
2019 ఎన్నికల్లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గెలుపొందుతారని, రైతు రాజ్యం రావడం కచ్చితమని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి పేర్కొన్నారు. 2004లో వైఎస్ రాజశేఖరరెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఆరోగ్యశ్రీ, ఉచిత విద్యుత్ తదితర సంక్షేమ పథకాలు అమలు చేశారన్నారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి భారతీయుడు మాట్లాడుకునే విధంగా వైఎస్సార్ పరిపాలన చేశారన్నారు. ఆ మహనీయుడు ఈ రోజు లేకపోయినా ఆయన ప్రాణం అయిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మనముందు ఉన్నారన్నారు. మాటతప్పని వ్యక్తి జగన్‌మోహన్‌రెడ్డి అని, ఈ ఎన్నికల్లో ప్రతిఒక్కరూ ఆయన గెలుపుకోసం కృషి చేయాలన్నారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment