
77వ రోజు ప్రజాసంకల్పయాత్రలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
సాక్షి, నెల్లూరు : వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. గురువారం ఉదయం సర్వేపల్లి నియోజకవర్గం, పొదలకూరు శివారు నుంచి వైఎస్ జగన్ 77వరోజు ప్రజాసంకల్పయాత్రను ప్రారంభించారు. అక్కడ నుంచి తోడేరు క్రాస్ రోడ్డు మీదుగా ఉప్పుటూరు క్రాస్ రోడ్డు చేరుకుంటారు. అనంతరం అక్కడ నుంచి చాటగట్ల చేరుకొని పార్టీ జెండా ఆవిష్కరిస్తారు. ఆతర్వాత మరుపూరు వద్ద ప్రజాసంకల్పయాత్ర ముగియనుంది. పాదయాత్రలో భాగంగా ఇప్పటిదాకా వైఎస్ జగన్ 1034.3 కిలోమీటర్లు నడిచిన విషయం తెలిసిందే.