సాక్షి, నెల్లూరు: బారాషహీద్ దర్గా అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది. సమగ్రాభివృద్ధి కోసం రూ.15 కోట్లు మంజూరు చేస్తూ సోమవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది. కలెక్టర్ చక్రధర్‌బాబు నివేదిక ఆధారంగా నిధులు మంజూరు చేసింది. దర్గా ప్రాంగణంలో కాంప్లెక్స్, ఇంటర్నల్ సిమెంట్ రోడ్లు, స్వర్ణాల చెరువు తదితర అభివృద్ధి పనులను అనుమతి దక్కింది. రొట్టెల పండగ నాడు భక్తులకు తీపి కబురు లభించింది. బారాషహీద్ దర్గా అభివృద్ధికి ప్రజా ప్రతినిధుల అభ్యర్థన మేరకు కలెక్టర్ నివేదిక ఆధారంగా నిధులు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
‘బారాషహీద్ దర్గా ప్రాంగణంలో ఉన్నంత వరకు తాను భక్తుడినే. ప్రాంగణం బయట మాత్రమే ఎమ్మెల్యేను, చిత్తశుద్ధితో దర్గా అభివృద్ధి కోసం కృషి చేస్తానను’ అని కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి చెప్పిన మాట నిలబెట్టుకున్నారు. చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డితో సమీక్షించి, కలెక్టర్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందించారు. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి కోటంరెడ్డి సోదరులు ప్రత్యేకంగా తీసుకెళ్లారు. జిల్లాలో అత్యంత ప్రతిష్టాత్మకమైన బారాషహీద్ దర్గా ప్రాంగణంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులను వివరించారు. దీంతో దర్గా అభివృద్ధి పనుల కోసం రూ.15 కోట్ల నిధులు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
చదవండి: (Rottela Panduga: భక్తులతో పోటెత్తిన స్వర్ణాల చెరువు)
సీఎం వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు
రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే రొట్టెల పండగ జరిగే బారాషహీద్ దర్గా అభివృద్ధికి రూ.15 కోట్ల నిధులు కేటాయించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కృతజ్ఞతలు. రొట్టెల పండగ నాడు తీపి కబురు లభించడంపై దర్గా భక్తుడిగా చాలా ఆనందంగా ఉంది. దర్గా అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేశాను. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తోడ్పాటుతో సాధ్యమైంది.
– కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే
చదవండి: (త్యాగానికి, ధర్మ పరిరక్షణకు ప్రతీక మొహర్రం : సీఎం వైఎస్ జగన్)
Comments
Please login to add a commentAdd a comment