జన్మభూమి కమిటీల పుణ్యమాని పచ్చగా ఉండే గ్రామాల్లో పింఛన్ల రగడ రగులుకుంటోంది. తాము చెప్పిన వారికే పింఛన్లు ఇవ్వాలని అధికారులపై కమిటీల సభ్యులు పెత్తనం చెలాయిస్తుండడంతో అనవసర రగడ నెలకొంటుంది. తాము చెబితేనే వారు అర్హులని..లేకుంటే నిజంగా అర్హులైనా కాదని పెత్తనం చెలాయిస్తున్నారు. దీంతో అర్హులు ప్రశ్నిస్తున్నారు. అడిగితే అధికార దౌర్జన్యం ప్రదర్శిస్తున్నారు. ఇందుకు తార్కాణమే వావిలవలస గ్రామంలో మంగళవారం చోటు చేసుకున్న తెలుగు తమ్ముళ్ల దాడి. వివరాల్లోకి వెళ్తే...
రేగిడి : వావిలవలస గ్రామంలో పింఛన్ల విషయంలో తెలుగుదేశం పార్టీ గత కొన్నాళ్లుగా అనుసరిస్తున్న దౌర్జన్య నీతి మంగళవారం కొట్లాటకు దారితీసింది. తామేమి తప్పు చేశామని తమ పింఛన్లు తొలగించారని.. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే అర్హులైనా..పింఛన్లు ఇవ్వరా అంటూ ప్రశ్నించినందుకు దాడి చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య పింఛన్ల వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. రాళ్లు రువ్వుకోవడంతో కొందరికి స్వల్ప గాయూలయ్యూయి. గ్రామంలో సామాజిక తనిఖీలు చేపట్టక ముందు 226 పింఛన్లు ఉండేవి.
తరువాత 70 పింఛన్లను వివిధ కారణాలతో తొలగించారు. పింఛన్ల మంజూరు బాధ్యతను జన్మభూమి కమిటీలకు అప్పగించడంతో తొలగించిన పింఛన్లలో 33 మంది తెలుగుదేశం అనుచరులకు జన్మభూమి సభ్యుల సిఫారసు మేరకు పునరుద్ధరించారు. మిగిలిన 37 మందిలో ఆరుగురు వివిధ కారణాలతో మృతి చెందగా మిగిలిన 31 మందికి నేటికీ మంజూరు కాలేదు. వీరంతా వైఎస్‌ఆర్ సీపీకి చెందిన వారు కావడం విశేషం. దీనిపై బాధితుల తరఫున వైఎస్‌ఆర్ సీపీ సర్పంచ్ మురుుద ప్రసన్నలక్ష్మి, మాజీ సర్పంచ్ ముయిద శ్రీనివాసరావు మండల, జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు.
అర్హులకు పింఛన్లు మంజూరు చేయూలని కోరారు. తొలగించిన వారంతా పేదలే కావడంతో స్పందించిన ఆనంద్ యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు ముద ఆనందరావు ఆరు నెలలుగా ఒకొక్కరికి రూ.1000 చొప్పున ప్రతి నెలా అందజేస్తున్నారు. ఈ క్రమంలో పింఛన్లు కోల్పోయిన 31 మందితో పాటు కొత్తగా మరో తొమ్మిది మంది సర్పంచ్‌తో కలిసి కలెక్టర్ లక్ష్మీనృసింహంకు ఇటీవల ఫిర్యాదు చేశారు. విచారణ జరపాలని కోరారు. స్పందించిన కలెక్టర్ డీఆర్‌డీఏ పీడీ తనూజారాణికి గ్రామంలో పింఛన్ల విషయమై దర్యాప్తు చేయూలని ఆదేశించారు. మండల విద్యాశాఖాధికారి ఎంవీ ప్రసాదరావుకు విచారణాధికారిగా నియమించారు. కొట్లాటకు కారణమిదే...
