
భూ సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టండి
భూ పరిపాలన ప్రధాన కమిషనర్ అనిల్ చంద్ర పునేతా
కర్నూలు(రాజ్‌విహార్): భూ సమస్యలు పరిష్కరించేందు కు తగిన చర్యలు చేపట్టాలని రాష్ట్ర భూ పరిపాలన ప్రధాన కమిషనర్ అనిల్ చంద్ర పునేతా అధికారులను ఆదేశించా రు. బుధవారం ఆయన హైదరాబాదు నుంచి ఈ-క్యాంపు బుకింగ్, జన్మభూమి పెండింగ్ అర్జీల పరిష్కారం, ఫైళ్ల డిస్పోజల్స్, బడ్జెట్, కౌలు రైతులకు ఎల్‌ఈసీ కార్జుల జారీ, వన్‌టైమ్ కన్వర్షన్, సర్వే పనులు తదితర అంశాలపై జిల్లాల వారీగా జాయింట్ కలెక్టర్లతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ క్యాంపు బుకింగ్స్‌ను రెండు రోజుల్లో పూర్తి చేసి పంపాలన్నారు. వెబ్ ల్యాండ్ వివరాలు, భూముల సర్వేలు, డిజిటల్ ఇండియాలో భాగంగా భూముల వివరాలు, మ్యాపులు, ఈ-పట్టాదారు పుస్తకాల పంపిణీ చేశారో తెలపాలన్నారు. రేషన్ కార్డుల కోసం వచ్చిన ఆర్జీలను ఆన్‌లైన్ చేయాలన్నారు. కర్నూలు నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో జేసీ హరికిరణ్, డీఆర్‌ఓ గంగాధర్ గౌడు, ఆదోని ఆర్డీఓ ఓబులేసు, సర్వే భూమి రికార్డుల ఏడీ మనోహర్ రావు, ఎన్‌ఐసీ అధికారిణి నూర్జహాన్ పాల్గొన్నారు.