Nellore Transgender: Man Passed Away Due To B Pharmacy Student Negligence - Sakshi
Sakshi News home page

Nellore Transgender: బెడిసికొట్టిన లింగమార్పిడి శస్త్రచికిత్స

Published Sat, Feb 26 2022 2:42 AM | Last Updated on Sat, Feb 26 2022 9:07 AM

Man Passed Away Due To B Pharmacy Student Negligence In Nellore District - Sakshi

 బి.శ్రీకాంత్‌ (ఫైల్‌)  

నెల్లూరు (క్రైమ్‌)/జరుగుమల్లి: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కేంద్రం నెల్లూరులో ఇద్దరు బీ–ఫార్మసీ విద్యార్థులు వైద్యుల అవతారమెత్తారు. ఓ లాడ్జి గదిని ఆపరేషన్‌ థియేటర్‌గా చేసుకుని లింగమార్పిడి శస్త్రచికిత్స మొదలుపెట్టారు. ఈ క్రమంలో తీవ్ర రక్త స్రావమై పల్స్‌డౌన్‌ కావడంతో ఓ ట్రాన్స్‌జెం డర్‌ మృతి చెందాడు. ప్రకాశం జిల్లా జరుగు మల్లి మండలం కామేపల్లికి చెందిన బి.శ్రీకాంత్‌ అలియాస్‌ అమూల్య(28) చిన్న తనం నుంచే హైదరాబాద్‌లో తాపీపనికి వెళ్లే వాడు. అతడికి 2019లో మేనమామ కుమార్తె తో వివాహమైంది.

వారు 2020లో విడాకులు తీసుకున్నారు. అప్పటినుంచి శ్రీకాంత్‌ ఒంగోలులో ఉంటున్నాడు. అక్కడే అతడికి విశాఖపట్నానికి చెందిన ట్రాన్స్‌ జెండర్‌ మోనాలిసా అలియాస్‌ జి.అశోక్‌తో పరిచయమైంది. ఇద్దరు స్నేహితులయ్యారు. వివిధ ప్రాంతాలకు తిరుగుతుండేవారు. ఆరునెలల కిందట శ్రీకాంత్‌కు సోషల్‌ మీడియా యాప్‌ ద్వారా నెల్లూరులోని ఓ ప్రైవేట్‌ కళాశాల బీ–ఫార్మసీ విద్యా ర్థులు ఎ.మస్తాన్, జీవాతో పరిచయమైంది.

ఈ క్రమంలో శ్రీకాంత్‌ తాను ముంబై వెళ్లి లింగమార్పిడి శస్త్రచికిత్స చేయించుకుంటానని మస్తాన్‌కు చెప్పాడు. లిం గమార్పిడికి ముంబైలో రూ.లక్షలు ఖర్చ వుతుందని, తక్కువ ఖర్చుతో తానే చేస్తానని మస్తాన్‌ చెప్పాడు. దీంతో అందరూ కలసి ఈ నెల 23న నెల్లూరు గాంధీబొమ్మ సెంటర్‌లోని ఎస్‌ఎస్‌ లాడ్జిలో గదిని అద్దెకు తీసుకున్నారు. 24న మస్తాన్, జీవా.. మోనాలిసా సహాయం తో శ్రీకాంత్‌కు శస్త్రచికిత్స ప్రారంభించి మర్మాం గాన్ని తొలగించారు.

దీంతో శ్రీకాంత్‌కు తీవ్ర రక్తస్రావమై, పల్స్‌ పడిపోయింది. మోతాదుకు మించి మందులు వాడటంతో కొద్దిసేపటికే శ్రీకాంత్‌ మృతిచెందాడు. ఈ విషయాన్ని గమనించిన లాడ్జి సిబ్బంది చిన్నబజారు పోలీ సులకు సమాచారమందించారు. మృతుడి వద్ద లభ్యమైన ఆధారాలతో అతడి సోదరి పల్లవికి పోలీసులు సమాచారం అందించి, మృత దేహాన్ని జీజీహెచ్‌ మార్చురీకి తరలిం చారు. నెల్లూరు చేరుకున్న పల్లవి దీనికి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని చిన్నబజారు పోలీసు లకు ఫిర్యాదు చేశారు. ఇప్పటికే పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారి స్తున్నట్లు సమాచారం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement