నెల్లూరు(సెంట్రల్): నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి చేపట్టిన ప్రజాబాట కార్యక్రమం నేటితో 100 పూర్తి చేసుకోనుంది. కార్యక్రమంలో భాగంగా ఆయన 40 గ్రామాల్లోని 94 కాలనీల్లో పర్యటించారు. దాదాపు 40,074 ఇళ్లు తిరిగి సుమారు 1,30,000 మంది ప్రజలతో మాట్లాడారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ, ప్రతి గడపకుపోవాలనే ఉద్దేశంతో ‘మన ఎమ్మెల్యే–మన ఇంటికి’ పేరుతో 105 రోజుల పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో 100 రోజుల పాటు ఇంటికి దూరంగానే ఉన్న ఆయన ప్రజలు, కూలీలతో సహపంక్తి భోజనాలు వంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందుకు సాగుతున్నారు. ఏ ప్రాంతానికి వెళ్లినా స్థానికులు ఆయనకు ఆత్మీయ స్వాగతం పలుకుతున్నారు. కాగా కార్యక్రమంలో భాగంగా ప్రజలు ఆయన దృష్టికి తెచ్చిన క్లిష్టమైన సమస్యలపై అధికారులతో చర్చించి పరిష్కార మార్గాలు చూపడం గమనార్హం.
సమస్యల గుర్తింపు
పాదయాత్రలో ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి అత్యంత పేదరికంలో ఉన్న ప్రజలకు స్థలాలు, పక్కా ఇళ్లు లేక పోవడం, కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు, తాగునీటి ఇబ్బందులు, సీసీ రోడ్లు లేకపోవడం వంటి వాటిని గుర్తించారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అధికారంలోకి వస్తే ఈ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని ప్రజలకు భరోసా ఇస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment