సాక్షి, తూర్పుగోదావరి: అనారోగ్య పరిస్థితుల కారణంగా తరగతులకు హాజరుకాలేకపోయిన ఇద్దరు విద్యార్థినులను పరీక్షలకు హాజరు కాలేకపోయారు. దీంతో తమ ఆవేదనను ‘సాక్షి’తో పంచుకున్నారు. హరిత, మోనా అనే స్టూడెంట్స్ కాకినాడ జేఎన్టీయూలో బీ ఫార్మసీ చివరి ఏడాది చదువుతున్నారు.
హైదరాబాద్‌కు చెందిన హరితకు పచ్చ కామెర్లు కావడం, గుంటూరుకు చెందిన మోనా వాళ్ల తల్లికి క్యాన్సర్ రావడంతో తరగతులకు హజరు కాలేకపోయారు. దీంతో హాజరు తగ్గిందని వీరిద్దరిని తరగతి అధ్యాపకులు ఫైనల్ సెమిస్టర్ పరీక్షలకు అనుమతించలేదు. ఈ నేపథ్యంలో జేఎన్టీయూ వీసీ రామలింగరాజు కలిసినా పరీక్షలు రాసేందుకు అనుమతి లభించకపోవడంతో వీరిద్దరూ ఆవేదన వ్యక్తం చేశారు. పరీక్షలు రాసేందుకు అనుమతించాలని కోరుతున్నారు. (విద్యార్థులకు వరం.. ఏపీ కెరీర్ పోర్టల్)
Comments
Please login to add a commentAdd a comment