వావిలపల్లిలోని రామమందిరంలో మంగళవారం ఉదయం 10 గంటలకు విచారణ చేపట్టారు. ఫిర్యాదుదారు సర్పంచ్ ప్రసన్నలక్ష్మీతో పాటు నోటీసులు అందుకున్న 33 మంది పింఛన్ కోల్పోయిన వారు హాజరయ్యూరు. వీరితో పాటు ఎంపీటీసీ పాలూరి రామినాయుడుకు సమాచారం ఇవ్వడంతో ఆయన కూడా పాల్గొన్నారు. విచారణకు హాజరైన లబ్ధిదారుల నుంచి సంతకాలు తీసుకొని పింఛన్ పొందేందుకు తగిన ఆధారాలు అందజేయూలని విచారణాధికారి కోరారు. అప్పటికే ఇరు వర్గాల వారు ఆరు బయట ఉండడంతో ఘర్షణ తలెత్తింది. స్వల్ప కొట్లాటకు దారితీసింది. కొందరు రాళ్లు రువ్వడంతో కొందరికి గాయూలయ్యూయి. గాయపడిన వారిని రాజాం సామాజిక ఆస్పత్రికి తరలించారు. మరోవైపు విచారణ జరుగుతున్న క్రమంలో అక్కడకు వచ్చిన ఎన్టీఆర్ పింఛన్ల విభాగం ఏపీడీ సోమయూజులు, ఎంపీడీఓ వి.రామలింగేశ్వరరావు వద్దకు బాధితులు వెళ్లి ఆయన వాహనాన్ని అడ్డుకున్నారు. తమకు న్యాయం చేయూలని కోరారు.
స్పందించిన పోలీసులు...
వావిలవలస గ్రామంలో విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా ఎస్‌ఐ ఎన్.కామేశ్వరరావు, హెచ్‌సీ వి.అప్పలనాయుడు, పీసీ రామారావులను బందోబస్తుకు నియమించారు. వీరు విచారణ జరుగుతున్న ప్రదేశం వద్దే ఉన్నప్పటికీ ఒక్కసారిగా ఇరు వర్గాలు ఘర్షణకు దిగడంతో సమాచారం అందుకున్న ఎస్‌ఐ ఇరువర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అనంతరం తిరిగి విచారణ ప్రారంభించారు. అధికారులకు చూపించాల్సిన పింఛన్ల ఆధారాలు తీసుకొని రాకపోవడంతో గంటకాలం వేచి చూసి అర్ధంతరంగా లేచి వెళ్లిపోయారు.
కేసుల నమోదు...
రేగిడి : తనను తన కుటుంబ సభ్యులను పాలూరి రామినాయుడుతో పాటు మరో 13 మంది కులం పేరుతో దూషించారంటూ వావిలవలస గ్రామానికి చెందిన వర్రి తవుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మంగళవారం కేసు నమోదు చేశామని ఎస్‌ఐ ఎన్.కామేశ్వరరావు తెలిపారు. గ్రామంలోని రామమందిరం వద్ద పింఛన్ల వ్యవహారంపై దర్యాప్తు జరుపుతుండగా తమకు పింఛన్లు అందని విషయమై అధికారుల వద్ద మొర పెట్టుకునేందుకు వర్రి తవుడు ఇతర దళితులు కూర్చుని ఉండగా రామినాయుడు వర్గీయులు కర్రలు, రాళ్లు పట్టుకొని వచ్చి కులం పేరుతో దూషించి గాయపర్చినట్టు తవుడు ఫిర్యాదు ఇచ్చారని చెప్పారు.
పింఛన్ల వ్యవహారంలో జరిగిన కొట్లాటలో గాయపడ్డ తవుడుతో పాటు జామి లచ్చయ్య, చింత పోలినాయుడు, చోరు చిన్నసాంబయ్య యూదవులకు చెందిన కొయ్యూన తవుడు, మజ్జి వెంకటరమణ రాజాం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్టు ఎస్‌ఐ తెలిపారు. అలాగే పాలూరి రామినాయుడు వర్గానికి చెందిన శీలంక తవిటినాయుడు, కలిగి వెంకటరావు, మండల మోహనరావు, పిన్నింటి సూర్యనారాయణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆనందరావు, శ్రీనివాసరావుతో పాటు మరో 16 మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు. ముయిద ఆనందరావు, ముయిద శ్రీనివాసరావుతో పాటు మరో 16 మంది కర్రలతో బెదిరించి పింఛన్లు ఎలా ఇవ్వరో చూస్తామని బెదిరించినట్టు ఫిర్యాదు చేశారని తెలిపారు.
అడిగితే... అధికార జులుం
Published Wed, Mar 16 2016 1:33 AM | Last Updated on Fri, May 25 2018 9:20 PM
Advertisement