కూటమి నేత కనుసన్నల్లో ఖనిజం తవ్వకాలు
పట్టించుకోని మైనింగ్ అధికారులు
సైదాపురం: విలువైన ఖనిజ నిక్షేపాలున్న శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని దేవరతిప్ప కొండపై అధికార పార్టీకి చెందిన అక్రమార్కులు తిష్ట వేశారు. సైదాపురం తహసీల్దార్ కార్యాలయం సమీపంలోనే ఉన్న ఈ కొండలో అపారమైన స్పోక్ క్వార్ట్ ్జ ఖనిజం దొరుకుతుంది. దీంతో కూటమి నేతలు ఈ కొండను చెరబట్టారు. వారి అండతో ఓ చోటా వ్యాపారి విలువైన ఖనిజాన్ని తవ్వేస్తున్నారు. పట్ట పగలే భారీ సంఖ్యలో కూలీలను పెట్టి యథేచ్ఛగా తవ్వుతున్నారు. ఈ విషయం తెలిసినా మైనింగ్ అధికారులు కన్నెత్తి చూడటంలేదు. దేవరతిప్ప వద్ద 24 రకాల ఖనిజ నిక్షేపాలు అపారంగా ఉన్నాయి.
దేశంలో భూగర్భ పరిశోధన చేసే విద్యార్థులు ఏటా ఈ కొండను సందర్శించి, ఇక్కడి ఖనిజాలపై పరిశోధనలు చేస్తుంటారు. గతంలో టీడీపీ హయాంలో ఈ కొండలో విచ్చలవిడిగా తవ్వకాలు చేపట్టారు. ఆ తర్వాత గనులన్నీ మూతపడిపోవడంతో కొండ జోలికి రాలేదు. మళ్లీ కూటమి ప్రభుత్వం రావడంతో స్పోక్ క్వార్ట్ ్జ ఖనిజాన్ని తవ్వి తరలించేస్తున్నారు. యంత్రాలతో త వి్వతే అనుమానాలు వస్తాయన్న కారణంతో ఇతర ప్రాంతాల నుంచి తెచి్చన కూలీలతో తవ్వుతున్నారు.
తట్టకు రూ.150 వంతున కూలీలకు చెల్లిస్తున్నారు. 400 తట్టలు ఏరితే 10 టన్నులు వస్తోంది. స్థానికంగానే 10 టన్నుల ఖనిజానికి రూ. లక్ష ధర పలుకుతోంది. ఈవిషయం జిల్లా మైనింగ్ అధికారులకు సమాచారం ఇచ్చినా కూడా ఫలితం లేకపోయిందని స్థానిక ప్రజలు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment