B pharmacy student
-
పల్నాడు జిల్లా పసుమర్రులో 17 ఏళ్ల ఫిరోజ్ గుండెపోటుతో మృతి
-
విషాదం: కబడ్డీ ఆడుతూ కుప్పకూలిన 19 ఏళ్ల యువకుడు, చూస్తుండగానే...
సాక్షి, అనంతపురం: నిర్దిష్ట కారణాలేంటో తెలియదుగానీ ఈమధ్య కాలంలో వయసుతో సంబంధం లేకుండా గుండెపోట్లు కలవరపెడుతున్నాయి. ముఖ్యంగా నిండా పాతికేళ్లు కూడా లేని యువత హార్ట్ అటాక్‌తో చూస్తుండగానే ప్రాణాలు విడుస్తున్న ఘటనలు వెలుగుచూస్తున్నాయి. ఈ నెల 1న అనంతపురం జిల్లాలో 19 ఏళ్ల తనూజ నాయక్ అనే యువకుడు కబడ్డీ ఆడుతూ కుప్పకూలిపోయాడు. అతన్ని బెంగళూరులోని ఎమ్మెస్ రామయ్య ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం తుదిశ్వాస విడిచాడని వైద్యులు తెలిపారు. ఆరోగ్యంగా ఉండే తమ బిడ్డకు గుండెపోటు ఏంటని ఆ తల్లిదండ్రులు స్థాణువయ్యారు. దేవుడు తమకు అన్యాయం చేశాడని, ఆడుతూ పాడుతూ తిరిగే తమ కుమారుడికి ఇంత చిన్న వయసులో ఈ ప్రాణాలు తీసే రోగమేంటని కన్నీరుమున్నీరయ్యారు. మృతుడు తనూజ నాయక్ది మడకశిర మండలం అచ్చంపల్లి తండా. అనంతపురం పట్టణంలోని పీవీకేకే కాలేజీలో బీఫార్మసీ ఫస్టియర్ చదువుతున్నాడు. కాగా, కబడ్డీ ఆడుతూ తనూజ నాయక్ కుప్పకూలిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. (చదవండి: జనం మధ్యకు పులి కూనలు..24 గంటలు గడిచిన తల్లి జాడ లేదు!) 17 ఏళ్లకే ప్రాణాంతక ‘పోటు’ పల్నాడు జిల్లా పసుమర్రులో కూడా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. 17 ఏళ్ల ఫిరోజ్‌కు సోమవారం అర్ధరాత్రి గుండెపోటు వచ్చింది. కుటుంబ సభ్యులు హుటాహుటిన అతడిని ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు వెల్లడించారు. -
బీఫార్మసీ విద్యార్థిని అదృశ్యం
పటాన్చెరు టౌన్: బీఫార్మసీ విద్యార్థిని అదృశ్యమైన సంఘటన పటాన్చెరు పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. ఎస్ఐ రామానాయుడు కథనం ప్రకారం.. రుద్రారం గీతం విశ్వవిద్యాలయంలో బీఫార్మసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న రోషిణి ఈనెల 13వ తేదీన సంక్రాంతి సెలవులకు బాబాయి ఇంటికి చెముడులంకకు వెళ్లింది. తిరిగి 16వ తేదీన కళాశాలకు వెళ్తున్నానని చెప్పి ఇంటి బయలుదేరింది. 22వ తేదీన టాంజానియాలో ఉన్న తండ్రి రాముకు ఫోన్‌చేసి ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పింది. దీంతో కుటుంబ సభ్యులు కళాశాలకు ఫోన్ చేయగా 22వ తేదీ వరకు సెలవులు ఉన్నాయని చెప్పారు. తండ్రి రాము కూతురుకు ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ వచ్చింది. దీంతో కుటుంబ సభ్యులు పటాన్చెరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈమేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
కడపలో విషాదం.. కళాశాలలో చేరిన నాలుగు రోజులకే..
సాక్షి, కడప అర్బన్: కడప నగరంలోని ఊటుకూరులో వున్న రామిరెడ్డి ఫార్మసీ అండ్ ఫిజియోథెరపీ కళాశాలలో మొదటి సంవత్సరం విద్యార్థిని ముద్దం సుజాత(17) తమ హాస్టల్ గదిలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ సంఘటనపై విద్యార్థిని బంధువులు, పోలీసులు తెలిపిన కథనం మేరకు వివరాలిలా వున్నాయి. కలసపాడు మండలం నల్లగొండపల్లెకు చెందిన ముద్దం వెంకటేశ్వర్లు, కళావతికి కుమార్తె సుజాత, కుమారుడు ప్రదీప్ ఉన్నారు. గతేడాది ఇంటర్ పూర్తి చేసిన సుజాతను ఈ నెల 13న కడప నగర శివార్లలోని ఊటుకూరులోని రామిరెడ్డి ఫార్మసీ అండ్ ఫిజియోథెరపీ కళాశాలలో బి.ఫార్మసీ మొదటి సంవత్సరంలో చేర్పించారు. ఈ క్రమంలో సుజాత 16వ తేదీన ఉదయం 7:30 గంటలకు హాస్టల్ నుంచి సహచర విద్యార్థిని సెల్ఫోన్లో నుంచి తన తల్లి కళావతితో మాట్లాడింది. తరువాత రాత్రి అదే సహచర విద్యార్థిని ఉదయం ఫోన్ చేసిన నంబర్‌కే చేసి సుజాత హాస్టల్లో వెంటిలేటర్ కొక్కేనికి చున్నీతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిందని సమాచారం చెప్పింది. దీంతో సుజాత మేనమామ, బాబాయ్ ఇద్దరు కలిసి హుటాహుటిన కడపకు వచ్చి కళాశాలకు చేరుకున్నారు. అక్కడ సుజాత మృతదేహాన్ని చూసి తీవ్ర ఆవేదన చెందారు. వెంటనే కుటుంబ సభ్యులను పిలిపించారు. సంఘటన స్థలాన్ని కడప డీఎస్పీ బి.వెంకట శివారెడ్డి, సీఐ ఉలసయ్య, తాలూకా ఎస్ఐ ఎస్‌కెఎం హుసేన్ తమ సిబ్బందితో కలిసి పరిశీలించారు. మృతదేహాన్ని రిమ్స్ మార్చురీకి తరలించారు. కళాశాలలో చేరిన నాలుగు రోజులకే.. సుజాత కళాశాలలో చేరిన నాలుగు రోజులకే ఈ సంఘటన జరగడంపై చర్చ సాగుతోంది. సుజాత తండ్రి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ తమ కుమార్తె ఇంటి దగ్గర కూడా ఎవరితోనూ మాట్లాడేది కాదన్నారు. తమ ఆర్థిక పరిస్థితి సరిగాలేక ఆలస్యంగా కళాశాలలో చేర్పించామన్నారు. విద్యను అభ్యసించేందుకు ఎంతో ఆసక్తి చూపించిందని, శుక్రవారం కడపకు వచ్చి మాట్లాడి వెళదామనుకునేలోపే ఇలాంటి సంఘటన జరుగుతుందనుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా అదనపు ఎస్పీ విచారణ సుజాత మృతి సంఘటనపై జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ ఆదేశాల మేరకు జిల్లా అదనపు ఎస్పీ నీలం పూజిత విచారణ చేశారు. కడప రిమ్స్ మార్చురీలో వున్న సుజాత మృతదేహాన్ని ఆమె పరిశీలించారు. సుజాత తండ్రి వెంకటేశ్వర్లు, బంధువులను విచారణ చేశారు. సంఘటనపై ఎలాంటి అనుమానాలున్నా ఫిర్యాదులో పేర్కొనాలని, కేసు నమోదు చేయడంతోపాటు సమగ్రంగా దర్యాప్తు చేస్తామన్నారు. అదనపు ఎస్పీ వెంట కడప డీఎస్పీ బి.వెంకటశివారెడ్డి, కడప తాలూకా సీఐ ఉలసయ్య, ఎస్ఐ ఎస్‌కెఎం హుసేన్, సిబ్బంది ఉన్నారు. సమగ్రంగా విచారణ జరపాలి సుజాత మృతి సంఘటనపై సమగ్రంగా విచారణ జరపాలని మహిళా కమిషన్ సభ్యురాలు గజ్జెల వెంకట లక్ష్మి కోరారు. సుజాత మృతిపై స్పందించిన ఆమె వెంటనే కడప తాలూకా సీఐతో ఫోన్లో మాట్లాడారు. విద్యార్థి, ప్రజా సంఘాల ధర్నా కడప వైఎస్ఆర్ సర్కిల్/ చింతకొమ్మదిన్నె : విద్యార్ధి సుజాత మృతికి కారకులైన వారిని శిక్షించాలని వివిధ సంఘాల నేతలు కోరారు. రిమ్స్‌లోని మార్చురీ ఉన్న సూజాత మృతదేహాన్ని వారు పరిశీలించారు. అనంతరం కళాశాల ఎదుట ధర్నా చేపట్టారు. వారిని పోలీసులు అరెస్ట్ చేసి చింతకొమ్మదిన్నె పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కార్యక్రమంలో ఎన్ఎస్యూఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తిరుమల్లేష్, ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శులు సగిలి రాజేంద్ర ప్రసాద్, వలరాజు, వివిధ, ప్రజా, విద్యార్థి సంఘాల నాయకులు అంకన్న, ఆర్ఎన్ రాజా, వేణు, శంకర్, జయవర్దన్, ప్రశాంత్, గోపి తదితరులు పాల్గొన్నారు. కళాశాల వద్ద పటిష్ట బందోబస్తు కళాశాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కడప డీఎస్పీ వెంకటశివారెడ్డి ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. -
