
బారాషహీద్ దర్గా ప్రాంగణంలోని స్వర్ణాల చెరువులో ఏటా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే రొట్టెల పండగ శనివారం ప్రారంభంకానుంది

మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే రొట్టెల పండగకు దేశ, విదేశాల నుంచి భక్తులు రానున్నారు

ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా నగరపాలక సంస్థ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పండగ నిర్వహణకు దాదాపు రూ.మూడు కోట్లను కార్పొరేషన్ కేటాయించింది

బారాషహీదులను స్మరిస్తూ తమ కోర్కెలు నెరవేరాలని కాంక్షిస్తూ స్వర్ణాల చెరువులో రొట్టెలను భక్తులు మార్చుకుంటారు

కోర్కెలు తీరాక తిరిగి రొట్టెను వదులుతారు. పండగకు పది లక్షల నుంచి 12 లక్షల మంది భక్తులు హాజరవుతారని అంచనా

రొట్టెల పండగలో ఎలాంటి హడావుడి, ఆర్భాటాల్లేకుండా ఘనంగా నిర్వహించేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు చర్యలు చేపట్టారు

అన్ని శాఖల సమన్వయంతో రొట్టెల పండగను విజయవంతంగా నిర్వహించేందుకు మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్‌కుమార్ పనిచేస్తున్నారు






















