janmabhoomi committee
-
బాబు సాక్షిగా.. జన్మభుమికి ద్రోహం
సాక్షి, గుంటూరు : ఏ పని జరగాలన్నా జన్మభూమి కమిటీలు ఆమోదం తెలపాల్సిందే.. ప్రతి పనికీ జన్మభూమి కమిటీ సభ్యులకు ముడుపులు ముట్టజెప్పాల్సిందే.. ఐదేళ్ల టీడీపీ పాలనలో రాజ్యాంగేతర శక్తిగా, కమిటీలోని సభ్యులు షాడో అధికారులుగా చెలామణి అవుతూ ప్రజలను అడ్డగోలుగా దోచుకున్నారు. సంక్షేమ పథకాలకు సంబంధించి దరఖాస్తు నమోదు నుంచే జన్మభూమి కమిటీల పెత్తనం ప్రారంభించారు. హౌసింగ్, వృద్ధాప్య పింఛన్, రేషన్ కార్డు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కార్పొరేషన్ల రుణాల దరఖాస్తులపై జన్మభూమి కమిటీ సభ్యుల, నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జుల రబ్బర్‌స్టాంప్‌లు ఉంటేనే అధికారుల పరిశీలనకు తీసుకున్నారు. ఇలా వీరి అరాచకాలకు అడ్డూఅదుపూ లేకుండా పోయింది. జాతిపిత బాపూజీ కలలుగన్న గ్రామీణ స్వరాజ్యంలో తెలుగుదేశం ప్రభుత్వ పుణ్యమా అని ప్రజలచే ఎన్నికైన గ్రామ ప్రథమ పౌరులు(సర్పంచ్‌లు) ద్వితీయ పౌరులుగా మారారు. పంచాయతీల సర్పంచ్ల అధికారాలను జన్మభూమి కమిటీలతో చెక్ పెట్టారు. జన్మభూమి కమిటీల నీడలో ఉనికి కోల్పోతున్న స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు తమ హక్కుల కోసం అప్పట్లో గళం విప్పారు. అధికార పార్టీ కార్యకర్తలకు మినహా పేదలకు సంక్షేమ ఫలాలు అందించడానికి ససేమిరా అంటున్న వైనాన్ని తూర్పారబట్టారు. సంక్షేమ పథకాలు అందని నిరుపేదలు కలెక్టర్, తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకుండా పోయింది. నరసరావుపేట పార్లమెంటరీ జిల్లా పరిధిలోని చిలకలూరిపేట, నరసరావుపేట, సత్తెనపల్లి, పెదకూరపాడు నియోజక వర్గాల్లో పాదయాత్ర చేపట్టిన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి పలువురు సర్పంచ్‌లు జన్మభూమి కమిటీల పెత్తనాన్ని తెలియజేశారు. రాజ్యాంగేతర శక్తులుగా సంక్షేమ పథకాలను తన్నుకుపోతున్న వైనాన్ని వివరించారు. టీడీపీ నేతలు ఒప్పుకున్నారు టీడీపీకి చెందిన ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి మహానాడు సభలో సీఎం ముందే జన్మభూమి కమిటీలు రాజ్యాంగేత శక్తుల్లా ప్రజలను దోచుకుంటున్నాయని కుండబద్దలు కొట్టారు. స్థానిక శాసనసభ్యులు, ఎంపీపీ, జెడ్పీటీసీలను కూడా జన్మభూమి కమిటీల ముందు టీడీపీ ప్రభుత్వం డమ్మీలను చేసింది. జన్మభూమి కమిటీ సభ్యులు తీసుకున్న నిర్ణయాలకే పెద్దపీట వేసింది. ప్రభుత్వ పథకాలకు లబ్ధిదారులను ఎంపిక చేసే బాధ్యత వీరికి అప్పగించడంతో కమిటీల సభ్యులు కమీషన్లు వసూలు చేశారు. టీడీపీ సానుభూతి పరుడు, జన్మభూమి కమిటీ సభ్యుడి బంధువు అయితే చాలు అర్హతలతో సంబంధం లేకుండా ప్రభుత్వ పథకాల లబ్ధి చేకూర్చారు. అర్హులకు మాత్రం మొండి చెయ్యి చూపారు. ప్రతి పనికీ కమీషన్.. రేషన్ కార్డు మంజూరు నుంచి కార్పొరేషన్ లోన్ల వరకూ ప్రతి పనికీ ఓ రేటు కట్టి జేబులు నింపుకున్నారు. రేషన్ కార్డు మంజూరుకు రూ.1000–రూ.5 వేలు, ఆసరా పింఛన్‌కు రూ.2 వేలు–రూ.5 వేలు, కార్పొరేషన్ రుణాలకు 10–15 శాతం కమిషన్ రూపంలో జన్మభూమి కమిటీ సభ్యులు దోచుకున్నారు. కొంత మంది వద్ద పింఛన్ మంజూరయ్యాక 2–5 నెలల పింఛన్ మొత్తాన్ని జన్మభూమి కమిటీ సభ్యులు తీసుకున్నారు. మరుగుదొడ్ల మంజూరుకు రూ.2 వేలు–రూ.5 వేలు కమిషన్ తీసుకోగా నిర్మించని మరుగుదొడ్లకు కూడా బిల్లులు చేయించుకుని జిల్లాలోని గుంటూరు నగరం, మంగళగిరి, నరసరావుపేట, సత్తెనపల్లి, బాపట్ల సహా వివిధ నియోజవకర్గాల్లో నిధులు స్వాహా చేశారు. హౌసింగ్ ఫర్ ఆల్ స్కీమ్‌లో జన్మభూమి కమిటీ సభ్యులు రూ.లక్షలు కొట్టేశారంటే అతిశయోక్తి కాదు. ఈ పథకంలో ఒక్కో లబ్ధిదారుడి నుంచి రూ. 10 వేలు నుంచి లక్ష రూపాయల వరకు వసూలు చేశారు. వృద్ధులు, వికలాంగులనూ వదల్లేదు.. జన్మభూమి కమిటీ సభ్యులు వృద్ధులు, వికలాంగులు, వితంతువులను కూడా వదల్లేదు. ప్రభుత్వం అందించే ఆసరా పింఛన్ పంపిణీలో అభాగ్యుల నుంచి కమీషన్లు వసూలు చేశారు. ఒక్కొక్కరి నుంచి రూ.100 చొప్పున దండుకున్నారు. ఆఖరికి టీడీపీ సభ్యత్వ నమోదు రూపంలో జన్మభూమి కమిటీ సభ్యులు రూ.100 చొప్పున వసూలు చేశారు. గుంటూరు, మాచర్ల పట్టణాల్లో ఈ వసూళ్ల బాగోతం బట్టబయలైంది. -
పింఛనులో కాకినాడ జమ్మభూమి కమిటీ కనిషన్
-
ఫోర్జరీ కేసులో టీడీపీ మహిళా నేత అరెస్టు
సాక్షి, గన్నవరం: డ్వాక్రా గూపు సభ్యురాలి సంతకాల ఫోర్జరీతో ధాన్యం కొనుగోలు లావాదేవీలు చేసిన టీడీపీ జన్మభూమి కమిటీ సభ్యురాలు, ఆమె కుమార్తెపై కోర్టు ఆదేశాల మేరకు కృష్ణా జిల్లా గన్నవరం పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పోలీసుల సమాచారం ప్రకారం.. గన్నవరం మండలం దావాజిగూడెం ఉజ్వల గ్రామ సమాఖ్య సంఘంలోని రసూల్ స్వయం సహాయక సంఘంలో షేక్ రిజ్వానా సభ్యురాలిగా ఉన్నారు. ఆమె ఆంధ్రా బ్యాంక్ ఖాతాలో 2016, ఫిబ్రవరిలో మూడుసార్లు మొత్తం రూ.7.60 లక్షలు జమయ్యాయి. దీనిపై అప్పటి గ్రామ సమాఖ్య సంఘం అధ్యక్షురాలు, ధాన్యం కొనుగోలు కేంద్రం ఇన్చార్జి గొంది నాగరాజు(రాణి)ను ఆమె ప్రశ్నించగా.. . బ్యాంక్ ఖాతాలు లేని రైతుల ధాన్యం కొనుగోలు మొత్తాన్ని జమచేసేందుకు రిజ్వానా అకౌంట్ ఇచ్చినట్లు సమాధానమిచ్చింది. రిజ్వానా తన ఖాతాలోని నగదు డ్రా చేసి రాణికి, ఆమె కుమార్తె గొంది ప్రగతికి ఇచ్చింది. అనంతరం ధాన్యం కొనుగోలు కేంద్రంలో రూ.కోట్ల అక్రమాలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో తన పేరిట జరిగిన ధాన్యం విక్రయ పత్రాల్ని రిజ్వానా పరిశీలించగా.. ట్రాక్‌షీట్, రైతు కొనుగోలు ధ్రువపత్రం, రైతు చెల్లింపు తదితర పత్రాలపై ఆమె సంతకం ఫోర్జరీ చేసినట్లు గుర్తించింది. దీనిపై జిల్లా కలెక్టర్, వెలుగు అధికారులకు ఫిర్యాదు చేయడంతో.. వెలుగు అధికారులు విచారణ జరిపి రిజ్వానా సంతకం ఫోర్జరీ చేసినట్లు నిర్ధారించారు. ఈ వ్యవహరంపై గతేడాది నవంబర్ 16న ఆమె గన్నవరం సీఐ, విజయవాడ సీపీతో పాటు జిల్లా కలెక్టర్, డీజీపీకి ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో గన్నవరంలోని 11వ మెట్రోపాలిటన్ కోర్టును ఆశ్రయించారు. సీఆర్పీసీ సెక్షన్ 200 కింద గొంది నాగరాజు(రాణి), ఆమె కుమారై గొంది ప్రగతిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గన్నవరం పోలీసులను కోర్టు ఆదేశించింది. రెండు వారాల అనంతరం పోలీసులు సోమవారం వీరిద్దరిపై సెక్షన్ 420, 468, 471, 477, 506, 120(బి) రెడ్‌విత్ 34 కింద కేసులు నమోదు చేశారు. -
జన్మభూమి కమిటీల పెత్తనంతో మనస్తాపం..
పశ్చిమగోదావరి, ఉండ్రాజవరం: రాష్ట్రంలో జన్మభూమి కమిటీల అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. తమకు అనుకూలంగా ఉన్నవారికి ప్రభుత్వ పథకాల లబ్ధిని చేకూర్చడం, వ్యతిరేకంగా ఉన్నవారిపై కక్ష కట్ట డం గ్రామాల్లో పరిపాటిగా మారిపోయింది. జన్మభూమి క మిటీ సభ్యుల కక్ష సాధింపులతో ఓ దివ్యాంగుడు ఆత్మహత్య చేసుకునేందుకు పూనుకున్నాడంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. తమ గ్రామంలో జన్మభూమి కమిటీల పెత్తనం పెరిగిపోయిందని, తనకు రుణం అందకుండా అడ్డుకుంటున్నారంటూ ఓ దివ్యాంగుడు ఆత్మహత్య చేసుకుంటానని సెల్ఫీ వీడియో తీసి వాట్సాప్‌లో పోస్ట్ చేయడం సంచలనం కలిగించింది. వివరాలిలా ఉన్నాయి.. ఉండ్రాజవరం మండలం వడ్లూరుకు చెందిన గొర్రెల శివరావు దివ్యాంగుడు. 2014లో జన్మభూమి గ్రామసభలో ఇంటికోసం దరఖాస్తు చేసుకున్నాడు. నెల రోజుల తర్వాత గృహ నిర్మాణశాఖ అధికారులు ఇల్లు మంజూరైందని చెప్పడంతో అప్పు చేసి నిర్మాణం పూర్తిచేశాడు. అప్పటి నుంచి బిల్లుల కోసం అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరుగుతున్నా మంజూరు చేయడం లేదు. దీంతోతీవ్ర మనస్తాపం చెందిన శివరావు శనివారం సాయంత్రం ఉండ్రాజవరంలో గృహ నిర్మాణశాఖ కార్యాలయానికి వెళ్లి ఆదివారం సాయంత్రం 5 గంటలలోపు ఇంటికి సంబంధించిన మంజూరు ఉత్తర్వులు, బిల్లులు ఇవ్వకపోతే పెట్రోల్ పోసుకుని ఇక్కడే ఆత్మహత్య చేసుకుం టానని సెల్ఫీ వీడియో దిగి వాట్సాప్‌లో పోస్ట్ చేశాడు. గ్రామానికి చెందిన జన్మభూమి కమిటీ సభ్యులు తనకు ఇల్లు మంజూరు కాకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించాడు. తాను ఇంటి కోసం 1100కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయడంతో కక్ష కట్టారని వాపోయాడు. బీసీ కార్పొరేషన్ రుణానికి దరఖాస్తు చేసుకున్నా మంజూరు కాకుండా అడ్డుకున్నారని ఆరోపించాడు. సెల్ఫీ విషయం తెలిసిన గృహ నిర్మాణ శాఖ ఏఈ దండు శివరామరాజు పోలీసులకు ఫిర్యాదు చేయగా హుటాహుటిన వచ్చి బాధితుడు శివరావును ఉండ్రాజవరం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. సంచలనం రేపిన ఆరోపణలు వాట్సాప్ వీడియోలో శివరావు కష్టాలు తెలుసుకున్నవారు అయ్యో పాపం అనగా.. అధికారులు గుండెల్లో రైళ్లు పరుగెట్టాయి. వడ్లూరుకు చెందిన జన్మభూమి కమిటీ సభ్యులు పంపన అంజి, శ్రీనుబాబు, బుల్లబ్బులు తనకు ఇల్లు మంజూరు కాకుండా అడ్డుకుంటున్నారని శివరావు సెల్ఫీ వీడియోలో ఆరోపించాడు. తాను ఇంటి కోసం 1100కు ఫిర్యాదు చేయగా తనపై కక్ష కట్టారని, బీసీ కార్పొరేషన్ రుణానికి దరఖాస్తు చేసుకున్నా మంజూరు కాకుండా అడ్డుకున్నారని శివరావు ఆరోపించాడు. దళిత, బీసీ సంఘాల మద్దతు శివరావు సెల్ఫీ వీడియో విషయం తెలుసుకున్న దళిత, బీసీ సంఘాల నాయకులు పెద్ద ఎత్తున ఉండ్రాజవరం పోలీస్‌స్టేషన్‌కు తరలివచ్చారు. బాధితుడిని పరామర్శిం చి పోలీసులతో చర్చించారు. దీనిపై ఎస్సై గంగాధరరావు మాట్లాడుతూ శివరావు ఆత్మహత్య చేసుకుంటా మంటే అది చట్టరీత్యా నేరమని అందుకే రక్షణ కోసం స్టేషన్‌కు తరలించామని చెప్పారు. సాయంత్రం 7 గంటల వరకు శివరావుకు కౌన్సెలింగ్ ఇచ్చి వడ్లూరు గ్రామపెద్దలకు అప్పగించామన్నారు. రాష్ట్ర మాల ఐక్యవేదిక అధ్యక్షుడు తిర్రే రవిదేవా బాధితుడిని పరామర్శించి విలేకరులతో మాట్లాడారు. దివ్యాంగుడి పట్ల ఇం త అమానుషంగా వ్యవహరించిన జన్మభూమి కమిటీ సభ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. శివరావు న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని లేకపోతే ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. -
ప్రచార మిత్రలు
జన్మభూమి కమిటీల పేరిట అధికార పార్టీ కార్యకర్తలతో గ్రామాల్లో అలజడి సృష్టించిన సీఎం చంద్రబాబు వీరి ఆగడాలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో మరో కొత్త ఎత్తుగడకు తెరలేపారు. పథకాల ప్రచారం, సమస్యల పరిష్కారం కోసమంటూ జన్మభూమి కమిటీల తరహాలోనే గ్రామాల్లో తమకు అనుకూలురైన వారిని సాధికార మిత్రలుగా నియమించుకుంటున్నారు. వారిని పార్టీ ప్రచారానికి బూత్ స్థాయి కార్యకర్తలుగా వినియోగించుకునేందుకు వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు. పర్చూరు: రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులను కాదని, జన్మభూమి కమిటీల పేరుతో టీడీపీ కార్యకర్తలకు అధికారం కట్టబెట్టింది. కమిటీ సభ్యులు సూచించిన వారికే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందజేస్తోంది. దీంతో అధికారులు కేవలం ప్రేక్షక పాత్రకే పరిమితమయ్యారు. అధికార దర్పంతో ఇష్టారాజ్యంగా వ్యవహరించిన కమిటీలు కొన్నాళ్లకే ప్రజా వ్యతిరేకతను మూట కట్టుకున్నాయి. మరో వైపు ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు ఎదురయ్యాయి. దీంతో ఉలిక్కిపడిన టీడీపీ ప్రభుత్వం జన్మభూమి కమిటీలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. కానీ, అధికారమే పరమావధిగా భావించిన టీడీపీ నాయకులకు ఈ నిర్ణయం రుచించలేదు. దీంతో జన్మభూమి కమిటీల స్థానంలో సాధికార మిత్ర, కల్యాణ మిత్ర, బీమా మిత్రలు ఇలా రకరకాల పేర్లతో టీడీపీ ప్రచార మిత్రలను నియమించింది. గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి ప్రభుత్వానికి అనుకూలంగా ప్రచారం చేసేందుకు వీరిని ఉపయోగించుకోనుంది.పార్టీ ప్రచారం కోసం పక్కా ప్రణాళిక... సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేసే నెపంతో ప్రభుత్వం డ్వాక్రా మహిళా సంఘాల్లో పనిచేస్తున్న టీడీపీ కార్యకర్తలను సాధికారమిత్రలు, పశుమిత్రలు, కల్యాణ మిత్రలు, బీమా మిత్రలుగా ఎంపిక చేసింది. వారికి ఎటువంటి విద్యార్హతలు అవసరం లేదు. కేవలం టీడీపీ కార్యకర్త అయితే చాలు. వారిని ప్రతి నెల గౌరవ వేతనం పేరుతో కొంత మొత్తాన్ని ఇస్తూ పార్టీ ప్రచారానికి వినియోగించుకుంటోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. గ్రామాల్లో ప్రతీ 35 కుటుంబాలకు ఒక సాధికారమిత్ర చొప్పున పార్టీ కార్యకర్తలను నియమించింది. డ్వాక్రా సంఘాల మహిళలను సాధికారమిత్ర, కల్యాణమిత్ర, బీమా మిత్రలుగా ఎంపిక చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు కావాల్సిన దరఖాస్తుల నుంచి అర్హుల ఎంపిక వరకు అంతా వీరే చూసుకుంటారు. టీడీపీకి అనుకూలంగా ఉన్న వారికే ప్రభుత్వ పథకాలు అందిస్తూ.. ప్రతిపక్ష పార్టీలకు చెందిన వారికి మొండి చేయి చూపిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కమీషన్ ఇస్తేనే పథకాలు మంజూరు... జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో 26,571 మంది సాధికారమిత్రలు, మండలానికి ఇద్దరేసి చొప్పున 112 మంది కల్యాణమిత్రలు, 112 మంది బీమా మిత్రలను నియమించారు. వీరంతా అధికార పార్టీ కార్యకర్తలే. పింఛన్లు, గ్రూపు రుణాలు మంజూరు కావాలన్నా, చంద్రన్న బీమా పరిహారం అందాలన్నా. ఎన్టీఆర్ గృహాలు మంజూరు చేయాలన్నా ఆయా మిత్రలకు కమీషన్ ఇవ్వాల్సిందే. కమిషన్ ఇవ్వకపోతే ప్రభుత్వ పథకాలు మంజూరు కావు. -
భిక్షగాడి పేరిట ఆరు ఎకరాలు
చిత్తూరు, పెద్దతిప్పసముద్రం: భవతీ బిక్షాందేహీ అంటూ కావిడి.. పట్టుకుని ఇల్లిల్లూ తిరిగి భిక్షాటన చేస్తున్న ఆ వృద్ధుడి పేరు వడ్డి పెద్దన్న (76). పెద్దతిప్పసముద్రం మండలం పట్టెంవాండ్లపల్లెకి చెందిన ఈయనకు వెనకా, ముందూ నా అనే వారు ఎవరూ లేరు. తల దాచుకునేందుకు ఇల్లు కూడా లేకపోవడంతో నాలుగిళ్లు తిరిగి గ్రామస్తుల దయా దాక్షిణ్యాలతో పొట్ట నింపుకుని ఇదే గ్రామంలో మూతబడిన ప్రభుత్వ పాఠశాల ఆవరణలో తల దాచుకుంటున్నాడు. ఇతని పేరిట 237512162539 నంబర్ ఆధార్ కార్డులో 76 ఏళ్ల వయసు ఉంది. రేషన్ కార్డులో కూడా 70 ఏళ్ల వయసు ఉన్నట్లు పేర్కొన్నారు. కొన్నేళ్ల పాటు ఇతని కార్డు ఇన్ యాక్టివేషన్ అని రావడంతో సరుకులు పొందలేకపోయినా పలువురి సాయంతో కొద్ది నెలలుగా సరుకులు పొందుతున్నాడు. అయితే ఈ అనాథకు ఇంత వరకు వృద్ధాప్య పింఛన్ మాత్రం మంజూరు కాలేదు. జన్మభూమి–మాఊరుతో పాటు వివిధ గ్రామసభల్లో అర్జీలు ఇచ్చినా ఎవరూ కనికరించలేదు. పింఛన్ ఎందుకు మంజూరు కాలేదం టూ వృద్ధుడు అధికారులను ప్రశ్నిస్తే మీ పేరిట ఆరు ఎకరాల భూమి ఉన్నట్లు ఆన్లైన్లో వచ్చిందని చెప్పడంతో అవాక్కయ్యాడు. తన పేరిట ఎలాంటి భూములు లేకున్నా ఆన్లైన్లో ఎలా నమోదు చేశారో తనకు తెలియదని ఆయన వాపోతున్నాడు. తనకు పింఛన్ రాకున్నా పరవాలేదు, ఆరు ఎకరాల భూమి ఎక్కడ ఉందో చూపించి పట్టా ఇస్తే కౌలుకైనా ఇచ్చుకుని కాలం గడుపుతానని పెద్దన్న అధికారులకు విన్నవిస్తున్నాడు. అయితే పింఛన్ పొందేందుకు పెద్దన్నకు అర్హత ఉన్నా రెవెన్యూ రికార్డుల్లో భూమి ఐదు ఎకరాల కన్నా అధికంగా ఉన్నట్లు నమోదై ఉండడంతో తామేమీ చేయలేక పోతున్నామని ఆ గ్రామ పంచాయతీ కార్యదర్శి తెలిపారు. -
కేంద్రం ఇస్తున్న నిధులను టీడీపీ కాజేస్తుంది
-
డమ్మీ స్టార్
అభివృద్ధిలో పంచాయతీలు పోటీ పడాలని ప్రభుత్వం స్టార్ రేటింగ్స్‌ని ప్రకటిస్తోంది. అందుకు సరిపడా నిధులను మాత్రం అందించలేకపోతోంది. ఒకవేళ నిధులిచ్చినా జన్మభూమి కమిటీల అవినీతికి అడ్డుకట్ట వేయలేకపోతోంది. ఒకవైపు సర్పంచ్ల చెక్ పవర్ రద్దయ్యింది. పంచాయతీ రాజ్ వ్యవస్థ నిర్వీర్యమయ్యే పరిస్థితి నెలకొంది. ఈ దశలో గ్రామాలు మౌలిక వసతుల లేమితో కొట్టుమిట్టాడుతున్నాయి. ఎక్కడికక్కడ అభివృద్ధి కుంటుపడుతోంది. కానీ ప్రభుత్వం మాత్రం క్షేత్ర స్థాయి వాస్తవాలతో సంబంధం లేకుండా ‘డమ్మీ స్టార్స్’తో లేని అభివృద్ధి ఉన్నట్టు ప్రజలు మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోంది. సాక్షి, అమరావతి బ్యూరో/ఎస్వీఎన్కాలనీ: గ్రామ పంచాయతీల అభివృద్ధిని ప్రభుత్వం స్టార్ రేటింగ్స్‌తో సూచిస్తోంది. కానీ వాస్తవ పరిస్థితులకు, వచ్చిన రేటింగ్స్‌కు ఏ మాత్రం పొంతన ఉండట్లేదు. వివిధ శాఖల అనుసంధానం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధిని వేగవంతం చేసి, మౌలిక వసతులను కల్పించాల్సిన ప్రభుత్వం స్టార్ రేటింగ్స్ అంటూ మభ్యపెడుతోంది. ఇప్పటికే గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ల అధికారాలకు ప్రభుత్వం కత్తెర వేసింది. జన్మభూమి కమిటీలకు అధికారాలను కట్టబెట్టి పంచాయతీ రాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేస్తోంది. అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల్లో లబ్ధిదారుల ఎంపిక అంతా టీడీపీ వారి కనుసన్నల్లోనే జరుగుతుండటంతో సర్పంచ్‌లు ఉత్సవ విగ్రహాలుగా మారుతున్నారు. ఫలితంగా గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడుతోంది. గ్రేడింగ్‌లు ఇలా... గ్రామాలు ఏ మేరకు అభివృద్ధి సాధించాయో స్టార్ల రూపంలో ప్రభుత్వం రేటింగ్ ఇస్తోంది. కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వల నుంచి నిధులు విడుదల అవుతున్నా, క్షేత స్థాయిలో ఆశించిన మేర అభివృద్ధి కనిపించడం లేదని ప్రభుత్వం పంచాయతీలకు గ్రేడింగ్ విధానం ప్రవేశపెట్టింది. ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధి, భవిష్యత్తులో చేపట్టబోయే కార్యాచరణ అంశాలపై ఈ రేటింగ్ విధానం ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. రేటింగ్ ఇలా.. పంచాయతీల మధ్య స్నేహపూర్వక పోటీ పెంచేందుకు 11 అంశాల్లో సాధించిన పురోగతి ఆధారంగా స్టార్ రేటింగ్ ఇస్తారు. 11 స్టార్లు సాధించిన గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా ప్రకటించి సముచిత రీతిలో ప్రభుత్వం గౌరవిస్తుంది. దశల వారీగా అన్ని గ్రామ పంచాయతీల్లో మిషన్ అంత్యోదయ కార్యక్రమంలో భాగంగా 2019 అక్టోబరు 2 నాటికి ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నారు. ఓపెన్ డెఫకేషన్ ఫ్రీ గ్రామంగా ఉండాలి ప్రతి ఇంటికి విద్యుత్ సౌకర్యం, గ్రామాల్లో వీధి దీపాలు ఎల్ఈడీలుగా మార్పు ప్రతి ఇంటికి గ్యాస్ కనెక్షన్ ఉండాలి సురక్షిత తాగునీరు అందాలి, ప్రతి ఇంటికి వ్యక్తిగత కుళాయి కనెక్షన్ పారిశుద్ధ్యాన్ని మొరుగుపరిచేందుకు ఘన, వ్యర్థాల నిర్వహణ, చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాల ఏర్పాటు ప్రయాణాలకు అనువైన రహదారులు, అంతర్గత సీసీ రోడ్లు, అన్ని గ్రామాలను కలుపుతూ రోడ్ల నిర్మాణం కో నాలెడ్జ్ సొసైటీగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఇంటికి పైబర్ నెట్ ప్రతి పేద మహిళ పొదుపు సంఘంలో ఉండేలా చూడటం. వారికి నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ ఇచ్చి ఆదాయ వనరులు చూపించాలి. బడిఈడు పిల్లలందరూ పాఠశాలకు హాజరు కావడం, అన్ని పాఠశాలల్లో మరుగుదొడ్లు, తాగునీరు, ఫర్నీచర్, ఫైబర్ నెట్ ఏర్పాటు చిన్నారులకు వంద శాతం వ్యాధి నిరోధక టీకాలు, వంద శాతం ఆస్పత్రి ప్రసవాలు, వంద శాతం పోషకాహారం అందాలి. మహిళల ఆర్థిక, సామాజిక, రాజకీయ సాధికారితకు కృషి. లింగ సమానత్వం, గృహ హింస రహిత గ్రామాలు ఇదీ జిల్లా సంగతి.. జిల్లాలో మొత్తం 1011 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ప్రభుత్వం అభివృద్ధి విషయంలో ఒక్కో పంచాయతీకి 10 వరకు స్టార్ రేటింగ్ ఇస్తోంది. ఈ లెక్కన జిల్లాలోని పంచాయతీలు 10,110 స్టార్లు సాధించాలి. కానీ ఇంత వరకు 5,624 స్టార్ రేటింగ్స్‌ను మాత్రమే సాధించాయి. ప్రభుత్వం పేర్కొన్న అంశాల ప్రకారం స్టార్లు 55.89 శాతం మాత్రమే వచ్చాయి. అంటే జిల్లాలో ఎక్కువ శాతం పంచాయతీలు చాలా అంశాల్లో వెనుకబడి ఉన్నాయి. అధికారులు పూర్తి స్థాయిలో గ్రామాలు అభివృద్ధి చెందాయని చెబుతునప్పటికీ , క్షేత్ర స్థాయిలో అందుకు పరిస్థితులు భిన్నంగా కనిపిస్తున్నాయి. ప్రధానంగా కేంద్రం విడుదల చేసే ఆర్థిక సంఘం నిధులు తప్ప, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేకనిధులు అందటం లేదు. విద్యుత్తు, రక్షిత మంచినీటి ప«థకాల నిర్వహణకు కూడా చిన్న పంచాయతీల్లో నిధులు సరిపోని పరిస్థితి నెలకొంది. అభివృద్ధి ఆధారంగానే రేటింగ్ గ్రామ పంచాయతీల్లో ఓడీఎఫ్, విద్యుత్తు, సురక్షిత నీరు, పారిశుద్ధ్యం, పౌరసేవలు వంటి అంశాల ఆధారంగా రేటింగ్‌లు ఇచ్చారు. గ్రామ పంచాయతీలను అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నాం. ప్రత్యేక దృష్టి సారించి గ్రామాలు అభివృద్ధిలో స్టార్ రేటింగ్ మెరుగుపరచుకునేలా చర్యలు తీసుకుంటాం.–అరుణ, జిల్లా పంచాయతీ అధికారి -
పంచాయతీ పాలనకు బాబు సర్కార్ వెన్నుపోటు
ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేలు, ఎంపీలను అన్నిచోట్లా సగౌరవంగా ప్రజా ప్రతినిధులుగా గుర్తిస్తున్నారు. కానీ అదే ప్రజలు ఎన్నుకున్న సర్పంచులు మాత్రం అసలు ప్రజా ప్రతినిధులే కాదన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం జన్మభూమి కమిటీల ద్వారా పోటీ పాలన సాగిస్తూ స్థానిక సంస్థలను నిర్వీర్యం చేస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మాదిరిగా 73వ రాజ్యాంగ సవరణ ద్వారా గ్రామ పంచాయతీలకు కల్పించిన అధికారాలను తన అధికార గర్వంతో అణచివేస్తోంది. బాపూజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యానికి తూట్లు పొడుస్తోంది. సాక్షి, అమరావతి: రాష్ట్రంలో స్థానిక ప్రభుత్వాల పాలన çనాలుగేళ్లుగా గాడి తప్పింది. ప్రజలెన్నుకున్న సర్పంచులకు కల్పించిన అధికారాలను జన్మభూమి కమిటీ సభ్యులు అనుభవిస్తున్నారు. గ్రామాలకు రాష్ట్ర ప్రభుత్వం నిధులివ్వకపోగా కేంద్రం నేరుగా ఇచ్చే వాటిని కూడా ఖర్చు పెట్టుకోవడానికి వీల్లేకుండా ట్రెజరీల్లో ఆంక్షలు అమలు చేస్తోంది. జిల్లా, మండల పరిషత్‌లైతే నిధులు లేక కొట్టుమిట్టాడుతున్నాయి. స్థానిక ప్రభుత్వాల పాలనకు జవసత్వాలు కల్పించే రాజ్యాంగ సవరణ అమల్లోకి వచ్చిన ఏప్రిల్ 24వ తేదీని జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవంగా తూర్పు గోదావరి జిల్లాలో నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో స్థానిక సంస్థల పరిస్థితి ఎలా దిగజారిందో పరిశీలిద్దాం. సగం ఊర్లకు కార్యదర్శులే లేరు..: రాష్ట్రంలోని స్థానిక సంస్థల్లో పాలన సజావుగా జరగడానికి వీలుగా ఊరికొక గ్రామ కార్యదర్శి కూడా లేరు. రాష్ట్రంలో 12,918 గ్రామ పంచాయతీలుండగా కేవలం 6,014 మంది కార్యదర్శులే పనిచేస్తున్నారు. ఒక్కో కార్యదర్శి నాలుగైదు గ్రామాలకు ఇన్చార్జి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. నిన్న మొన్నటిదాకా జిల్లా పంచాయతీ అధికారుల పోస్టులన్నీ ఖాళీగా ఉండగా వారం క్రితం పలువురిని డీపీవోలుగా నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఇప్పటికీ రెండు జిల్లాలకు పూర్తిస్థాయి డీపీలు లేరు. మూడు జిల్లాలకు పూర్తిస్థాయి జెడ్పీ సీఈవోలు లేరు. అన్ని జిల్లాల్లో డిప్యూటీ సీఈవో పోస్టులు, ఏవో పోస్టులు ఖాళీగా ఉన్నాయి. నిధులు, విధులు కాగితాల్లోనే..: రాజ్యాంగంలోని 11వ షెడ్యూల్ ఆర్టికల్ 243(జి) ప్రకారం 29 అంశాలకు సంబంధించి నిధులు, విధులు, సిబ్బందిని పంచాయతీరాజ్ వ్యవస్థకు బదలాయించాల్సి ఉన్నా ఉత్తర్వులకే పరిమితమయ్యాయి. ఉదాహరణకు అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ తీసుకుంటే మదర్స్ కమిటీలు పంచాయతీల పర్యవేక్షణలో పనిచేయాలి. నిధులు, సిబ్బంది పంచాయతీల ఆధీనంలోనే ఉండాలి. అయితే ప్రభుత్వం అంగన్వాడీల నిర్వహణకు నిధులు విడుదల చేయలేదు, సిబ్బంది కూడా శిశుసంక్షేమ శాఖ ఆధీనంలోనే పనిచేస్తున్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో ఫ్యాన్లు, ఇతర సామాగ్రి కొనుగోలు కోసం పంచాయతీలు ఇంటిపన్ను రూపంలో వసూలు చేసిన నిధులను ఖర్చు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. కేరళలో రాష్ట్ర ప్రభుత్వ ఆదాయంలో 40–50 శాతం పంచాయతీరాజ్ వ్యవస్థలకే బదలాయిస్తున్నారని అధికారులు చెబుతున్నారు. మన రాష్ట్రంలో మాత్రం పంచాయతీ ఉద్యోగులకు చెల్లిస్తున్న జీతాలను లెక్క చూపిస్తూ 10–15 శాతం నిధులను పంచాయతీలకు కేటాయిస్తున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. కేంద్ర నిధుల విడుదలపై ఆంక్షలు..: కేంద్రం నేరుగా పంచాయతీలకు విడుదల చేసిన 14 ఆర్థిక సంఘం నిధులతోపాటు స్థానికంగా వసూలయ్యే ఇంటి పన్ను తదితరాలు కలిపి ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామ పంచాయతీల పేరుతో రూ.1,400 కోట్లున్నా వీటితో సర్పంచులు అభివృద్ధి పనులు చేపట్టడానికి వీలులేకుండా రాష్ట్ర ప్రభుత్వం ట్రెజరీల్లో అనధికారిక ఆంక్షలు అమలు చేస్తోంది. ఈ ఏడాది జనవరి 25 నుంచి నిధులు విడుదల చేయకుండా సర్పంచులు ఇచ్చే చెక్‌లను వెనక్కి పంపిస్తోంది. గుంటూరు జిల్లా నరసరావుపేట రూరల్ మండలంలో ఒక్క చోటే 56 చెక్కులను అధికారులు ఎలాంటి కారణం చూపకుండా ఈ ఏడాది ఏప్రిల్ మొదటి వారంలో వెనక్కి పంపారు. మూడేళ్లుగా జెడ్పీ, ఎంపీపీలకు నిధుల్లేవ్: జిల్లా, మండల పరిషత్‌లకు మూడేళ్లుగా నిధులు విడుదల కావటం లేదు. గతంలో కేంద్ర ప్రభుత్వం పంచాయతీలు, జిల్లా, మండల పరిషత్‌లకు వాటాలవారీగా నిధులు ఇచ్చేది. 14వ ఆర్థిక సంఘం సిఫార్సులతో మండల, జిల్లా పరిషత్‌లకు రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి నిధులు విడుదల చేయాలని సూచించింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం మూడేళ్లుగా నిధులు విడుదల చేయకపోవటంతో జిల్లా పరిషత్, మండల పరిషత్‌లలో పాలన పూర్తిగా స్తంభించింది. గ్రామాలకు కరెంట్ షాకులు: మైనర్ పంచాయతీల్లో వీధి దీపాల కరెంట్ బిల్లును గతంలో రాష్ట్ర ప్రభుత్వాలే భరించాయి. 2013–14 వరకు ఇదే కొనసాగింది. అయితే చంద్రబాబు అధికారంలోకి రాగానే గ్రామాల్లో వీధి దీపాల కరెంటు బిల్లులు రూ.1,800 కోట్లు పేరుకుపోయాయని, దీన్ని సంబంధిత పంచాయతీలే విద్యుత్ శాఖకు చెల్లించాలని ప్రభుత్వం ఒత్తిడి తెచ్చింది. వెయ్యికే దొరికే ఎల్ఈడీ లైట్‌కు రూ.4,500: నారా లోకేశ్ మంత్రిగా బాధ్యతలు చేపట్టాక గ్రామాల్లో వీధి దీపాల సరఫరా, నిర్వహణను బడా ప్రైవేట్ కాంట్రాక్టర్లకు అప్పగించారు. ప్రభుత్వ పెద్దలే కాంట్రాక్టర్ల వద్ద కమీషన్లు తీసుకుంటూ మార్కెట్లో ప్రస్తుతం ఒక్కొక్కటి రూ.వెయ్యిలోపు ధరలోనే దొరుకుతున్న ఎల్ఈడీ వీధి దీపానికి పంచాయతీలు ఏటా రూ.450 చొప్పున పదేళ్ల పాటు రూ.4,500 చెల్లించాలని ఆదేశించారు. దీంతో 200 స్తంభాలున్న పంచాయతీలు పదేళ్ల పాటు ప్రతి ఏటా రూ. 90 వేల చొప్పున ప్రైవేట్ కాంట్రాక్టర్లకు చెల్లించాల్సి వస్తోంది. తాజాగా గ్రామాల్లో మురుగు కాల్వలను శుభ్రం చేసే పనులను కూడా పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకు అప్పగించాలని కూడా లోకేశ్ యోచిస్తున్నారు. జన్మభూమి కమిటీలదే పెత్తనం: 73వ రాజ్యాంగ సవరణ ప్రకారం సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపిక అందరికీ తెలిసేలా సర్పంచుల అధ్యక్షతన గ్రామసభల ద్వారా జరగాలి. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక దీన్ని జన్మభూమి కమిటీల ద్వారా చేపడుతున్నారు. స్థానిక సంస్థల తీర్మానాల ద్వారా గుర్తించాల్సిన అభివృద్ధి పనుల్లోనూ జన్మభూమి కమిటీలదే పెత్తనం. -
బిల్లు బిల్లుకూ మామూళ్లు!
ఇచ్ఛాపురం నియోజకవర్గంలోని భైరిపురం...గృహనిర్మాణ పథకంలో ఇల్లు కావాలని 30 మంది దరఖాస్తు చేసుకున్నారు. అధికార పార్టీ నాయకులు, జన్మభూమి కమిటీ సభ్యులు కలిసి ఆ దరఖాస్తుదారుల్లో 18 మందితో మాత్రమే దరఖాస్తు చేయించారు. ఈ ప్రక్రియ కోసం రూ.5 వేలు, తర్వాత ఇల్లు మంజూరు కోసమంటూ రూ.25 వేలు వరకూ వసూళ్లు జరిగాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంటే రూ.1.50 లక్షల ఇంటి సొమ్ము కోసం రూ.30 వేల వరకూ కమీషన్లు కొట్టేస్తున్నారని సొంత పార్టీవారే ఆరోపిస్తున్నారు. ఎక్కడైనా నిలదీస్తే తమ ఇల్లు ఎక్కడ చేజారిపోతుందోనని వారే భయపడుతుండటం గమనార్హం!! సాక్షి ప్రతినిధి–శ్రీకాకుళం: గృహ నిర్మాణ పథకం లబ్ధిదారులు అధికార పార్టీ నాయకుల తీరుతో నష్టపోతున్నారు. ఈ పరిస్థితి ఒక్క ఇచ్ఛాపురం నియోజకవర్గంలోనే కాదు జిల్లావ్యాప్తంగా ఉంది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఊరించీ ఊరించీ రెండున్నరేళ్ల తర్వాత ఎన్టీఆర్ గృహనిర్మాణ పథకం కింద ఇళ్లు ఇస్తామని టీడీపీ ప్రభుత్వం ప్రకటించింది! ఆ ఇళ్లు కూడా టీడీపీ నాయకుల అనుయాయులకే కట్టబెడుతున్నారు. జన్మభూమి కమిటీల సభ్యులు రంగంలోకి దిగి వసూళ్ల పర్వానికి తెరలేపారు. అలాగే ఇల్లు మంజూరయ్యాక బిల్లుల చెల్లింపు సమయంలో హౌసింగ్ అధికారులకూ కమీషన్లు ఇవ్వాలని చెప్పి కలెక్షన్లు చేస్తున్నారు. దీంతో లబ్ధిదారుల పరిస్థితి మింగ లేక కక్కలేకా అన్నట్లుగా తయారైంది. పథకం కింద ఇంటి నిర్మాణానికొచ్చేది రూ.1.50 లక్షలైతే అందులో రూ.30 వేల వరకూ ఆమ్యామ్యాలకే పోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా ఎక్కడ నోరువిప్పితే బిల్లులు అర్ధంతరంగా నిలిపేస్తారేమోననే భయం వారిని వెంటాడుతోంది. టీడీపీ ప్రభుత్వం తొలి రెండు ఆర్థిక సంవత్సరాల్లో ఇళ్లేవీ మంజూరు చేయలేదు. ఎన్టీఆర్ గ్రామీణ గృహనిర్మాణ పథకం కింద 2016–17లో మాత్రం నియోజకవర్గానికి 1,250 చొప్పున ప్రకటించింది. ఆ తర్వాత 12,235 ఇళ్లు ఇస్తున్నట్లు హామీ ఇచ్చింది. ఈ సంవత్సరం మరో 13,486 ప్రకటించింది. కానీ ఇవేవీ వాస్తవ అర్హులకు చేరట్లేదు. కేవలం టీడీపీ కార్యకర్తలకే కట్టబెడుతున్నారు. వారి నుంచి కూడా కమీషన్లు వసూలు జరుగుతోంది. ఈ పథకం కింద యూనిట్ విలువ రూ.1.50 లక్షలు. అయితే దీనిలో రూ.95 వేలు హౌసింగ్ కార్పొరేషన్ విడుదల చేస్తుంది. మిగిలిన రూ.55 వేలు మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎన్ఆర్ఈజీఎస్) కింద వస్తాయి. ఈ యూనిట్ మొత్తంలోనే సిమెంట్, ద్వారాలు, కిటికీలు లబ్ధిదారులకు అందజేస్తారు. ప్రతి ఇంటికీ మరుగుదొడ్డి తప్పనిసరి. యూనిట్ విలువ మొత్తానికి మూడు నాలుగు దఫదఫాలుగా చెల్లింపులు చేస్తున్నారు. ఈ సమయాల్లోనే లంచాలు ఎక్కువవుతున్నాయనే కారణంతోనే బిల్లు మొత్తాన్ని లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో నేరుగా జమ చేసే విధానం తీసుకొచ్చారు. అయినా సంబంధిత హౌసింగ్ సిబ్బంది జన్మభూమి కమిటీలతో కుమ్మక్కై... బిల్లులు బ్యాంకులో జమ అయిన తక్షణమే లబ్ధిదారుల నుంచి కమిషన్లను ముందుగానే వసూలు చేస్తున్నారు. లబ్ధిదారుల బ్యాంకుపాస్ పుస్తకాలు జన్మభూమి కమిటీల వద్దే ఉంచేస్తున్నారు. ఇలా ఒక్కో లబ్ధిదారుడి నుంచి రూ.30 వేల వరకూ దఫదఫాలుగా దండేస్తున్నారు. చివరకు మిగిలేది అప్పులే... వాస్తవానికి చిన్న ఇల్లు నిర్మించుకోవాలన్నా ప్రస్తుత పరిస్థితుల్లో రూ.5 లక్షలకు పైమాటే! దీనిలో హౌసింగ్ పథకం కింద రూ.1.50 లక్షలు వస్తే కొంత ఊరట కలుగుతుందనేదీ పేదప్రజల ఆశ. కానీ బిల్లుల మొత్తం చేతికొచ్చేసరికి అందులో రూ.30 వేల వరకూ జేబుకు చిల్లుపడుతోంది. ఇటీవల కాలంలో సిమెంట్, ఇనుము, ఇటుక ధరలు సామాన్యులకు అందుబాటులో ఉండట్లేదు. ఇక ఇసుక ఉచితమే ప్రభుత్వం ప్రకటించినా ఇంటికి తెచ్చుకునేసరికి లోడుకు వాస్తవ ధర కన్నా రెట్టింపు మొత్తం చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఇల్లు పూర్తయ్యేసరికి అప్పులే మిగులుతున్నాయనే ఆవేదన లబ్ధిదారుల్లో వ్యక్తమవుతోంది. ఎంతమందికి ఇల్లు వచ్చిందో తెలియదు భైరిపురం గ్రామంలో ఎన్టీఆర్ గహనిర్మాణ పథకం కింద ఎంతమందికి ఇల్లు మంజూరైందో ఇంతవరకు అధికారులు చెప్పడం లేదు. కానీ ఇల్లు పేరుతో భారీఎత్తున వసూళ్లు జరుగుతున్నాయి. అంతా అయోమయమైన పరిస్థితి. వాస్తవాలను అధికారులు వెల్లడించకపోవడం వల్ల పేదలు మోసపోతున్నారు. –యలమంచిలి నీలయ్య, కవటి మండల ప్రధాన కార్యదర్శి, వైఎస్సార్సీపీ -
దౌర్జన్యాల.. జన్మభూమి
అధికారం ‘బరి’తెగిస్తోంది.. సమస్యలపై నోరు విప్పడం తప్పుఅవుతోంది.. ప్రశ్నిస్తే దాడికి పాల్పడుతున్నారు.. ఊరురా అర్జీలు అందించాలని ప్రచారం చేస్తున్న అధికారులు చేష్టలుడికి చూస్తున్నారు.. జన్మభూమి కమిటీ సభ్యులు రెచ్చిపోతుండగా ప్రజాప్రతినిధులు అండగా ఉంటున్నారు. అందుకు జన్మభూమి సభలు వేదికలయ్యాయి. మచిలీపట్నంటౌన్ : పట్టణంలోని 29వ వార్డులో సోమవారం నిర్వహించిన జన్మభూమి సభ రసాభాసగా మారింది. ఆ వార్డు జన్మభూమి కమిటీ సభ్యులు వీరంగం సృష్టించారు. వార్డు కౌన్సిలర్‌గా ప్రాతి నిధ్యం వహిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మీర్అస్గర్అలీతో పాటు కౌన్సిలర్లు మేకల సుబ్బన్న, కోసూరి లక్ష్మీనాంచారయ్య, పార్టీ నాయకుడు ధనికొండ శ్రీనివాస్‌లపై దౌర్జన్యానికి దిగారు. చొక్కా కాలర్లు పట్టుకుని దాడి చేసేందుకు యత్నించారు. సభలో ఉన్న మునిసిపల్ చైర్మన్ ఎంవీ బాబాప్రసాద్, వైస్‌చైర్మన్ పి.కాశీవిశ్వనాథం కూడా వారికి మద్దతుగా నిలవడంతో పరిస్థితి గందరగోళంగా మారింది. గొడవ ప్రారంభమైంది ఇలా మీ వార్డులో పింఛన్లు అందని వారు ఎవరైనా ఉన్నారా అని చైర్మన్ బాబాప్రసాద్ ప్రశ్నించారు. దీంతో ఆ వార్డుకు చెందిన గట్టా కనకదుర్గ ఆయన వద్దకు వచ్చి చేతులు జోడించి దండం పెట్టి ‘అయ్యా నా భర్త తాతయ్య మృతి చెంది నాలుగు సంవత్సరాలైంది.. అప్పటి నుంచి వితంతు పింఛను కోసం దరఖాస్తు చేస్తూనే ఉన్నా’ అని సభ దృష్టికి తీసుకొచ్చారు. చూస్తా.. వెళ్లి కూర్చో అంటూ చైర్మన్ ఆమెను పంపే ప్రయత్నం చేశారు. ఈ దశలో పింఛను మంజూరు కోసం ఎదురు చూస్తున్న కొంత మంది దరఖాస్తుదారులు ఆయన వద్దకు వెళ్లారు. నాలుగేళ్లుగా కనకదుర్గకు పింఛను రాకపోతే ఏం చేస్తున్నావంటూ అవార్డు కౌన్సిలర్ అస్గర్‌ను వైస్‌చైర్మన్ కాశీవిశ్వనాథం ప్రశ్నించారు. దీంతో అస్గర్ లేచి వీరందరూ పింఛను పొందేందుకు అర్హులేనని వీరికి పింఛను మంజూరు చేయాలంటూ పలుమార్లు కౌన్సిల్ సమావేశంలో కూడా ప్రస్తావించానని, జన్మభూమి సభల్లో అడిగినా మంజూరు కాలేదన్నారు. ఈ దశలోనే ఆ వార్డు జన్మభూమి కమిటీ సభ్యులు అస్గర్‌తో పాటు వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లతో వాగ్వాదానికి దిగారు. చొక్కా కాలర్‌ను పట్టుకున్నారు. కౌన్సిలర్ అస్గర్ మాట్లాడతూ వార్డులో 72 మంది అర్హులకు పింఛన్లు మంజూరు చేయటం లేదని అదేమని అడిగితే సభలో రాజకీయం చేయవద్దని చైర్మన్ వారించే ప్రయత్నం చేస్తున్నారని ఇదెక్కడి న్యాయమని నిలదీశారు. సభలో మునిసిపల్ ప్రతిపక్ష నాయకుడు షేక్ అచ్చాబా, కమిషనర్ ఎం.జస్వంతరావు, అసిస్టెంట్ కమిషనర్ చంద్రిక, డీఈ వెంకటేశ్వరగుప్తా ఉన్నారు. పట్టణంలోని 30, 31, 32, 33 వార్డుల్లో కూడా జన్మభూమి సభలు నిర్వహించారు. రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొనకళ్ల బుల్లయ్య పాల్గొన్నారు. -
ఊళ్లు పంచుకుంటున్న దొంగలు!
కనిగిరి: దొంగలు.. దొంగలు ఊళ్లు పంచుకున్నట్లు ఒక్క ప్రాజెక్టు కూడా నిర్మించకుండా అభివృద్ధి పేరితో ప్రధానిమోదీ, సీఎం చంద్రబాబు దేశాన్ని, రాష్ట్రాన్ని మూడున్నరేళ్లుగా దోచుకుంటున్నారని సీపీఎం కేంద్ర కార్యదర్శి వర్గ సభ్యుడు వి.శ్రీనివాసరావు ఆరోపించారు. సీపీఎం జిల్లా 12వ మహాసభలు సోమవారం రాత్రి సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం ప్రాంగణంలో సయ్యద్ హనీఫ్ అధ్యక్షతన నిర్వహించారు. శ్రీనివాసరావు మాట్లాడుతూ పెద్దనోట్ల రద్దు అతిపెద్ద కుంభకోణంగా విమర్శించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమీత్‌షా కొడుకు మూడేళ్ల క్రితం కేవలం రూ. 50 వేల పెట్టుబడి పెట్టి వ్యాపారం ప్రారంభిస్తే ఆ పార్టీ అధికారంలోకి వచ్చాక అతని ఆదాయం రూ.85 వేల కోట్లకు ఎలా పెరిగిందని ప్రశ్నించారు. బీజేపీ మతోన్మాదపాలన సాగిస్తూ. ఆర్ఎస్ఎస్ వంటి దృష్టశక్తులను పోషిస్తోందని ఘాటుగా విమర్శించారు. జన్మభూమి కమిటీలను నిలదీయాలి రాష్ట్రంలోని జన్మభూమి కమిటీలు దోపిడీ కమిటీలని శ్రీనివాసరావు ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దొంగట ఆడుతున్నాయని, బీజేపీ, టీడీపీ కలిసి తెలుగు ప్రజలను నిలువునా మోసం చేస్తున్నాయని మండిపడ్డారు. తాగేందుకు నీళ్లు ఇవ్వకుండా.. మద్యం ఏరులై పారిస్తున్నారని విమర్శించారు. జన్మభూమి కమిటీలను రద్దు చేస్తేనే రాష్ట్రానికి మోక్షం కలుగుతుందని చెప్పారు. జన్మభూమి సభల్లో సమస్యలపై ప్రభుత్వాన్ని, అధికారులను నిలదీయాలని పిలుపునిచ్చారు. ఆ పాపం చంద్రబాబుదే రక్షిత మంచినీరు లేకనే జిల్లాలో 423 మంది కిడ్నీ వ్యాధితో మృతి చెందారని, ఆ పాపం చంద్రబాబునాయుడిదేనని శ్రీనివాసరావు ధ్వజమెత్తారు. వెలుగొండ ప్రాజెక్టు పూర్తి అయితే తాగు నీటి సమస్య తీరుతుందన్నారు. బాబు వస్తే జాబు వస్తోందని చెప్పిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చి లోకేష్ బాబుకు అధికారం అనే జాబు ఇప్పించుకున్నాడని ఎద్దేవా చేశారు. నిమ్జ్ పేరుతో సేకరిస్తున్న పేదల భూములకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలని, రైతులకు గిట్టుబాటు «ధరల కోసం చట్టం తేవాలని డిమాండ్ చేశారు. ప్రత్యామ్నయ శక్తికోసం సీపీఎం కృషి దేశంలో ప్రత్యామ్నయ శక్తి ఏర్పాటు కోసం సీపీఎం అందరి సహకారంతో ముందుకు సాగుతోందని శ్రీనివాసరావు అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాలనపై సీపీఎం నిరంతర పోరాటాలు చేస్తోందన్నారు. సీపీఎం ప్రజల గొంతుకై ప్రజా పోరాటాలు సాగిస్తోందని చెప్పారు. ప్రజావ్యతిరేక పార్టీలపై ప్రజలు తిరుగుబాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. మోదీ, బాబుకు నైతిక విలువలు లేవు కనీస నైతిక విలువలు లేని మోదీ, చంద్రబాబులు విలువల గూర్చి మాట్లాడం దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు వై.వైంకటేశ్వరరావు ఎద్దేవా చేశారు. సీట్లు తక్కువగా వచ్చినా నిస్సిగ్గుగా గవర్నర్‌ను అడ్డం పెట్టుకుని ప్రధాని మోదీ గోవా, మణిపూర్‌లో అధికారం చేపట్టారని దుయ్యబట్టారు. చంద్రబాబు మరి బరితెగించి సిగ్గు లేకుండా వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను కొనుగోలు చేసి మంత్రి పదవులిచ్చాడని ఘాటుగా విమర్శించారు. సీపీఎం జిల్లా కార్యదర్శి పూనాటి ఆంజనేయులు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డి.సుబ్బారావు, జీవీ కొండారెడ్డి, జిల్లా నాయకులు పి. హనుమంతరావు, షేక్.మాబు, చీకటి శ్రీనివాసరావు మాట్లాడారు. కార్యక్రమంలో పార్టీ డివిజన్ నాయకులు పిల్లి తిప్పారెడ్డి, బడుగు వెంకటేశ్వర్లు, పీసీ కేశవరావు పాల్గొన్నారు. -
మరో 'పచ్చ' పెత్తనం
సాక్షి ప్రతినిధి, కాకినాడ: సాధికార మిత్ర ముసుగులో బూత్ మిత్ర నియామకాలు చేపడుతున్నారు. బూత్ స్థాయి కార్యకర్తలుగా వినియోగించుకునేందుకు సీఎం చంద్రబాబు వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు. జన్మభూమి కమిటీల తరహాలో గ్రామాల్లో తనకు అనుకూల వ్యక్తులను నియమించుకుంటున్నారు. పథకాల ప్రచారం, సమస్యల పరిష్కారం కోసమని చేపడుతున్న సాధికార మిత్ర నియామకాలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వీరి నియామకాలు పూర్తి చేయాలని ఒత్తిడి చేస్తుండటంతో అధికార వర్గాలు సైతం విస్తుపోతున్నాయి. ఇప్పటికే జన్మభూమి కమిటీలు చెలరేగిపోతున్నాయి. గ్రామాల్లో పచ్చరోత రాజకీయాలు చేస్తున్నాయి. అర్హులు, అనర్హులన్న విషయాన్ని పక్కన పెట్టి టీడీపీ మద్దతు దారులైతేనే లబ్ధిదారులుగా ఎంపిక చేస్తున్నాయి. ప్రతి విషయంలో జోక్యం చేసుకుంటున్నాయి. గ్రామాల్లో రాజకీయ అశాంతిని సృష్టిస్తున్నాయి. జన్మభూమి కమిటీల ఆగడాలపై ఇప్పటికే న్యాయస్థానాల్లో అనేక పిటీషన్లు దాఖలయ్యాయి. కమిటీ సభ్యుల దౌర్జన్యాలను కోర్టులు సైతం ఆక్షేపించి, అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసింది. ఈ కమిటీలే గ్రామాల పాలిట శాపంగా మారాయనుకుంటే ఇప్పుడా విధానాన్ని బూత్ స్థాయికి ప్రభుత్వం తీసుకెళ్తోంది. సాధికార మిత్ర పేరుతో కార్యకర్తల నియామకం స్వయం సహాయక సంఘాల (డ్వాక్రా)లోని తమకు అనుకూల మహిళలను సాధికార మిత్రలుగా నియమించాలని ఇప్పటికే అధికారులకు ఆదేశాలిచ్చారు. 35 కుటుంబాలకొక మిత్ర చొప్పున నియమించాలని, నియమించేముందు ఎమ్మెల్యేను సంప్రదించి, జన్మభూమి కమిటీ ఆమోదం మేరకు నియామకం చేపట్టాలని నేరుగా ఆదేశించారు. ప్రజా సాధికారిత సర్వేలో చేసిన క్లస్టర్ల విభజన ఆధారంగా నియామకాలు చేపట్టాలని సూచించారు. జిల్లాలో ప్రస్తుతం 17 లక్షల 83 వేల 145 కుటుంబాలున్నాయి. 35 కుటుంబాలకు ఒకరు చొప్పున జిల్లా వ్యాప్తంగా 50,947 మందిని సాధికార మిత్రలుగా నియమించనున్నారు. ఈ మేరకు క్షేత్రస్థాయి అధికారులకు జిల్లా అధికారులు ఆదేశాలు ఇచ్చారు. గత నాలుగు రోజులుగా వీటి నియామకంలోనే అధికారులంతా నిమగ్నమయ్యారు. వీరిని ఎలా నియమించాలన్నదానిపై సదరు అధికారులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. వీటిని సత్వరమే పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టడంతో అధికారులంతా పరుగులు తీస్తున్నారు. ఎన్నికల దృష్టితోనే.. ఎన్నికల దృష్టిలో ఉంచుకుని సాధికార మిత్ర నియామకాలు చేపడుతున్నారు. తమకు అనుకూల మహిళలను మిత్రలుగా నియమించి, బూత్ స్థాయిలో పనిచేయించనున్నట్టు సమాచారం. వీరి ద్వారానే ఎన్నికల వ్యూహరచనలు చేయనున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. ప్రతీదీ వారిచేత చేయించాలని, లోపాయికారీ కథ నడిపించాలని రాజకీయ ఎత్తుగడతో సాధికార మిత్రలను ఏర్పాటు చేస్తున్నట్టు విమర్శలొస్తున్నాయి. బయటికి మాత్రం ఆ 35 కుటుంబాలకు ప్రభుత్వ పథకాలపై అవగాహన, ప్రచారం చేయడంతో పాటు సమస్యలుంటే అధికారుల దృష్టికి తీసుకురావడమే లక్ష్యంగా చెప్పుకొస్తున్నారు. కానీ లోపాయికారీ మర్మమైతే మాత్రం రాజకీయ లబ్ధిపొందడానికేనన్న వాదనలు విన్పిస్తున్నాయి. విశేషమేమిటంటే సాధికార మిత్ర నియామకాలని అధికారికంగా చెబుతుండగా...ఇటీవల వాటి నియామకాల ప్రగతిపై అధికారులతో నిర్వహించిన కాన్ఫరెన్స్‌లో మాత్రం బూత్మిత్ర నియామకాలు ఎంత వరకు వచ్చాయని, వెంటనే పూర్తి చేయాలని సీఎం ఆదేశించడంతో అధికారులంతా అవాక్కయ్యారు. బయటికి సాధికార మిత్ర అని చెబుతున్నా...సీఎం మనసులో మాత్రం వారంతా బూత్ మిత్ర కార్యకర్తలే అన్న అభిప్రాయం ఉందనేది స్పష్టమయిందని అధికార వర్గాలు సైతం వాపోతున్నాయి. -
దివ్యాంగుడిగా జన్మించడమే తప్పా..?
జి.సిగడాం: రాజకీయ వివక్ష.. జన్మభూమి కమిటీల పెత్తనం పుణ్యమాని అర్హులైన లబ్ధిదారులు ప్రభుత్వ పథకాలకు దూరమవుతున్నారు. ముఖ్యంగా పింఛన్ల పంపిణీలో అడుగడుగునా వివక్ష కనిపిస్తోంది. జన్మభూమి కమిటీల ప్రమేయంతో ఎంతోమంది వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు పింఛన్లకు దూరమవుతున్నారు. అటువంటి కోవకే చెందుతాడు ఈ దివ్యాంగుడు. దివంగత వైఎస్ హయాంలో ఇతనికి ప్రతినెలా కచ్చితంగా పింఛన్ అందేది. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పింఛన్ నిలిచిపోయింది. నాటి నుంచి నేటి వరకూ అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేకపోతోంది. మండలంలోని దేవరవలస గ్రామానికి చెందిన బత్తుల అప్పారావుకు పుట్టుక నుంచే రెండు కాళ్లూ రావు. అయినప్పటికీ చదువుపై ఆసక్తి పెంచుకున్నాడు. ప్రస్తుతం పొందూరు డిగ్రీ కళాశాలో రెండో సంవత్సరం చదువుతున్నాడు. ఇతనికి జిల్లా వైద్యాధికారులు 45 శాతం వికలాంగత్వం ఉందంటూ ధ్రువీకరణ పత్రాన్ని అందించారు. ఈ పత్రం ఆధారంగా వైఎస్ హయాంలో పింఛన్ అందేది. చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చాక పింఛన్ నిలుపుదల చేశారు. తన పింఛన్ పునరుద్ధరించాలని ఎన్నోసార్లు వినతులిచ్చినా ఫలితం ఉండటంలేదు. అవన్నీ చెత్తబుట్టలోనే వేస్తున్నారని అప్పారావు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. గత ఏడాది, ఈ ఏడాది జరిగిన జన్మభూమి గ్రామసభల్లో సైతం వినతులు అందించాడు. ఇతని మొరను ఏ ఒక్కరూ పట్టించుకోవడం లేదు. మండల పరిషత్ అధికారులను ఎప్పుడు అడిగినా ఇదిగో, అదిగో అంటున్నారని.. తనకు న్యాయం మాత్రం జరగడం లేదని అప్పారావు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. తాను దివ్యాంగుడిలా జన్మించడమే తప్పులా ఉందని వాపోతున్నాడు. -
జన్మభూమి కమిటీలు ఆడిందే ఆట పాడిందే పాట
-
జన్మభూమి కమిటీలకు కనికరం లేదు!
జెడ్పీచైర్మన్ ఎదుట పెట్లూరువాసుల ఆవేదన వెంకటగిరి: పెట్లూరుకు చెందిన వెంకటసుబ్బయ్య ఐదేళ్లుగా మంచానికి పరిమితమై ఉన్నాడు.. భార్య కూలీ పనులకు వెళితేనే పూట గడుస్తోంది.. దివ్యాంగుల పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్న జన్మభూమి కమిటీ సభ్యులు కనికరించలేదని బాధితుడి బంధువులు జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం గడపగడపకు వైఎస్సార్‌లో భాగంగా పెట్లూరు గ్రామంలో పర్యటించిన జెడ్పీ చైర్మన్‌కు ప్రజలు తమ సమస్యలను మొరపెట్టుకున్నారు. సబ్సిడీ రుణాలు, పింఛన్ల మంజూరులో అర్హులకు అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. స్పందించిన జెడ్పీచైర్మన్ మాట్లాడుతూ వెంకటసుబ్బయ్య దీనస్థితిని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి సాయం అందించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా సహాయకార్యదర్శులు చిట్టేటి హరికృష్ణ, సాయినాయుడు, జిల్లా రైతువిభాగం కార్యదర్శి గూడూరు భాస్కర్‌రెడ్డి, మండల కన్వీనర్ ఆవుల గిరియాదవ్, మాజీ స్టీరింగ్ కమిటీ సభ్యుడు కూనా మల్లికార్జున్, మాజీ మండల కన్వీనర్ బత్తినపట్ల వీరారెడ్డి, వెంగమాంబపురం సొసైటీ ఉపాధ్యక్షుడు ఆర్ వెంకటకృష్ణమనాయుడు, నాయకులు కందాటి రాజారెడ్డి, మాజీ ఎంపీటీసీ వెంకటేశ్వర్లు, మహిళా నేత ధనియాల రాధ, తదితరులు పాల్గొన్నారు. -
జలసిరి.. వర్షార్పణం
► జలసిరి-2 అమలు తీరిదీ.. ►10,223 జలసిరి బోర్ల లక్ష్యం ►5,850గుర్తించిన బ్లాక్‌లు ►1,185నీటి లభ్యత బ్లాక్‌లు ►106మంజూరు ►74వేసిన బోర్లు ► 39 నీళ్లు పడిన బోర్లు ఆయకట్టును పెంపొందించే ఉద్దేశంతో అమలు చేస్తున్న జలసిరి పథకం జిల్లాలో చతికిల పడింది. కాలువల్లో నీరు పారకపోయినా పంటలు ఎండిపోకూడదని బోర్లు వేసేందుకు తీసుకున్న నిర్ణయం అపహాస్యమవుతోంది. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు.. అధికారుల్లో చిత్తశుద్ధి లోపించడం వల్ల పుణ్యకాలం కాస్తా గడిచిపోతోంది. వర్షాకాలం ప్రారంభం కావడంతో ఇక బోర్లు వేసే అవకాశం కూడా లేకుండాపోతోంది. ఆయకట్టు ప్రాంతాల్లో 10,223 బోర్ల తవ్వకానికి అనుమతి లభించింది. ఆయకట్టు ప్రాంతాల్లో రెండు నుంచి మూడెకరాల భూమి కలిగిన రైతులు ఈ పథకానికి అర్హులు. ఆయకట్టు ప్రాంతాల్లోని చివరి భూములకు ప్రాధాన్యత కల్పిస్తున్నారు. అర్హులైన లబ్ధిదారుల జాబితాను జన్మభూమి కమిటీ ఆమోదించాల్సి ఉండగా.. లబ్ధిదారుడు పట్టాదారు పాసు పుస్తకం నకలు, ఆధార్‌కార్డు, ఉపాధి హామీ పథకం జాబ్‌కార్డు అందజేయాలనే నిబంధనలు విధించారు. ప్రభుత్వం బోరు తవ్వుకునేందుకు రూ.1,19,000 ఇస్తుందనే మాటే కానీ.. క్షేత్ర స్థాయిలో సవాలక్ష నిబంధనలు రైతులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. కేవలం ఆయకట్టు ప్రాంతాల్లోనే బోరు బావి తవ్వాలనే నిబంధన వల్ల ఈ పథకం లక్ష్యాన్ని చేరుకోలేకపోయినట్లు తెలుస్తోంది. చాలా ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటిపోవడం.. ప్రభుత్వం నిర్ణీత అడుగుల వరకే డబ్బు చెల్లిస్తామని చెప్పడంతో పథకం నీరుగారింది. అదనపు భారం రైతుపైనే.. విద్యుదీకరణ సబ్సిడీ, పంపుసెట్ ఖరీదుపై లబ్ధిదారుడు ఎస్సీ, ఎస్టీలైతే 5శాతం(రూ.4,500), ఇతరులు 20శాతం(రూ.18,000) చెల్లించాలి. విద్యుదీకరణకు రూ.50వేల సబ్సిడీ మినహాయించి మిగిలిన మొత్తమంతా లబ్ధిదారుడే భరించాల్సి వస్తోంది. ఇక్కడే అసలు సమస్య ఉత్పన్నమవుతోంది. కేవలం విద్యుదీకరణకే కొందరు రైతులకు రూ.3లక్షల నుంచి రూ.5లక్షల వరకు వెచ్చిస్తున్నారు. విద్యుత్ శాఖ అధికారులు అవసరమైన కెపాసిటీ ట్రాన్స్ఫార్మర్ కంటే అధిక కెపాసిటీ ట్రాన్స్ఫార్మర్ను అమరుస్తుండటంతో రైతులపై మరింత భారం పడుతోంది. బోరు బావి తవ్వేందుకు, కేసింగ్ పైపు వేసేందుకు గరిష్టంగా రూ.24వేలు చెల్లిస్తామని చెబుతున్నా, బోరు ఫెయిలైతే మాత్రం కొంత మొత్తాన్ని లబ్ధిదారుడే భరించాల్సి ఉంది. చిన్న, సన్నకారు రైతులు ఆ మొత్తాన్ని వెచ్చించలేక పథకంపై పెద్దగా ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. వర్షాకాలంలో బ్రేక్ పడినట్లే.. వర్షాకాలం ప్రారంభం కావడంతో బోరు బావుల తవ్వకాలపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఆయకట్టు ప్రాంతాల్లోనే బోరుబావులు తవ్వాలనేది పథకంలోని నిబంధన. ఆయకట్టు ప్రాంతాల్లో అధికంగా వరిమళ్లు ఉండటం.. ప్రస్తుతం వర్షాలు కురుస్తుండటంతో ఆ పొలాల్లోకి వెళ్లేందుకు బోరువెల్ వాహన యజమానులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఒకసారి పొలంలో వాహనం దిగబడిందంటే దానిని బయటకు తీసుకొచ్చేందుకు భారీగా ఖర్చు అవుతుందని జంకుతున్నారు. ఫలితంగా పథకానికి ఈ సీజన్లో బ్రేక్ పడినట్లేననే చర్చ జరుగుతోంది. -
జన్మభూమి ఇంటి గుట్టు
► సొంత ఇళ్లు ఇప్పిస్తామంటూ వసూళ్లు ► జన్మభూమి కమిటీ సభ్యుల పేరుతో నిరుపేదలకు టోపీ ► దళారులుగా మారిన తెలుగు తమ్ముళ్లు పేదల సొంత ఇంటి కల తెలుగు తమ్ముళ్లకు కాసులు కురిపిస్తోంది. ‘పది వేల రూపాయలు ఇవ్వండి. మీకు సొంత ఇల్లు ఇప్పిస్తాం’ అంటూ తిరుపతి నగరంలో తెలుగుదేశం పార్టీకి చెందిన చోటా నాయకులు వసూళ్లకు పాల్పడుతున్నారు. తాము చెప్పిన వారికే అధికారులు ఇళ్లు మంజూరు చేస్తారనీ, తమ మాట వినకుంటే అనర్హుల జాబితాలో పెట్టిస్తామని భయపెడుతున్నారు. కొందరు అధికారులకు ఈ వ్యవహారం తెలిసినా అధికారం వాళ్లది తమకెందుకని మిన్నకుంటున్నారు. తిరుపతి కార్పొరేషన్: సావిత్రికి ఇద్దరు పిల్లలు కాగా, ఐదేళ్ల క్రితం భర్త చనిపోయాడు. అంత వరకు అద్దె ఇంటిలో ఉండటం, సంపాదన లేకపోవడం, అద్దె కట్టుకోలేక ప్రభుత్వం కల్పించే సొంత ఇంటి కోసం జన్మభూమి కమిటీ సభ్యుడిని వేడుకుంది.రూ.10వేలు ఇచ్చావంటే ఆన్లైన్లో నీ పేరు నమోదు చేయించి, ఇల్లు వచ్చేలా మంత్రితో మాట్లాడుతా ’’ అని ఆ కమిటీ సభ్యుడు హామీ ఇచ్చాడు.‘‘ఇళ్లలో పాచిపని చేసుకునే కుమారిది నిరుపేద కుటుంబం. ‘అందరికీ ఇల్లు’ ఇస్తామన్న ప్రభుత్వ ప్రకటన చూసి జన్మభూమి కమిటీ సభ్యుడిని ఆశ్రయించింది. అందుకు ఆయన రూ.12వేలు ఇస్తే ఇల్లు ఇప్పించేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.’’ ఇదీ తిరుపతిలో సొంత ఇల్లు ఇప్పిస్తామంటూ జన్మభూమి కమిటీ సభ్యులుగా ఉన్న తెలుగు తమ్ముళ్ల అడ్డగోలు వ్యాపారానికి నిదర్శనం. పట్టణాల్లో ఇల్లులేని ప్రతి కుటుంబానికి 2022 నాటికి శాశ్వత గృహాలు నిర్మించాలని కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయి. అందుకు అర్హులైన లబ్ధిదారులను గుర్తించేందుకు తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ ఒక ప్రత్యేక వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేసింది. అర్హులైన పేదలు మీసేవ ద్వారా అర్హులు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. అయితే దీనిని తిరుపతిలోని తెలుగు తమ్ముళ్లు తమ అక్రమాలకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. ఆదాయ మార్గంగా దరఖాస్తులు తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో అధికారిక లెక్కల ప్రకారం 91,811 నివాస గృహాలు ఉండగా 3,74,260 లక్షల మంది జీవిస్తున్నారు. అయితే తిరుపతిలో 4.50 లక్షల మందికి పైగా జీవనం సాగిస్తున్నారని, అందులో సొంత ఇల్లులేని నిరుపేదలు దాదాపు 50 వేల మందికి పైగా ఉన్నారని అధికారులు చెబుతున్నారు. అర్హులు ఈ పథకంలో దళారీలను నమ్మకుండా నేరుగా మీ సేవ కేంద్రంలో రూ.20 చెల్లించి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అందుకు కుటుంబ సభ్యుల ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంకు ఖాతా నెంబరును జత చేసేలా మార్గదర్శకాలు జారీ చే సింది. రూ.10వేలు ఇస్తే ఇల్లు ఇప్పిస్తాం నగరంలో శాశ్వత ఇల్లు లేని నిరుపేదలు దాదాపు 40 వేల మంది ఉన్నారని అధికారులు గుర్తించారు. అర్హులు మార్చి 20 నుంచి ఏప్రిల్ 20 వరకు ముప్పైరోజుల పాటు ఆన్లైన్ దరఖాస్తులు చేసుకోవాలని ప్రచారం కల్పించారు. అయితే ఇప్పటివరకు కేవలం 3వేల అప్లికేషన్లు మాత్రమే వచ్చినట్టు విశ్వసనీయ సమాచారం. అందుకు కార ణాలు విశ్లేషిస్తే ఆయా వార్డుల్లోని అర్హుల వివరాలు తెలుసుకున్న తెలుగు తమ్ముళ్లు తమకు తాముగా జన్మభూమి కమిటీ సభ్యులుగా ప్రకటించుకున్నారు. ఇల్లు కావాలంటే తాము రెఫర్ చేయాలని, లేకుంటే అధికారుల దృష్టికి వెళ్లదని చెబుతున్నారు. పైగా మీ దరఖాస్తు నంబరును మంత్రి, ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి సొంతిల్లు మంజూరు చేయిస్తామని, అందుకు రూ.10వేలు అధికారులకు ఇవ్వాల్సి ఉంటుందంటున్నారు. డబ్బులు ఇచ్చిన వారికే ఇల్లు వస్తుందని దళారుల అవతారం ఎత్తిన నేతలు ప్రచారం చేసుకుంటున్నారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడం తెలియని నిరుపేదలు అమాయకంగా పచ్చ నేతలను ఆశ్రయిస్తున్నారు. ఇలా ఒక్కో వార్డుకు సరాసరి 550 నుంచి 670 మంది చొప్పున నిరుపేదల నుంచి దరఖాస్తులు స్వీకరించిన ట్లు తెలుస్తోంది. ఒక్కో దరఖాస్తుదారుడి నుంచి వ్యక్తుల స్థాయిని బట్టి రూ.10 నుంచి రూ.15వేల వరకు దాదాపు రూ.కోటి వరకు వసూళ్లు చేసినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ అక్రమానికి స్థానికంగా ఉన్న స్వయం సహాయక సంఘాల నాయకులు సైతం సహకరించారని సమాచారం. దీనిపై ఎవరైనా ఎదురు ప్రశ్నిస్తే, వారిని అనర్హులుగా పక్కన పెడుతున్నట్టు బాధిత మహిళలు ఆరోపిస్తున్నారు. ఆటోనగర్, జీవకోన, బొమ్మగుంట, ఎస్టీవీ నగర్, న్యూ ఇందిరా నగర్, కొర్లగుంట, మారుతీ నగర్ తదితర ప్రాంతాలకు చెందిన మహిళలు ఇందులో బాధితులుగా ఉన్నట్లు సమాచారం. తమను అధికార పార్టీ నాయకుల నుంచి కాపాడాలని, కార్పొరేషన్ అధికారులను వేడుకుంటున్నారు. అయితే దీనిపై మాట్లాడేందుకు కార్పొరేషన్ అధికారులు నోరు మెదపడం లేదు. సార్ అధికారం వారిది.. అందులోకి మమ్మల్ని లాగకండి ప్లీజ్ అంటూ తప్పించుకోవడం గమనార్హం. -
భూ సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టండి
భూ పరిపాలన ప్రధాన కమిషనర్ అనిల్ చంద్ర పునేతా కర్నూలు(రాజ్‌విహార్): భూ సమస్యలు పరిష్కరించేందు కు తగిన చర్యలు చేపట్టాలని రాష్ట్ర భూ పరిపాలన ప్రధాన కమిషనర్ అనిల్ చంద్ర పునేతా అధికారులను ఆదేశించా రు. బుధవారం ఆయన హైదరాబాదు నుంచి ఈ-క్యాంపు బుకింగ్, జన్మభూమి పెండింగ్ అర్జీల పరిష్కారం, ఫైళ్ల డిస్పోజల్స్, బడ్జెట్, కౌలు రైతులకు ఎల్ఈసీ కార్జుల జారీ, వన్‌టైమ్ కన్వర్షన్, సర్వే పనులు తదితర అంశాలపై జిల్లాల వారీగా జాయింట్ కలెక్టర్లతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ క్యాంపు బుకింగ్స్‌ను రెండు రోజుల్లో పూర్తి చేసి పంపాలన్నారు. వెబ్ ల్యాండ్ వివరాలు, భూముల సర్వేలు, డిజిటల్ ఇండియాలో భాగంగా భూముల వివరాలు, మ్యాపులు, ఈ-పట్టాదారు పుస్తకాల పంపిణీ చేశారో తెలపాలన్నారు. రేషన్ కార్డుల కోసం వచ్చిన ఆర్జీలను ఆన్లైన్ చేయాలన్నారు. కర్నూలు నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో జేసీ హరికిరణ్, డీఆర్ఓ గంగాధర్ గౌడు, ఆదోని ఆర్డీఓ ఓబులేసు, సర్వే భూమి రికార్డుల ఏడీ మనోహర్ రావు, ఎన్ఐసీ అధికారిణి నూర్జహాన్ పాల్గొన్నారు. -
జీ..హుజూర్ !!
► అధికార పార్టీ నేతల ఆదేశాల మేరకే కేసులు ► కదిరి ఎమ్మెల్యే వాహనంపై దాడికేసులో నిందితులను తప్పించిన వైనం ► ఉరవకొండ హత్య కేసులోనూ ► పాత్రధారులను తప్పించేందుకు రంగం సిద్ధం ► నెల గడుస్తున్నా లాయర్ శ్రీరాములును అరెస్టు చూపని వైనం (సాక్షి ప్రతినిధి, అనంతపురం) ► ప్రభుత్వం సంక్షేమ పథకాల కోసం దరఖాస్తు చేసుకున్న వారిని ఎంపిక చేసేందుకు ప్రభుత్వం జన్మభూమి కమిటీ పేరుతో తెలుగుదేశం పార్టీ నేతలను నియమించింది. ఈ కమిటీ ఎవరి పేర్లు చెబితే వారు లబ్ధిదారుల జాబితాలో ఉంటారు.’ ►‘ అనంత’లో ఏ కేసులో ఎవరి పేరు చేర్చాలి? ఎవరు పేరు తొలగించాలనే సూచనలు కూడా అధికార పార్టీ నేతలు చేస్తున్నారు. బాధాకరమేంటంటే పోలీసులు కూడా ‘జీ హుజూర్’ అని వారి చెప్పినట్లుగానే కేసులు తారుమారు చేస్తున్నారు.’ \తాజాగా ‘అనంత’లో వెలుగు చూస్తున్న కేసుల తారుమారు అంశం సామాన్య ప్రజల్లో భయాందోళనలను రేపుతోంది. పోలీసులే నిందితులను తప్పించే ప్రయత్నం చేస్తుంటే శాంతి భద్రతలు ఏ మేరకు అదుపులో ఉంటాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. కదిరి ఎమ్మెల్యే అత్తార్‌చాంద్‌బాషా తలుపుల మండలంలో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇటీవల వెళ్లారు. ఆయన కారుపై కొందరు రాళ్లు వేసి దాడికి యత్నించారు. బాషా అనే వ్యక్తి రాళ్లు వేసినట్లు ఎమ్మెల్యే గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. తర్వాత పోలీసులు బాషాను అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. తలుపుల టీడీపీ నేత గరికపల్లి రామకృష్ణారెడ్డి కుమారుడు ఆదేశాలతోనే తాను దాడి చేశానని బాషా పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది. అయితే తీరా పోలీసులు కేసు మాత్రమూ బాషా, గరికపల్లి కుమారుడిపై కాకుండా ఘటనతో ఏ మాత్రం సంబంధం లేని అశోక్ అనే వ్యక్తిపై నమోదు చేశారు. ఉరవకొండలో హ త్యకేసు తారుమారుకు యత్నం ఉరవకొండలో మార్చి 17న వెంకటేశ్ అనే టీడీపీ నేత పోలీస్ స్టేషన్ పక్కనున్న ఆర్అండ్బీ అతిథిగృహంలో హత్యకు గురయ్యారు. విడపనకల్లు ఎంపీపీ ప్రతాప్‌నాయుడు, లాయర్ శ్రీనివాసులు తన భర్తను హత్య చేశారని వెంకటేశ్ భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కూడా మార్చి 18న ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వీరిద్దరితో పాటు మరికొందరు ఈ కేసులో ఉన్నారు. ప్రస్తుతం ఈ కేసు చార్జ్‌షీటు ఫైలు చేసి కేసును కోర్టు ముందు ఉంచేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. చార్జ్‌షీట్‌లో ప్రతాప్, శ్రీనివాసులు పేర్లను తప్పించేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. హత్యకు ప్రధాన కారకులైన వారిని తప్పించి, ఘటనతో సంబంధం లేని వ్యక్తులను కేసులో చేర్చేందుకు సిద్ధమైనట్లు తెలిసింది. టీడీపీ నేతల ఒత్తిళ్లతోనే పోలీసులు ఈ కేసును తారుమారు చేసేందుకు సిద్ధమయ్యారని అక్కడి విపక్ష పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. పైగా శ్రీనివాసులు వృత్తి రీత్యా లాయర్. ఒక లాయర్‌ను అరెస్టు చేస్తే 24 గంటల్లోపు కోర్టుకు హాజరు పర చాలి. లేదంటే స్టేషన్ బెయిల్‌పై విడుదల చేయాలి. కానీ ఇన్ని రోజులుగా శ్రీనివాసులు పోలీసుల అదుపులోనే ఉన్నారు. ఇలాంటి కేసులే తారుమారవుతున్నాయంటే బయటి ప్రపంచానికి తెలీయకుండా ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలోని కేసుల పరిస్థితి ఏంటో ఇట్టే తెలుస్తోంది. నేరాలకు సంబంధించి అసలు నేరస్తులను తప్పించి, మరొకరిని బాధ్యుల్ని చేస్తే నేరస్తులు మరిన్ని నేరాలు చేసే ప్రమాదం లేకపోలేదు. అధికార పార్టీ నేతలు ఎలాంటి ఒత్తిళ్లు తీసుకొచ్చినా నేరస్తులకు శిక్షపడేలా చేయడంలో పోలీసులు కఠినంగా వ్యవహరించాలని, లేదంటే శాంతిభద్రతలకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని విపక్షాలు వ్యాఖ్యానిస్తున్నాయి. -
అర్హులందరికీ ఇళ్లు మంజూరు చేయాలి
ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌యాదవ్ నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): జన్మభూమి కమిటీలతో సంబంధం లేకుండా అర్హులందరికీ ఇళ్లు మంజూరు చేయాలని నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌యాదవ్ పేర్కొన్నారు. ఆరో డివిజన్లో డిప్యూటీ మేయర్ ముక్కాల ద్వారకానాథ్ ఆధ్వర్యంలో పక్కాగృహాల దరఖాస్తులను శెట్టిగుంట రోడ్డులోని సత్రంబడిలో గురువారం ఉచితంగా ఆన్లైన్లో నమోదు చేశారు. రసీదులను డివిజన్ ప్రజలకు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే అనిల్ మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇళ్లు లేని వారికి గృహ వసతిని కల్పిస్తామన్నాయని, దీనికి సంబంధించిన దరఖాస్తులను ఆన్లైన్లో చేసుకోవాలనే అంశాన్ని గుర్తించి డిప్యూటీ మేయర్ ఆధ్వర్యంలో సుమారు వెయ్యి దరఖాస్తులను పొందుపర్చామని వివరించారు. రిజిస్ట్రేషన్‌కు ఇతర కేంద్రాల్లో రూ.వంద ఖర్చవుతోందని, డివిజన్లోని ప్రజలపై ఆ భారం పడకుండా డిప్యూటీ మేయర్ కార్యక్రమాన్ని నిర్వహించడాన్ని అభినందించారు. పేదలకు ఎన్ని ఇళ్లు ఇస్తామనే అంశాన్ని ప్రభుత్వం స్పష్టం చేయకపోవడం బాధాకరమన్నారు. నగరంలోని 54 డివిజన్లలో దాదాపు లక్ష మందికిపైగా దరఖాస్తు చేసుకున్నారని వివరించారు. రాజకీయాలకతీతంగా జన్మభూమి కమిటీలను పక్కనబెట్టి అర్హులందరికీ గృహ వసతిని కల్పించాలని డిమాండ్ చేశారు. కార్పొరేటర్ ఓబిలి రవిచంద్ర, దేవరకొండ అశోక్, నాయకులు శివకుమార్, తులసి, మద్దినేని శ్రీధర్, హరీష్, చిరంజీవి, సునీల్, సునీత, మల్లి, తదితరులు పాల్గొన్నారు. చెత్త సేకరణకు చర్యలు చేపట్టాలి చెత్త సేకరణకు కార్పొరేషన్ ప్రత్యేక చర్యలు చేపట్టాలని నెల్లూరు నగర ఎమ్మెల్యే డాక్టర్ అనిల్‌కుమార్‌యాదవ్ తెలిపారు. 46వ డివిజన్ కార్పొరేటర్ వేలూరు సుధారాణి ఆధ్వర్యంలో చెత్త సేకరణకు అవసరమైన రెండు రిక్షా బండ్లు, డస్ట్బిన్లను మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లుకు ఎమ్మెల్యే అనిల్, డిప్యూటీ మేయర్ ముక్కాల ద్వారకానాథ్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. డివిజన్ నుంచి రూ.కోటికిపైగా పన్నులు కార్పొరేషన్‌కు వస్తున్నాయని, అయితే డివిజన్లో అభివృద్ధి పనులకు రూ.19 లక్షలనే వెచ్చించారని ఆరోపించారు. డ్రెయిన్లు, మురుగుకాలువలకు నిధులను వెచ్చించాల్సిన అవసరం ఉందని చెప్పారు. మెరుగైన పారిశుధ్యం కోసం స్థానిక కార్పొరేటర్ తన వం తు సహకారం అందించడాన్ని అభినందించారు. కార్పొరేటర్లు ఓబి లి రవిచంద్ర, ఖలీల్‌అహ్మద్, దేవరకొండ అశోక్, మహేష్, రఘు, కుమార్, నాగరాజు, రామలక్ష్మణ్, అరవింద్, మల్లికార్జున, శ్రీనివాసులురెడ్డి, శ్రీకాంత్, వీరా, తదితరులు పాల్గొన్నారు. -
'ఉచిత యిసుక పేరుతో వందల కోట్ల లూటీ'
హైదరాబాద్: ఉచిత యిసుక పేరుతో కొన్ని వందల కోట్ల రూపాయాలు లూటీ చేసి టీడీపీ కార్యకర్తలకు దోచి పెడుతున్నారని వైఎస్సార్ సీపీ నాయకుడు పార్థసారధి ఆరోపించారు. అవినీతికి తావు లేకుండా ఉచిత యిసుక ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జన్మభూమి కమిటీలతో గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడిందని ఆరోపించారు. జన్మభూమి కమిటీల పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నారని తెలిపారు. జన్మభూమి కమిటీల అవినీతికి సీఎం చంద్రబాబు బాధ్యత వహించాలన్నారు. ఎస్డీఎఫ్ నిధుల కేటాయింపులో టీడీపీ ప్రభుత్వం పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందని విమర్శించారు. ఎస్డీఎఫ్ ను, టీడీపీ సంక్షేమ నిధిగా మార్చేశారని ఆక్షేపించారు. ఓడిపోయిన వారికి, టీడీపీ కార్యకర్తలకు వందల కోట్లు కేటాయించడానికి సీఎంకు అధికారం ఉందా అని ప్రశ్నించారు. టీడీపీ కార్యకర్తల పేరు మీద జీవోలు ఇచ్చి నిధులు కేటాయించడం సరికాదన్నారు. విచారణ జరిపి పక్షపాతధోరణితో కేటాయించిన నిధులు నిలుపుదల చేయాలని పార్థసారధి డిమాండ్ చేశారు. -
అడిగితే... అధికార జులుం
జన్మభూమి కమిటీల పుణ్యమాని పచ్చగా ఉండే గ్రామాల్లో పింఛన్ల రగడ రగులుకుంటోంది. తాము చెప్పిన వారికే పింఛన్లు ఇవ్వాలని అధికారులపై కమిటీల సభ్యులు పెత్తనం చెలాయిస్తుండడంతో అనవసర రగడ నెలకొంటుంది. తాము చెబితేనే వారు అర్హులని..లేకుంటే నిజంగా అర్హులైనా కాదని పెత్తనం చెలాయిస్తున్నారు. దీంతో అర్హులు ప్రశ్నిస్తున్నారు. అడిగితే అధికార దౌర్జన్యం ప్రదర్శిస్తున్నారు. ఇందుకు తార్కాణమే వావిలవలస గ్రామంలో మంగళవారం చోటు చేసుకున్న తెలుగు తమ్ముళ్ల దాడి. వివరాల్లోకి వెళ్తే... రేగిడి : వావిలవలస గ్రామంలో పింఛన్ల విషయంలో తెలుగుదేశం పార్టీ గత కొన్నాళ్లుగా అనుసరిస్తున్న దౌర్జన్య నీతి మంగళవారం కొట్లాటకు దారితీసింది. తామేమి తప్పు చేశామని తమ పింఛన్లు తొలగించారని.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే అర్హులైనా..పింఛన్లు ఇవ్వరా అంటూ ప్రశ్నించినందుకు దాడి చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య పింఛన్ల వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. రాళ్లు రువ్వుకోవడంతో కొందరికి స్వల్ప గాయూలయ్యూయి. గ్రామంలో సామాజిక తనిఖీలు చేపట్టక ముందు 226 పింఛన్లు ఉండేవి. తరువాత 70 పింఛన్లను వివిధ కారణాలతో తొలగించారు. పింఛన్ల మంజూరు బాధ్యతను జన్మభూమి కమిటీలకు అప్పగించడంతో తొలగించిన పింఛన్లలో 33 మంది తెలుగుదేశం అనుచరులకు జన్మభూమి సభ్యుల సిఫారసు మేరకు పునరుద్ధరించారు. మిగిలిన 37 మందిలో ఆరుగురు వివిధ కారణాలతో మృతి చెందగా మిగిలిన 31 మందికి నేటికీ మంజూరు కాలేదు. వీరంతా వైఎస్ఆర్ సీపీకి చెందిన వారు కావడం విశేషం. దీనిపై బాధితుల తరఫున వైఎస్ఆర్ సీపీ సర్పంచ్ మురుుద ప్రసన్నలక్ష్మి, మాజీ సర్పంచ్ ముయిద శ్రీనివాసరావు మండల, జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు. అర్హులకు పింఛన్లు మంజూరు చేయూలని కోరారు. తొలగించిన వారంతా పేదలే కావడంతో స్పందించిన ఆనంద్ యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు ముద ఆనందరావు ఆరు నెలలుగా ఒకొక్కరికి రూ.1000 చొప్పున ప్రతి నెలా అందజేస్తున్నారు. ఈ క్రమంలో పింఛన్లు కోల్పోయిన 31 మందితో పాటు కొత్తగా మరో తొమ్మిది మంది సర్పంచ్‌తో కలిసి కలెక్టర్ లక్ష్మీనృసింహంకు ఇటీవల ఫిర్యాదు చేశారు. విచారణ జరపాలని కోరారు. స్పందించిన కలెక్టర్ డీఆర్డీఏ పీడీ తనూజారాణికి గ్రామంలో పింఛన్ల విషయమై దర్యాప్తు చేయూలని ఆదేశించారు. మండల విద్యాశాఖాధికారి ఎంవీ ప్రసాదరావుకు విచారణాధికారిగా నియమించారు. కొట్లాటకు కారణమిదే... వావిలపల్లిలోని రామమందిరంలో మంగళవారం ఉదయం 10 గంటలకు విచారణ చేపట్టారు. ఫిర్యాదుదారు సర్పంచ్ ప్రసన్నలక్ష్మీతో పాటు నోటీసులు అందుకున్న 33 మంది పింఛన్ కోల్పోయిన వారు హాజరయ్యూరు. వీరితో పాటు ఎంపీటీసీ పాలూరి రామినాయుడుకు సమాచారం ఇవ్వడంతో ఆయన కూడా పాల్గొన్నారు. విచారణకు హాజరైన లబ్ధిదారుల నుంచి సంతకాలు తీసుకొని పింఛన్ పొందేందుకు తగిన ఆధారాలు అందజేయూలని విచారణాధికారి కోరారు. అప్పటికే ఇరు వర్గాల వారు ఆరు బయట ఉండడంతో ఘర్షణ తలెత్తింది. స్వల్ప కొట్లాటకు దారితీసింది. కొందరు రాళ్లు రువ్వడంతో కొందరికి గాయూలయ్యూయి. గాయపడిన వారిని రాజాం సామాజిక ఆస్పత్రికి తరలించారు. మరోవైపు విచారణ జరుగుతున్న క్రమంలో అక్కడకు వచ్చిన ఎన్టీఆర్ పింఛన్ల విభాగం ఏపీడీ సోమయూజులు, ఎంపీడీఓ వి.రామలింగేశ్వరరావు వద్దకు బాధితులు వెళ్లి ఆయన వాహనాన్ని అడ్డుకున్నారు. తమకు న్యాయం చేయూలని కోరారు. స్పందించిన పోలీసులు... వావిలవలస గ్రామంలో విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా ఎస్ఐ ఎన్.కామేశ్వరరావు, హెచ్‌సీ వి.అప్పలనాయుడు, పీసీ రామారావులను బందోబస్తుకు నియమించారు. వీరు విచారణ జరుగుతున్న ప్రదేశం వద్దే ఉన్నప్పటికీ ఒక్కసారిగా ఇరు వర్గాలు ఘర్షణకు దిగడంతో సమాచారం అందుకున్న ఎస్ఐ ఇరువర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అనంతరం తిరిగి విచారణ ప్రారంభించారు. అధికారులకు చూపించాల్సిన పింఛన్ల ఆధారాలు తీసుకొని రాకపోవడంతో గంటకాలం వేచి చూసి అర్ధంతరంగా లేచి వెళ్లిపోయారు. కేసుల నమోదు... రేగిడి : తనను తన కుటుంబ సభ్యులను పాలూరి రామినాయుడుతో పాటు మరో 13 మంది కులం పేరుతో దూషించారంటూ వావిలవలస గ్రామానికి చెందిన వర్రి తవుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మంగళవారం కేసు నమోదు చేశామని ఎస్ఐ ఎన్.కామేశ్వరరావు తెలిపారు. గ్రామంలోని రామమందిరం వద్ద పింఛన్ల వ్యవహారంపై దర్యాప్తు జరుపుతుండగా తమకు పింఛన్లు అందని విషయమై అధికారుల వద్ద మొర పెట్టుకునేందుకు వర్రి తవుడు ఇతర దళితులు కూర్చుని ఉండగా రామినాయుడు వర్గీయులు కర్రలు, రాళ్లు పట్టుకొని వచ్చి కులం పేరుతో దూషించి గాయపర్చినట్టు తవుడు ఫిర్యాదు ఇచ్చారని చెప్పారు. పింఛన్ల వ్యవహారంలో జరిగిన కొట్లాటలో గాయపడ్డ తవుడుతో పాటు జామి లచ్చయ్య, చింత పోలినాయుడు, చోరు చిన్నసాంబయ్య యూదవులకు చెందిన కొయ్యూన తవుడు, మజ్జి వెంకటరమణ రాజాం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్టు ఎస్ఐ తెలిపారు. అలాగే పాలూరి రామినాయుడు వర్గానికి చెందిన శీలంక తవిటినాయుడు, కలిగి వెంకటరావు, మండల మోహనరావు, పిన్నింటి సూర్యనారాయణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆనందరావు, శ్రీనివాసరావుతో పాటు మరో 16 మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు. ముయిద ఆనందరావు, ముయిద శ్రీనివాసరావుతో పాటు మరో 16 మంది కర్రలతో బెదిరించి పింఛన్లు ఎలా ఇవ్వరో చూస్తామని బెదిరించినట్టు ఫిర్యాదు చేశారని తెలిపారు. -
జన్మభూమి కమిటీల పెత్తనం ఏమిటి?
అసెంబ్లీలో ప్రస్తావించిన ఎమ్మెల్యే కాకాణి నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): జన్మభూమి కమిటీలు రాజ్యాంగవిరుద్ధంగా వ్యవహరిస్తున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి గురువారం ఆరోపించారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో పింఛన్ల వివరాలు, కేంద్ర ప్రభుత్వ పింఛన్ల సాయంపై ఆయన మాట్లాడారు. జన్మభూమి కమిటీల జోక్యంతో అర్హులకు పింఛన్లు అందడంలేదని, జరుగుతున్న అన్యాయంపై ధ్వజమెత్తారు. దివంగత సీఎం వైఎస్సార్ హయాంలో అర్హులందరికీ పార్టీలకతీతంగా పింఛన్లను అందజేసిన విషయాన్ని గుర్తు చేశారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం దీనికి విరుద్ధంగా జన్మభూమి కమిటీలకు ప్రమేయం కల్పించి రాజకీయ పబ్బం గడుపుకొంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్హులకు వెంటనే పింఛన్లు అందజేయాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వంలో అందజేసిన పింఛన్లు, ప్రస్తుత ప్రభుత్వం అందజేస్తున్న పింఛన్లను గణాంకాలతో సహా వివరించారు. ఆధార్‌కార్డుల్లో చేతివేళ్లు నమోదు కాలేదని, భూమి కలిగి ఉన్నారని, వయస్సు తక్కువ, తదితర కారణాలతో తమ పార్టీ మద్దతుదారుల పింఛన్లను తొలగించారని ఆరోపించారు. -
కమిటీల కర్ర పెత్తనం
గ్రామాల్లో జన్మభూమి కమిటీల అరాచకం అర్హులను సైతం నిర్దాక్షిణ్యంగా తొలగిస్తున్న వైనం కమిటీలకే వత్తాసు పలుకుతున్న అధికారులు అనంతపురం సెంట్రల్ :జన్మభూమి కమిటీలు గ్రామాల్లో కర్ర పెత్తనం చలాయిస్తున్నాయి. ప్రభుత్వ పథకాలకు లబ్ధిదారుల ఎంపికలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. పక్షపాత ధోరణితో అర్హులకు సైతం తీరని అన్యాయం చేస్తున్నాయి. కమిటీ సభ్యుల కనుసన్నల్లో లేకపోతే పథకాలను నిర్దాక్షిణ్యంగా తొలగిస్తున్నారు. అధికారులు కూడా వారు చెప్పిందే శాసనంగా అమలు చేస్తున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లాలో జన్మభూమి కమిటీల సిఫారసుతో 44,417 మందికి పింఛన్ తొలగించారు. కొత్తగా 27,071 పింఛన్లు మంజూరయ్యాయి. ఈ సందర్భంగా గతంలో తొలగించిన వారిలో కొంతమందికి పునరుద్ధరించినా.. ఇంకా చాలామంది అర్హులకు అందడం లేదు. జిల్లావ్యాప్తంగా దాదాపు 84 వేల మంది కొత్త పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకుని ఎదురుచూస్తున్నారు. వీరందరికీ ఎప్పటిలోగా మంజూరు చేస్తారో అర్థం కావడం లేదు. ప్రతినెలా రూ.1.83 కోట్ల మిగులు ప్రస్తుతం వికలాంగులు 2,084 మంది, వృద్ధులు, వితంతువులు, ఇతరులు కలిపి 15,262 మందికి పింఛన్ రద్దు చేశారు. దీనివల్ల ప్రభుత్వానికి ప్రతినెలా రూ.1.83 కోట్లు మిగులుతోంది. అభయహస్తం పింఛన్ దారులకు వాస్తవానికి రూ.1,500 చొప్పున ఇవ్వాల్సి ఉండగా .. అందరితో సమానంగా రూ.వెయ్యి మాత్రమే పంపిణీ చేస్తున్నారు. గత ప్రభుత్వంలో రూ.200 పింఛన్ మొత్తానికి అదనంగా రూ.300 కలిపి మొత్తం రూ.500 అభయహస్తం లబ్ధిదారులకు ఇచ్చేవారు. ప్రస్తుతం పింఛన్ మొత్తాన్ని రూ.వెయ్యికి పెంచడంతో అభయహస్తం లబ్ధిదారులకు అదనంగా ఇవ్వాల్సి ఉంటుంది. అయితే.. ప్రభుత్వం అదనపు మొత్తం గురించి పట్టించుకోవడం లేదు. దీనివల్ల ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి డ్వాక్రా మహిళలు ముందుకు రావడం లేదు. -
నాడు వలపు.. నేడు వెగటు
సాక్షి ప్రతినిధి, కాకినాడ : ఎన్నికల సందర్భంగా రెండేళ్ల క్రితం జట్టు కట్టినప్పుడు టీడీపీ, బీజేపీ శ్రేణులు.. ‘కొత్త ప్రేమికుల్లా’ చెట్టపట్టాలు వేసుకుని తిరిగారు. అయితే అది అవసరార్థం తెచ్చిపెట్టుకున్న ప్రేమే తప్ప సైద్ధాంతిక సారూప్యం వల్లో, ప్రజలకు మేలు చేయూలన్న పరస్పర నిబద్ధతతోనే పెనవేసుకున్న బంధం కాదని అనతి కాలంలోనే తేలిపోయింది. ఇప్పటికీ సాంకేతికంగా రెండు పార్టీ లూ మిత్రపక్షాలుగానే ఉన్నా.. ఆ చెలిమి ఎడమొహం, పెడమొహం ప్రయూణంలా ఉంది. ముఖ్యంగా తమపట్ల టీడీపీ అనుసరిస్తున్న వైఖరి, ప్రదర్శిస్తున్న ఉదాసీనతలతో బీజేపీ శ్రేణులు భగ్గుమంటున్నాయి. ఎన్నికల్లో తమతో పొత్తువల్ల లబ్ధి పొందిన టీడీపీ.. అధికారంలోకి వచ్చిన తర్వాత ‘ఒడ్కెక్కాక బోటు మల్లన్న బోడి మల్లన్న అయిన’ చందంగా వ్యవహరిస్తోందని బహిరంగంగానే బీజేపీవారు విమర్శలకు దిగుతున్నారు. ఎన్నికల సమయంలో బీజేపీ డిమాండ్లను అయిష్టంగానే అంగీకరించిన చంద్రబాబు.. వాటిలో నెరవేర్చినవి తక్కువే. రాష్ట్రంలో తమ పార్టీ అగ్రనేతలకు న్యాయం జరిగినా జిల్లా, మండల, గ్రామ స్థాయిలో తమకు తీవ్ర అన్యాయమే జరుగుతోందని బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారు. మార్కెట్ కమిటీల నుంచి జన్మభూమి కమిటీల వరకూ తమకు దేనిలోనూ చోటు కల్పించకపోవడంపై కారాలు మిరియాలు నూరుతున్నారు. తమ పార్టీకి ఇచ్చిన హామీలను అటకెక్కించినట్లే.. ప్రజలకు ఇచ్చిన ఎన్నికల వాగ్దానాలను సరిగా నెరవేర్చక ప్రజాదరణ కోల్పోతున్న టీడీపీతో కటీఫ్ చెప్పేస్తేనే మంచిదనే వాదన బీజేపీ శ్రేణుల్లో బలంగా వినిపిస్తోంది. కాపు ఐక్యగర్జన సభ సమయంలో విధ్వంసం కేసుల్లో బీజేపీ వారినీ ప్రభుత్వం ఇరికించినా తమ పార్టీ మంత్రులు, ఎమ్మెల్సీ సోము వీర్రాజువంటి నాయకులు కానీ ఖండించకపోవడం వారిలో మరింత నిస్పృహకూ, నిరసనకూ కారణమైంది. మోదీ జనాకర్షణశక్తితో టీడీపీకే లబ్ధి.. ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కలసి పోటీ చేసినా నరేంద్రమోదీ జనాకర్షణశక్తి వల్ల తమకన్నా టీడీపీనే ఎక్కువగా లబ్ధి పొందిందనే వాదన బీజేపీలో ఆదినుంచీ ఉంది. ఎన్నికల్లో మిత్రపక్షమైన బీజేపీకి కేవలం రాజమహేంద్రవరం నగర నియోజకవర్గాన్ని కేటాయించగా డాక్టర్ ఆకుల సత్యనారాయణ విజయం సాధిం చారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచీ జిల్లాలో టీడీపీ, బీజేపీల మధ్య ఆధిపత్యపోరు, పలు అంశాలపై విభేదాలు పొడసూపుతూనే ఉన్నాయి. రాజమహేంద్రవరం నగర నియోజకవర్గంలో గ్రామీణ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి పెత్తనం చేయడం వారిమధ్య విభేదాలకు దారి తీసింది. నగరంలో గోదావరి పుష్కరాల పనుల ఎంపిక, నిధులు కేటాయింపుల్లోనూ గోరంట్ల ఏకచ్ఛత్రాధిపత్యంతో వ్యవహరించడాన్ని ఆకుల పలుమార్లు తప్పుపట్టారు. పుష్కరాల్లో చోటుచేసుకున్న అవినీతి, అక్రమాలపై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు బహిరంగంగా ధ్వజమెత్తడం, కార్పొరేషన్ సాక్షిగా అధికార పార్టీ నేతల అక్రమాలపై అధికారులను నిలదీయడం వంటి పరిణామాలతో రెండు పార్టీల మధ్య విభేదాలు మరింత పెరిగాయి. అమలాపురంలో సైతం ఇరు పార్టీల నేతల మధ్య పోరు సాగుతోంది. అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు, బీజేపీ నేత, రాష్ట్ర పశుగణాభివృద్ధి సంస్థ చైర్మన్ యాళ్ల దొరబాబు మధ్య గతంలో విభేదాలు ఇరు పార్టీల అగ్రనేతలు జోక్యం చేసుకునే స్థాయికి చేరాయి. వారి పాపం.. వీరికి శాపం.. టీడీపీ ప్రభుత్వం అవినీతికి పర్యాయపదంగా మారడంతో ఆ పాపం తమకు చుట్టుకుంటోందన్న భావన బీజేపీ నేతలు, కార్యకర్తల్లో బలంగా ఉంది. జన్మభూమి కమిటీల పేరుతో ప్రభుత్వ పథకాల్లో టీడీపీ చోటామోటా నాయకులు, కార్యకర్తలు చొచ్చుకుపోతుండడం బీజేపీ నేతలకు ఇబ్బందిగా మారింది. కేంద్రం నుంచి వస్తున్న పథకాలకు సైతం పచ్చరంగు పూస్తున్నారని బీజేపీ కార్యకర్తలు వాపోతున్నారు. వీటన్నింటికన్నా టీడీపీ అవినీతి, ప్రజావ్యతిరేక విధానాలతో ప్రజల్లో తమపై కూడా వ్యతిరేకత వస్తుందని ఆందోళ చెందుతున్నారు. డెల్టా రైతులకు శాపంగా మారిన పట్టిసీమ ఎత్తిపోతల పథకం, గోదావరి పుష్కరాల్లో అవినీతి, ఇసుక ర్యాంపుల్లో దోపిడీ, అధికారపార్టీ నేతలు గ్రామస్థాయిల్లో సాగిస్తున్న అవినీతి పాపం తమకు చుట్టుకుంటుందని బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. ఇవన్నీ అధిష్టానం దృష్టికి తీసుకుని వెళ్లి టీడీపీతో తెగుతెంపులు చేసుకుంటే వచ్చే ఎన్నికల్లో జనం మధ్యన తిరిగే అవకాశం ఉంటుందని, లేదంటే టీడీపీపై ఉన్న వ్యతిరేకతకు పార్టీని బలిపెట్టాల్సి వస్తోందనే వాదనలు వినిపిస్తున్నాయి. తప్పుడు కేసులు పెట్టినా ఖండన కరువు.. మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఆధ్వర్యంలో చేపట్టిన కాపు ఉద్యమంతో టీడీపీ, బీజేపీల మధ్య ఉన్న విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలను ధిక్కరించే ధైర్యంలేక టీడీపీలోని కాపు నాయకులు ఈ ఉద్యమానికి దూరంగా ఉన్నారన వాదన ఉంది. కానీ బీజేపీలోని కాపు నాయకులు చాలావరకూ ఉద్యమంలో భాగస్వాములయ్యారు. అయితే కాపు అనే కోటాలో పార్టీలో ఎమ్మెల్సీ పదవి దక్కించుకున్న సోము వీర్రాజు ఏమాత్రం స్పందించకపోవడాన్ని వారు తప్పుబడుతున్నారు. తుని విధ్వంస ఘటనలను సాకుగా తీసుకుని బీజేపీ నేతలపై తప్పుడు కేసులు పెట్టినా ఖండించకపోవడాన్ని ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా ముందుగా టీడీపీ ప్రభుత్వంతో అమీతుమీ తేల్చుకోవాలనే బీజేపీ శ్రేణులు ఉన్నాయి. -
ఇవేం అరాచకాలు?