బీఫార్మసీ విద్యార్థి తేజస్విని మృతి కేసు.. ప్రియుడు అరెస్ట్
సాక్షి, శ్రీసత్యసాయి జిల్లా: జిల్లాలో సంచలన కలిగించిన బీఫార్మసీ విద్యార్థి తేజస్విని మృతి కేసులో నిందితుడు సాధిక్‌ను పోలీసులు అరెస్టు చేశారు. సాధిక్ ఆలియాస్ బాబూలాల్ వేధింపుల వల్లే తేజశ్విని ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుందన్న పోలీసులు.. అతనిపై 420, 376, 306 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కేసు విచారణ బాధ్యతలు దిశ పోలీసులకు అప్పగించామని.. రెండు వారాల్లో దర్యాప్తు పూర్తి చేయాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేసినట్లు ధర్మవరం డీఎస్పీ రమాకాంత్ తెలిపారు. చదవండి: పాపం రమాదేవి.. భర్త ప్రాణాలు కాపాడబోయి.. -
బెడిసికొట్టిన లింగమార్పిడి శస్త్రచికిత్స
నెల్లూరు (క్రైమ్)/జరుగుమల్లి: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కేంద్రం నెల్లూరులో ఇద్దరు బీ–ఫార్మసీ విద్యార్థులు వైద్యుల అవతారమెత్తారు. ఓ లాడ్జి గదిని ఆపరేషన్ థియేటర్‌గా చేసుకుని లింగమార్పిడి శస్త్రచికిత్స మొదలుపెట్టారు. ఈ క్రమంలో తీవ్ర రక్త స్రావమై పల్స్‌డౌన్ కావడంతో ఓ ట్రాన్స్జెం డర్ మృతి చెందాడు. ప్రకాశం జిల్లా జరుగు మల్లి మండలం కామేపల్లికి చెందిన బి.శ్రీకాంత్ అలియాస్ అమూల్య(28) చిన్న తనం నుంచే హైదరాబాద్‌లో తాపీపనికి వెళ్లే వాడు. అతడికి 2019లో మేనమామ కుమార్తె తో వివాహమైంది. వారు 2020లో విడాకులు తీసుకున్నారు. అప్పటినుంచి శ్రీకాంత్ ఒంగోలులో ఉంటున్నాడు. అక్కడే అతడికి విశాఖపట్నానికి చెందిన ట్రాన్స్ జెండర్ మోనాలిసా అలియాస్ జి.అశోక్‌తో పరిచయమైంది. ఇద్దరు స్నేహితులయ్యారు. వివిధ ప్రాంతాలకు తిరుగుతుండేవారు. ఆరునెలల కిందట శ్రీకాంత్‌కు సోషల్ మీడియా యాప్ ద్వారా నెల్లూరులోని ఓ ప్రైవేట్ కళాశాల బీ–ఫార్మసీ విద్యా ర్థులు ఎ.మస్తాన్, జీవాతో పరిచయమైంది. ఈ క్రమంలో శ్రీకాంత్ తాను ముంబై వెళ్లి లింగమార్పిడి శస్త్రచికిత్స చేయించుకుంటానని మస్తాన్‌కు చెప్పాడు. లిం గమార్పిడికి ముంబైలో రూ.లక్షలు ఖర్చ వుతుందని, తక్కువ ఖర్చుతో తానే చేస్తానని మస్తాన్ చెప్పాడు. దీంతో అందరూ కలసి ఈ నెల 23న నెల్లూరు గాంధీబొమ్మ సెంటర్లోని ఎస్ఎస్ లాడ్జిలో గదిని అద్దెకు తీసుకున్నారు. 24న మస్తాన్, జీవా.. మోనాలిసా సహాయం తో శ్రీకాంత్‌కు శస్త్రచికిత్స ప్రారంభించి మర్మాం గాన్ని తొలగించారు. దీంతో శ్రీకాంత్‌కు తీవ్ర రక్తస్రావమై, పల్స్ పడిపోయింది. మోతాదుకు మించి మందులు వాడటంతో కొద్దిసేపటికే శ్రీకాంత్ మృతిచెందాడు. ఈ విషయాన్ని గమనించిన లాడ్జి సిబ్బంది చిన్నబజారు పోలీ సులకు సమాచారమందించారు. మృతుడి వద్ద లభ్యమైన ఆధారాలతో అతడి సోదరి పల్లవికి పోలీసులు సమాచారం అందించి, మృత దేహాన్ని జీజీహెచ్ మార్చురీకి తరలిం చారు. నెల్లూరు చేరుకున్న పల్లవి దీనికి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని చిన్నబజారు పోలీసు లకు ఫిర్యాదు చేశారు. ఇప్పటికే పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారి స్తున్నట్లు సమాచారం. -
ఘట్కేసర్ యువతి ఆత్మహత్య
-
ఘట్కేసర్ కిడ్నాప్ డ్రామా: యువతి ఆత్మహత్య
సాక్షి, మేడ్చల్: నగరంలో పది రోజుల క్రితం ఫార్మాసీ విద్యార్థిని కిడ్నాప్ కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. చివరకు ఇదంతా డ్రామా అని తేల్చారు పోలీసులు. సదరు యువతిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దాంతో మనస్తాపానికి గురైన యువతి బుధవారం ఆత్మహత్య చేసుకుంది. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత యువతి తన అమ్మమ్మ ఇంట్లో ఉంటుంది. ఈ క్రమంలో మంగళవారం యువతి షుగర్ ట్యాబ్లెట్స్ మింగి ఆత్మహత్యా యత్నం చేసింది. గమనించిన కుటుంబ సభ్యులు ఆమెని ఘట్కేసర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అర్థరాత్రి వరకు బాగానే ఉన్న యువతి బుధవారం ఉదయం 10 గంలకు చికిత్స పొందతూ మృతి చెందింది. పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఘటన తర్వాత విద్యార్థిని డిప్రెషన్‌కు గురైనట్లు వెల్లడించారు. అసలేం జరిగిందంటే... మేడ్చల్ కండ్లకోయలోని ఓ ప్రైవేట్ కాలేజీలో బీ ఫార్మసీ చదువుతున్న ఆ విద్యార్థిని ప్రతిరోజూ లాగానే కాలేజీ రాంపల్లి ఎక్స్‌రోడ్డు వద్ద బస్సు దిగి ఆర్ఎల్ నగర్‌కు వెళ్లేందుకు సెవెన్ సీటర్ ఆటో ఎక్కింది. అప్పటికే ఆమె తండ్రి ఫోన్‌కాల్ చేస్తే మరికొద్ది నిమిషాల్లోనే ఇంటికి చేరుకుంటానని చెప్పింది. ఆ తర్వాత ఆమె తల్లి ఫోన్‌కాల్ చేస్తే ఆ బస్టాప్ వద్ద ఆగకుండా ఆటోడ్రైవర్ వేగంతో ముందుకు తీసుకెళుతున్నాడంటూ అరుస్తూ చెప్పింది. ఆ తర్వాత ఎన్నిసార్లు కాల్ చేసినా ఆమె ఫోన్ కనెక్ట్ కాలేదు. దీంతో ఈ విషయాన్ని డయల్ 100కు కాల్ చెప్పారు. దీంతో అప్రమత్తమైన కీసర, ఘట్కేసర్, మల్కాజ్గిరి, ఉప్పల్, మేడిపల్లి పోలీసులతో పాటు ఎస్వోటీ పోలీసులు బృందాలుగా ఏర్పడి మరీ గాలించారు. చివరకు అన్నోజిగూడ చెట్ల పొదల్లో ఆమె పంపిన లైవ్ లోకేషన్‌తో ఆచూకీ లభించడంతో జోడిమెట్లలోని క్యూర్ ఆసుపత్రికి తరలించారు. విద్యార్థిని చెప్పిన వివరాలతో మొదట కిడ్నాప్, ఆ తర్వాత నిర్భయ చట్టం కింద వివిధ సెక్షన్ల కింద కీసర పోలీసులు కేసు నమోదు చేశారు. తొలుత విద్యార్థిని చెప్పిన వివరాల ఆధారంగా కేసులు నమోదు చేసిన పోలీసులు నలుగురు ఆటోడ్రైవర్లతో పాటు మరో ముగ్గురిని అదుపులోకి తీసుకొని విచారించారు. ఆ తర్వాత సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం వెళితే బాధితురాలు చెప్పిన వివరాలకు, క్షేత్రస్థాయి వాస్తవాలకు పొంతన కుదరకపోవడంతో మరోసారి పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. అలాగే 10న సాయంత్రం 6 నుంచి 8 గంటల మధ్యలో యువతి యామ్నాంపేట, ఘట్కేసర్, అన్నోజిగూడ ప్రాంతాల్లో ఒంటరిగానే సంచరించినట్లుగా సీసీటీవీలకు చిక్కిన దృశ్యాలతో తేల్చారు. అలాగే పోలీసుల అదుపులోకి తీసుకున్న అనుమానితుల సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆయా ప్రాంతాల్లో లేనట్లుగా తేలింది. ఈ కేసులో విద్యార్థిని చెప్పినట్లుగా ముఖ్య అనుమానితుడిగా భావించిన ఆటోడ్రైవర్ ఘట్కేసర్ రాకుండానే యామ్నాంపేట నుంచి తిరిగి ఈసీఐఎల్, అక్కడి నుంచి మల్టీప్లెక్స్ థియేటర్, ఆ తర్వాత వైన్‌షాప్‌కు వెళ్లినట్లుగా సీసీటీవీ కెమెరాల ద్వారా తేలింది. దీంతో విద్యార్థినిని మరోసారి ప్రశ్నించగా ‘తల్లి పదేపదే ఫోన్‌కాల్ చేస్తుండటంతోనే ఈ డ్రామా ఆడానని, ఇంటి నుంచి వెళ్లిపోయేందుకే ఇలా చేశాన’ని చెప్పింది. గతంలో కరోనా సమయంలో ఆటో చార్జీల విషయంలో ఓ ఆటోడ్రైవర్‌తో గొడవపడటంతో మనసులో పెట్టుకొని అతని పేరు చెప్పినట్లుగా బాధితురాలు చెప్పిందని సీపీ తెలిపారు. 6 నెలల క్రితం తన స్నేహితునితోనూ తనను కిడ్నాప్ చేశారంటూ కట్టుకథ అల్లిందని, 10 తేదీన కూడా ఆటోలో వచ్చేరోజూ తన సీనియర్ విద్యార్థితోనూ కిడ్నాప్ గురించి విషయాలు మాట్లాడిందని తేలిందన్నారు. కుటుంబ సమస్యలతోనే ఇంటి నుంచి వెళ్లిపోవాలనుకుందని, అయితే సెల్‌ఫోన్ సిగ్నల్స్, సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా కేసు ఛేదించామన్నారు. ఈ కేసులో కీలకంగా వ్యవహరించిన కీసర సీఐ జే.నరేందర్‌గౌడ్‌తో పాటు ఇతర సిబ్బందిని రివార్డులతో మహేశ్ భగవత్ సత్కరించారు. చదవండి: ఘట్కేసర్ కేసు; రాడ్లతో విచక్షణ రహితంగా.. ఘట్కేసర్ అత్యాచారం కేసు: కొత్త ట్విస్టు -
