచ్చించారని ఆరోపించారు. డ్రెయిన్లు, మురుగుకాలువలకు నిధులను వెచ్చించాల్సిన అవసరం ఉందని చెప్పారు.
మెరుగైన పారిశుధ్యం కోసం స్థానిక కార్పొరేటర్ తన వం తు సహకారం అందించడాన్ని అభినందించారు. కార్పొరేటర్లు ఓబి లి రవిచంద్ర, ఖలీల్‌అహ్మద్, దేవరకొండ అశోక్, మహేష్, రఘు, కుమార్, నాగరాజు, రామలక్ష్మణ్, అరవింద్, మల్లికార్జున, శ్రీనివాసులురెడ్డి, శ్రీకాంత్, వీరా, తదితరులు పాల్గొన్నారు.