* బతికున్న మనిషిని చనిపోయినట్టు ధ్రువీకరించడమేమిటి? * క్షేత్ర స్థాయిలో ఏం జరుగుతోంది * ప్రజాస్వామ్యంలో ఇటువంటి తీరు వాంఛనీయం కాదు * పిటిషనర్ పెన్షన్ ఎందుకు రద్దుచేశారో... * చనిపోయినట్టు ఎలా ధ్రువీకరించారో తెలపాలని ఆదేశం సాక్షి, హైదరాబాద్: ‘రక్త మాంసాలతో బతికున్న మనిషి చనిపోయినట్టు ధ్రువీకరించడమేమిటి..ఇవేం అరాచకాలు? అసలు క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోంది?’ అంటూ జన్మభూమి కమిటీల తీరుపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. తను బతికున్నప్పటికీ చనిపోయినట్టు నిర్ధారించి తన పెన్షన్ రద్దు చేసిన జన్మభూమి కమిటీ తీరుపై అమ్మణ్ణమ్మ అనే ఓ వృద్ధ మహిళ న్యాయపోరాటానికి దిగింది. బతికున్నానని చెప్పినా, ఆధారాలు చూపినా జన్మభూమి కమిటీ పట్టించుకోకపోవడంతో ఆ మహిళ హైకోర్టును ఆశ్రయించింది. అలాగే మెట్ట లక్ష్మి అనే ఓ వితంతు మహిళ కూడా తను వితంతువు కాదంటూ పెన్షన్ రద్దు చేశారని వివరిస్తూ స్వయంగా కోర్టు ముందుకొచ్చి అన్ని ఆధారాలను సమర్పించారు. మరో 75 మంది కూడా ఇదేవిధంగా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. వీటన్నింటినీ పరిశీలించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి దేని ఆధారంగా పిటిషనర్లకు పెన్షన్‌ను రద్దు చేశారో, దేని ఆధారంగా చనిపోయినట్టు ధ్రువీకరించారో పూర్తి వివరాలను కోర్టు ముందుంచాలంటూ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. అంతకుముందు పిటిషనర్ల తరఫు న్యాయవాది యర్రంరెడ్డి నాగిరెడ్డి వాదనలు వినిపిస్తూ... రాజకీయ కారణాలతో పిటిషనర్ల పెన్షన్లు రద్దు చేశారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అప్పీల్ తీసుకునేందుకు సైతం ఎంపీడీవో తిరస్కరించి, అధికార పార్టీ నేతలు చెబితేనే తీసుకుంటానని చెప్పారన్నారు. ఈ సమయంలో అమ్మణ్ణమ్మ కోర్టు ముందుకొచ్చి తను బతికే ఉన్నప్పటికీ చనిపోయినట్టు ధ్రువీకరించి పెన్షన్‌ను రద్దు చేశారని తెలిపారు. వితంతువైన లక్ష్మి కూడా కోర్టు ముందుకొచ్చి ఆధారాలను చూపారు. న్యాయమూర్తి వాటిని ఆంధ్ర ప్రాంత జడ్పీపీ, ఎంపీపీ, గ్రామ పంచాయతీల తరఫు న్యాయవాది చీమలపాటి రవికి ఇచ్చారు. ‘‘ఆ వృద్ధ మహిళను చూస్తే ఆమె పెన్షన్‌కు అర్హురాలని ఎవరైనా ఇట్టే చెప్పేస్తారు. మీ అధికారులకు మాత్రం కనిపించడంలేదు. భౌతికంగా చూసీ వృద్ధుడు కాదంటారు. ధ్రువీకరణ పత్రం ఇచ్చినా అంగవైకల్యం లేదు, పెన్షన్ రాదంటారు. ప్రజాస్వామ్యంలో ఇటువంటి తీరు వాంఛనీయం కాదు. ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్న వారు రాష్ట్రవ్యాప్తంగా ఎంతో మంది ఉన్నారు. కోర్టు దృష్టికి వస్తున్నవి సముద్రంలో నీటి చుక్క మాత్రమే. ఈ రోజు మీరు అధికారంలో ఉండి ఇలా చేస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్న వారు రేపు అధికారంలోకి వస్తే వారూ మిమ్మల్ని చూసి ఇలానే చేయవచ్చు. అంతిమంగా ఇబ్బందిపడేది అమాయకపు ప్రజలే’’ అని న్యాయమూర్తి ఘాటుగా వ్యాఖ్యానించారు. ఈ అంశంపై ఉపలోకాయుక్త ఇచ్చిన ఆదేశాల అమలుకు తీసుకున్న చర్యలను వివరించాలన్నారు. గడువు ఇస్తే పూర్తి వివరాలను కోర్టు ముందుంచుతానని రవి కోరడంతో న్యాయమూర్తి అందుకు అంగీకరిస్తూ విచారణను ఈ నెల 16కు వాయిదా వేశారు. -
దసరా ఉత్సవాల్లా శంకుస్థాపన వేడుకలు
సాక్షి, విజయవాడ బ్యూరో/తాడేపల్లి రూరల్: నూతన రాజధానికి ఈ నెల 22న జరిగే శంకుస్థాపనను వాడవాడలా ఘనంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మభూమి కమిటీ సభ్యులకు ఆదేశించారు. ఆదివారం ఉండవల్లిలోని తన నివాసం నుంచి జన్మభూమి-మాఊరు కమిటీ సభ్యులతో టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. దసరా నవరాత్రుల మాదిరిగానే ఈ నెల 13 నుంచి 21వ తేదీ వరకూ శంకుస్థాపన వేడుకలను జరపాలని కోరారు. లండన్‌లోని బ్రిటిష్ మ్యూజియంలో 33ఏ పేరుతో అమరావతి గ్యాలరీ ఇప్పటికీ ఉందని, ఇక్కడ తవ్వకాల్లో దొరికిన స్థూపాలు, బుద్ధుని పాదుకలు, సింహ ప్రతిమలను అందులో భద్రపరిచారని తెలిపారు. శాతవాహనుల సంస్కృతి, బౌద్ధ బోధనలు, ప్రాచీన సంప్రదాయానికి పుట్టినిల్లయిన ప్రాంతంలో జరుగుతున్న శంకుస్థాపన వేడుకలు ప్రపంచానికి తలమానికం కావాలన్నారు. రాజధాని నిర్మాణంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని, మన కోసం, భావితరాల కోసం ఈ పని చేస్తున్నామనే భావన అందరిలోనూ రావాలన్నారు. 13వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ‘మన మట్టి-మన నీరు-మన అమరావతి’ కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలోనూ ఉత్సాహంగా జరపాలని సూచించారు. మట్టి, జలాల సేకరణ, పూజల్లో అందరూ పాల్గొనేలా చూడాలని, అమరావతి సంకల్ప జ్యోతి ర్యాలీల్లో అందరూ పాల్గొనాలన్నారు. అమరావతి నిర్మాణానికి సహకరించండి అమరావతి నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ తమ వంతు సహాయ సహకారాలు అందించి సహకరించాలని చంద్రబాబు కోరారు. ఆదివారం ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుఫోరం ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా తాడేపల్లి బైపాస్‌లో ఏర్పాటు చేసిన రన్ ఫర్ క్యాపిటల్ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, తాను చేపట్టిన రాజధాని నిర్మాణాన్ని ఎవరూ అడ్డుకోలేరని, గ్రీన్ సిటీ నిర్మాణాన్ని చేపట్టి తీరుతానని స్పష్టం చేశారు. యువత ఉద్యోగాల కోసం ఎక్కడకో వెళ్లాల్సిన అవసరం లేదని, త్వరలోనే రాష్ట్రంలోనే ఉద్యోగావకాశాలు వస్తాయని, అప్పటి దాకా యువత ప్లే గ్రౌండ్లో ఆటలతో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. 100 హెల్త్‌కేర్ ఏటీఎంలు రాష్ట్రంలో 100 హెల్త్‌కేర్ ఏటీఎంలను ఏర్పాటు చేయాలని, పనితీరునుబట్టి వాటిసంఖ్యను మరింత పెంచాలని ముఖ్యమంత్రి చంద్రబాబు వైద్య, ఆరోగ్య శాఖాధికారులను ఆదేశించారు. ఆదివారం క్యాంపు కార్యాలయంలో వైద్య, ఆరోగ్య శాఖాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సాధారణ వ్యాధులకు హెల్త్‌కేర్ ఏటీఎంల ద్వారా మందులు పంపిణీ చేసే విధానం అందుబాటులో ఉందని, దీన్ని వినియోగించుకోవాలని సూచించారు. ఇండియన్ డివైజర్ మాన్యుఫ్యాక్చరర్స్‌తో సమావేశం ఏర్పాటు చేయాలని, వైద్య పరికరాల తయారీ పరిశ్రమలు నెలకొల్పేవారికి ప్రభుత్వపరంగా ప్రోత్సాహకాలు ఇస్తామని చెప్పారు. తమిళనాడులో అల్ట్రా సోనాలజీ సెంటర్లు అందిస్తున్న సేవలపై అధ్యయనం చేయాలని సీఎం కోరారు. ప్రతి నియోజకవర్గ కేంద్రంలో సిటీస్కాన్ సేవలు అందుబాటులోకి తేవాలన్నారు. ప్రతి ఆస్పత్రికి గ్రేడింగ్ ఇవ్వాలని, బాగా పనిచేసిన వారిని ప్రోత్సహించాలని కోరారు. -
పెన్షన్లన్నీ పచ్చచొక్కాలకే
కడప సెవెన్‌రోడ్స్ : రాష్ట్ర ప్రభుత్వం జన్మభూమి కమిటీల పేరుతో పెన్షన్లన్నీ టీడీపీ కార్యకర్తలకే కట్టబెడుతోందని వైఎస్సార్ సీపీ నాయకులు ఆరోపించారు. అర్హత ఉన్నప్పటికీ వైఎస్ఆర్సీపీకి ఓట్లేశారన్న కక్షతో పెన్షన్లు మంజూరు చేయడం లేదన్నారు. జన్మభూమి కమిటీలను రద్దు చేసి అర్హులందిరకీ పెన్షన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు. పోరుమామిళ్ల మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు చిత్తా విజయ్‌ప్రతాప్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆ మండలానికి చెందిన వృద్ధులు, వితంతువులు, వికలాంగులు శుక్రవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ జిల్లా అద్యక్షుడు ఆకేపాటి అమర్నాథ్రెడ్డి మాట్లాడుతూ వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అర్హుందరికీ పెన్షన్లు మంజూరు చేశారని తెలిపారు. పెన్షన్ల విషయంలో ఆయన పార్టీల బేధం చూపలేదన్నారు. కానీ చంద్రబాబు టీడీపీ కార్యకర్తలకే పెన్షన్లు ఇచ్చేందుకు జన్మభూమి కమిటీలు ఏర్పాటు చేయడం అప్రజాస్వామికమని పేర్కొన్నారు. కమిటీల ముసుగులో అనర్హులకు పెన్షన్లు ఇస్తూ అర్హులకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. జిల్లా అధికారులైనా న్యాయం చేయాలని కోరారు. నగర మేయర్ కె.సురేష్‌బాబు మాట్లాడుతూ కడపలో 18,876 మందికి పెన్షన్లు వస్తుండగా, అందులో 8700 మందిని తొలగించారని పేర్కొన్నారు. ఇంకా నగరంలో 11 వేల మంది అర్హులు ఉన్నప్పటికీ పెన్షన్లు మంజూరు చేయలేదన్నారు. ఇలా మొత్తం 19 వేల మందికి పెన్షన్లు ఇవ్వడం లేదన్నారు. జిల్లాలో మూడు లక్షల మందికి పెన్షన్లు వస్తుండగా, లక్షా 72 వేల మందిని తొలగించారని వివరించారు. వృద్దులు, వితంతువులు, వికలాంగులకు అన్యాయం చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబును దేవుడు కూడా క్షమించడని అన్నారు. ఈ అంశంపై అవసరమైతే కలెక్టర్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. నేనే పెన్షన్లు ఇస్తా : ఎంపీపీ తన మండలంలో అర్హులై ఉండి పెన్షన్లు రాని వారందరికీ ప్రతినెలా తానే సొంత డబ్బుతో పెన్షన్లు ఇస్తానని పోరుమామిళ్ల ఎంపీపీ విజయ్‌ప్రతాప్‌రెడ్డి హామీ ఇచ్చారు. అర్హులకు పెన్షన్ల మంజూరుపై అవసరమైతే హైకోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు నిత్యానందరెడ్డి, షఫీ, సునీల్‌కుమార్, వికలాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర నాయకులు వెంకట్రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పచ్చ ముద్ర పడితేనే పింఛన్!
- పింఛన్ కోసం జిల్లా వ్యాప్తంగా 42,578 దరఖాస్తులు - ప్రస్తుతం 13,800 మంది అర్హులుగా గుర్తింపు - నియోజకవర్గానికి వెయ్యి చొప్పున 10 వేల కొత్త పింఛన్లు మంజూరు - నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌కే పెత్తనం కట్టబెడుతున్న వైనం కడప రూరల్ : కొత్తగా కేటాయిస్తున్న ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ రాజకీయ రంగు పులుముకుంది. జన్మభూమి కమిటీలతో త మకు న్యాయం జరగడం లేదని అర్హులు గగ్గోలు పెడుతున్న తరుణంలో తాజాగా రాష్ట్ర ప్రభుత్వం నియోజకవర్గానికి 1000 చొప్పున జిల్లాకు 10 వేల కొత్త పింఛన్లు మంజూరు చేసింది. ఈ పింఛన్లు ఎవరికి కేటాయించాలనే బాధ్యతలను ఆయా నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌లకు అప్పజెప్పినట్లు సమాచారం. వారి సూచనలు, సలహాల మేరకు కొత్త పింఛన్ల పంపిణీకి రంగం సిద్ధం అవుతున్నట్లు తెలిసింది. మొన్నటికి మొన్న 13 వేలకు పైగా కొత్త పింఛన్లు మంజూరు చేయగా అవన్నీ జన్మభూమి కమిటీలో ఉన్న టీడీపీ నేతలు సూచించిన వారికే దక్కాయనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో తాజాగా మంజూరైన కొత్త పింఛన్లు పాలక నేతల కనుసన్నల్లో మెలిగే వారికే అందుతాయనే ప్రచారం సాగుతోంది. ఇన్చార్జ్ మంత్రి ఆదేశాలతోనే.. కొత్త పింఛన్ల మంజూరు ప్రక్రియ ఆయా నియోజకవర్గ టీడీపీ ఇన్ చార్జిల ఆధ్వర్యంలో జరగాలని జిల్లా ఇన్చార్జ్ మంత్రి ఆదేశించినట్లు తెలుస్తోంది. ఇదే తంతు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతోందని యం త్రాంగం చెబుతోంది. నియోజకవర్గం టీడీపీ ఇన్చార్జ్ సూచన మేరకే ఏ పంచాయతీలో ఎన్ని పింఛన్లు మం జూరు చేయాలనేది నిర్ణయిస్తారని సమాచారం. ఆ ప్రకారం జన్మభూమి కమిటీలు లబ్ధిదారులను ఎంపిక చేయనున్నాయి. వేలల్లో అర్హులు.. కొందరికే పింఛన్లు మొన్నటి వరకు జిల్లా వ్యాప్తంగా పింఛన్ల కోసం వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, చేనేతలు, కల్లు గీత కార్మికులు మొత్తం 50 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. అందులో 14,243 మందిని రాష్ట్ర ప్రభుత్వం అర్హులుగా గుర్తించగా ఇటీవల అందులో 8409 మందికి మాత్రమే కొత్త పింఛన్లను మంజూరు చేశారు. పెండింగ్‌లో 35,575 దరఖాస్తులు మిగిలిపోగా, మళ్లీ కొత్తగా 7 వేలకు పైగా దరఖాస్తులు వచ్చినట్లు తెలిసింది. మొత్తం 42,575 దరఖాస్తులు ఉండగా అందులో ప్రభుత్వం 13,800 మందిని అర్హులుగా గుర్తించింది. ఆ మేరకు తాజాగా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట వ్యాప్తంగా ఉన్న 170 నియోజకవర్గాలకు నియోజకవర్గానికి 1000 చొప్పున మొత్తం 1.70 లక్షల కొత్త పింఛ న్లను మంజూరు చే సింది. ఆ ప్రకారం వైఎస్ఆర్ జిల్లాకు నియెజకవర్గానికి 1000 చొప్పున మొత్తం 10 వేల పింఛన్లను కేటాయించారు. అర్హులు ఎంత మంది ఉన్నప్పటికీ ఎంపిక చేసిన వారికి మాత్రమే పింఛన్లు మంజూరు చేయనున్నారు. ఈ విషయంపై జిల్లా గ్రామీణాభివద్ధి సంస్థ ప్రాజెక్టు డైరక్టర్ అనిల్‌కుమార్‌రెడ్డిని ‘సాక్షి’ సంప్రదించగా.. జన్మభూమి కమిటీల ఆధ్వర్యంలో లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందని చెప్పారు. -
జన్మభూమి కమిటీలతో అర్హులకు అన్యాయం
కడప కార్పొరేషన్: రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జన్మభూమి కమిటీల వల్ల ప్రజలకు ఒరిగిందేమీ లేదని అర్హులకు అన్యాయం జరుగుతోందని పలువురు ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి అధ్యక్షతన శనివారం స్థానిక కలెక్టరేట్ సభా భవనంలో నిర్వహించిన విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో జన్మభూమి కమిటీల ద్వారా జరుగుతున్న అవినీతి, నష్టాలపై సుదీర్ఘ చర్చ జరిగింది. మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి మాట్లాడుతూ జన్మభూమి కమిటీల పేరుతో ఈ ప్రభుత్వం పేదల కడుపుకొడుతోందని, అర్హులకు కాకుండా అనర్హులకు పింఛన్లు మంజూరు చేస్తున్నారని మండిపడ్డారు. ఎంపీడీఓ, కమిషనర్ సంతకాలు లేకపోయినా జన్మభూమి కమిటీ సభ్యుల సంతకాలుంటే చాలు అధికారులు కళ్లుమూసుకొని పింఛన్లు మంజూరు చేస్తున్నారని ధ్వజమెత్తారు. బద్వేలు ఎమ్మెల్యే జయరాములు మాట్లాడుతూ కాశినాయన మండలం నాయనిపల్లెలో తమ కాళ్లు పట్టుకుంటేనే పింఛన్ ఇప్పిస్తామని జన్మభూమి కమిటీ సభ్యులు అంటున్నారని సభ దృష్టికి తీసుకు వచ్చారు. రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ ఫీల్డ్ అసిస్టెంట్ల నియామకంలో కూడా జన్మభూమి కమిటీల సిఫార్సులు అమలు చేయడం సరికాదన్నారు. తప్పుచేస్తే సర్పంచ్ చెక్ పవర్ రద్దు చేస్తున్నారని, అధికారులను సస్పెండ్ చేస్తున్నారని, అనర్హులను సిఫార్సు చేసిన జన్మభూమి కమిటీలపై ఎందుకు చర్యలు తీసుకోరని ప్రశ్నించారు. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ జన్మభూమి కమిటీల వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అన్యాయం జరుగుతోందని, కమిటీలు సిఫార్సు చేసిన అనర్హుల పింఛన్లు ఒక్కటైనా రద్దు చేశారా? అంత ధైర్యం అధికారులకు ఉందా? అని సూటిగా ప్రశ్నించారు. పోరుమామిళ్ల ఎంపీపీ విజయప్రతాప్ మాట్లాడుతూ అధికారులు రూపొందించిన అర్హుల జాబితా కాకుండా జన్మభూమి కమిటీలు సిఫార్సు చేసిన వారికే పింఛన్లు ఇస్తున్నారని, ప్రజలకు తాము ఏమని సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. ఒక దశలో ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలు మ్యాండేటరీ(తప్పనిసరి)కాదని కలెక్టర్ చెప్పడంతో గందరగోళం నెలకొంది. అలాగైతే జన్మభూమి కమిటీ సభ్యులతోనే సమావేశం నిర్వహించుకోవాలని ఎమ్మెల్యే రఘురామిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అనర్హులెవరో రాతమూలకంగా రాసిస్తే విచారణ చేసి తొలగిస్తామని కలెక్టర్ ఇచ్చిన సమాధానంతో ఎమ్మెల్యేలు సంతృప్తి చెందలేదు. అనర్హులను సిఫారసు చేసిన కమిటీలపై ఏం చర్యలు తీసుకొంటారని గట్టిగా పట్టుబట్టారు. అయితే సభ్యులు అడిగిన ప్రశ్నలకు కలెక్టర్ సూటిగా సమాధానమివ్వలేదు. ఆ కమిటీలు ఏర్పాటుచేసింది ఇన్చార్జి మంత్రే కాబట్టి ఆయన దృష్టికి తీసుకుపోతామని కలెక్టర్ చెప్పడంతో ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. జన్మభూమి కమిటీలను రద్దు చేయాలని ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ఎజెండాకు.. మినిట్స్‌కు సంబంధమేమిటి..? అంతకుముందు ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి మాట్లాడుతూ రెండవ సమావేశానికి సంబంధించి మినిట్స్‌లో తన సంతకం లేకుండానే ప్రభుత్వానికి పంపారని, ఎమ్మెల్యేలు లేవనె త్తిన ఏ ఒక్క అంశం కూడా మినిట్స్‌లో రాలేదన్నారు. ఈసారి తన కు చూపిన తర్వాత ప్రభుత్వానికి పంపితే బాగుంటుందని కన్వీనర్ అయిన కలెక్టర్‌కు సూచించారు. దీనిపై ఎమ్మెల్యే రఘురామిరెడ్డి మాట్లాడుతూ తాము మాట్లాడిన విషయాలు మినిట్స్‌లోకి రాకపోతే ఈ మీటింగ్‌కు తాము రావడమెందుకని ప్రశ్నించారు. ఛెర్మైన్‌కు చూపిన తర్వాతే సభ్యులందరికీ మినిట్స్ కాపీలు పంపాలన్నారు. దీనిపై కలెక్టర్ కేవీ రమణ మాట్లాడుతూ ఎజెండా పరిధిలోకి రాని వాటిని రికార్డు చేయలేదని, ఈ విషయాన్ని ప్రభుత్వానికి నివేదించి, వారిచ్చే సూచనల ప్రకారం మినిట్స్ ఛెర్మైన్‌కు పంపుతామని చెప్పారు. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మాట్లాడుతూ ఎజెండాలోని అంశాలే మాట్లాడాలని గిరిగీసుకొని కూర్చొంటే కుదరదని, అర్థవంతమైన సలహాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. జిల్లా నీటి యాజమాన్య సంస్థకు సంబంధించిన విషయాలపై ఎమ్మెల్యే జయరాములు మాట్లాడుతూ బాబు వస్తే జాబు వస్తుందని ఎన్నికలకు ముందు ఢంకా బజాయించి చెప్పారని, నేడు ఫీల్డ్ అసిస్టెంట్లను అకారణంగా తొలగిస్తున్నారని చెప్పారు. ఇందుకు డ్వామా పీడీ బాలసుబ్రమణ్యం సమాధానమిస్తూ 75 శాతం కంటే తక్కువ పనులు చేసిన వారిని మాత్రమే తొలగిస్తున్నామని తెలిపారు. కమలాపురంలో రూ. 56 కోట్ల పనులు జరగ్గా, ఒకే పనికి రెండుసార్లు బిల్లులు చేసుకున్నారని కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ ఒక్క పనికి రెండుసార్లు బిల్లులు చేసుకోవడం చాలా సీరియస్ అంశమని, ఈ విషయంపై తనకు ఆధారాలు ఇస్తే అందరిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇసుక క్వారీలు రద్దు చేయాలి జమ్మలమడుగులో ఏర్పాటు చేస్తున్న ఇసుక క్వారీని రద్దు చేయాలని ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి కోరారు. ఈ ఇసుక క్వారీని రద్దు చేయాలని స్థానిక సంస్థలు తీర్మానాలు ఇచ్చాయని, అయినా అధికారులు ముందుకు పోవడం భావ్యం కాదని చెప్పారు. ఖాజీపేట వద్ద ఇసుక క్వారీని రద్దు చేయాలని రఘురామిరెడ్డి కోరగా, పొన్నుతోట, అనిమెల, రాజుపాలెం, కుమ్మరాంపల్లె ఇసుక క్వారీలను రద్దు చేయాలని కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి కోరారు. ఇక్కడ ఇసుక క్వారీలు ఏర్పాటు చేస్తే తాగునీటి స్కీములు నిరుపయోగంగా మారే అవకాశం ఉందని వారు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రాయలసీమ, ఉత్తరాంధ్రలకు ప్రత్యేక ప్యాకేజీ మంజూరు చేసిందని, ఇందులో భాగంగా జిల్లాకు రూ. 50 కోట్లు వచ్చాయని ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి తెలిపారు. ఈ ప్యాకేజీకి సంబంధించి విధి విధానాలు ఇంకా ఖరారు కానందున స్థానిక ప్రజాప్రతినిధుల సిఫార్సులకే ప్రాధాన్యత ఇవ్వాలని, అన్ని నియోజకవర్గాలకు సమంగా ఈ నిధులను పంపిణీ చేసేలా తీర్మానాన్ని ప్రభుత్వానికి పంపాలని సూచించారు. ఇందుకు ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి మద్దతు ప్రకటించారు. ద్వంద్వ విధానాలు ఎందుకు? ఎంపీ నిధుల మంజూరులో ఆలస్యం జరుగుతోందని ఎమ్మెల్యే రఘురామిరెడ్డి తెలిపారు. కడప, కమలాపురం ఎమ్మెల్యేలు ఎస్బి అంజద్‌బాషా, పి. రవీంద్రనాథ్‌రెడ్డి మాట్లాడుతూ ఎంపీ నిధుల విషయంలో లక్ష దాటితే టెండర్ పిలవాలంటున్నారు, ఇదే నియమాన్ని నీరు-చెట్టులో ఎందుకు అమలు చేయరని ధ్వజమెత్తారు. నీరు-చెట్టు కార్యక్రమంలో రూ. 50లక్ష ల విలువగల పనులు కూడా నామినేషన్‌పై ఇస్తున్నారని, ఇంత అవినీతి జరుగుతున్నా ఎజెండాలో లేదని తప్పించుకోవడం ఎంతవరకు సమంజసమన్నారు. కమలాపురం, సీకేదిన్నె, చదిపిరాళ్ల, పాతకడప చెరువుల్లో జరిగిన పనులపై సమగ్ర విచారణ చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ ఎంపీ ల్యాడ్స్ నిధుల విషయమై పది రోజుల్లో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. క్యాన్సర్ కంటే ఇది ప్రమాదకరం- ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి జన్మభూమి కమిటీల వల్ల ఏ ప్రభుత్వ పథకాలు సక్రమంగా అమలు కావడం లేదని, అనేక అవకతవకలన్నీ ఈ కమిటీల వల్లే జరుగుతున్నాయని జిల్లా విజిలెన్స్ అండ్ మాని టరింగ్ కమిటీ ఛెర్మైన్, కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి అన్నారు. ప్రజాస్వామ్యంలో ఇది క్యాన్సర్ కంటే ప్రమాదకరమన్నారు. సమావేశం అనంతరం ఆయన మీడియతో మాట్లాడుతూ జన్మభూమి కమిటీలు స్థానిక సంస్థలను బలహీనం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కమిటీల వల్ల ఏ ప్రభుత్వ పథకాలు సక్రమంగా అమలు కావడంలేదన్నారు. పింఛన్లు అర్హులైన వారికి కాకుండా అనర్హులకు అందుతున్నాయని, ఫీల్డ్ అసిస్టెంట్ల నియామకాల్లో కూడా ఈ కమిటీలదే పెత్తనంగా ఉందన్నారు. ఫలితంగా అవినీతికి ఆస్కారమేర్పడుతోందని, దీనిపై ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించాల్సి ఉందన్నారు. తాగునీటి పథకాలు, ఐఏవై పథకాలలో ప్రజాప్రతినిధుల సిఫారసుల మేరకు పనులు చేయాలని కోరామన్నారు. ఎన్ఎస్ఏపీ, ఉపాధిహామీ పథకం వంటి కేంద్రప్రభుత్వ పథకాలకు కూడా జన్మభూమి కమిటీలతో ముడిపెట్టి నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. జిల్లాలో రామాపురం, వేముల మండలాలు మినహా అన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించారని, ఈ మండలాలను కూడా కరువు మండలాలుగా ప్రకటించాలని కోరామన్నారు. -
జన్మభూమి కమిటీలే కర్మభూమి కమిటిలై...
-
‘ఉపాధి’.. పచ్చ పునాది
ఎఫ్ఏల నియామక బాధ్యత జన్మభూమి కమిటీలకు - 939 మంది ఫీల్డ్ అసిస్టెంట్ల నియామకాలకు సన్నాహాలు - జన్మభూమి కమిటీలు సూచించిన వారికే ఉద్యోగాలు సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో కిందిస్థాయిలో పచ్చ చొక్కాల పంట పండుతోంది. గతంలో ‘పనికి ఆహారం’ తరహాలోనే ఇప్పుడు పచ్చ చొక్కాలకు పనులు అప్పగిస్తున్నారు. సామాజిక కార్యకర్తల పేరుతో అధికార తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులతో ప్రతి గ్రామంలో ఇప్పటికే ఏర్పాటు చేసిన జన్మభూమి కమిటీలు సిఫారసు చేసిన వారికే ప్రభుత్వ ప్రయోజనాలు చేకూరనున్నాయి. ఆఖరుకు ప్రభుత్వ ఉద్యోగులను నియమించే బాధ్యతలను కూడా ఆ కమిటీలకే అప్పగించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. తాజాగా ఉపాధి హామీ పథకంలో ఫీల్డు అసిస్టెంట్ ఉద్యోగాలు కూడా ఈ కమిటీలు సూచించిన వారికే దక్కబోతున్నాయి. వారికే ‘ఉపాధి’ చంద్రబాబు తిరిగి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక వృద్ధాప్య, వితంతు, వికలాంగుల పింఛనుదారులలో అనర్హుల ఏరివేత కోసమంటూ గతేడాది సెప్టెంబర్ 17వ తేదీన గ్రామ, మున్సిపల్ వార్డు స్థాయిలో కమిటీల నియామకానికి ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం ఆరుగురు ఉండే ఈ కమిటీలో నలుగురు ఆయా జిల్లా మంత్రి సూచించినవారే ఉంటారు. మిగిలిన ఇద్దరిలో ఒకరు సర్పంచ్, మరొకరు ఆ గ్రామ ఎంపీటీసీ సభ్యుడు. అప్పట్లో గ్రామాల్లో పింఛన్లలో కోతలు పెట్టడానికి అనర్హుల గుర్తింపు బాధ్యతను ఈ కమిటీలకు అప్పగించారు. అవి ఫింఛన్లకు అర్హులైన లక్షలాది మందిని కూడా ఈ కమిటీలు ఏరివేశాయి. వీటిపై మరోసారి పరిశీలన జరిపినప్పుడు అర్హులను ఏరివేశారని తేలింది. దీంతో చివరికి ప్రభుత్వం పునఃవిచారణ చేసి.. తొలగించిన వారిలో సగానికి ఎక్కువమందికి తిరిగి పింఛన్లు మంజూరు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అటువంటి ఈ కమిటీలను ఆ తరువాత ప్రభుత్వం అనేక ఇతర సంక్షేమ కార్యక్రమాల లబ్ధిదారుల ఎంపికలోనూ భాగస్వాములుగా చేసింది. ప్రభుత్వం నిర్వహించే జన్మభూమి-మావూరు కార్యక్రమ బాధ్యతలను ఈ కమిటీలకే అప్పగించారు. ఇప్పుడు ఇదే కమిటీలకు ఉపాధి హామీ పథకంలో ఫీల్డు అసిస్టెంట్ల ఎంపిక ప్రక్రియను అప్పగించారు. ఇప్పటికే ఫీల్డు అసిస్టెంట్ ఉద్యోగం ఖాళీగా ఉన్న గ్రామంలో ఉన్న ఈ జన్మభూమి కమిటీ ముగ్గురు పేర్ల జాబితాను స్థానిక ఎంపీడీవోకు అందజేస్తుంది. ఆ ముగ్గురిలో ఒకరిని ఎంపీడీవో తప్పనిసరిగా ఎంపిక చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు ఫీల్డు అసిస్టెంట్ల ఎంపిక ప్రక్రియకు సంబంధించి మార్గదర్శకాలను ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ గ్రామీణాభివృద్ధి శాఖ సర్క్యులర్ నం. 3141ని జారీ చేసింది. పదిరోజుల్లో నోటిఫికేషన్లు రాష్ట్రంలో 13,083 గ్రామపంచాయతీల్లో ఉపాధి హామీ పథకం అమలులో ఉంది. అయితే గ్రామంలోని మొత్తం కూలీలందరికీ కలపి ఏడాదికి వెయ్యి రోజులకు మించి పనిదినాలు కల్పించేచోట్ల మాత్రమే ఫీల్డు అసిస్టెంట్‌ను నియమిస్తారు. ఇలాంటివి దాదాపు పదివేల గ్రామాల వరకు ఉండగా.. వీటిలో ప్రస్తుతం 939 గ్రామపంచాయతీల్లో ప్రస్తుతం ఫీల్డు అసిస్టెంట్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. వీటి భర్తీకి పదిరోజుల్లో ఆయా జిల్లాల డ్వామా పీడీలు నోటిఫికేషన్లు జారీ చేయనున్నారు. ఫీల్డు అసిస్టెంట్ ఎంపికకు గాను ఐదు రకాల నిబంధనలను పాటించాలని గ్రామ జన్మభూమి కమిటీలకు ప్రభుత్వం సూచించింది. రేషన్ కార్డుల్లోనూ... గతేడాది ప్రభుత్వం నిర్వహించిన జన్మభూమి-మా ఊరు కార్యక్రమం సందర్భంగా రేషన్ కార్డుల్లేని వారినుంచి అధికారులు దరఖాస్తులు స్వీకరించారు. ఇందులో భాగంగానే రాష్ట్రవ్యాప్తంగా 11.05 లక్షల మంది నుంచి దరఖాస్తులు వచ్చాయి. ఈ రకంగా అందిన దరఖాస్తుల్లో అర్హులను గుర్తించే బాధ్యతను జన్మభూమి కమిటీలకు అప్పగించారు. ఇది అందరికీ ఆందోళన కలిగిస్తోంది.