జేఎన్టీయూ వద్ద అమ్మాయిల ఆందోళన
సాక్షి, తూర్పుగోదావరి: అనారోగ్య పరిస్థితుల కారణంగా తరగతులకు హాజరుకాలేకపోయిన ఇద్దరు విద్యార్థినులను పరీక్షలకు హాజరు కాలేకపోయారు. దీంతో తమ ఆవేదనను ‘సాక్షి’తో పంచుకున్నారు. హరిత, మోనా అనే స్టూడెంట్స్ కాకినాడ జేఎన్టీయూలో బీ ఫార్మసీ చివరి ఏడాది చదువుతున్నారు. హైదరాబాద్‌కు చెందిన హరితకు పచ్చ కామెర్లు కావడం, గుంటూరుకు చెందిన మోనా వాళ్ల తల్లికి క్యాన్సర్ రావడంతో తరగతులకు హజరు కాలేకపోయారు. దీంతో హాజరు తగ్గిందని వీరిద్దరిని తరగతి అధ్యాపకులు ఫైనల్ సెమిస్టర్ పరీక్షలకు అనుమతించలేదు. ఈ నేపథ్యంలో జేఎన్టీయూ వీసీ రామలింగరాజు కలిసినా పరీక్షలు రాసేందుకు అనుమతి లభించకపోవడంతో వీరిద్దరూ ఆవేదన వ్యక్తం చేశారు. పరీక్షలు రాసేందుకు అనుమతించాలని కోరుతున్నారు. (విద్యార్థులకు వరం.. ఏపీ కెరీర్ పోర్టల్) -
ఆశ్చర్యపరుస్తోన్న రవి శేఖర్ నేర చరిత్ర
-
రాష్ట్రానికో వేషం.. భారీగా మోసం
సాక్షి, హైదరాబాద్: గత నెల 23వ తేదీన హయత్‌నగర్ యువతి కిడ్నాప్‌కు పాల్పడిన రవి శేఖర్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు శనివారం మీడియా ముందు ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా రాచకొండ సీపీ మహేష్ భగవత్ మాట్లాడుతూ.. ‘రవి శేఖర్ మే 23న విజయవాడ పోలీసుల కస్టడీ నుంచి తప్పించుకుని రైలు ఎక్కాడు. ఈ క్రమంలో రైలులో కర్ణాటక కోప్పల్కు చెందిన ఓ కుటుంబంతో పరిచయం పెంచుకున్నాడు. చర్చి కట్టడానికి సాయం చేస్తానని మాయ మాటలు చెప్పి వారి ఇంటికి వెళ్లాడు. బళ్లారిలో తనకు రూ. 3 కోట్ల డబ్బు ఉందని.. వెళ్లి తీసుకొస్తానని చెప్పి.. వారి ఐ20 కారుతో ఉడాయించాడు’ అని తెలిపారు. ‘జూలై 21వ తేదీన రవి శేఖర్ హైదరాబాద్‌లో ప్రత్యక్షం అయ్యాడు. సబ్ కలెక్టర్ ఆఫీస్ నుంచి వచ్చానని చెప్పి డబ్బులు వసూలు చేసి.. అమ్మాయితో అసభ్యకరంగా ప్రవర్తించాడు. జూలై 23న హయత్‌నగర్‌లో సోనిని కిడ్నాప్ చేశాడు. రవి శేఖర్ కోసం కడప, ఒంటిమిట్ట, తిరుపతిలో గాలించాము. 29 తేదీన నల్గొండ వాడపల్లిలో ఓ ఎరువులు దుకాణం దగ్గరికి వెళ్లి తనిఖీల పేరుతో రూ.80 వేల నగదుతో పరారయ్యాడు రవి శేఖర్. విజయవాడ వైపుగా వెళ్లాడని తెలియడంతో ఏపీ పోలీసులు సాయం తీసుకున్నాం. ఎనిమిది రోజుల తర్వాత జూలై 30న సోనిని వదిలేశాడు. అనంతరం అతడిని అరెస్ట్ చేశాం. రవి శేఖర్‌ను పట్టుకోవడంలో ఏపీ పోలీసులు బాగా సహకరించారు’ అని భగవత్ తెలిపారు. అంతేకాక ‘రవి శేఖర్ మీద తెలుగు రాష్ట్రాలతో పాటు.. ఇతర రాష్ట్రాల్లో కూడా కలుపుకుని 65కు పైగా కేసులు నమోదయ్యాయి. ఒక్క ఏపీలోనే ఇతడి మీద 50 కేసులు నమోదయ్యాయి. 2001 నుంచి రవి శేఖర్ నేరాలకు పాల్పడుతున్నాడు. 2006-2017 వరకూ తెలంగాణలో విజిలెన్స్ ఆఫీసర్, జడ్జీ కుమారుడిని, ఏసీబీ అధికారిని అంటూ మోసాలకు పాల్పడ్డాడు. 2014లో భువనగిరిలో పీడీఎస్‌లో అవకతవకలు అంటూ వెళ్లి షాప్ యజమానిని బెదిరించాడు. అనంతరం యజమాని భార్యతో బైక్ పైన ఉడాయించి, రామోజీ ఫిలిం సిటీకి వెళ్ళిపోయాడు. రెండు రోజులు తరువాత ఆమెను విడిచి పెట్టాడు’ అని భగవత్ తెలిపారు. రవి శేఖర్ డబ్బులు వసూలు చేయడమే కాక పాటు మహిళలను మోసం చేస్తున్నాడన్నారు. అంగన్వాడి వర్కర్స్‌ను ట్రాప్ చేసి మోసం చేశాడని తెలిపారు. బ్యాక్ డోర్ ద్వారా ప్రభుత్వ ఉద్యోగాలు అంటూ మోసం చేస్తున్నాడు. ఇలాంటి వారిని నమ్మవద్దు అని మహేష్ భగవత్ ప్రజలను కోరారు. -
కిడ్నాప్ కథ సుఖాంతం
