sri potti sriramulu nellore district
-
‘దేవర తిప్ప’పై అక్రమార్కుల తిష్ట
సైదాపురం: విలువైన ఖనిజ నిక్షేపాలున్న శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని దేవరతిప్ప కొండపై అధికార పార్టీకి చెందిన అక్రమార్కులు తిష్ట వేశారు. సైదాపురం తహసీల్దార్ కార్యాలయం సమీపంలోనే ఉన్న ఈ కొండలో అపారమైన స్పోక్ క్వార్ట్ ్జ ఖనిజం దొరుకుతుంది. దీంతో కూటమి నేతలు ఈ కొండను చెరబట్టారు. వారి అండతో ఓ చోటా వ్యాపారి విలువైన ఖనిజాన్ని తవ్వేస్తున్నారు. పట్ట పగలే భారీ సంఖ్యలో కూలీలను పెట్టి యథేచ్ఛగా తవ్వుతున్నారు. ఈ విషయం తెలిసినా మైనింగ్ అధికారులు కన్నెత్తి చూడటంలేదు. దేవరతిప్ప వద్ద 24 రకాల ఖనిజ నిక్షేపాలు అపారంగా ఉన్నాయి.దేశంలో భూగర్భ పరిశోధన చేసే విద్యార్థులు ఏటా ఈ కొండను సందర్శించి, ఇక్కడి ఖనిజాలపై పరిశోధనలు చేస్తుంటారు. గతంలో టీడీపీ హయాంలో ఈ కొండలో విచ్చలవిడిగా తవ్వకాలు చేపట్టారు. ఆ తర్వాత గనులన్నీ మూతపడిపోవడంతో కొండ జోలికి రాలేదు. మళ్లీ కూటమి ప్రభుత్వం రావడంతో స్పోక్ క్వార్ట్ ్జ ఖనిజాన్ని తవ్వి తరలించేస్తున్నారు. యంత్రాలతో త వి్వతే అనుమానాలు వస్తాయన్న కారణంతో ఇతర ప్రాంతాల నుంచి తెచి్చన కూలీలతో తవ్వుతున్నారు.తట్టకు రూ.150 వంతున కూలీలకు చెల్లిస్తున్నారు. 400 తట్టలు ఏరితే 10 టన్నులు వస్తోంది. స్థానికంగానే 10 టన్నుల ఖనిజానికి రూ. లక్ష ధర పలుకుతోంది. ఈవిషయం జిల్లా మైనింగ్ అధికారులకు సమాచారం ఇచ్చినా కూడా ఫలితం లేకపోయిందని స్థానిక ప్రజలు చెబుతున్నారు. -
హైవేపై పెద్దపులిని ఢీకొన్న కారు
మర్రిపాడు/ఆత్మకూరు రూరల్: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం కదిరినాయుడుపల్లి సమీపంలో నెల్లూరు–ముంబయి జాతీయ రహదారిపైకి ఒక్కసారిగా పెద్దపులి రావడం కలకలం రేగింది. ఆ పులిని ఓ కారు ఢీకొనడం.. ఆగ్రహంతో పెద్దపులి తిరిగి ఆ కారుపై దాడి చేయడం సంచలనం సృష్టించింది. ఈ ఆకస్మిక ఘటనతో కారులో ప్రయాణిస్తున్నవారు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. కారులో ఉన్న వ్యక్తులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... బద్వేల్ నుంచి నెల్లూరుకు వెళ్తున్న ఓ కారుకు కదిరినాయుడుపల్లి సమీపంలో వెలిగొండ అటవీ ప్రాంతం వద్ద ఒక్కసారిగా పెద్దపులి అడ్డువచ్చింది.పెద్దపులిని కారు ఢీకొని కొద్దిదూరం ముందుకు దూసుకువెళ్లింది. దీంతో పెద్దపులికి కోపం వచ్చి వాహనం ముందు భాగంపై తన పంజాతో దాడి చేసింది. అనంతరం సమీపంలోని అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోయింది. కారు డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో లోపల ఉన్నవారికి ప్రమాదం తప్పింది. కారు ముందుభాగం ధ్వంసమైంది. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు ఘటనాస్థలానికి వచ్చి వివరాలు సేకరించారు.పెద్దపులి కాలి ముద్రలు, కారు ఢీకొనడం వల్ల పులి గాయపడినట్లుగా ఆనవాలు కనుగొని ఉన్నతాధికారులకు సమాచారాన్ని అందించారు. అటవీశాఖ అధికారులు కదిరినాయుడుపల్లి సమీపంలోని అడవిలో గాలింపు చర్యలు చేపట్టారు. పెద్దపులి సంచారంతో కదిరినాయుడుపల్లి అటవీ ప్రాంతం సమీపంలోని పడమటినాయుడుపల్లి, చుంచులూరు తదితర గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.శేషాచలం చేరిన పెద్దపులి!శ్రీశైలం–శేషాచలం మధ్య పెద్దపులుల కారిడార్ ఉంది. శ్రీశైలం–నాగార్జున సాగర్ అభయారణ్యం నుంచి శేషాచలం వరకు పులుల విస్తరణ కోసం అధికారులు పలు చర్యలు చేపట్టారు. అయితే, శేషాచలం వరకు పెద్దపులి వెళ్లిందా.. లేదా.. అని ఇప్పటికీ సంశయంగానే ఉండేది. ఆ అనుమానాలకు తెరదించుతూ శేషాచలం అటవీ ప్రాంతం వరకు పెద్దపులి చేరిందని కదిరి నాయునిపల్లె సమీపంలో సోమవారం జరిగిన ఘటనతో స్పష్టమైంది. -
విద్యుదాఘాతంతో యువకుడి మృతి
కందుకూరు: చంద్రబాబు ప్రమాణ స్వీకారాన్ని పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలిపే ఫ్లెక్సీ కడుతూ విద్యుదాఘాతానికి గురై యువకుడు మృతి చెందిన ఘటన శ్రీపొట్టి శ్రీరాములు జిల్లా కందుకూరు మండలం మాచవరంలో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన ఇనకొల్లు గజపతి, అనూరాధ దంపతుల కుమారుడు నరసింహ (21) తోటి యువకులతో కలిసి చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలుపుతూ భారీ ఫ్లెక్సీ ఏర్పాటుకు సంకల్పించారు.తన ఇంటి సమీపంలో ఫ్లెక్సీ కట్టేందుకు యత్నిస్తుండగా, ఒక్కసారిగా పెద్ద గాలి వచ్చింది. దీంతో ఫ్లెక్సీ బ్యాలెన్స్ తప్పి పక్కనే వెళ్తున్న 11 కేవీ విద్యుత్ లైన్‌పై పడింది. ప్రమాదంలో ఫ్లెక్సీకి ఉన్న ఇనుప బోర్డుకు విద్యుత్ సరఫరా కావడంతో నరసింహ అక్కడికక్కడే మృతి చెందారు. చేతికి అందివచ్చిన కుమారుడు ప్రమాదంలో మృతి చెందడంతో తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. -
జగనన్న లేఅవుట్లోని ఇళ్లు ధ్వంసం
దుత్తలూరు: జగనన్న లేఅవుట్లలోని ఇళ్లను కూడా టీడీపీ కార్యకర్తలు ధ్వంసం చేస్తున్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం ఏరుకొల్లు పంచాయతీలో జగనన్న లేఅవుట్లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఎస్సీలకు 36 ఇళ్లు మంజూరు చేసింది. వాటిలో 20 ఇళ్లు పునాది దశలో ఉన్నాయి. ఎస్సీ కాలనీవాసులు వైఎస్సార్సీపీకి ఓటేశారనే అక్కసుతో సోమవారం సాయంత్రం అదే పంచాయతీ రావిళ్లవారిపల్లికి చెందిన పిడికిటి వెంకటేశ్వర్లు జేసీబీతో ధ్వంసం చేశాడు. ఇదేమని ప్రశ్నిaస్తే మీ దిక్కున్న చోట చెప్పుకోండని బెదిరించాడని ఎస్సీ కాలనీవాసులు తెలిపారు.ధ్వంసం చేసిన తొమ్మిది ఇళ్లలో 6 కాంట్రాక్టర్ నిర్మించగా 3 ఇళ్లు సొంతంగా నిర్మించుకుంటున్నారు. ఇళ్ల కూల్చివేతను ఎస్సీ కాలనీవాసులు అడ్డుకొన్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో కావలి డీఎస్పీ వెంకటరమణ, ఉదయగిరి సీఐ గిరిబాబు, ఎస్సై ఉమాశంకర్ ఘటన స్థలాన్ని పరిశీలించారు. రెవెన్యూ అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. తమ ఇళ్లను ధ్వంసం చేసిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్సీ కాలనీవాసులు డిమాండ్ చేశారు. పోలీసులు టీడీపీ నాయకుడు పిడికిటి వెంకటేశ్వర్లును, జేసీబీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. జేసీబీని స్వా«దీనం చేసుకున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు మంగళవారం వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. -
Michaung Cyclone: మిచౌంగ్ తుపాన్ ఎఫెక్ట్‌తో నెల్లూరులో భారీ వర్షం (ఫొటోలు)
-
నెల్లూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు (ఫొటోలు)
-
Mekapati Goutham Reddy: దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి కాంస్య విగ్రహావిష్కరణ (ఫొటోలు)
-
నెల్లూరు : రొట్టెల పండగ...జనసంద్రంగా స్వర్ణాలచెరువు (ఫోటోలు)
-
Nellore Dargah Rottela Panduga Photos: నేటి నుంచి రొట్టెల పండగ ప్రారంభం (ఫొటోలు)
-
నెల్లూరు: నేటి నుంచి రొట్టెల పండగ ప్రారంభం (ఫొటోలు)
-
నెల్లూరు చెరువులో పడవ బోల్తా..అయిదుగురి మృతదేహాలు లభ్యం
సాక్షి, నెల్లూరు: పొదలకూరు మండలం తోడేరు చెరువులో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. గల్లంతైన ఆరుగురిలో అయిదు మృతదేహాలను రెస్క్యూ టీం వెలికి తీసింది. మృతులు బాలాజీ, చల్లా ప్రశాంత్, కళ్యాణ్, త్రినాథ్, రఘుగా గుర్తించినట్లు పేర్కొన్నారు. మరో వ్యక్తి సురేంద్ర ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. మంత్రి కాకాణి ,ఎస్పీ విజయరావు, కలెక్టర్ చక్రధర్ బాబు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న జడ్పీ చైర్పెర్సన్ ఆనం అరుణమ్మ.. మృతుల కుటుంబసభ్యులను పరామర్శించారు. కాగా జిల్లాలో ఆదివారం సాయంత్రం ఘోర ప్రమాదం జరిగింది. పొదలకూరు మండలం తోడేరు గ్రామ చెరువులో ప్రయాణికులతో వెళ్తున్న పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో ఆరుగురు యువకులు గల్లంతయ్యారు. వాళ్ల ఆచూకీ కోసం పోలీసులు, ఫైర్ సిబ్బంది గాలిస్తున్నారు. సెలవు దినం కావడంతో వాళ్లంతా సరదాగా షికారుకు వెళ్లినట్లు తెలుస్తోంది. ప్రమాదం సమయంలో పడవలో పది మంది యువకులు ఉన్నారు. నలుగురు క్షేమంగా బయటపడ్డారు. ఆరుగురు గల్లంతయ్యారు. గల్లంతయిన యువకుల పేర్లు.. సురేంద్ర,(19), రఘు (24), బాలాజీ (21), త్రినాథ్ (18), కళ్యాణ్(28), ప్రశాంత్(29)గా నిర్ధారించారు పోలీసులు. పొదలకూరు సీఐ సంగమేశ్వరరావు, ఎస్ఐ కరిముల్లా పర్యవేక్షణలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. (చదవండి: నెల్లూరులో ఘోర ప్రమాదం: తోడేరు చెరువులో పడవ బోల్తా.. ఆరుగురు యువకుల గల్లంతు) -
అమ్మా.. ఎందుకిలా చేశావు?, నాన్నా.. నేనేం పాపం చేశాను?
పరిష్కారం లేని సమస్య ఏదీ ఉండదన్న విషయాన్ని ఓ తల్లి, ఓ తండ్రి మరిచిపోయారు. తమ సమస్యల పరిష్కారానికి చావే మార్గమని భావించారు. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం వారితోపాటు ఎంతో భవిష్యత్ ఉన్న పిల్లల ప్రాణాలను సైతం బలితీసుకుంది. భార్య ప్రవర్తన, బంధువుల చేష్టలతో విసిగివేసారిన నెల్లూరులోని అంబాపురం గ్రామానికి చెందిన తండ్రి తన కొడుకుతో కలిసి బావిలో దూకాడు. తాళి కట్టి జీవితాంతం తోడుంటానని ప్రమాణం చేసిన భర్త వేధింపులను తట్టుకోలేకో ఏమో.. ఓ మహిళ అభంశుభం తెలియని ఇద్దరు బిడ్డలతో సహా మృత్యువుని చేరిన ఘటన వింజమూరులోని జైభీమ్‌నగర్‌లో చోటుచేసుకుంది. ఈ హృదయ విదారకర ఘటనలు బాధిత కుటుంబాల్లో పెను విషాదం నింపగా, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో సంచలనం రేపాయి. అమ్మా.. ఎందుకిలా చేశావు? అమ్మా.. పేగును పంచావు.. ప్రేమగా పెంచావు.. మమ్మల్నే సర్వస్వం అనుకున్నావు.. మేమే జీవితమని పొంగిపోయావు.. ఏమైందో ఏమో.. క్షణికావేశంలో నీ ప్రాణాన్ని తీసుకోవాలనుకున్నావో ఏమో.. నీవు లేని మా జీవితాలు మోడువారుతాయని తలిచావో ఏమో.. మమ్మల్ని ఉరితాడుకు బిగించి.. నువ్వూ ఉరేసుకుని తనువు చాలించావు.. ఆవేశంలో నీ కంటిపాపలమని మరిచావా అమ్మా? వింజమూరు: స్థానిక జైభీమ్ నగర్లో గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఓ వివాహిత తన ఇద్దరు పిల్లలతో సహా ఆత్మహత్య చేసకుంది. ఈ ఘటన వింజమూరులో సంచలనం సృష్టించింది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. జైభీమ్ నగర్‌కు సాదం వెంకట్రావు స్థానిక గ్యాస్ ఏజెన్సీలో గుమస్తాగా పనిచేస్తున్నాడు. ఆయనకు ఆత్మకూరు మండలం నాగులపాడుకు చెందిన గీత (31)తో 12 సంవత్సరాల క్రితం వివాహమైంది. వారికి కుమారుడు వెంకట్ (10), కుమార్తె చరిష్మ (5) ఉన్నారు. వెంకట్ గండిపాళెం గురుకుల పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్నాడు. కుమార్తె స్థానిక పాఠశాలలో చదువుతోంది. గీత తండ్రి మరణించాడు. తల్లి, ఇద్దరు అన్నలు, ఒక అక్క ఉన్నారు. కుటుంబసభ్యులు ప్రస్తుతం నెల్లూరులో స్థిరపడ్డారు. గీత గతంలో వింజమూరు పెట్రోలు బంకులో పనిచేసింది. ప్రస్తుతం రెడీమేడ్ దుస్తుల దుకాణంలో పనిచేస్తూ కుటుంబానికి చేదోడువాదోడు ఉంది. వెంకట్రావు గురువారం మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వచ్చేసరికి భార్య, ఇద్దరు పిల్లలు వరండాలో వేలాడుతుండడాన్ని చూసి వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. కలిగిరి సీఐ సాంబశివరావు, ఎస్సై జంపానికుమార్ ఘటనా స్థలానికి చేరుకుని విచారించారు. గీత ముందుగా కుమారుడు, కుమార్తెకు ఉరేసి తర్వాత తాను ఉరేసుకుని ఉంటుందని భావిస్తున్నారు. విషయం తెలుసుకున్న గీత తల్లి డోలా సరస్వతమ్మ ఘటనా స్థలానికి చేరుకుని కుమార్తె, ఆమె బిడ్డల మృతదేహాలను చూసి బోరున విలపించింది. అనంతరం వింజమూరు పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని అల్లుడి వేధింపుల వల్లే తన కుమార్తె బిడ్డలతో సహా ఆత్మహత్యకు పాల్పడిందని ఫిర్యాదు చేసింది. నాన్నా.. నేనేం పాపం చేశాను? నాన్నా.. మా బంగారు భవిష్యత్తుపై ఎన్నో కలలు కన్నావు.. నేను, తమ్ముడూ బాగా చదువుకోవాలనుకున్నావు.. మేమిద్దరం నువ్వే మా లోకమని జీవిస్తున్నాం.. చేయిపట్టి నడిపించాల్సిన నువ్వే నీ చేతులకు, నా చేతులకు తాడు కట్టి బావిలోకి దూకించావు.. నేనేం పాపం చేశాను.. నీ బిడ్డ ప్రాణం కూడా పోతుందని ఒక్క నిమిషం ఆలోచించలేకపోయావా నాన్నా? నెల్లూరు(క్రైమ్): భార్య ప్రవర్తన, బంధువుల వేధింపులే చావుకి కారణమని స్నేహితుడికి వాయిస్ మెసేజ్ పంపి ఓ తండ్రి తన కుమారుడితో కలిసి నేలబావిలో దూకి బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఘటన నెల్లూరు రూరల్ మండలం అంబాపురం గ్రామ పొలాల్లో గురువారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. అంబాపురం ఎల్బీఎస్ నగర్‌కు చెందిన కృష్ణస్వామి రంగస్వామి (45), విజయలక్ష్మి దంపతులకు సంజయ్‌కుమార్ (14), ప్రేమ్‌కుమార్ పిల్లలున్నారు. సంజయ్ 9వ తరగతి చదువుతున్నాడు. రంగస్వామికి అతని భార్యకు మధ్య కొంతకాలంగా తీవ్ర గొడవలు జరుగుతున్నాయి. ఇటీవల ఆమె ఎవరికీ చెప్పకుండా ఇంట్లోంచి వెళ్లిపోయింది. భర్త ఆమె కోసం గాలింపు చర్యలు చేపట్టాడు. ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు. ఈ నేపథ్యంలో రంగస్వామి, పెద్ద కుమారుడు సంజయ్‌కుమార్ వెనుక చేతులు కట్టుకుని ఊరికి సమీప పొల్లాలోని నేలబావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. స్థానిక వీఆర్వో బాలసర్వేశ్వరరావు వేదాయపాళెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇన్స్పెక్టర్ కె.నరసింహారావు తన సిబ్బందితో కలిసి స్థానికులు, అగ్నిమాపక సిబ్బంది సహాయంతో మృతదేహాలను వెలికితీయించారు. చనిపోయే ముందు రంగస్వామి ఆడియో మెసేజ్ రికార్డు చేసి తన స్నేహితుడు సెల్వమణికి పంపాడు. చావుకి కారణం తన వదిన, బావ, వాళ్లమ్మ కారణమని, వారి వల్లే కుటుంబంలో వివాదాలు తలెత్తాయని, భార్య తనను వదిలిపోయిందని అందులో పేర్కొన్నాడు. ఆడియో మెసేజ్ ఆధారంగా ఇన్స్పెక్టర్ కేసు నమోదు చేశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జీజీహెచ్‌కు తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
నెల్లూరులో శ్రీవారి వైభవోత్సవాలు
-
బెడిసికొట్టిన లింగమార్పిడి శస్త్రచికిత్స
నెల్లూరు (క్రైమ్)/జరుగుమల్లి: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కేంద్రం నెల్లూరులో ఇద్దరు బీ–ఫార్మసీ విద్యార్థులు వైద్యుల అవతారమెత్తారు. ఓ లాడ్జి గదిని ఆపరేషన్ థియేటర్‌గా చేసుకుని లింగమార్పిడి శస్త్రచికిత్స మొదలుపెట్టారు. ఈ క్రమంలో తీవ్ర రక్త స్రావమై పల్స్‌డౌన్ కావడంతో ఓ ట్రాన్స్జెం డర్ మృతి చెందాడు. ప్రకాశం జిల్లా జరుగు మల్లి మండలం కామేపల్లికి చెందిన బి.శ్రీకాంత్ అలియాస్ అమూల్య(28) చిన్న తనం నుంచే హైదరాబాద్‌లో తాపీపనికి వెళ్లే వాడు. అతడికి 2019లో మేనమామ కుమార్తె తో వివాహమైంది. వారు 2020లో విడాకులు తీసుకున్నారు. అప్పటినుంచి శ్రీకాంత్ ఒంగోలులో ఉంటున్నాడు. అక్కడే అతడికి విశాఖపట్నానికి చెందిన ట్రాన్స్ జెండర్ మోనాలిసా అలియాస్ జి.అశోక్‌తో పరిచయమైంది. ఇద్దరు స్నేహితులయ్యారు. వివిధ ప్రాంతాలకు తిరుగుతుండేవారు. ఆరునెలల కిందట శ్రీకాంత్‌కు సోషల్ మీడియా యాప్ ద్వారా నెల్లూరులోని ఓ ప్రైవేట్ కళాశాల బీ–ఫార్మసీ విద్యా ర్థులు ఎ.మస్తాన్, జీవాతో పరిచయమైంది. ఈ క్రమంలో శ్రీకాంత్ తాను ముంబై వెళ్లి లింగమార్పిడి శస్త్రచికిత్స చేయించుకుంటానని మస్తాన్‌కు చెప్పాడు. లిం గమార్పిడికి ముంబైలో రూ.లక్షలు ఖర్చ వుతుందని, తక్కువ ఖర్చుతో తానే చేస్తానని మస్తాన్ చెప్పాడు. దీంతో అందరూ కలసి ఈ నెల 23న నెల్లూరు గాంధీబొమ్మ సెంటర్లోని ఎస్ఎస్ లాడ్జిలో గదిని అద్దెకు తీసుకున్నారు. 24న మస్తాన్, జీవా.. మోనాలిసా సహాయం తో శ్రీకాంత్‌కు శస్త్రచికిత్స ప్రారంభించి మర్మాం గాన్ని తొలగించారు. దీంతో శ్రీకాంత్‌కు తీవ్ర రక్తస్రావమై, పల్స్ పడిపోయింది. మోతాదుకు మించి మందులు వాడటంతో కొద్దిసేపటికే శ్రీకాంత్ మృతిచెందాడు. ఈ విషయాన్ని గమనించిన లాడ్జి సిబ్బంది చిన్నబజారు పోలీ సులకు సమాచారమందించారు. మృతుడి వద్ద లభ్యమైన ఆధారాలతో అతడి సోదరి పల్లవికి పోలీసులు సమాచారం అందించి, మృత దేహాన్ని జీజీహెచ్ మార్చురీకి తరలిం చారు. నెల్లూరు చేరుకున్న పల్లవి దీనికి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని చిన్నబజారు పోలీసు లకు ఫిర్యాదు చేశారు. ఇప్పటికే పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారి స్తున్నట్లు సమాచారం. -
వామ్మో.. ఎంత చేపో..!!
సాక్షి, విడవలూరు: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా విడవలూరు మండలం పెదపాళెం పంచాయతీ పరిధిలోని వెంకటరెడ్డిపాళెంకు చెందిన మత్స్యకారుల వలకు బుధవారం 300 కేజీల భారీ బుల్ షార్క్ (సొర చేప) చిక్కింది. మత్స్యకారులు చుక్కా సుబ్రమణ్యం, ఎందేటి బ్రహ్మయ్య, పుల్లయ్య వెంకటరెడ్డిపాళెం సమీపంలోని సముద్రంలోకి వలను విసిరారు. భారీ బుల్ షార్క్ వలకు చిక్కడంతో దానిని బయటకు తీసేందుకు కష్టంగా మారింది. దీంతో స్థానికులతోపాటు 20 మంది మత్స్యకారులు ఆ చేపను బోటులో వెంకటరెడ్డిపాళెంకు తరలించారు. ఈ విషయాన్ని తెలుసుకున్న చెన్నై వ్యాపారస్తులు వచ్చి కేజీ రూ.150 చొప్పున రూ.45 వేలకు దానిని కొనుగోలు చేశారు. తామెప్పుడూ ఇంత పెద్ద చేపను చూడలేదని మత్స్యకారులే ఆశ్చర్యం వ్యక్తం చేశారు. భారీ ‘బుల్ షార్క్’ను చూసేందుకు స్థానికులు అమితాసక్తి చూపారు. (చదవండి: ఆ ఎమ్మెల్సీతో మాట్లాడితే రూ.10వేల జరిమానా) -
10 నుంచి రొట్టెల పండుగ
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: నెల్లూరు నగరంలోని ప్రసిద్ధ బారా షాహిద్ దర్గాలో ఈనెల 10వ తేదీ నుంచి 14వరకు రొట్టెల పండుగ జరుగనుంది. రాష్ట్ర పండుగ హోదా కలి్పంచిన నేపథ్యంలో అట్టహాసంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 10న షహదాత్‌తో ప్రారంభమయ్యే రొట్టెల పండుగ 14న ముగియనుంది. ఆంధ్రా నుంచే కాకుండా తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలతో పాటు సౌదీ దేశాల్లో ఉంటున్న ముస్లింలు తరలివస్తారు. ఏటా లక్షల సంఖ్యలో భక్తులు హాజరై వారి కోర్కెలకు అనుగుణంగా రొట్టెలు వదులుతారు. పది లక్షల మంది భక్తులకు సౌకర్యం కలి్పంచేలా ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రధానంగా బారా షాహిద్ ప్రాంగణాన్ని ముస్తాబు చేయడంతో పాటు కోర్కెల రొట్టెలు ఇచ్చే పవిత్ర స్వర్ణాల చెరువులో నీరు నిల్వ ఉండేలా చర్యలు తీసుకున్నారు. 11న గంధం మహోత్సవం.. రొట్టెల పండుగలో కీలకమైన గంధం మహోత్సవం ఈనెల 11వ తేదీన జరుగనుంది. 11న రాత్రి భారీ ఉరేగింపుగా గంధను దర్గాకు తీసుకొచ్చి బారా షాహిద్‌లకు సమరి్పస్తారు. కార్యక్రమంలో కడప పెద్ద దర్గా పీఠాధిపతి హజరత్ ఆరీపుల్లా హుస్సేని పాల్గొంటారు. 10వ తేదీన షహదాత్, 11న గంధ మహోత్సవం, 12న రొట్టెల పండుగ, 13న తహలీల్ ఫాతేహ, 14న ముగింపు సభ జరుగుతుంది. -
ఈ చిన్నారికి 15 వేళ్లే
సాక్షి, నెల్లూరు(పొగతోట): ఈ చిత్రంలో కనిపిస్తున్న చిన్నారికి కాళ్లు, చేతులకు కలిపి 15 వేళ్లు మాత్రమే ఉన్నాయి. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కలిగిరి మండలం జీర్రావారిపాలెంకు చెందిన పి.సురేష్, సునీత దంపతులు వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. వారికి ఐదు సంవత్సరాల క్రితం ప్రభుకుమార్ జన్మించాడు. పుట్టుకతోనే అతని కుడి చేతికి రెండు వేళ్లు, ఒక్కో కాలికి నాలుగేసి వేళ్లు మాత్రమే ఉన్నాయి. ప్రస్తుతం బాలుడు రెండో తరగతి చదువుతున్నాడు. ప్రభుకు దివ్యాంగుల పింఛన్ కోసం తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లారు. అయితే రేషన్‌కార్డు లేకపోవడంతో ముందుగా దాని కోసం దరఖాస్తు చేశారు. అయితే అధికారుల నుంచి స్పందనలేదు. దీంతో సునీత మంగళవారం ప్రభుకుమార్తో కలెక్టరేట్‌కు వచ్చి అధికారులను వేడుకుంది. రేషన్‌కార్డు ఉంటేనే పింఛన్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు వీలువుతుందని త్వరగా స్పందించాలని కోరుతోంది. -
కలసిరండి బాబూ!
ప్రజా సంకల్ప యాత్ర నుంచిసాక్షి ప్రత్యేక ప్రతినిధి : ఎంపీల రాజీనామాల నిర్ణయంతో ప్రత్యేక హోదా ఉద్యమాన్ని మరో దశకు తీసుకువెళ్లిన వైఎస్సార్సీపీ అధినేత, ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారంనాడు ముఖ్యమంత్రి చంద్రబాబుకు మరో సంచలన సవాల్ విసిరారు. ‘మా ఎంపీలు రాజీనామా చేస్తున్నారు వారితోపాటు మీ ఎంపీల చేత కూడా రాజీనామా చేయించండి’ అని పిలుపునిచ్చారు. ఐదుకోట్ల మంది ఆంధ్రుల ఆకాంక్ష అయిన ప్రత్యేక హోదా కోసం వైఎస్ జగన్ మొదటి నుంచీ అనేక రూపాలలో పోరాడుతున్న సంగతి తెల్సిందే. శ్రీపొట్టి శ్రీరాములునెల్లూరు జిల్లాలో ప్రజా సంకల్ప పాదయాత్రలో ఉన్న జగన్ గురువారం ఉదయగిరి నియోజకవర్గంలోని రేణమాలలో జరిగిన మహిళల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఒక విద్యార్ధిని అడిగిన ప్రశ్నకు జవాబిస్తూ జగన్ పై విధంగా పిలుపునిచ్చారు. ప్రత్యేక హోదా సాధన కోసం కృషి చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో కలసి నడిచేందుకు తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉందా? అని ప్రశ్నించారు. ప్రత్యేకహోదా ఆంధ్రప్రదేశ్‌కు ఊపిరి వంటిదని, దానిని సాధించే వరకు తమ పోరాటం ఆగదని జగన్ స్పష్టం చేశారు. రాజీనామాలు చేద్దాం రండి.. ‘చంద్రబాబు గారూ, మిమ్మల్ని ఒక్కటే అడుగుతున్నా. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలతో పాటు తెలుగుదేశం పార్టీ ఎంపీలందరూ.. ఏపీకి చెందిన మొత్తం 25 మంది ఎంపీలూ మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తే అçప్పుడు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా కేంద్రం ఎక్కడకు పోతుందో చూద్దాం’ అని జగన్ వ్యాఖ్యానించారు. ‘ఇప్పటికైనా మీరు ప్రత్యేక ప్యాకేజీ అన్న దానిని పక్కనపెట్టండి. మోసపూరిత ప్యాకేజీ కోసమో.. అర్ధ రూపాయి, రూపాయి తగ్గింది, ఇవ్వండి అని అడగడం కోసమో ప్రయత్నాలు మాని ప్రత్యేక హోదా సాధించడం కోసం ముందుకు రండి’ అని చంద్రబాబుకు ఆయన పిలుపునిచ్చారు. ‘ఈ వేళ మీ నోటి వెంట వచ్చిన మాటలతోనైనా చంద్రబాబును గట్టిగా డిమాండ్ చేస్తూ అడుగుతున్నాను. మీ అందరి తరఫున అడుగుతున్నా. ఇప్పటికైనా ఆయనకు జ్ఞానోదయం అవుతుందేమో..కాస్తోకూస్తో ముందుకొస్తారేమో ఆశిద్దాం’ అని సమ్మేళనానికి హాజరైన మహిళలతో జగన్ పేర్కొన్నారు. ప్యాకేజీ కోసం హోదాను అమ్మేస్తారా..? రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తేనే పరిశ్రమలు వస్తాయని, యువతకు ఉద్యోగాలు వస్తాయని జగన్ స్పష్టం చేశారు. హోదా అన్నది బిక్షం వేసినట్టు ఇచ్చేది కాదని.. ఆ రోజు పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీ అని, హోదా ఇస్తామన్న హామీతోనే రాష్ట్రాన్ని విడగొట్టారని గుర్తు చేశారు. ‘విభజన చట్టం చేసే రోజు పార్లమెంట్లో వెంకయ్యనాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలో కొత్త ఫ్యాక్టరీ పెట్టడానికే మూడేళ్లు పడుతుందని.. హోదా ఐదేళ్లు ఏమి సరిపోతుంది, పదేళ్లు కావాలని అడిగారు. చంద్రబాబు కూడా హోదా ఐదేళ్లు, పదేళ్లు కాదు 15 ఏళ్లు కావాలని అడిగారు.. హోదా సంజీవని అని ఆరోజు చెప్పారు. ఇవాళ మాత్రం చంద్రబాబు ప్యాకేజీ కోసం, లంచాలు, కమీషన్లు తీసుకోవడం కోసం హోదాను పూర్తిగా అమ్మేసిన పరిస్థితి కనిపిస్తోంది’ అని జగన్ దుయ్యబట్టారు. ‘అందుకే హోదా మన హక్కు ప్యాకేజీ కోసం మోసం చేయొద్దు చంద్రబాబూ అని గట్టిగా నినాదమిచ్చాం. హోదా మా హక్కు ప్యాకేజీ మాకొద్దు అన్న నినాదంతోనే పోరాటం చేస్తాం. ఆ పోరాటంలో భాగంగానే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల చివరి రోజు వరకు హోదా కోసం వీరోచితంగా పోరాటం చేస్తారు. వైఎస్సార్సీపీకి చెందిన ప్రతి ఒక్కరూ రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద మార్చి 1న ధర్నా నిర్వహిస్తారు. మార్చి 3న పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీనియర్లు నేను పాదయాత్ర చేస్తున్న ప్రదేశానికి వస్తారు. అక్కడి నుంచి నేను వారందరినీ జెండా ఊపి ఢిల్లీకి పంపుతాను.’ అని జగన్ వివరించారు. ‘పార్టీ నేతలంతా మార్చి 5న పార్లమెంటు వద్ద ధర్నా చేస్తారు. ఆ తర్వాత మార్చి 5 నుంచి ఏప్రిల్ 6 వరకూ పార్లమెంటులో మన ఎంపీలు హోదా కోసం పోరాటం చేస్తారు. ఫలితం లేకపోతే పార్లమెంటు సమావేశాల చివరి రోజైన ఏప్రిల్ 6న లోక్‌సభ స్థానాలకు రాజీనామా చేసి ఆ రాజీనామాలను వారి మొఖాన కొట్టి మన రాష్టానికి తిరిగి వస్తారు’ అని జగన్ స్పష్టంచేశారు. రాష్ట్రమంతటా టీడీపీ నేతల దాష్టీకాలే మహిళా సదస్సులో ప్రతిపక్ష నేత జగన్ ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: రాష్ట్రంలో నాలుగేళ్లుగా మహిళలకు భద్రత లేకుండా పోయిందని ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అండతో టీడీపీ నేతల అరాచకాలకు అడ్డే లేకుండా పోయిందని మండిపడ్డారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా గురువారం 88వ రోజు శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలోని రెణమాలలో మహిళల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన ప్రసంగించారు. పెందుర్తిలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అండదండలతో ఆయన అనుచరులు దళిత మహిళ బట్టలు ఊడదీయించి కొట్టి.. భూములు లాక్కోవడం దారుణం అన్నారు. అలాంటి వారిపై కూడా కేసులు పెట్టని పరిస్థితిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పోరాడాల్సి వచ్చిందన్నారు. రోజా అక్కడికి వెళ్లి ధర్నా చేస్తే తప్ప కేసులు నమోదు కాని పరిస్థితి అన్నారు. పెందుర్తితో పాటు చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో కూడా ఒక అక్కను బట్టలు ఊడతీసి, దారుణంగా కొట్టి, అది సోషల్ మీడియాలో చూపించే అన్యాయమైన పరిస్థితి ఈ రాష్ట్రంలో ప్రజలు చూస్తున్నారన్నారు. ఇసుక దోపిడీని అడ్డుకున్న మహిళా ఎమ్మారో వనజాక్షిని టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని జుట్టుపట్టుకొని ఈడ్చినప్పుడు ఆయనపై కఠినంగా చర్యలు తీసుకొని ఉంటే ఈ పరిస్థితులు ఏర్పడేవే కావన్నారు. ఆ పెద్దమనిషి (చంద్రబాబు) ఆ ఎమ్మెల్యేను ఆనాడు జైలులో పెట్టేందుకు ధైర్యం చేయకపోవడం వల్లే ఈ రోజు రాష్ట్రంలో మరే మహిళకూ రక్షణలేని పరిస్థితి నెలకొందని నిప్పులు చెరిగారు. -
77వ రోజు మొదలైన వైఎస్ జగన్ పాదయాత్ర
సాక్షి, నెల్లూరు : వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. గురువారం ఉదయం సర్వేపల్లి నియోజకవర్గం, పొదలకూరు శివారు నుంచి వైఎస్ జగన్ 77వరోజు ప్రజాసంకల్పయాత్రను ప్రారంభించారు. అక్కడ నుంచి తోడేరు క్రాస్ రోడ్డు మీదుగా ఉప్పుటూరు క్రాస్ రోడ్డు చేరుకుంటారు. అనంతరం అక్కడ నుంచి చాటగట్ల చేరుకొని పార్టీ జెండా ఆవిష్కరిస్తారు. ఆతర్వాత మరుపూరు వద్ద ప్రజాసంకల్పయాత్ర ముగియనుంది. పాదయాత్రలో భాగంగా ఇప్పటిదాకా వైఎస్ జగన్ 1034.3 కిలోమీటర్లు నడిచిన విషయం తెలిసిందే. -
76వ రోజు పాదయాత్ర ప్రారంభం
సాక్షి, నెల్లూరు: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. సైదాపురం మండలం తలుపూరు నుంచి బుధవారం ఉదయం 76వ రోజు పాదయాత్రను జగన్ మొదలుపెట్టారు. ఆయన వెంట నడిచేందుకు వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. వారందరితో కలిసి జననేత ముందుకు సాగుతున్నారు. ప్రజల సమస్యలు, కష్టాలు తెలుసుకుంటూ పాదయాత్ర సాగిస్తున్నారు. సర్వేపల్లి నియోజకవర్గం పొదలకూరు మండలంలోని మలిచేడు క్రాస్, డేగపూడి, ఇనుకుర్తి, మర్రిపల్లి మీదగా పొదలకూరు వరకూ ఈ రోజు పాదయాత్ర కొనసాగిస్తారు. పొదలకూరు సెంటర్లో బహిరంగ సభలో వైఎస్ జగన్ పాల్గొంటారు. -
70వ రోజు పాదయాత్ర డైరీ
-
70వ రోజు పాదయాత్ర డైరీ
ఉదయం శిరసనంబేడు దాటి కాస్త ముందుకెళ్లగానే.. నడవలేక నడవలేక నాకేసి వస్తున్న ఓ అవ్వ కనిపించింది. నడుం పూర్తిగా వంగిపోయి, చేతికర్ర సాయంతో ఎంతో కష్టంగా వచ్చిన ఆ అవ్వను చూడగానే కదిలిపోయాను. ఆ అవ్వ నావద్దకు వచ్చి నా చెంపను తడిమింది. ఏం కావాలవ్వా.. అని అడిగాను. ‘నాకేమీ వద్దు నాయనా.. నువ్వు ముఖ్యమంత్రివై మా ఊరికి రావాలి.. అదే చాలు’ అని దీవించింది. ‘నీలో నాన్నను చూసుకుంటున్నానయ్యా’ అంటూ ఎంతో మురిసిపోయింది. 80 ఏళ్లు పైబడిన ఆ అవ్వ చూపించిన ఆప్యాయతకు, ప్రేమకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలను.? చావలి దాటాక, హైవేపై నడుస్తున్నప్పుడు.. దారి పక్కనే చాలా ఇటుక బట్టీలు కనిపించాయి. చాలామంది కూలీలు, మహిళలు నన్ను చూడాలని పరుగు పరుగున వచ్చారు. వారితోపాటు చిన్నచిన్న పిల్లలు కూడా పరుగులెడుతూ ఆతృతగా వచ్చి నన్ను కలిశారు. ఆ పిల్లలంతా మట్టికొట్టుకుని ఉన్నారు. తలలు మాసిపోయాయి. బట్టలు మాసిన చిరుగుపాతలు. ఆ పిల్లలను దగ్గరకు తీసుకుని వారి చేతులు తడిమాను. ఆ అరచేతులు కాయలు కాసి ఉన్నాయి. ఏమైందమ్మా.. అని వారి తల్లులను అడిగాను. ఆ పిల్లలు కూడా ఇటుక బట్టీలలో పనిచేస్తున్నారట. పలకాబలపం పట్టాల్సిన చిట్టిచేతులు మట్టితట్టలు మోయాల్సి వస్తో్తందని తెలిసి కలతచెందాను. ఆటపాటలతో, చదువులతో వెల్లివిరియాల్సిన బాల్యం ఇటుక బట్టీలలో వాడిపోతోందని తెలిసి చాలా బాధపడ్డాను. పిల్లలను బడులకు పంపించాలమ్మా.. అని అనగానే.. ‘తినడానికే లేదు. ఇక చదువులెక్కడ సార్.. మాకూ చదివించుకోవాలనే ఉంది. కానీ బడికెట్లా పంపం?’ అన్నారు. ఇలాంటి తల్లుల కోసమే నవరత్నాలలో పొందుపర్చిన అమ్మఒడి పథకం గురించి వివరించాను. పిల్లలను బడికి పంపితే ఆ తల్లులకు సంవత్సరానికి రూ.15,000 ఇస్తానని చెప్పాను. అది విన్నాక తమ పిల్లల్ని ఇబ్బందుల్లేకుండా బాగా చదివించుకునే రోజులు రానున్నాయన్న ఆనందం వారిలో కనిపించింది. ఆ పిల్లలను పెద్ద చదువులు చదివించి, గొప్ప స్థానాల్లో చూడాలన్న నా ఆశయాన్ని తెలియజేసినప్పుడు ఆ తల్లుల ముఖాల్లో సంతోషం వెల్లివిరిసింది. భోజన విరామానికి ముందు ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య ప్రతినిధులు కలిశారు. చంద్రబాబు వారినెలా మోసం చేశాడో చెప్పారు. నాన్నగారి హయాంలో 13 వేల దేవాలయాలకు ధూప దీప నైవేద్యాల కింద రూ.2,500 ఇచ్చేవారు. బాబుగారు ఆ దేవాలయాల సంఖ్యను మూడు వేలకు కుదించివేశాడు. ఎన్నికలప్పుడు ఓట్లకోసం.. బ్రాహ్మణ కార్పొరేషన్‌ను ఏర్పాటుచేసి రూ.500 కోట్లు ఇస్తామని హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చాక ఆ కార్పొరేషన్‌కు ఇస్తానన్న నిధులు ఇవ్వకపోగా, అన్యాయాన్ని ప్రశ్నించిన సదరు కార్పొరేషన్ చైర్మన్‌ను రాత్రికిరాత్రి అవమానకరంగా తొలగించి, కార్పొరేషన్‌ను చంద్రబాబు నిర్వీర్యం చేశారని వాపోయారు. మంచి పథకాలకు తూట్లు పొడవడం, అబద్ధపు హామీలతో నెట్టుకురావడం బాబుగారికి ఉగ్గుపాలతో పెట్టిన విద్యమరి. ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. ఎన్నికలకు ముందు ఓట్లకోసం అన్ని కులాలకూ తాయిలాలు ప్రకటించి, బూటకపు హామీలిచ్చి, అవసరం తీరాక వాటిని తీర్చకపోగా.. ప్రశ్నించిన కుల సంఘాలను బెదిరించడాన్ని ఏమనుకోవాలి? అది దేనికి సంకేతం? అదే మీ నైజమా? -
69వ రోజు పాదయాత్ర డైరీ
69వ రోజు 23–01–2018, మంగళవారం చెన్నప్పనాయుడుపేట, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా గత 68 రోజులుగా వైఎస్సార్, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో జరిగిన ప్రజా సంకల్ప యాత్ర నేటితో సింహపురికి చేరింది. దశాబ్దాలుగా కరువుకాటకాలతో సతమతమవుతున్న ఈ 4 జిల్లాల్లోని ప్రజలు ఎన్నో సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. కరువుకాటకాల సమస్యలు ప్రకృతిపరమైనవైతే, తీర్చగలిగే అవకాశం ఉండీ.. పాలకులు పట్టించుకోని సమస్యలు చాలా ఉన్నాయి. ఇవన్నీ ఒక ఎత్తయితే, పాలకులే సృష్టించిన సమస్యలు మరెన్నో. పేదరికంతో, సమస్యలతో నిత్యం జీవన పోరాటం చేస్తున్న ఈ ప్రజలకు అండగా ఉండి, రక్షించాల్సిన ప్రభుత్వమే సమస్యగా మారితే.. పాలించే వారే సమస్యలు సృష్టించి పీడిస్తూ ఉంటే.. ప్రజలెలా బతకాలి? ఎవరితో చెప్పుకోవాలి? ఉదయం 10.05 గంటలకు శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో అడుగుపెట్టాను. ఈ జిల్లాలో మహి ళా చైతన్యం బాగా ఎక్కువంటారు. మొట్టమొదటిగా మద్య నిషేధ ఉద్య మాన్ని ప్రారంభించింది ఈ జిల్లా అక్కచెల్లెమ్మలే. అటువంటి ఈ జిల్లాలో అపూర్వ స్వాగతం లభించింది. చెంబేడు గ్రామంలో హైస్కూలు విద్యార్థినులు.. వారు చదువుతున్న ప్రభుత్వ పాఠశాల స్థితిగతుల గురించి ఏకరువు పెట్టారు. తొమ్మిదో తరగతి చదువుతున్న పూర్ణిమ అనే అమ్మాయి ‘అన్నా.. మా ఊరికి బస్సు సౌకర్యం సరిగా లేదు. మాతో పాటు బడికి రావడానికి టీచర్లు కూడా ఇబ్బందిపడుతున్నారు. రాత్రి పూట స్పెషల్ క్లాసెస్‌కు వెళ్లాలంటే భయమేస్తోంది. వీధి దీపాల్లేవు, దారి కూడా సరిగా లేదు. తాగుబోతు యువకులు అమ్మాయిలను వేధిస్తున్నారు. స్కూల్లో టాయిలెట్ల నిర్వహణ ఘోరంగా ఉంది. మధ్యాహ్న భోజనం చాలా అధ్వానం. మాకు చదువుకోవాలని ఎంతగా ఉన్నా.. ఈ సమస్యలతో బడి మానేసే పరిస్థితులు వస్తున్నాయి. అలా కొంతమంది అమ్మాయిలు బడి మానేశారు కూడా. మేమంతా పేద పిల్లలం. మా అమ్మానాన్నలు మమ్మల్ని ప్రయివేటు పాఠశాలల్లో చేర్పించలేరు’ అంటూ ఆ బంగారు తల్లి చెబుతుంటే.. మనసులో ఓ వైపు బాధేసింది. మరో వైపు ఆ చిట్టితల్లి చైతన్యానికి ముచ్చటేసింది. విద్యార్థినులలోని ఇలాంటి ధైర్యం, చైతన్యం స్ఫూర్తిదాయకం. అదే గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చెందిన ఆశా వర్కర్లు కలిశారు. ‘సార్.. తల్లీబిడ్డల సంరక్షణ నుంచి, ప్రజా రోగ్యానికి చెందిన ప్రతి కార్యక్రమంలో పాల్గొంటూ విధులు నిర్వర్తిస్తు న్నాం. ఇంత చాకిరీ చేస్తున్నా.. నెలకు రూ.500 నుంచి 700 కూడా రావడం లేదు. అది కూడా మూడు, నాలుగు నెలలకోసారి ఇస్తున్నారు. పొరుగు రాష్ట్రాల్లో నెలకు రూ.6000 దాకా ఇస్తున్నారు. మాకన్నా రోజు కూలీలే నయం’ అంటూ ఆవేదన చెందారు. ఈ రోజు కలిసిన 108, 104 ఉద్యో గులదీ ఇదే సమస్య. వారి సమస్యలను ఎన్నిసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదట. ప్రభుత్వ విద్యను, ప్రజారోగ్యాన్ని గాలికొదిలేసి, ప్రయివేటు సంస్థలకు కొమ్ముకాస్తున్న ఈ ప్రభుత్వాన్ని న్యాయం చేయాలని కోరడం కూడా అత్యాశే అవుతుంది. రాబోయే రోజు ల్లో వారి జీతాలు, జీవితాలను మెరుగుపర్చడమే కాకుండా, నాన్నగారు ఏ మహదాశయంతో 104, 108 వ్యవస్థలను ఏర్పాటుచేశారో.. దాన్ని మరిం త మెరుగ్గా కొనసాగిస్తానని భరోసా ఇస్తూ ముందుకు కదిలాను. అంత ర్జాతీయంగా పేరొందిన షార్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం, పులికాట్ సరస్సు, నేలపట్టు పక్షుల విడిది కేంద్రాలున్న çసూళ్లూరుపేట నియోజక వర్గంలో మొదటి రోజు పాదయాత్ర అలా సాగింది. సీఎంగారికి నాదో ప్రశ్న.. మీ 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఈ నాలుగు సంవత్సరాలు చాలా సంతృప్తినిచ్చాయని చెప్పుకొంటున్నారు. ప్రజలేమో.. ఈ నాలుగేళ్ల నుంచి అత్యంత దుర్భర జీవితం గడుపుతున్నామంటున్నారు. ప్రజలు ఇంత తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేస్తుంటే.. మీకు సంతృప్తి ఎలా వచ్చింది? -
ఒక్క బల్బుకు రూ.8.73 లక్షల బిల్లు
తోటపల్లిగూడూరు (సర్వేపల్లి): ఒక్క బల్బుకు కరెంటు వాడితే బిల్లు ఎంతో తెలుసా.. అక్షరాలా రూ.8.73 లక్షలు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఈ బిల్లు అందుకున్న వినియోగదారుడు షాక్‌కు గురయ్యాడు. ఈ బిల్లు చూపించి అధికారుల్ని అడిగితే.. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసుకోమని సలహా ఇచ్చారు. దీంతో వినియోగదారుడికి దిక్కుతోచడంలేదు. తోటపల్లిగూడూరు మండలం నరుకూరు తొట్టి ప్రాంతానికి చెందిన వేగూరు రవీంద్ర పక్కాగృహం నిర్మించుకుంటున్నాడు. మూడు నెలల కిందట ఆ ఇంటికి కొత్త మీటర్ బిగించుకుని, ఒక బల్బు వినియోగిస్తున్నాడు. దీనికి జనవరిలో రూ.85, ఫిబ్రవరిలో రూ.87 బిల్లులొచ్చాయి. ఫిబ్రవరిలో వాడకానికి సంబంధించి ఈనెలలో ఇచ్చిన బిల్లు మాత్రం లక్షలైంది. 1,26,517 యూనిట్లు వాడినట్లుగా లెక్కలు వేసి రూ.8,73,696 బిల్లును ట్రాన్స్‌కో అధికారులు వినియోగదారుడికి అందించారు. ఈ బిల్లు చూసి కంగుతిన్న బాధితుడు స్థానిక ట్రాన్స్‌కో అధికారులతో తన గోడును వెళ్లబోసుకుంటే తామేమీ చేయలేమని, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసుకోవాలని సూచించారు. దీంతో బాధితుడు గొల్లుమంటున్నాడు. -
ఇది ఆమె జీవనచిత్రం
కొన్నేళ్ల కిందటి వరకు ఆమె సాధారణ గృహిణి. భర్త... కూతురితో అందంగా అల్లుకున్న పొదరిల్లు ఆమెది. ఓ రోజు... ఊహించని ప్రమాదం. బస్సు తాకిడికి కింద పడిపోయారామె. బస్సు చక్రం ఆమె చేతి మీద నుంచి వెళ్లిపోయింది. తాను కోల్పోయింది చేతినా... జీవితాన్నా? ఈ ప్రశ్నకు తనకు తానే సమాధానం చెప్పుకున్నారామె. ఇప్పుడామె... ఒక చేత్తోనే బొమ్మలు వేస్తున్నారు. చిన్న పిల్లలకు బొమ్మలు వేయడం నేర్పిస్తున్నారు. గాంధీజీ ఆశయాలను బోధిస్తున్నారు. జీవితాన్ని జయించడం ఇలా... అంటున్నారు. తన జీవితాన్ని కొత్తగా చిత్రించుకున్నారు. గూడూరు లక్ష్మిది శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా. జిల్లా కేంద్రం నెల్లూరులోని పొగతోటలో ఆమె నివాసం. లక్ష్మి తాత రావూరు జయరామిరెడ్డి సినీ నటుడు. విజయ వాహిని స్టూడియోలో పనిచేసేవారు. ఆమె పుట్టే నాటికి చెన్నై నగరంలో ఉన్న వారి కుటుంబం తండ్రికి లైబ్రేరియన్‌గా ఉద్యోగం రావడంతో నెల్లూరు జిల్లా వాకాడుకు మారింది. పెద్దయిన తర్వాత లక్ష్మణ్‌కుమార్‌తో వివాహమైంది. ఇంత వరకు ఎటువంటి ప్రత్యేకతలూ లేకుండానే చాలా సాధారణంగా గడిచిపోయింది ఆమె జీవితం. పెళ్లయిన ఏడేళ్ల వరకు వైవాహిక జీవితం అన్యోన్యంగా సాగిపోయింది. ఓ రోజు బంధువుల పెళ్లికి భర్తతోపాటు బైక్ మీద వెళ్తున్నారామె. ఇంతలో... వెనుక నుంచి బస్సు వచ్చి ఢీకొట్టింది. తేరుకుని చూస్తే ఎడమ చెయ్యి రెండుగా తెగిపోయి దూరంగా పడి ఉంది. ఆ చేతిని అతికించడం అసాధ్యమన్నారు డాక్టర్లు. ఆ పరిస్థితిలో భర్త, కుటుంబసభ్యులందరూ ఆమెకి ధైర్యం చెప్పారు. కానీ ఆమెని ఆవరించిన దిగులు మాత్రం వదల్లేదు. తాను కొలిచే దేవుడే పలికించినట్లు... ప్రమాదం గురించి తెలిసిన బంధువుల్లో ఒక్కొక్కరు ఒక్కోరోజు వచ్చి పలకరించి పోతున్నారు. ఎవరికి తోచినట్లు వాళ్లు జీవితం పట్ల నిరాశ చెందవద్దని ధైర్యం చెప్పి పోతున్నారు. అలాంటప్పుడు కూతురు లాస్య అన్న మాటలే తనకు మార్గదర్శనం చేశాయంటారు లక్ష్మి. బంధువుల్లో ఒకామె... ‘‘లాస్యా... మీ అమ్మకి చేయి లేదు కదా. తనేమీ చేసుకోలేదు. నువ్వు సాయం చేస్తుండాలి’’ అన్నారు. వెంటనే లాస్య... ఉక్రోషంతో ‘‘మా అమ్మ ఒక్క చేత్తోనే అన్ని పనులూ చక్కగా చేస్తోంది. ఒకచెయ్యి లేకపోతేనేం మరో చెయ్యి ఉందిగా. ఎవ్వరూ మా అమ్మకు చెయ్యి లేదనవద్దు’’ అన్నది. ఆరేళ్ల లాస్యకు ఏం తెలిసి అన్నదో కానీ ఆ మాటలే తనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచాయంటారు లక్ష్మి. ‘‘బహుశా నేను పూజించే దేవుడే పాప చేత ఆ మాటలు పలికించాడేమో అనిపిస్తుంది. ఆ తర్వాత నేను ఏ రోజూ నాకు చెయ్యి లేదనుకోలేదు. ఉన్న చేత్తోనే ఏమేం చేయవచ్చో అన్నీ చేస్తున్నాను. అప్పటికే నాకు చిత్రలేఖనంలో ప్రవేశం ఉంది. కుట్లు, అల్లికలు బాగా చేసేదాన్ని. ప్రమాదం తర్వాత చిత్రలేఖనంలో మళ్లీ శిక్షణ తీసుకున్నాను. ఇప్పుడు గ్లాస్ పెయింటింగ్స్, తంజావూరు పెయింటింగ్స్, పాట్ పెయింటింగ్... అనేక రకాల చిత్రలేఖనాలు వేస్తున్నాను. నాలో ఉన్న కళకు మెరుగులు దిద్దుకోకుండా ఇంటికే పరిమితమవుతున్నానని ఆ దేవుడే ఇలా చేశాడేమో అనుకుంటున్నాను’’ అని స్థితప్రజ్ఞతతో అన్నారామె. గాంధీజీ స్ఫూర్తితో... లక్ష్మి వేసిన బొమ్మలలో గాంధీజీ ఎక్కువగా కనిపిస్తారు. అలాగే ఆమె ఆసక్తి ఉన్న చిన్న పిల్లలకు చిత్రలేఖనంలో ఉచితంగా శిక్షణనిస్తుంటారు. పిల్లలకు గాంధీజీ ఆశయాలను బోధిస్తుంటారు. గాంధీ ఆశ్రమ నిర్వహణ బాధ్యతల్లో చురుగ్గా పాల్గొంటారు. అదే విషయాలను ప్రస్తావించినప్పుడు... ఆమె బాల్యంలో జరిగిన సంఘటలను గుర్తు చేసుకున్నారు. ‘‘నాకు మా తాత దగ్గర పెరగడం ఇష్టం. ఆయనతో సినిమా షూటింగులకు వెళ్లడం ఇష్టం. అలా తరచూ మద్రాసు (చెన్నై)కు వెళ్లేదాన్ని. ఒకసారి... అవి ‘యమగోల’ షూటింగ్ జరుగుతున్న రోజులు. తాతతోపాటు స్టూడియోకి వెళ్లాను. నటుడు కైకాల సత్యనారాయణగారు కనిపించారు. దగ్గరకు వెళ్లి పలకరించాను. అప్పుడాయన ‘‘పరిచయం లేకపోయినా సరే చూడగానే గుర్తు పట్టి వచ్చి పలకరించావు. నీలో మంచి విల్‌పవర్, ఆత్మవిశ్వాసం ఉన్నాయి. నువ్వేమైనా సాధించగలవు’’ అని మెచ్చుకున్నారు. అప్పుడే ఆయన గాంధీజీ గురించి చాలా చెప్పారు. అలా గాంధీజీ గురించి చదవడం అలవాటైంది. ఆ తర్వాత బొమ్మలు వేయడం కూడా. ఒకసారి పల్లెపాడు గ్రామం (నెల్లూరు జిల్లా)లో ఉన్న గాంధీజీ ఆశ్రమం నుంచి నాకు పిలుపు వచ్చింది. నేను ఆశ్రమ నిర్వహణ బాధ్యత తీసుకోవడానికి సంతోషంగా అంగీకరించాను’’ అన్నారు. చేతిరాత బాగుంటే... గాంధీ ఆశ్రమంలోని పిల్లలకు చిత్రలేఖనం నేర్పించడానికి మరో కారణాన్ని చెప్తారు లక్ష్మి. గాంధీజీ తరచుగా ‘చేతిరాత బాగాలేకపోతే తల రాత బాగుండదనేవారు’ పిల్లల చేతిరాత బాగుపడాలంటే చిత్రలేఖనం మంచి మార్గం- అనుకున్నాననంటారు. రక్తదానం ఎన్నిసార్లు చేశారంటే ఆమె నుంచి ఇన్నిసార్లనే సమాధానం రాదు. ఎన్నిసార్లు చేశానో లెక్కపెట్టుకోలేదు. రాష్ట్ర గవర్నర్ చేతుల మీదుగా ‘ఉత్తమ సేవా ప్రతినిధి అవార్డు’ అందుకున్నారామె. గాంధీ ఆశ్రమ నిర్వహణలో భాగంగా చాలా సందర్భాల్లో ఆమె చేతి నుంచి డబ్బు ఖర్చవుతూ ఉంటుంది. ఒకసారి లక్ష్మి అల్లుడు (లాస్య భర్త) లక్షన్నర రూపాయల వరకు సహాయం చేశారు. ‘‘ఆ సంఘటనతో నా కుటుంబం నాకే కాక, నా ఆశయానికి కూడా అండగా ఉందనిపించి చాలా సంతోషం కలిగింది’’ అన్నారామె. లక్ష్మి తన జీవితాన్ని పలువురికి స్ఫూర్తిదాయకంగా మలుచుకున్నారు. నెల్లూరు నగరంలో ఏటా ఇస్కాన్ ఆధ్వర్యంలో రథయాత్ర జరుగుతుంది. ఆ రథం మీద శంకుచక్రాలు, హనుమంతుడు, గోవిందనామాలతోపాటు, ఇస్కాన్ మందిరంలో పరదాల మీద చిత్రాలు కూడా లక్ష్మి వేసినవే. ఎవరి జీవితంలోనైనా ప్రమాదం జరిగితే అది వారి జీవితాన్ని అనూహ్యమైన మలుపులు తిప్పుతుంది. చాలా మంది ప్రమాదం తర్వాత ఆ దిగులుతో ఇంటి నాలుగ్గోడలకే పరిమితమవుతుంటారు. కానీ లక్ష్మి మాత్రం ఆత్మవిశ్వాసంతో జీవితాన్ని చక్కటి మలుపులు తిప్పుకున్నారు. - సాక్షి, నెల్లూరుఫొటోలు : ఆవుల కమలాకర్ నటులు సత్యనారాయణగారు మనందరం ఆ జాతిపిత అడుగుజాడల్లో నడవాలన్నారు. ఆ మాటలు నాలో చాలా ప్రభావం చూపించాయి. నాన్న లైబ్రేరియన్ కావడంతో పుస్తకాలు చదివే అవకాశం ఉండేది. గాంధీజీ పుస్తకాలే ఎక్కువగా చదివేదాన్ని. చిత్రలేఖనంలోనూ ఎక్కువ గాంధీజీ బొమ్మలే వేస్తున్నాను. బాపూజీ బొమ్మ వేయడం నాకిష్టం. - లక్ష్మి, విధిని జయించిన మహిళ -
'నెల్లూరు జడ్పీ పీఠం మాదే'
జిల్లా జడ్పీ ఛైర్మన్ ఎన్నికకు ప్రతిసారి అడ్డంకులు సృష్టించాలని అధికార టీడీపీ ప్రయత్నిస్తుందని నెల్లూరు లోక్‌సభ సభ్యుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి ఆరోపించారు. తమ పార్టీ జడ్పీటీసీలను ప్రలోభపెట్టేందుకు అధికార పార్టీ నేతలు ఇప్పటికీ ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. ఎవరు ఎన్నిక ప్రయత్నాలు చేసిన నెల్లూరు జడ్పీ ఛైర్మన్ పీఠం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే కైవసం చేసుకుంటుందని తెలిపారు. తమ పార్టీ జడ్పీటీసీ సభ్యులను ఎత్తుకెళ్లడానికే పోలీసులు కాపలాకాస్తున్నట్లుందని జడ్పీ ఛైర్మన్ ఎన్నికల నేపథ్యంలో పోలీసుల అనుసరిస్తున్న వ్యవహారశైలిని మేకపాటి ఎద్దేవా చేశారు. ఆదివారం జడ్పీ ఛైర్మన్ ఎన్నిక నేడు జరగనున్న నేపథ్యంలో జడ్పీ సమావేశ మందిరానికి మేకపాటితోపాటు ఆ పార్టీ జడ్పీ ఛైర్మన్ అభ్యర్థి బి.రాఘవేంద్రరెడ్డి వచ్చారు. ఈ సందర్బంగా రాఘవేంద్రరెడ్డి మాట్లాడుతూ... అర్థంపర్థం లేని సాంకేతిక సమస్యలను చూపి జడ్పీ ఛైర్మన్ ఎన్నికను వాయిదా వేయించేందుకు టీడీపీ యత్నిస్తోందని ఆరోపించారు. నేడు జరుగుతున్న జడ్పీ పీఠం ఏన్నిక ఎన్నికల సంఘం జారీ చేసిన నోటిఫికేషన్ ఆధారంగా జరుగుతుందని ఆయన గుర్తు చేశారు. ఇప్పుడు వాయిదా పడే ప్రసక్తే లేదని రాఘవేంద్ర రెడ్డి స్సష్టం చేశారు. నెల్లూరు జడ్పీ ఛైర్మన్ ఎన్నిక ఇప్పటి వరకు రెండు సార్లు వాయిదా పడిన సంగతి తెలిసిందే. -
ఎమ్మెల్యే కురుగొండ్ల కోసం పోలీసుల గాలింపు
నెల్లూరు: జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా వీరంగం సృష్టించిన శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. కలెక్టర్ విధులకు ఆటంకం కలిగించిన ఆయనపై నాన్‌బెయిలబుల్ కేసు నమోదు చేసిన నేపథ్యంలో ఆదివారం నెల్లూరులోని ఆయన నివాసంలో గాలించారు. అయితే ఈ విషయం ముందే తెలుసుకున్న ఆయన అప్పటికే హైదరాబాద్ చేరుకోవడంతో పోలీసులు వెనుదిరిగారు. కేసు నమోదైన సమయంలో ఎమ్మెల్యే నెల్లూరులో ఉన్నా పట్టించుకోని పోలీసులు తీరా ఆయన హైదరాబాద్ వెళ్లిన 15 గంటల తర్వాత ఎమ్మెల్యే ఇంటికి వెళ్లడం గమనార్హం. జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా కురుగొండ్ల రామకృష్ణ దౌర్జన్యానికి దిగారు. కలెక్టర్ ఎదుట ఉన్న మైకును తోసివేసి, నామినేషన్, ప్రమాణ స్వీకార పత్రాలను చించివేశారు. -
ప్రేమకు అడ్డుగోడగా కులం
వింజమూరు: ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తే కులం పేరుతో తనను దూరం పెట్టే ప్రయత్నం చేస్తున్నాడంటూ ఓ యువతి నిరసనకు దిగింది. భర్త ఇంటి ముందు బైఠాయించి తనకు న్యాయం చేయాలని పట్టుబట్టింది. చివరకు పోలీసులు జోక్యం చేసుకుని వీరి పెళ్లిని రిజిస్ట్రేషన్ చేసేందుకు ఒప్పించ డంతో కథ సుఖాంతమైంది. వివరాలు... అనంతపురం జిల్లా హిందూపురానికి చెందిన శైలజాకుమారి 2004లో శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా వింజమూరులోని తన పెద్దమ్మ ఇంట్లో ఉంటూ స్థానిక ఎంఎస్ఆర్ డిగ్రీ కళాశాలలో డిగ్రీ చదివింది. అదే కళాశాలలో చదువుతున్న సూరా భాస్కర్‌రెడ్డి, శైలజాకుమారి ప్రేమించుకున్నారు. డిగ్రీ అనంతరం ఉన్నత చదువుల కోసం శైలజ తిరుపతికి, భాస్కర్రె డ్డి హైదరాబాద్ వెళ్లారు. మధ్యమధ్యలో భాస్కర్‌రెడ్డి తిరుపతికి వె ళ్లి ఆమెతో మాట్లాడివస్తుండే వాడు. 2010లో శైలజ ప్రాజెక్ట్ వర్క్ కోసం హైదరాబాద్ వెళ్లడంతో ఇద్దరూ మరింత దగ్గరయ్యారు. ఈ క్రమంలో ఆమె పెళ్లి ప్రస్తావన తేవడంతో కులాలు వేరయినందున తల్లిదండ్రులను నెమ్మదిగా ఒప్పించి చేసుకుంటానని నమ్మించాడు. మరోవైపు అదే ఏడాది తల్లిదండ్రులు పెళ్లి ప్రస్తావన తేవడంతో ఆమె మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నం చేసింది. ఆ సమయంలో భాస్కర్‌రెడ్డి ఖర్చులు భరించి ఆమెకు హైదరాబాద్‌లో వైద్యం చేయించాడు. చివరకు 2013 జూన్‌లో తిరుపతిలోని శ్రీనివాసమంగాపురంలో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. మొదట హిందూపురం, తర్వాత నెల్లూరులో కాపురం పెట్టారు. అనంతరం క్రమేణా ఆమెను దూరం పెడుతూ వచ్చాడు. అదే సమయంలో భాస్కర్‌రెడ్డికి మరోపెళ్లి చేసేందుకు అతని తల్లిదండ్రులు ప్రయత్నిస్తున్నారని తెలుసుకున్న శైలజకుమారి తల్లిదండ్రులు, బంధువులతో కలిసి వింజమూరు చేరుకుంది. తనకు న్యాయం చేయాలంటూ మహిళా సంఘాల నేతలతో కలిసి ఆదివారం రాత్రి నుంచి భాస్కర్‌రెడ్డి ఇంటి ఎదుట బైఠాయించింది. సోమవారం ఉదయం అక్కడకు చేరుకున్న భాస్కర్‌రెడ్డిని నిలదీసి, తనకు చేస్తున్న అన్యాయంపై ప్రశ్నించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఇరువర్గాల వారిని పోలీసుస్టేషన్‌కు పిలిపించి చర్చలు జరిపారు. చివరకు వీరి వివాహాన్ని మంగళవారం రిజిస్టర్ చేసేందుకు ఒప్పించారు. -
జైపాల్‌రెడ్డే పెద్ద శుంఠ: ఎమ్మెల్యే ఆనం
నెల్లూరు: సీమాంధ్ర ప్రజల మనోభావాలను కించపరిచేలా మాట్లాడిన కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డే పెద్ద శుంఠ అని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక పిలుపు మేరకు శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కేంద్రం నెల్లూరులో ఎపీ ఎన్జీవోల సంఘం నెల్లూరు తాలూకా కమిటీ ఆధ్వర్యంలో బుధవారం తెలంగాణ బిల్లు ప్రతులను, కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమైక్యాంధ్ర ఉద్యమానికి మద్దతుగా నిలిచిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి హెలికాప్టర్‌ను కూల్చివేస్తామని, ఆఖరు బంతికి బదులు బాంబులు వేస్తామని తీవ్రపదజాలం వాడుతున్న ఎంపీ పొన్నం ప్రభాకర్ చర్యలు ఉగ్రవాద చర్యలుగా ఉన్నాయని విమర్శించారు. రాష్ట్రం విడిపోకముందే తెలంగాణ నేతలు ఉగ్రవాద చర్యలకు పాల్పడుతుంటే సీమాంధ్ర ప్రాంత ప్రజలకు వీరెలా రక్షణ కల్పిస్తారని ప్రశ్నించారు. ఇప్పటివరకు రాష్ట్రానికి 12 మంది తెలంగాణ ప్రాంతం వారే ముఖ్యమంత్రులుగా పనిచేశారన్నారు. టీఆర్ఎస్ నాయకుడు ఈటెల రాజేంద్ర చరిత్ర తెలుసుకోకుండా మాట్లాడారని విమర్శించారు. సాధారణ ఎన్నికలు సమైక్య రాష్ట్రంలోనే జరుగుతాయని ధీమా వ్యక్తం చేశారు. నగర ఎమ్మెల్యే ముంగమూరు శ్రీధర్‌కృష్ణారెడ్డి మాట్లాడుతూ కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి సీమాంధ్ర ప్రజల మనోభావాలను దెబ్బతినే మాట్లాడటం సమంజసం కాదన్నారు. -
మీసం మెలేసిన రొయ్య!
సాక్షి, నెల్లూరు : రొయ్య మీసం మెలేసింది.. రొయ్యల చరిత్రలో మునుపెన్నడూ లేనంతగా వెనామీ రొయ్యలు అత్యధిక ధర పలుకుతున్నాయి. కిలో రొయ్య ధర సోమవారం నాటికి రూ.680 పలికింది. ఇది 20 ఏళ్ల రొయ్యల సాగు చరిత్రలోనే అత్యధిక ధర. ఎన్నడూ లేని విధంగా ధర పెరగడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో సముద్ర తీరప్రాంతంలోని సూళ్లూరుపేట, కోట, వాకాడు, గూడూరు, ముత్తుకూరు, టీపీ గూడూరు, ఇందుకూరుపేట, విడవలూరు, బోగోలు, కావలి, అల్లూరు తదితర మండలాల పరిధిలో 12 వేల హెక్టార్లలో 4 వేల మందికి పైగా రైతులు వెనామీ రొయ్యల సాగు చేపట్టారు. అమెరికాలో సాగుచేస్తున్న వెనామీ ఎనిమిదేళ్ల క్రితం జిల్లాకు చేరింది. ఐదేళ్లుగా జిల్లాలో వెనామీ సాగు పెరిగింది. ఈ సమయంలో ఎన్నడూ కిలో రొయ్యలు రూ.200 నుంచి రూ. 300 దాట లేదు. రొయ్య ధర ప్రస్తుతం కిలో రూ.680 పలుకుతోంది. సోమవారం (కిలోగ్రాముకు) 30 కౌంట్ రొయ్య రూ. 680 ఉండగా 40 కౌంట్ రూ.600, 50 కౌంట్ రూ.550 పలికింది. ఎనిమిదేళ్ల వెనామీ చరిత్రలోనే కాదు 21 ఏళ్ల టైగర్, ఇండికాస్ రొయ్యలసాగు చరిత్రలోనే ఇంతధర ఎన్నడూ లేదు. ఈ లెక్కన లక్ష రొయ్యల సీడ్‌కు సరాసరి 70 శాతం దిగుబడి 1500 కిలోల లెక్కన ప్రస్తుత ధరతో రూ.7.5 లక్షలు రాబడి వస్తోంది. లక్ష రొయ్యల సాగుకు సంబంధించి సీడ్ రూ. 50 వేలతో పాటు ఫీడ్, విద్యుత్, నీటి శుభ్రత పరిరక్షణ తదితర ఖర్చులు లెక్కిస్తే మొత్తం రూ. 2.5 లక్షలు అవుతుంది. ఒక్కొక్క రొయ్య పెంపకానికి రూ. 2.50 ఖర్చు వస్తోంది. ఈ లెక్కన పెట్టుబడి పోను లక్ష రొయ్యల సీడ్ లో సరాసరి 70 శాతం దిగుబడి 1500 కేజీలు లెక్కిస్తే రూ.5 లక్షలకు తగ్గకుండా ఆదాయం వస్తున్నట్లు వెనామీ రైతులు పేర్కొంటున్నారు. హెక్టారులో నిబంధనల మేరకు 6 లక్షల సీడ్ వేయాల్సి ఉంది. అయితే రైతులు హెక్టారులో సుమారు 10 లక్షల వరకూ సీడ్‌ను పెంచుతున్నారు. ఈ లెక్కన ప్రస్తుత ధరతో లెక్కిస్తే వెనామీ రైతుల ఆదాయం పెద్ద ఎత్తున ఉండే అవకాశముంది. రైతన్న ఏమంటున్నారు.. ‘వెనామీ’ బాగుంది. మూడేళ్ల నుంచి వెనామీ రొయ్యల సాగు హెక్టారులో చేపట్టా. ఈ ఏడాది అక్టోబర్ వరకు వెనామీకి పెద్దగా ధరలు లేవు. కిలో రూ.300కు మించి అమ్మింది లేదు. అక్టోబర్ నుంచి రేట్లు పెరిగాయి. ప్రస్తుతం కిలో రూ.680కి పైగా పలుకుతోంది. ఇలా ధరలుంటే రైతులకు మంచి ఆదాయం. -హనుమంతరావు నాయుడు, రైతు, రాముడిపాళెం, నెల్లూరు జిల్లా జిల్లాలో రొయ్యల సాగు ఎప్పుడు ప్రారంభమైంది: 1991 నుంచి ఏ రకం రొయ్యలు సాగు చేస్తున్నారు: టైగర్, స్కాంపీ, ఇండికాస్ వెనామీ రకం ఎప్పుడొచ్చింది: 8 ఏళ్ల క్రితం జిల్లాకు వచ్చింది వెనామీ పెంపకం కాలం ఎంత: 90 రోజుల నుంచి 110 రోజులు. ఎప్పుడు విక్రయించవచ్చు: కేజీ కౌంట్ 30 నుంచి 50 లోపు ఎప్పుడైనా దీనిని విక్రయించుకోవచ్చు. ఎన్ని గ్రాములు పెరుగుతుంది: 30.3 గ్రాముల వరకూ పెరుగుతుంది. ఎక్కడ డిమాండ్ ఉంది: వెనామీకి విదేశాల్లో మంచి డిమాండ్ ఉంది. అక్కడ కేజీ రొయ్య ధర రూ. 1200 కు పైనే ఉంది. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి: క్వాలిటీ సీడ్ వేసుకోవాలి. ప్రభుత్వ అనుమతులు ఉన్న కంపెనీల నుంచి నాణ్యత కలిగిన ఫీడ్‌ను వాడాలి. రొయ్యల చెరువుల్లోకి బయటనుంచి హానికర క్రిములు, కీటకాలు రాకుండా జాగ్త్రలు తీసుకోవాలి. ఆక్సిజన్ సరఫరా సక్రమంగా జరిగేలా చూడాలి. ఇందుకోసం ఏరియేటర్లను ఉపయోగించాలి. -
పోలీసునని బెదిరించి యువతిపై అత్యాచారం
సూళ్లూరుపేట: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో శనివారం రాత్రి వేనాటి రాజశేఖర్‌రెడ్డి అనే యువకుడు తాను పోలీసునని బెదిరించి యువతిపై అత్యాచారం చేశాడు. బాధితురాలు పోలీసులకు ఆదివారం ఫిర్యాదు చేసింది. నిందితుడు రాజశేఖర్‌రెడ్డి విద్యార్థి సంఘ నాయకుడిగా, పోలీసులకు ఇన్ఫార్మర్గా వ్యవహరించేవాడు. లాఠీ పట్టుకుని వలంటీర్‌గా పోలీసులకు సహకరిస్తుండేవాడు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తికి చెందిన కొమ్మల శ్రీనివాసులు, అతడితో పరిచయం ఉన్న సూళ్లూరుపేట మండలం జంగాలగుంటకు చెందిన యువతి శనివారం రాత్రి చెంగాళమ్మ ఆలయానికి వెళ్లారు. వారు ఆలయం పక్కనే ఉన్న కట్టమీదకు వెళ్లడాన్ని గమనించిన రాజశేఖర్‌రెడ్డి వెంబడించాడు. తాను పోలీసునని చెప్పి లాఠీతో శ్రీనివాసులును కొట్టి బెదిరించి పంపి ఆ యువతిపై అత్యాచారం చేశాడు. తర్వాత బాధితురాలు బీట్ తిరుగుతున్న ఏఆర్ పోలీసులను గమనించి వారిని ఆశ్రయించింది. బాధితురాలిని గూడూరు డీఎస్పీ చౌడేశ్వరి విచారించారు. ఆమెను వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. నిందితుడు రాజశేఖర్‌రెడ్డిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.