ఇసుక రీచ్ టెండర్లలో అధికార పార్టీ టీడీపీ నేతలు అక్రమాలకు పాల్పడుతున్నారని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఆరోపించారు.
నెల్లూరు: ఇసుక రీచ్ టెండర్లలో అధికార పార్టీ టీడీపీ నేతలు అక్రమాలకు పాల్పడుతున్నారని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఆరోపించారు. మంగళవారం ఆయన నెల్లూరులో విలేకరులతో మాట్లాడారు. సిండికేట్గా ఏర్పడి ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారని మండిపడ్డారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపించాలని కోటంరెడ్డి డిమాండ్ చేశారు.
నెల్లూరులోని కలెక్టరేట్ ఎదుట ధర్నా చేస్తున్న అగ్రిగోల్డ్ బాధితులకు మద్దతు తెలిపారు. అగ్రిగోల్డ్ బాధితుల పక్షాన నిలబడి వారి కోసం పోరాటం చేస్తామని కోటంరెడ్డి చెప్పారు.