కందమూరులో సమస్యలు తెలుసుకుంటున్న ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి
సాక్షి, నెల్లూరు రూరల్: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి బుధవారం స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. కందమూరు గ్రామంలో బుధవారం ఉదయం ఆయన ‘జగనన్న మాట–గడప గడపకు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి బాట’ కార్యక్రమం నిర్వహిస్తుండగా కుడికాలు నొప్పిగా ఉండడంతో వెంట ఉన్నవారు నెల్లూరులోని ప్రభుత్వ వైద్యశాల వైద్యులకు సమాచారం అందించారు. డాక్టర్లు మధ్యాహ్నం గ్రామానికి చేరుకుని చికిత్స అందించారు. కొద్ది రోజులు విశ్రాంతి తీసుకోవాలని సలహా ఇచ్చారు.
ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికి చికిత్స చేస్తున్న ప్రభుత్వ వైద్య సిబ్బంది
బీపీ, షుగర్ పరీక్షలు నిర్వహించగా సాధారణంగా ఉన్నట్లు తేలింది. వైద్యుల సూచనను ఎమ్మెల్యే సున్నితంగా తిరస్కరించారు. తన కార్యక్రమాన్ని యథావిధిగా కొనసాగించారు. మంగళవారం గత రాత్రి పాతవెల్లంటి గ్రామంలో కుండా మురళీరెడ్డి ఇంట్లో బసచేసిన ఆయన బుధవారం ఉదయం కందమూరులో చేవూరు పెంచలయ్య ఇంటి వద్ద నుంచి కార్యక్రమాన్ని ఆరంభించారు. ఉదయం ఏడు గంటల నుంచి ఇంటింటికీ వెళుతూ ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ఆరా తీశారు. అర్హులైన ప్రతిఒక్కరికీ పథకాలు అందేలా కృషి చేస్తామని చెప్పారు.
చదవండి: (ఇనమడుగు వాసి ఎద్దుల సాయికుమార్‌రెడ్డికి ప్రతిష్టాత్మక అవార్డు)
Comments
Please login to add a commentAdd a comment