bara shaheed dargah
-
నెల్లూరులో రెండో రోజు ఘనంగా రొట్టెల పండుగ..(ఫొటోలు)
-
నెల్లూరు : స్వర్ణాల చెరువులో కోర్కెలు తీర్చే రొట్టెల పండుగ (ఫొటోలు)
-
ఆకాంక్షలే ఆలంబనగా రొట్టెల పండగ
అక్కడకు తరలి వచ్చేవారివి చిన్న చిన్న కోరికలే. చదువు రావాలి, ఉద్యోగం రావాలి, వివాహం జరగాలి, సంతానం కలగాలి అనే... జీవితంలో ఆకాంక్షలు ఉండాలి. ఆ ఆకాంక్షలు నెరవేరతాయనే ఆశ ఉండాలి. అలాంటి వారికి అభయమిచ్చే ఆధ్యాత్మిక వేడుకలు ఎన్నో. అలాంటి వాటిలో ఒకటి ‘రొట్టెల పండగ’ నెల్లూరులో జరిగే ఈ పండగలో స్త్రీలు విశేషంగా ΄ాల్గొంటారు. ప్రతి సంవత్సరం మొహరం పండగ వేళలో నెల్లూరు వీధులు ΄ోటెత్తుతాయి. దేశ విదేశాల నుంచి జనం నెల్లూరులోని బారా షహీద్ దర్గా దగ్గరకు చేరుకుంటారు. కులం, మతం, భాష, ్ర΄ాంతం... తేడా లేకుండా అక్కడి స్వర్ణాల చెరువులో మొక్కు మొక్కుకుంటారు. లేదా తీర్చుకుంటారు. మొక్కు తీరిన వారు రొట్టె పంచుతారు. మొక్కుకునే వారు ఆ రొట్టెను స్వీకరిస్తారు. తరాలుగా వస్తున్న ఈ సంప్రదాయం చెక్కు చెదరడం లేదు. ప్రతి సంవత్సరం ఐదు రోజుల ΄ాటు జరిగే ఈ వేడుక నిన్నటి నుంచి çఘనంగా జరుగుతోంది. ఇది ప్రధానంగా స్త్రీల పండగ.ఎవరు ఈ బారా షహీద్?మహమ్మద్ ప్రవక్త సందేశాన్ని ప్రపంచ వ్యాప్తం చేయడంలో భాగంగా టర్కీ నుంచి సుమారు 300 ఏళ్ల క్రితం 12 మంది మతబోధకులు భారతదేశానికి వచ్చారు. ఆ సమయంలో కొడవలూరు మండలంలోని గండవరంలో తమిళనాడు వాల్జారాజులకు, బీజాపూర్ సుల్తాన్లకు మధ్య యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో ఈ 12 మంది వీరమరణం ΄÷ందారు. వీరి తలలు గండవరంలో తెగిపడగా మొండాలను గుర్రాలు నెల్లూరులోని స్వర్ణాల చెరువు వద్దకు తీసుకు వచ్చాయి. ఈ 12 మంది నెల్లూరు ఖ్వాజీకి కలలో కనపడి తమను అక్కడే సమాధి చేయాలని కోరడంతో అక్కడే సమాధులు నిర్మించారు. 12ను ఉర్దూలో బారా, వీర మరణం ΄÷ందిన అమరులను షహీద్‌లుగా పిలుస్తారు. అందుకే ఈ దర్గాకు బారా షహీద్ అనే పేరొచ్చింది. రొట్టెల ఆనవాయితీతమిళనాడు నుంచి నెల్లూరు వరకు ఆర్కాట్ నవాబుల ఏలుబడిలో ఉన్నప్పుడు నవాబు భార్య జబ్బు పడితే ఆమెకు నయం అయ్యే మార్గం కోసం నవాబు ఎదురు చూస్తున్నాడు. అదే సమయంలో బారా షహీద్ దర్గా దగ్గర బట్టలు ఉతుకుతున్న రజకునికి ఆ రాత్రి బారా షహీద్‌లు కనబడి మా సమాధుల దగ్గరి మట్టి తీసుకుని నవాబు భార్య నుదుటికి రాస్తే నయం అవుతుందని చె΄్పారు. ఆ సంగతి రజకుడు ఊరి వారికి తెలుపగా వారు నవాబుకు తెలియచేశారు. మట్టి తెప్పించిన నవాబు దానిని తన భార్య నుదుటికి రాయగా 24 గంటల్లో ఆమెకు నయం అయ్యింది. దాంతో అతడు అంత దూరం నుంచి బారా షహీద్ దర్గాను చూడటానికి వచ్చాడు. దర్శనం అయ్యాక అక్కడ ఉన్న పేదలకు రొట్టెలు పంచాడు. మొక్కు తీరాక ఇలా రొట్టెలు పంచడం ఆనవాయితీ అయ్యింది. ఈ నెల 21 వరకు రొట్టెల పండగ జరుగుతుంది.వివాహం రొట్టె.. సంతాన రొట్టెనెల్లూరు బారా షహీద్ దర్గాలో మొక్కు రొట్టెతో ముడిపడి ఉంటుంది. ఇక్కడకు వచ్చే భక్తులు ఉద్యోగం, ప్రమోషన్, సౌభాగ్యం, సంతానం, విద్య, స్వగృహం, వ్యా΄ారం... ఈ కోరికలు నెరవేరాలని మొక్కుకునేందుకు వస్తారు. గతంలో మొక్కిన మొక్కులు తీరిన వారు రొట్టెలతో వస్తారు. వారి నుంచి రొట్టె తీసుకోవాలి. అంటే గతంలో వివాహ మొక్కు మొక్కుకుని వివాహం జరిగిన వారు రొట్టెలతో వస్తారు. వివాహం కావలసిన వారు వారి దగ్గర నుంచి రొట్టె స్వీకరించి తినాలి. మొక్కు తీరాక వాళ్లు ఇలాగే రొట్టెను తెచ్చి ఇవ్వాలి. బారా షహీద్ దర్గా పక్కనే ఉన్న స్వర్ణాల చెరువులో మోకాళ్ల లోతుకు దిగి స్త్రీలు ఈ రొట్టెల బదలాయింపు చేసుకుంటారు. బాకీ తీరాలనే రొట్టె, స్థలం కొనాలనే రొట్టె, ర్యాంకుల రొట్టె... ఇవన్నీ అదృష్టాన్ని బట్టి దొరుకుతాయి. అన్నింటి కంటే ఎక్కువగా ఆరోగ్య రొట్టె కోసం వస్తారు. – కొండా సుబ్రహ్మణ్యం, సాక్షి, నెల్లూరు -
నెల్లూరు : బారాషహీద్ దర్గా వద్ద రొట్టెల పండుగ భక్తుల సందడి (ఫొటోలు)
-
నెల్లూరు : రొట్టెల పండగ...జనసంద్రంగా స్వర్ణాలచెరువు (ఫోటోలు)
-
Nellore Dargah Rottela Panduga Photos: నేటి నుంచి రొట్టెల పండగ ప్రారంభం (ఫొటోలు)
-
నెల్లూరు: నేటి నుంచి రొట్టెల పండగ ప్రారంభం (ఫొటోలు)
-
కోర్కెలు తీరాలి.. మళ్లీ రావాలి (ఫొటోలు)
-
నెల్లూరు : రొట్టెల పండగ ప్రారంభం...దర్గాకు పోటెత్తిన జనం (ఫొటోలు)
-
ఫలించిన ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి కృషి.. సీఎం జగన్‌కు కృతజ్ఞతలు
సాక్షి, నెల్లూరు: బారాషహీద్ దర్గా అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది. సమగ్రాభివృద్ధి కోసం రూ.15 కోట్లు మంజూరు చేస్తూ సోమవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది. కలెక్టర్ చక్రధర్‌బాబు నివేదిక ఆధారంగా నిధులు మంజూరు చేసింది. దర్గా ప్రాంగణంలో కాంప్లెక్స్, ఇంటర్నల్ సిమెంట్ రోడ్లు, స్వర్ణాల చెరువు తదితర అభివృద్ధి పనులను అనుమతి దక్కింది. రొట్టెల పండగ నాడు భక్తులకు తీపి కబురు లభించింది. బారాషహీద్ దర్గా అభివృద్ధికి ప్రజా ప్రతినిధుల అభ్యర్థన మేరకు కలెక్టర్ నివేదిక ఆధారంగా నిధులు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ‘బారాషహీద్ దర్గా ప్రాంగణంలో ఉన్నంత వరకు తాను భక్తుడినే. ప్రాంగణం బయట మాత్రమే ఎమ్మెల్యేను, చిత్తశుద్ధితో దర్గా అభివృద్ధి కోసం కృషి చేస్తానను’ అని కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి చెప్పిన మాట నిలబెట్టుకున్నారు. చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డితో సమీక్షించి, కలెక్టర్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందించారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి కోటంరెడ్డి సోదరులు ప్రత్యేకంగా తీసుకెళ్లారు. జిల్లాలో అత్యంత ప్రతిష్టాత్మకమైన బారాషహీద్ దర్గా ప్రాంగణంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులను వివరించారు. దీంతో దర్గా అభివృద్ధి పనుల కోసం రూ.15 కోట్ల నిధులు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. చదవండి: (Rottela Panduga: భక్తులతో పోటెత్తిన స్వర్ణాల చెరువు) సీఎం వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే రొట్టెల పండగ జరిగే బారాషహీద్ దర్గా అభివృద్ధికి రూ.15 కోట్ల నిధులు కేటాయించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కృతజ్ఞతలు. రొట్టెల పండగ నాడు తీపి కబురు లభించడంపై దర్గా భక్తుడిగా చాలా ఆనందంగా ఉంది. దర్గా అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేశాను. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తోడ్పాటుతో సాధ్యమైంది. – కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే చదవండి: (త్యాగానికి, ధర్మ పరిరక్షణకు ప్రతీక మొహర్రం : సీఎం వైఎస్ జగన్) -
కొత్తకొత్తగా.. రంజాన్ కానుకగా..
రొట్టెల పండగకు వేదికగా నిలిచే బారాషహీద్ దర్గా తెలుగు రాష్ట్రాల్లోనే ప్రసిద్ధి గాంచింది. ఇక్కడి ఆవరణలో ఉన్న ఈద్గా భవనం ముస్లింలకు ఎంతో ప్రీతికరం. అయితే టీడీపీ హయాంలో ఈద్గా నిర్మాణాన్ని అర్థాంతరంగా కూల్చేశారు. కొత్త నిర్మాణం చేపడుతామని మిన్నకుండి పోయారు. అయితే వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ముస్లింల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని స్థానిక ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ప్రత్యేక చొరవతో ఈద్గా నిర్మాణం పూర్తి చేయించారు. రంజాన్ కానుకగా ముస్లింలకు అంకితం చేయనున్నారు. సాక్షి, నెల్లూరు : నెల్లూరులో చారిత్రాత్మకమైన ప్రదేశంగా విరాజిల్లుతున్న బారాషహీద్ దర్గా ప్రాంగణంలో ప్రత్యేకతలతో కూడిన ఈద్గా నిర్మాణం పూర్తయింది. రంజాన్ మాసం కానుకగా స్థానిక ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఈనెల 29న ముస్లింలకు అంకితం చేయనున్నారు. గత టీడీపీ హయాంలో ముస్లింల మనోభావాలకు విరుద్ధంగా ఈద్గాను కూల్చివేసి నిర్మాణం గురించి పట్టించుకోలేదు. దీంతో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు జరుపుకునేందుకు అనేక ఇబ్బందులు పడ్డారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే స్థానిక ఎమ్మెల్యే కోటంరెడ్డి చొరవతో పూర్తి హంగులతో ఈద్గా నిర్మాణం పూర్తి చేయించారు. అన్ని హంగులతో ఈద్గా నిర్మాణం బారాషహీద్ దర్గా ప్రాంగణంలో అన్ని హంగులతో ఈద్గా నిర్మాణం చేపట్టడం ఆనందదాయకం. స్థానిక ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకుని నిధులు మంజూరు చేయించి తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కడా లేనివిధంగా నిర్మాణం చేయించారు. ముస్లింల పట్ల ఎమ్మెల్యేకున్న అభిమానాన్ని చాటుకున్నారు. ఆయనకు మేమంతా కృతజ్ఞతులై ఉంటాం. – అబూబకర్, మాజీ చైర్మన్, బారాషహీద్ రొట్టెల పండగ కమిటీ ఎంతో సంతోషంగా ఉంది ప్రత్యేక హంగులతో నిర్మించిన ఈద్గాను రంజాన్ కానుకగా మాకు అప్పగించడం చాలా సంతోషంగా ఉంది. గత మూడేళ్లుగా ఈద్గా లేక ప్రార్థనల కోసం ఇబ్బందిపడేవారం. స్థానిక ఎమ్మెల్యే మా మనోభావాలను గౌరవిస్తూ ఈద్గా నిర్మాణంపై దృష్టిపెట్టి మాకు రంజాన్ కానుకగా ఇవ్వడం ఆనందంగా ఉంది. పండగ రోజు అందరం కలిసి ప్రత్యేక ప్రార్థనలు జరుపుకుంటాం. – ఎస్డీ ఇలియాజ్ స్థానికుడు, నెల్లూరు వైఎస్సార్సీపీ హయాంలో.. రాష్ట్రంలో ఉన్న వైఎస్సార్సీపీ ప్రభుత్వం ముస్లింల సంక్షేమానికి ఎనలేని ప్రాధాన్యం ఇస్తోంది. అదే విధంగా అధికార పార్టీ ప్రజాప్రతినిధులు కూడా ముస్లింల మనోభావాలకు అనుగుణంగా నడుచుకుంటున్నారు. తాజాగా నెల్లూరు రూరల్ నియోజకవర్గ కేంద్రంలో ఆధ్యాత్మిక కేంద్రంగా ఉన్న బారాషహీద్ దర్గా ప్రాంగణంలో అత్యాధునిక హంగులతో రూ.1.03 కోట్ల వ్యయంతో ఈద్గా నిర్మాణం పూర్తి చేయించారు. ► గత రెండేళ్లుగా కరోనా ఆంక్షలతో ముస్లింలు కలిసి ప్రార్థనలు చేసుకునే అవకాశం లేకుండాపోయింది. కానీ ఈ ఏడాది రంజాన్ పండగ కానుకగా ఈద్గాను వారికి అంకితం చేసేందుకు స్థానిక ఎమ్మెల్యే ప్రత్యేక శ్రద్ధ చూపారు. రంజాన్ మాసం చివరి శుక్రవారం ఈనెల 29న వారికి అంకితం చేసేందుకు కృషి చేస్తున్నారు. ► 100 అడుగుల వెడల్పు, సుమారు 70 అడుగుల ఎత్తులో మినార్ల నిర్మాణం చేపట్టారు. వచ్చే శుక్రవారం అంకితం.. రంజాన్ మాసం చివరి శుక్రవారం ఈద్గాను స్థానిక ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ముస్లింలకు అంకితం చేయనున్నారు. దాదాపు రెండు వేల మందికి పైగా ముస్లింలు హాజరుకానున్న సభలో ఇఫ్తార్ విందు కూడా ఇచ్చేందుకు ఎమ్మెల్యే ఏర్పాట్లు చేస్తున్నారు. బారాషహీద్ దర్గా ప్రాంగణంలో పూర్తి హంగులతో నిర్మాణం పూర్తి చేసుకున్న ఈద్గా నిర్మాణం తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కడా లేదని ముస్లింలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ హయాంలో.. బారాషహీద్ దర్గా ప్రాంగణంలో దశాబ్దాల కాలంగా ఉన్న ఈద్గాలో నగరంలో ఉన్న ముస్లింలు బక్రీద్, రంజాన్ పండగలకు ప్రత్యేక ప్రార్థనలు జరుపుకునేవారు. ప్రతి ఏటా రెండు పండగలకు ఈద్గా పరిసరాలను సుందరంగా తీర్చిదిద్ది ప్రత్యక ప్రార్థనలు చేసుకునేవారు. అయితే గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఈద్గాను కూల్చివేశారు. ఆ ప్రదేశంలో నూతన ఈద్గా నిర్మిస్తామని చెప్పి పట్టించుకోలేదు. గత మూడేళ్లుగా ఈద్గా లేక ముస్లింలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. -
నేటి నుంచి రొట్టెల పండుగ
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: నెల్లూరు నగరంలోని ప్రసిద్ధిగాంచిన బారా షాహిద్దర్గాలో మంగళవారం నుంచి రొట్టెల పండుగ ప్రారంభంకానుంది. రాష్ట్రం నుంచే కాకుండా తమిళనాడు, కేరళ, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలతో పాటు.. దుబాయ్ నుంచి కూడా మత విశ్వాసకులు పెద్ద సంఖ్యలో తరలిరానున్నారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ప్రధానంగా రూ.1.57 కోట్లతో విద్యుత్, తాగునీరు, పారిశుధ్యం తదితర ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వం రాష్ట్ర పండుగ హోదా కల్పించిన నేపథ్యంలో ఏర్పాట్లు భారీగా చేస్తున్నారు. 1,981 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు. పారిశుధ్య సమస్య తలెత్తకుండా 4,500 మంది పారిశుధ్య కార్మికులను నియమించారు. దర్గా ప్రాంగణాన్ని విద్యుద్దీపాలతో అలంకరించడంతో పాటు.. దర్గాలో ఉన్న స్వర్ణాల చెరువులో నీటి నిల్వకు ఇబ్బంది లేకుండా చూస్తున్నారు. స్వర్ణాల చెరువులో 11.5 అడుగుల మేర నీరుండేలా చర్యలు తీసుకున్నారు. దర్గా ప్రాంగణంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ రూమ్‌కి అనుసంధానం చేశారు. ప్రధాన విభాగాల అధికారులంతా పర్యవేక్షించనున్నారు. కిటకిటలాడుతున్న దర్గా ప్రాంగణం మంత్రి డాక్టర్ అనిల్‌కుమార్‌యాదవ్, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధరరెడ్డి, కలెక్టర్ ఎంవీ శేషగిరిబాబు, జిల్లా ఎస్పీ ఐశ్యర్య రస్తోగిలు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. సోమవారం మంత్రి, ఎమ్మెల్యే తదితరులు దర్గా ప్రాంగణంలో ఏర్పాట్లను పరిశీలించారు. ఇతర రాష్ట్రాల వారు ఆదివారం నుంచే తరలివస్తుండటంతో దర్గా ప్రాంగణం కిటకిటలాడుతోంది. పదో తేదీన షహదాత్, 11న గంధం మహోత్సవం, నగరంలోని కోటమిట్ట వద్ద ఉన్న మసీదు నుంచి గంధం ఉరేగింపు నిర్వహించి దర్గాకు తీసుకొస్తారు. 12న రొట్టెల పండుగ, 13న తహలీల్ ఫాతేహో, 14న ముగింపు సభ నిర్వహించనున్నారు. -
10 నుంచి రొట్టెల పండుగ
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: నెల్లూరు నగరంలోని ప్రసిద్ధ బారా షాహిద్ దర్గాలో ఈనెల 10వ తేదీ నుంచి 14వరకు రొట్టెల పండుగ జరుగనుంది. రాష్ట్ర పండుగ హోదా కలి్పంచిన నేపథ్యంలో అట్టహాసంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 10న షహదాత్‌తో ప్రారంభమయ్యే రొట్టెల పండుగ 14న ముగియనుంది. ఆంధ్రా నుంచే కాకుండా తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలతో పాటు సౌదీ దేశాల్లో ఉంటున్న ముస్లింలు తరలివస్తారు. ఏటా లక్షల సంఖ్యలో భక్తులు హాజరై వారి కోర్కెలకు అనుగుణంగా రొట్టెలు వదులుతారు. పది లక్షల మంది భక్తులకు సౌకర్యం కలి్పంచేలా ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రధానంగా బారా షాహిద్ ప్రాంగణాన్ని ముస్తాబు చేయడంతో పాటు కోర్కెల రొట్టెలు ఇచ్చే పవిత్ర స్వర్ణాల చెరువులో నీరు నిల్వ ఉండేలా చర్యలు తీసుకున్నారు. 11న గంధం మహోత్సవం.. రొట్టెల పండుగలో కీలకమైన గంధం మహోత్సవం ఈనెల 11వ తేదీన జరుగనుంది. 11న రాత్రి భారీ ఉరేగింపుగా గంధను దర్గాకు తీసుకొచ్చి బారా షాహిద్‌లకు సమరి్పస్తారు. కార్యక్రమంలో కడప పెద్ద దర్గా పీఠాధిపతి హజరత్ ఆరీపుల్లా హుస్సేని పాల్గొంటారు. 10వ తేదీన షహదాత్, 11న గంధ మహోత్సవం, 12న రొట్టెల పండుగ, 13న తహలీల్ ఫాతేహ, 14న ముగింపు సభ జరుగుతుంది. -
కోర్కెలు తీర్చే రొట్టెలు
భక్తుల రొట్టెలకే సంతసించి వారు కోరిన కోర్కెలు బారాషహీద్ తీరుస్తారని నమ్మకం. విశ్వాసమే ప్రధానంగా భక్తులు కోరిన కోర్కెలు తీర్చే దర్గాగా బారాషహీద్ ఖ్యాతి గాంచింది. ఇచ్చి పుచ్చుకోవడంలో మానవత్వం, పరస్పర సహకారం ఉందనే తత్వాన్ని బోధిస్తూ రొట్టెల పండగ చేసుకుంటారు. ఇందుకు నెల్లూరులోని బారాషహీద్ దర్గా ఖ్యాతిగాంచింది. వందల ఏళ్ల నుంచి కొనసాగుతున్న ఈ ఆచారం నేటికీ కొనసాగుతూ లక్షలమంది భక్తులు దర్గాకు చేరుస్తోంది. పవిత్ర యుద్ధంలో అమరులైన బారాషహీద్ పవిత్రమైన స్వర్ణాల చెరువు ప్రాంతంలో సమాధి చెందారు. ఆ సమాధి నేడు బారాషహీద్ దర్గాగా మారి మత సామరస్యానికి ప్రతీకగా నిలిచింది. ఒకటవ తేదీన మొదలయిన రొట్టెల పండగ ఉత్సవాలు 5వ తేదీ వరకు కొనసాగనున్నాయి. అప్పట్లో నెల్లూరు ప్రాంతం తమిళనాడు రాష్ట్రాన్ని పాలించిన ఆర్కాట్ నవాబుల పాలనలో ఉండేది. వందల ఏళ్ల క్రితం నెల్లూరుకు ఎటువంటి రాకపోకలు కూడా లేనివిధంగా పూర్తి అటవీప్రాంతంగా ఉండేది. సహజసిద్ధంగా ఏర్పడిన స్వర్ణాల చెరువు మాత్రమే ఉండేది. ఆర్కాట్ నవాబు సతీమణి అనారోగ్యంతో బాధపడుతోంది. ఈ క్రమంలో ఒకరోజు బారాషహీద్ ఆమెకు కలలో కనిపించి తాను స్వర్ణాల చెరువు వద్ద సమాధి అయ్యానని, తనకు అక్కడ దర్గా నిర్మించమని ఆదేశించారు. తనకొచ్చిన స్వప్నం గురించి ఆమె ఆర్కాట్ నవాబుకు చెప్పగా వెంటనే భారీ సైన్యంతో అటవీప్రాంతంలో ఉన్న స్వర్ణాలచెరువు వద్దకు ఆర్కాట్ నవాబు వచ్చి బారాషహీద్ కోరిన విధంగా సమాధి నిర్మాణ పనులు మొదలుపెట్టారు. అప్పట్లో దూరప్రాంతాలకు వచ్చే క్రమంలో రొట్టెలే ఆహారంగా ఎక్కువ వినియోగంలో ఉండేది. ఈ క్రమంలో నవాబు, అతని సతీమణి రొట్టెలు తిని స్వర్ణాల చెరువులో నిలబడి మిగిలిన రొట్టెలు తమతో వచ్చిన పరివారానికి పంచిపెట్టారు. ఆమె వెంటనే కోలుకోవడంతో షహీద్‌పై భక్తివిశ్వాసాలు పెరిగాయి. ఆ తర్వాత ఆర్కాట్ నవాబు షహీద్‌కు సమాధి నిర్మించి కొంత భూమిని దర్గాకు కేటాయించారు. ఇది సుమారు 266 ఏళ్ల క్రితం జరిగిన సంఘటన. 1751 నుంచి రొట్టెల పండగ... ఏటా మొహరం కలసి వచ్చేలా బారాషహీద్ దర్గా ఉత్సవాలు జరుగుతుంటాయి. దాదాపు 266 ఏళ్ల నుంచి ఉత్సవాలు జరుగుతున్నాయి. 1751వ సంవత్సరం జూలై 14వ తేది (శుక్రవారం) న బారాషహీద్ మహిమ ప్రకటితమైంది. నానాటికీ భక్తులు పెరుగుతున్న క్రమంలో ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నారు. పులే బారాషహీద్కు కాపలా.. బారాషహీద్ దర్గా నిర్మితమయ్యాక బారాషహీద్ మహిమలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వచ్చాయి. ప్రతిరోజూ ఉదయం పూట భక్తులు దర్గాను దర్శించుకొని వెళ్లేవారు. సాయంత్రం పూట దర్గాకు రక్షణగా పులి దర్గాలో సంచరించి రాత్రి అక్కడే నిద్రించి పొద్దునే వెళ్లేముందు దర్గా ప్రాంగణం మొత్తాన్ని తోకతో శుభ్రం చేసేది. దాదాపు 50 ఏళ్ల క్రితం వరకు కూడా ఇది కొనసాగింది. పులికోసం దర్గాలో బోను ఉంది. ఐదు వరకు ఉత్సవాలు.. ఒకటవ తేదీన ప్రారంభమైన ఉత్సవాలు 5వ తేది వరకు కొనసాగనున్నాయి. కోరిన కోర్కెలతో దర్గాపక్కనే ఉన్న స్వర్ణాల చెరువులో దిగి రొట్టెలను భక్తులు ఇచ్చి పుచ్చుకుంటారు. వారి కోర్కెలు తీరాక మరుసటి సంవత్సరం మొక్కుబడులు తీర్చుకుంటారు. ఇలా రాష్ట్రం నుంచే కాకుండా సౌదీ అరేబియా, దుబాయ్ దేశాల్లో సిర్థపడిన ముస్లింలు, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ, కర్ణాటక, తెలంగాణా రాష్ట్రాల నుంచి భారీగా భక్తులు హాజరవుతారు. నిజానికి నేడు తహలీల్ ఫాతియా కార్యక్రమం నిర్వహించి ఉత్సవాలను ముగించాలి. అయితే భక్తుల రద్దీ అధికంగా ఉన్నందువల్ల 5వ తేదీన దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు జరగనున్నాయి. ఉత్సవాల్లో గంధమహోత్సవం, మొక్కుబడి రొట్టెల కార్యక్రమం ముఖ్యమైనవి. ఇలా చేరుకోవాలి నెల్లూరు ఆర్టీసీ బస్టాండు నుంచి కిలోమీటరు, రైల్వేస్టేషన్ నుంచి 2 కి.మీ దూరంలో దర్గా ఉంది. నగరంలో బస్టాండు, రైల్వేస్టేషన్ల నుంచి ప్రత్యేక బస్సులతోపాటు నిరంతరం ఆటోలు ఉంటాయి. నెల్లూరు నుంచి 24 కి.మీ దూరంలో వెంకటాచలం మండలం కసుమూరు గ్రామంలో ప్రసిద్ధమైన మస్తాన్‌వలీ దర్గా ఉంది. నెల్లూరు నుంచి 59 కి.మీల దూరంలో ఎస్పేటలో ఖాజానాయబ్ రసూల్ దర్గా ఉంది. నెల్లూరు నుంచి సంగం మీదుగా ఏఏస్పేటకు చేరుకోవచ్చు. – కాట్రపాటి కిషోర్, సాక్షి ప్రతినిధి, నెల్లూరు. -
ఘనంగా మూడో రోజు రొట్టెల పండగ
-
ఘనంగా రెండోరోజు రొట్టెల పండుగ
-
ఘనంగా రెండో రోజు రొట్టెల పండగ
నెల్లూరు: బారా షహీద్ దర్గాలో గురువారం రొట్టెల పండగ రెండో రోజుకు చేరుకుంది. ఈ పండగ నేపథ్యంలో ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. రొట్టెల పండగలో రాత్రికి గంధమహోత్సవం జరగనుంది. అయితే ఈ రోజు మధ్యాహ్నం బారా షహిద్ దర్గాలో సీఎం చంద్రబాబు పాల్గొని ప్రార్థనలు చేయనున్నారు. దీంతో దర్గా వద్ద పటిష్టమైన భద్రత చర్యలు చేపట్టారు. మరో రెండు రోజులు ఈ రొట్టెల పండగ కొనసాగనుంది. -
రొట్టెల పండుగ కు భారీగా జనం
నెల్లూరు సమీపంలోని బారీషహీద్ దర్గాలో బుధవారం నుంచి ప్రారంభమైన రొట్టెల పండుగకు భక్తుల రద్దీ పెరుగుతోంది. బుధవారం మధ్యాహ్నం వరకు 50వేల మంది వచ్చి ఉంటారని అంచనా. సాయంత్రానికి ఈ సంఖ్య లక్షకు చేరుకుంటుందని అధికారులు అంటున్నారు. ముఖ్యంగా కర్ణాటక, కేరళ, తమిళనాడు, తెలుగు రాష్ట్రాలతోపాటు విదేశాల నుంచి కూడా ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఇటీవల నెల్లూరు పోర్టులో బాంబు పేలుడు ఘటన నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బాంబు స్వ్కాడ్లను రప్పించారు. -
కోరికలు తీరగ... రొట్టెల మార్చగ!
-
కోరికలు తీరగ... రొట్టెల మార్చగ!
నెల్లూరు బారాషహీద్ దర్గాకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. దేశ, విదేశాల నుంచి భక్తుల తరలి వస్తారు. బారాషహీద్‌లను దర్శించుకోవడమే కాక కోర్కెలను తీర్చే రొట్టెల కోసం భక్తులు ఏటా లక్షల మంది ప్రజలు వస్తున్నారు. ఈ దర్గాకు వందల సంవత్సరాల చరిత్ర ఉంది. దర్గా ప్రాశస్త్యం టర్కీకు చెందిన 12 మంది మతబోధకులు మక్కా నుంచి మహమ్మద్ ప్రవక్త సందేశాన్ని ప్రజలకు వివరిస్తూ భారతదేశానికి వచ్చారు. ఆ సమయంలో మైసూర్‌ను పాలించే హైదర్అలీ సహకారంతో అనేకప్రాంతాల్లో దైవబోధనలు చేశారు. పలు ప్రాంతాల్లో మసీదులు నెలకొల్పారు. ఆ సమయంలో కొడవలూరు మండలం లోని గండవరం గ్రామంలో తమిళనాడు వాల్జా రాజులకు, బీజాపూర్ సుల్తాన్లకు మధ్య యుద్ధం జరిగింది. ఆ పవిత్రయుద్ధంలో టర్కీ కమాండర్, మత ప్రచారకుడు జుల్ఫేఖార్బేగ్తో పాటు 11 మంది వీర మరణం పొందారు. వారి తలలు గండవరంలో తెగిపడగా వీరుల మొండాలను గుర్రాలు నెల్లూరులోని స్వర్ణాల చెరువు వద్దకు తీసుకువచ్చాయి. ఈ నేపథ్యంలో వీరమరణం పొందిన 12 మంది నెల్లూరు ఖ్వాజీకి కలలో కనపడి తమను అక్కడే సమాధి చేయాలని కోరారు. వారి కోరిక మేరకు12 మందికి సమాధులు నిర్మించారు. ఆర్కాట్నవాబుతో రొట్టెల మార్చుకోవడం ప్రారంభం తమిళనాడును అప్పట్లో ఆర్కాట్ నవాబు పరిపాలించే వారు. నెల్లూరు జిల్లా కూడా వారి ఆధీనంలో ఉండేది. ఈ క్రమంలో ఆర్కాట్ నవాబు భార్య తీవ్ర అనారోగ్యంతో బాధపడుతోంది. వైద్య సేవలు అందించినా ఫలితం లేకుండాపోయేది. దీంతో ఆయన తన రాజ్యమంతటా తన భార్య రోగాన్ని నయంచేసిన వారికి బహుమతి ఇస్తారని ప్రకటించారు. ఈ క్రమంలో స్వర్ణాల చెరువులో బట్టలు ఉతికే రజకులు రాత్రి పూట అక్కడే నిద్రపోయేవారు. రాత్రి కలలో బారాషహీద్‌లు కలలో కనపడి ఆర్కాట్ నవాబు భార్య అనారోగ్యంతో ఉందని దర్గాకు వస్తే నయమవుతుందని తెలిపారు. ఈ విషయాన్ని రజకులు రాజుకు తెలియజేశారు. అప్పటికే పుణ్యక్షేత్రాలను దర్శిస్తే రోగం నయమవుతుందన్న పండితుల మాటను విన్నరాజు మరుసటి రోజు తన భార్యతో కలిసి బారాషహీద్ దర్గాలో నిద్రచేశారు. షహీద్‌ల మహత్యం రాజు భార్య రోగం నయమైంది. దీంతో రాజు, రాణి ఇద్దరూ స్వర్ణాల చెరువులో స్నానమాచరించి తమ కోరిక తీరినందుకు తాము తెచ్చుకున్న రొట్టెలను స్థానికులకు పంచారు. దాన్ని ఆరోగ్య రొట్టెగా ప్రజలు తీసుకున్నారు. అప్పటి నుంచి కోరికలను తీర్చుకునేందుకు రొట్టెలను మార్చుకుంటున్నారు. నెలవంక కనిపించిన 11వ రోజు నుంచి ఆర్కాట్ నవాబు ప్రారంభించిన ఈ రొట్టెలు మార్చుకునే కార్యక్రమం రొట్టెల పండగగా మారింది. మొహరం నెలలో నెలవంక కనిపించిన 11వరోజున రొట్టెల పండగ ప్రారంభమవుతోంది. ప్రారంభమైన మరుసటి రోజు గంధమహోత్సవం చేస్తారు. కోటమిట్ట అమీనియా మసీదు నుంచి గంధాన్ని తీసుకొచ్చి 12 మంది షహీద్‌లకు లేపనం చేసి, భక్తులకు పంచిపెడుతారు. అనంతరం తమ కోర్కెలు తీరాలని భక్తులు వివిధ రకాల రొట్టెలను ఒకరికొకరు మార్చుకుని బారా షహీద్‌లు ప్రసాదించిన ప్రసాదంగా భావిస్తారు. పీర్లను కడిగిన చోటే రొట్టెల మార్పిడి మొహరం నెలలో జరిగే పీర్లపండగ చివరి రోజు పీర్లను స్వర్ణాల చెరువులో కడుగుతారు. దీంతో స్వర్ణాల చెరువు పవిత్రమవుతుందని ఇమామ్ అబూబాకర్ అషఫ్రి అంటున్నారు. అందుకే ఆ ప్రాంతంలో కోర్కెల రొట్టెలను మార్చుకుంటారని చెబుతున్నారు. మొహరం పండగ పదో రోజు మహమ్మద్ ప్రవక్త మనుమడు ఇమామ్ హుస్సేన్, ఆయన సహచరులు 72 మంది ఇరాక్‌లోని కర్బలా మైదాన ంలో యజీద్ సైన్యంతో యుద్ధం చేసి వీరమర ణం పొందారం టున్నారు. సంతాపదినం (జియారత్) రోజున రొట్టెలు మార్చుకుంటా ర ని ఆయన చెబుతున్నారు. 10 లక్షల మంది హాజరయ్యే అవకాశం నెల్లూరు సిటీ: ఈ ఏడాది 10 నుంచి 12 లక్షల మంది భక్తులు రొట్టెల పండగకు హాజరయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. దేశవిదేశాల నుంచి వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా 24గంటల పాటు తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేశారు. దర్గా ప్రాంగణం 16 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. దర్గా ప్రాంగణంలో రూ.84 లక్షలతో 120 శాశ్వత మరుగుదొడ్లు నిర్మించారు. హబీబ్ అజ్మీరీతో ఖవ్వాలీ ఏర్పాటు చేయనున్నారు. రవాణా శాఖ ఆధ్వర్యంలో 70 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. రొట్టెల పండగను ప్రతిష్టాత్మకంగా నిర్వహించండి - మంత్రి నారాయణ నెల్లూరు, సిటీ: ఐదు రోజులు పాటు జరిగే రొట్టెల పండగను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని మంత్రి పొంగూరు నారాయణ పేర్కొన్నారు. నగర పాలక సంస్థ కార్యాలయంలోని మేయర్ చాంబర్లో సోమవారం పోలీస్, ఇరిగేషన్, మత్స్యశాఖ, కార్పొరేషన్ అధికారులతో సమీక్షించారు. పార్కింగ్ ప్రాంతాల నుంచి దర్గాకు ఆర్టీసీ బస్సులు నడిపేలా చూడాలన్నారు. రొట్టెల పండగకు సీయం చంద్రబాబునాయుడు రూ.5 కోట్లు మంజూరు చేశారని, స్వర్ణాలచెరువును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుని వినియోగిస్తామన్నారు. ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర, జేసీ ఇంతియాజ్, మేయర్ అజీజ్, కమిషనర్ కె వెంకటేశ్వర్లు, టీడీపీ నగర ఇన్చార్జ్ ముంగమూరు శ్రీధర్‌కృష్ణారెడ్డి, చాట్లనరసింహారావు తదితరులు పాల్గొన్నారు. 7 జోన్లుగా దర్గా ప్రాంగణం 1వ జోన్: రొట్టెలు మార్చుకునే స్వర్ణాల చెరువు. 2వ జోన్: రొట్టెలు మార్చుకునే స్వర్ణాల చెరువతో పాటు ఘాట్, పురుషులు, స్త్రీల స్నానపు గదులు, శాశ్వత మరుగుదొడ్లను ఏర్పాటు చేశారు. 3వ జోన్ :పినాకినీ గెస్ట్‌హౌస్ వైపు స్టాల్స్, వైద్య శిబిరాలు. 4వ జోన్: సయ్యద్ అహ్మద్‌బాబా దర్గా, ముసాఫిర్ఖానా ఉంచారు. 5వ జోన్ : ఎగ్జిబిషన్, స్టాల్స్, వైద్య శిబిరాలు. 6వ జోన్ : బారాషాహిద్ దర్గా, ఆసిఫ్ హుస్సేన్బాబా దర్గా, దర్గా కమిటీ కార్యాలయం. 7వ జోన్ : దర్గా బయట వైపు మెరుున్రోడ్డు భారీ భద్రత -దర్గాలో మెటల్ డిటెక్టర్ల ఏర్పాటు (కొండ్రా హరిబాబు) బారాషాహీద్ దర్గాలో ఈనెల 12 నుంచి 16వరకు జరగనున్న రొట్టెల పండగకు జిల్లా పోలీసు యంత్రాంగం భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తోంది. గుంటూర్, ప్రకాశం జిల్లా లకు చెందిన 2100 మంది పోలీసులు భద్రతా విధుల్లో పాల్గొనున్నారు. ఎస్పీ విశాల్ గున్నీ అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తున్నారు. డ్రోన్‌తో నిఘా దర్గా ఆవరణం, కోటమిట్ట. ప్రధాన కూడళల్లో 40సీసీ కెమెరాలు, 2పిటీజెడ్ కెమెరాలు, నాలుగు డ్రోన్ కెమెరాలను వినియోగిస్తున్నారు. వీటిని నెల్లూరు, విజయవాడల్లోని కమాండ్ కంట్రోల్ సిస్టమ్‌కు అనుసంధానం చేస్తున్నారు. ఉన్నతాధికారులు విజయవాడనుంచే ప్రత్యక్షంగా రొట్టెల పండగను పర్యవేక్షిస్తూ అవసరమైన సలహాలు, సూచనలు ఇస్తారు. ట్రాఫిక్‌పై ప్రత్యేక దృష్టి ట్రాఫిక్‌కు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పక్కా ప్రణాళికలు సిద్ధం చేశారు. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ డైవర్షన్లు ఏర్పాటు చేస్తున్నారు. దర్గా ఆవరణలోకి వీవీఐపీ, వీఐపీ వాహనాలతోపాటు ముందస్తు అనుమతి పొందిన వాహనాలను మాత్రమే అనుమతిస్తారు. మిగిలిన వాహనాలన్నీ పార్కింగ్ ప్రదేశాల్లోనే నిలపాలి. పార్కింగ్ ప్రదేశాలివే మాగుంటలే అవుట్‌లోని పిచ్చిరెడ్డి కల్యాణమంటపం ఎదురుగా ఉన్న స్థలం, టీబీ హాస్పిటల్, కస్తూరిదేవిగార్డెన్ అండ్ స్కూల్, గుంటసుబ్బరామిరెడ్డి ఇంటి సమీపంలోని వక్ఫ్‌బోర్డు స్థలం, బట్వాడిపాలెం సెంటర్లోని మదరసా, ఏసి సుబ్బారెడ్డి స్టేడియం(హాకీ ప్లేగ్రౌండ్), కొత్తగా నిర్మిస్తున్న జిల్లా పోలీసు కార్యాలయ ఆవరణం, నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయం, సాల్వేషనార్మి చర్చి ఆవరణలో(ద్విచక్రవాహనాలు నిలపాలి) వాహనాలు నిలపాల్సి ఉంది. పోలీస్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు దర్గా ఆవరణలో పోలీసు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. 24 గంటలు సిబ్బంది అక్కడ భక్తులకు అందుబాటులో ఉంటారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కల్గినా డయల్ 100, 9440796303, 9440796305, 9440700015కు ఫిర్యాదు చేస్తే తక్షణమే స్పందిస్తారు. ట్రాఫిక్ దారిమళ్లింపు పొదలకూరువైపు నుంచి వచ్చే వాహనాలను పొదలకూరురోడ్డు , కొండాయపాలెం గేటు మీదుగా నగరంలోకి, పొదలకూరు వైపు వెళ్లే వాహనాలు కేవీఆర్ పెట్రోల్ బంక్, బొల్లినేని, కొండాయపాలెం మీదుగా పొదలకూరురోడ్డులోకి వెళుతారుు. జొన్నవాడ నుంచి వచ్చే వాహనాలు బట్వాడిపాలెం సెంటర్, శాంతినగర్ మీదుగా నెల్లూరు నగరంలోకి, జొన్నవాడ వెళ్లే వాహనాలు అదే మార్గం గుండా జొన్నవాడకు వెళ్లేలా చర్యలు తీసుకొన్నారు. సుజాతమ్మకాలనీ, ఎస్పీబంగ్లా, ప్రశాంతినగర్, అంబేడ్కర్ నగర వాసులకు మాత్రం వారి ఇళ్లకు వెళ్లేందుకు వాహనాలు అనుమతి ఇస్తామన్నారు. బారాషహీద్ అంటే వీర మరణం పొందిన సంఖ్యను ఉర్దూలో బారా అంటారు(12) అమరులను ఉర్దూలో షహీద్‌లుగా పిలుస్తారు. ఈ నేపథ్యంలోనే బారాషహీద్ అనే పేరొచ్చింది. వారు ఉన్న దర్గానే నేడు మనం పిలుచుకునే బారాషహీద్ దర్గా. తలలు తెగిపడిన చోటే సాతోషహీద్ దర్గా కొడవలూరు మండలంలోని గండవరంలో వాల్జారాజులకు, బీజాపూర్ సుల్తాన్లకు మధ్య జరిగిన పవిత్రయుద్ధంలో మత ప్రచారకుల 12 మంది తలలు తెగిపడ్డారుు. వాటిలో 7 మాత్రమే లభ్యమయ్యారుు. అవన్నీ సమాధులుగా మారిన చోటే నేడు సాతోషహీద్ (సాత్ అంటే ఉర్దూలో ఏడు, షహీద్ అంటే వీరమరణం పొందినవారు) దర్గాగా పిలువబడుతోంది. -
మూడో రోజు కొనసాగుతున్న రొట్టెల పండుగ
-
రెండో రోజు కొనసాగుతున్న రొట్టెల పండుగ
-
రెండో రోజు కొనసాగుతున్న రొట్టెల పండుగ
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా : జిల్లాలో శనివారం ఘనంగా ప్రారంభమైన రొట్టెల పండుగ రెండో రోజు కొనసాగుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో బారా షహీద్ దర్గాకు చేరుకుంటున్నారు. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం గంధం(సందల్) ఊరేగింపు ఉండటంతో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలుగకుండా నగర పాలక సంస్థతోపాటు వక్ఫ్ బోర్డు జాగ్రత్తలు తీసుకుంది. -
కోలాహలంగా రొట్టెల పండుగ
-
కోలాహలంగా రొట్టెల పండుగ
శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా : పట్టణంలోని బారా షహీద్ దర్గా వద్ద శనివారం రొట్టెల పండుగ కోలాహలంగా ప్రారంభమైంది. మహిళలు పరస్పరం రొట్టెలను మార్చుకున్నారు. సర్వ మతాల వారు ఐక్యంగా జరుపుకునే ఈ పండుగకు ఘనమైన చరిత్ర ఉంది. దేశవిదేశాల నుంచి వచ్చే భక్తులతో ఆ ప్రాంతమంతా కిటకిటలాడుతోంది. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం గంధ మహోత్సవం, సోమవారం రొట్టెల పండుగ నిర్వహిస్తారని దర్గా ముజావర్ రఫీ తెలిపారు. లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు వక్ఫ్ బోర్డు, నగరపాలక సంస్థ విస్తృత ఏర్పాట్లు చేశారు. మరుగుదొడ్లు, వాటర్ ప్రూఫ్ షామియానాలను ఏర్పాటు చేశారు. కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఉచిత మంచి నీటిని అందిస్తుండగా, మరి కొన్ని సంస్థలు అన్నదాన సదుపాయాన్ని కల్పించాయి. నగరంలోని ఆసుపత్రులు ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేశాయి. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలుగకుండా ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ జానకి తెలిపారు.