హైదరాబాద్: యువతి కిడ్నాప్ కథ ఎట్టకేలకు సుఖాంతం అయ్యింది. వారం క్రితం కిడ్నాపునకు గురైన బీ ఫార్మసీ విద్యార్థిని సోనీ సురక్షితంగా నగరానికి చేరడంతో ఉత్కంఠకు తెరపడింది. ఈ నెల 23న రాత్రి యువతి అపహరణకు గురైనప్పటి నుంచి పలు మలుపులు తిరుగుతూ వచ్చిన కిడ్నా ప్ కథ మంగళవారం ఉదయం సోనీ నగరానికి వచ్చిందని తెలి యడంతో పోలీసులు, కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నా రు. ఇబ్రహీంపట్నం సమీపం లోని బొంగుళూరు గేటు వద్ద టీ స్టాల్ నడిపే ఎలిమినేటి యాదగిరి కూతురు సోనీ(22)కి ఉద్యోగం ఇప్పిస్తానని ఆశ చూపి 23న రవిశేఖర్ కారులో ఎక్కించుకుని హయత్‌నగర్ వరకు తీసుకొచ్చి రాత్రి 8:30 గంటల సమయంలో కిడ్నాప్ చేసిన సంగతి తెలిసిందే. ఆమె తండ్రి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు అప్పటి నుంచి నిందితుని కోసం గాలిస్తున్నారు. నిందితుడు వాడిన కారు నంబర్ నకిలీదని తెలిసి కంగుతిన్నారు. అతని ఆచూకీ కోసం ఎల్బీనగర్ డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్ ఆధ్వర్యంలో గురువారం నుంచి ఐదు ప్రత్యేక బృందాలు వేట సాగిస్తున్నా యి. 3 రోజులు గడిచినా ఎలాంటి ఆధారాలు దొరక్కపోవడంతో పోలీసులు, కుటుంబ సభ్యు ల్లో ఆందోళన పెరిగింది. చివరకు నిందితుడిని రవిశేఖర్‌గా గుర్తించిన పోలీసులు అతను ఆ కారును బళ్లారి నుంచి దొంగిలించినట్లుగా కనుగొన్నారు. రోజులు గడుస్తున్నా నిందితుడు చిక్కకపోవడంతో పోలీసులు అతని ఆచూకీ తెలిపిన వారికి రూ.లక్ష బహుమతిని ప్రకటించారు. ఏం జరిగిందో ఏమో కానీ మంగళవారం ఉదయం సోనీ నగరానికి చేరుకుంది. మీడియా కంట పడకుండా... ఎంజీబీఎస్‌లో బస్సు దిగిన వెంటనే సోనీ తల్లిదండ్రులకు ఫోన్ చేయగా వారు పోలీ సులకు సమాచారం ఇచ్చారు. వారు సోనీ ని సరూర్‌నగర్ మహిళా పోలీస్టేషన్‌కు తరలించి, అక్కడి నుంచి ఎల్బీనగర్ సీసీఎస్ కార్యాలయానికి తీసుకెళ్లారు. మంగళవారం మొత్తం సోనీ మీడియా కంట పడకుండా పోలీసులు జాగ్రత్తపడ్డారు. నిందితుడు రవిశేఖర్ పోలీసుల అదుపులో ఉన్నాడని ప్రచారం జరుగుతున్నా అధికారులు ధృవీకరించడంలేదు. ఈ కిడ్నాప్ ఘటనపై రాచకొండ పోలీసులు సోనీని, రవిశేఖర్‌ను విచారిస్తున్నట్లు తెలిసింది. వైద్య పరీక్షల నిమిత్తం సోనీని వైద్య పరీక్షల నిమిత్తం పేట్ల బురుజులోని మెటర్నిటీ ఆస్పత్రికి తరలించి నట్లు సమాచారం. నిందితుడు బళ్లారిలో దొంగిలించిన కారుకు ఉన్న జీపీఆర్ఎస్తో పోలీసులు కారు కదలికలను కనుగొన్నారు. కర్నూలు, తిరుపతిలో అతని కదలికలు గుర్తించారు. చివరికి అద్దంకి, ఒంగోలులో పట్టుకున్నట్లు సమాచారం. -
ఒక్కగానొక్కడు
చీరాల రూరల్ : రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొనడంతో బీఫార్మసీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థి దుర్మరణం చెందాడు. ఈ సంఘటన మంగళవారం చీరాల కొత్తపేట బైపాస్ రోడ్డులోని ఆర్టీఏ కార్యాలయం సమీపంలో చోటుచేసుకుంది. టూ టౌన్ సీఐ రామారావు తెలిపిన వివరాల మేరకు.. చీరాల మండలం బుర్లవారిపాలెంకు చెందిన దేవరపల్లి హకిల్ (24) కుటుంబం వీఆర్ఎస్అండ్వైఆర్ఎన్ కళాశాల ప్రాంతంలో ఇంటిని అద్దెకు తీసుకుని నివాసముంటోంది. హకిల్ వేటపాలెం సమీపంలోని సెయింట్ ఆన్స్ ఇంజినీరింగ్ కాలేజీలో బీఫార్మసీ చివరి సంవత్సరం చదువుతున్నాడు. ఈ క్రమంలో హకిల్ కాలేజీలో పరీక్షలు రాసి తన స్నేహితుడైన చందుతో కలిసి ద్విచక్రవాహనంపై సాయంత్రం సమయంలో ఇంటికి బయలుదేరాడు. కొత్తపేట బైపాస్ రోడ్డులోని ఆర్టీఏ కార్యాలయం సమీపంలో వీరి వాహనం రాగా ముందుగా వెళుతున్న లారీ ఒక్కసారిగా కొత్తపేట గ్రామంవైపు మలుపు తిరిగింది. ఇదే సమయంలో ఈపురుపాలెం నుంచి వస్తున్న ద్విచక్రవాహనం హకిల్ వాహనం ఎదురెదురుగా వచ్చి ఢీకొన్నాయి. ఈ సంఘటనలో హకిల్ తీవ్ర గాయాలు కాగా చందుకు కూడా దెబ్బలు తగిలాయి. ఈపూరుపాలెం నుంచి బైకుపై వస్తున్న గుంటూరు జిల్లా చింతలపూడి గ్రామానికి చెందిన కొత్తపాటి గౌతం, పొన్నూరుకు చెందిన గద్దెపూడి నిహాల్ చౌదరిలకు కూడా గాయాలయ్యాయి. వీరిద్దరు ఇంజినీరింగ్ చదువుతున్నారు. సమాచారం అందుకున్న టూటౌన్ సీఐ రామారావు సంఘటనా స్థలానికి చేరుకుని క్షత గాత్రులను హుటాహుటిన 108 వాహన సహాయంతో చీరాల ప్రభుత్వాసుపత్రికి, మరి కొందరిని పట్టణంలోని ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. తీవ్ర రక్త గాయాలైన హకిల్ ఆస్పత్రిలో ప్రాణాలు విడిచాడు. గౌతం కూడా తీవ్రంగా గాయపడడంతో అతని పరిస్థితి కూడా ఆందోళనకరంగా మారింది. దీంతో బాధితుణ్ణి మెరుగైన చికిత్స కోసం గుంటూరు తరలించారు. ఇదే సంఘటనలో రోడ్డు పక్కగా నుంచుని ఐస్‌క్రీమ్ బండిపై ఐస్‌క్రీమ్‌లు విక్రయిస్తున్న జాండ్రపేటకు చెందిన మహబూబ్ బాషా అనే వ్యక్తికి కూడా గాయాలయ్యాయి. సంఘటన జరిగిన సమయంలో క్షతగాత్రులు ఇతనిపై పడడంతో కాలికి తీవ్ర గాయాలయ్యాయి. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. ఒక్కగానొక్కడు హకిల్ తండ్రి డేవిడ్ పాస్టర్‌గా విధులు నిర్వర్తిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. డేవిడ్‌కు హకిల్తో పాటు మరో ఇద్దరు కుమారైలున్నారు. వారికి వివాహాలు అయ్యాయి. ఒక్కగానొక్కడు హకిల్ను ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. హకిల్ ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా కాలేజీకి వెళ్లేందుకు గాను స్వగ్రామం బుర్లవారిపాలెం అయినప్పటికీ చదువు రీత్యా వీఆర్ఎస్అండ్వైఆర్ఎన్ కాలేజీ ప్రాంతంలో అద్దె ఇంట్లో నివాసముంటున్నారు. చదువులో ముందుంటూ అందరితో కలివిడిగా ఉండే హకిల్ మృతి చెందడంతో బుర్లవారిపాలెంలో విషాదఛాయలు అలముకున్నాయి. అప్పటి వరకు అందరితో ఎంతో సంతోషంగా గడిపిన స్నేహితుడు తిరిగిరాని లోకానికి వెళ్లడంతో హకిల్ స్నేహితులు తల్లడిల్లారు. మార్చురీ వద్దకు పెద్ద ఎత్తున హకిల్ స్నేహితులు, పాస్టర్లు చేరుకున్నారు. హకిల్ తల్లి దండ్రులు డేవిడ్, ప్రశాంతిలు శోక సంద్రంలో మునిగిపోయారు. చదువులు పూర్తయ్యి చేతికి అందివస్తాడనుకుంటున్న తరణంలో విధి చేతిలో హతమయ్యావా అంటూ వారు చేసిన ఆర్తనాదాలు చూపరులకు కంటతడి పెట్టించాయి. -
బీ ఫార్మసీ విద్యార్థిని మృతి
సాలూరు రూరల్ (పాచిపెంట): మండలంలోని విశ్వనాధపురం జంక్షన్ వద్ద జాతీయ రహదారి 26పై బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో బీ ఫార్మసీ చదువుతున్న గిరిజన విద్యార్థిని పేటూరి జ్యోతి(19) దుర్మరణం చెందింది. దీనిపై ఎస్.ఐ ఎ.సన్యాసినాయుడు తెలిపిన వివరాలు...బొబ్బిలి సమీపంలో కోమటిపల్లి గ్రామంలోని భాస్కర కళాశాలలో జ్యోతి బీ ఫార్మసీ మొదటి సంవత్సరం చదువుతుంది. జ్యోతి కళాశాలకు వెళ్లేందుకు మండలంలోని పద్మాపురం పంచాయతీ ఫిరంగివలస గ్రామం నుంచి బుధవారం ఉదయం బయల్దేరి రోడ్డుకు చేరుకుని ఆటోకై ఎదురు చూసింది. ఈ క్రమంలో అటుగా వెళ్తున్న తన బంధువులైన దీసరి రాజు, సత్యవతి దంపతులు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఎక్కింది. ముగ్గురు కలిసి ద్విచక్ర వాహనంపై సాలూరు వైపు వస్తుండగా విశ్వనాధపురం జంక్షన్ వద్ద ఎదురుగా వస్తున్న ఒడిశా వైపు వెళ్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో జ్యోతి లారీ కింద పడి అక్కడికక్కడే మృతి చెందింది. దీసరి రాజుకు కుడి కాలు విరిగిపోయి తలకు దెబ్బతగలగా, సత్యవతికి తీవ్ర గాయాలయ్యాయి. వీరి పరిస్థితి విషమంగా ఉండడంతో విశాఖపట్నం కేజీహెచ్‌కు రిఫర్ చేశారు. లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. కళాశాలకు వెళ్తానని చెప్పిన కూతురు మృత్యు ఒడిలోకి వెళ్లిపోవడంతో తల్లిదండ్రులు పేటూరి సత్య, కృష్ణవతి, కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా విలపించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్.ఐ తెలిపారు. ఎమ్మెల్యే సంతాపం సాలూరు: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన పేటూరి జ్యోతి మృతదేహాన్ని పట్టణ ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తీసుకురావడంతో ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ కేంద్రపాలక మండలి సభ్యుడు పీడిక రాజన్నదొర ఆస్పత్రికి చేరుకొని సంతాపం తెలిపారు. ప్రమాదానికి దారితీసిన కారణాలను మృతురా>లి తండ్రి కృష్ణను అడిగి తెలుసుకున్నారు. ఇదే ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన దీసరి రాజు, ఆయన భార్య సత్యవతిని పరామర్శించారు. మెరుగైన వైద్యసేవలు అందజేయాలని వైద్యాధికారులను ఆదేశించారు. -
మనస్తాపంతో రైలు కిందపడి విద్యార్థి మృతి
మేడ్చెల్: కాలేజీ అటెండెన్స్ తక్కువ కారణంగా ల్యాబ్ ఎగ్జామ్‌కు అనుమతించననడంతో బీ.ఫార్మశీ విద్యార్ధి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. మేడ్చెల్ సీఎంఆర్ ఫార్మశీ కాలేజీలో కుత్బుల్లాపూర్‌కు చెందిన ఆదినారాయణమూర్తి కుమారుడు సీఎంఆర్ ఫార్మశీ కాలేజీ బీ.ఫార్మశీ థర్డ్ ఇయర్ చదువుతున్నాడు. కాలేజీకు సరిగా రాకపోవడంతో హాజరుశాతం బాగా తగ్గడంతో ప్రిన్సిపాల్ మందలించి ల్యాబ్ పరీక్షలకు అనుమతించేదిలేదని చెప్పారు. దీంతో మనస్తాపానికి గురైన భార్గవనాయుడు ఆదివారం సాయంత్రం నాంపల్లి సమీపంలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. గుర్తు తెలియని శవంగా భావించిన పోలీసులు విచారణ చేపట్టారు. శవం ఫార్మసీ విద్యార్థి భార్గవ్దిగా మంగళవారం సాయంత్రం గుర్తించారు. దాంతో ఆగ్రహించిన కళాశాల విద్యార్థులు బుధవారం మధ్యాహ్నం కళాశాల ఎదుట ఆందోళన నిర్వహించారు. -
బీఫార్మసీ విద్యార్థి ఆత్మహత్యాయత్నం
నల్గొండ: జిల్లాలోని మిట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో బీఫార్మసీ చదువుతున్న ఓ విద్యార్థి బుధవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. హెచ్ వోడీ వేధింపులు తాళలేక అతడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టు తెలుస్తోంది. గత కొన్నిరోజులుగా హెచ్‌వోడీ తనను వేధింపులకు గురిచేస్తున్నాడంటూ కాలేజీ యాజమాన్యానికి ఫిర్యాదు చేశాడు. అయినా కాలేజీ యాజమాన్యం పట్టించుకోలేదు. దాంతో విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టాడు. గమనించిన తోటి విద్యార్థులు అతన్ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. -
గుండె మార్పిడి జరిగిన విద్యార్థి మృతి
కారంపూడి, న్యూస్‌లైన్: రాష్ట్రంలో తొలి గుండె మార్పిడి జరిగిన విద్యార్థి మృతి చెందాడు. వైద్యులు పునర్జన్మ ప్రసాదించారన్న సంబరం కొద్దినెలలు కూడా నిలువలేదు. గుంటూరు జిల్లా కారంపూడి మండలం పెదకొదమగుండ్లకు చెందిన బి ఫార్మసీ విద్యార్థి వీరాంజనేయులు డైలేటెడ్ కార్డియోపతి వ్యాధితో బాధపడున్నాడు. గత ఏడాది నవంబరు 11న హైదరాబాద్‌లోని అపోలో ఆస్ప త్రి వైద్యులు అతనికి ఆపరేషన్ నిర్వహించి, గుండె మార్పిడి చేశారు. యశోదా ఆసుపత్రిలో మెదడులో రక్తనాళాలు చిట్లడం వల్ల కొద్ది సమయంలో చనిపోబోతున్న వ్యక్తి నుంచి గుండెతీసి వీరాంజనేయులుకు అమర్చారు. అపోలో వైద్యులు దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకుని విదేశాల లో రూ.కోటి పైన ఖర్చుయ్యే ఆపరేషన్‌ను ఉచితంగా చేసి అతడికి ప్రాణం పోశారు. వాస్తవానికి మన రాష్ట్రంలో మొదటసారి జరిగిన అరుదైన ఆపరేషన్‌గా వైద్యరంగంలో ఇది అప్పట్లో సంచలనం అయింది. అప్పటి నుంచి ఇంటి దగ్గరే వుంటున్నాడు. ఆదివారం ఉన్నట్టుండి వీరాంజనేయులు అస్వస్థతకు గురవడంతో డాక్టర్ సలహాపై హైదరాబాద్ తీసుకెళ్లారు. అక్కడ వైద్యసేవలు అందిస్తుండగా మృతి చెందాడు.