Rottela panduga
-
రొట్టెల పండుగ : భక్తజనంతో పరవళ్లు తొక్కిన స్వర్ణాల తీరం (ఫొటోలు)
-
నెల్లూరులో రెండో రోజు ఘనంగా రొట్టెల పండుగ..(ఫొటోలు)
-
నెల్లూరు : స్వర్ణాల చెరువులో కోర్కెలు తీర్చే రొట్టెల పండుగ (ఫొటోలు)
-
నెల్లూరు : బారాషహీద్ దర్గా వద్ద రొట్టెల పండుగ భక్తుల సందడి (ఫొటోలు)
-
నెల్లూరు : రొట్టెల పండగ...జనసంద్రంగా స్వర్ణాలచెరువు (ఫోటోలు)
-
రొట్టెల పండుగకు పెరిగిన భక్తుల తాకిడి
-
Rottela Panduga : నెల్లూరులో రొట్టెల పండుగ (ఫొటోలు)
-
ఘనంగా రొట్టెల పండుగ ప్రారంభం
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: కులాలు, మతాలకతీతంగా నిర్వహించుకునే నెల్లూరు రొట్టెల పండుగ శనివారం ఘనంగా ప్రారంభమైంది. కోర్కెలు తీరిన భక్తులు రొట్టెలు వదిలేందుకు... కొత్త కోర్కెలతో రొట్టెలు తీసుకునేందుకు వచ్చిన భక్తులతో బారాషహీద్ దర్గా ప్రాంగణం తొలి రోజు కిటకిటలాడింది. వరాల రొట్టెలు మార్చుకునే స్వర్ణాల చెరువు భక్తులతో నిండిపోయింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలవారు, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు హాజరయ్యారు. ఐదు రోజులపాటు నిర్వహించనున్న రొట్టెల పండుగలో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు తలెత్తకుండా అధికార యంత్రాంగం పకడ్బందీగా ఏర్పాట్లు చేసింది. జిల్లా కలెక్టర్ ఎం.హరినారాయణన్, జాయింట్ కలెక్టర్ కూర్మనాథ్, కార్పొరేషన్ కమిషనర్ వికాస్ మర్మత్, అసిస్టెంట్ కలెక్టర్ విద్యాధరి ఏర్పాట్లు పర్యవేక్షించారు. అంచనాకు మించి రెట్టింపు స్థాయిలో భక్తులు వచ్చినా ఆటంకాలు లేకుండా ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో, వివిధ ప్రైవేటు హాస్పిటల్స్ వారు స్వచ్ఛందంగా ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. నిఘా నీడలో... రొట్టెల పండుగ సందర్భంగా దర్గా ఆవరణతోపాటు స్వర్ణాల చెరువు, పార్కింగ్ ప్రదేశాల్లో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటుచేశారు. ఆయా ప్రాంతాల్లో 50 సీసీ కెమెరాలు ఏర్పాటుచేసి నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. తప్పిపోయిన చిన్నారులు, వృద్ధుల సమాచారాన్ని పోలీస్ కమాండ్ కంట్రోల్ విభాగం ద్వారా తెలియజేసి వారి కుటుంబ సభ్యులకు క్షేమంగా అప్పగిస్తున్నారు. స్వర్ణాల చెరువు తీరం వెంబడి చిన్నారులు లోతుగా వెళ్లకుండా పటిష్టమైన నిఘా పెట్టారు. ముఖ్యంగా మహిళా భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. -
Nellore Dargah Rottela Panduga Photos: నేటి నుంచి రొట్టెల పండగ ప్రారంభం (ఫొటోలు)
-
నెల్లూరు: నేటి నుంచి రొట్టెల పండగ ప్రారంభం (ఫొటోలు)
-
స్వర్ణాల తీరం.. జనసంద్రం
రొట్టెల పండగకు భక్తులు పోటెత్తారు. స్వర్ణాల తీరానికి వెళ్లే ప్రతి మార్గం గురువారం కిటకిటలాడింది. బారాషహీద్‌లను స్మరించుకుని కోర్కెలు తీరాలని చెరువులో ఒకరికొకరు రొట్టెలు మార్చుకున్నారు. పండగకు అధికార యంత్రాంగం పక్కాగా ఏర్పాట్లు చేసింది. ప్రజాప్రతినిధులు పర్యవేక్షించి ఎవరికీ ఇబ్బందుల్లేకుండా చూడాలని ఆదేశాలిచ్చారు. నెల్లూరు సిటీ: స్వర్ణాల తీరం జనసంద్రమైంది. గంధ మహోత్సవం తర్వాత రొట్టెల కోసం పెద్దఎత్తున భక్తులు తరలివస్తుంటారు. ఈక్రమంలో దేశ, విదేశాల నుంచి గురువారం దర్గాకు అధికంగా వచ్చి బారాషహీద్‌లను దర్శించుకుని కోర్కెల రొట్టెలను స్వీకరించారు. బుధవారం అర్ధరాత్రి దాటాక ప్రారంభమైన గంధ మహోత్సవం గురువారం తెల్లవారుజాము వరకు జరిగింది. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు వేలాది మంది తరలివచ్చారు. నెల్లూరు సిటీ, రూరల్ ఎమ్మెల్యేలు డాక్టర్ పి.అనిల్‌కుమార్ యాదవ్, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డి, ముఖ్య నాయకులు విచ్చేసి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఏర్పాట్ల పరిశీలన ప్రభుత్వ ఆదేశాల నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో విస్తృతంగా ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా కార్పొరేషన్, రెవెన్యూ, పోలీసు, ఇతర శాఖలు సమన్వయంతో విధులు నిర్వహిస్తున్నారు. పారిశుద్ధ్యం, తాగునీరు, ఘాట్ నిర్వహణ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జరుగుతోంది. పక్క జిల్లాలు, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు ఏర్పాట్లు బాగున్నాయని ప్రశంసించారు. ఆరోగ్య రొట్టె ఉందా? ఈ ఏడాది ఆరోగ్య రొట్టెకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. దీనికోసం అనేకమంది వెతుకులాడారు. రెండు సంవత్సరాలపాటు కరోనా మహమ్మారి కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అనేకమంది వైరస్ బారినపడి అనారోగ్య సమస్యలు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆరోగ్య రొట్టె కోసం డిమాండ్ ఏర్పడిందని చెబుతున్నారు. బందోబస్తును పరిశీలించిన ఎస్పీ నెల్లూరు(క్రైమ్): రొట్టెల పండగ సందర్భంగా గురువారం బారాషహీద్ దర్గాకు ఎస్పీ సీహెచ్ విజయారావు విచ్చేశారు. ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం దర్గా ఆవరణలో బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు. రొట్టెల మార్పిడి ప్రదేశంలో భద్రతను కట్టుదిట్టం చేయాలని, నిర్దేశిత ప్రదేశంలోనే రొట్టెలు మార్పిడి చేసుకునేలా చూడాలని సిబ్బందికి సూచించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గంధ మహోత్సవం సజావుగా జరిగేందుకు సహకరించిన ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. తల్లిదండ్రులకు అప్పగింత గురువారం దర్గా ఆవరణం భక్త జనసందోహంతో కిక్కిరిసింది. క్రైమ్ పోలీసులు మఫ్టీలో తిరుగుతూ నేరస్తుల కదలికలపై నిఘా ఉంచారు. ఓ పాతనేరస్తుడిని అదుపులోకి తీసుకుని రూ.3 వేల నగదు, ఓ బ్యాగ్‌ను స్వాధీనం చేసుకుని బాధితుడికి వాటిని అప్పగించారు. తప్పిపోయిన పదిమంది చిన్నారులను పోలీసులు సంరక్షించి వారి తల్లిదండ్రులకు అప్పగించారు. ట్రాఫిక్‌కు ఎలాంటి అంతరాయం కలగకుండా ఏఎస్పీ (క్రైమ్స్) కె.చౌడేశ్వరి పర్యవేక్షణలో నగర ట్రాఫిక్ డీఎస్పీ అబ్దుల్ సుభాన్, నార్త్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మిద్దె నాగేశ్వరమ్మ పటిష్ట చర్యలు తీసుకున్నారు. మంటలు ఆర్పే పరికరాల ఏర్పాటు అగ్ని ప్రమాదాలు జరగకుండా అగ్నిమాపక సిబ్బంది పటిష్ట చర్యలు చేపట్టారు. దర్గా ప్రధాన ద్వారంతోపాటు దుకాణాల వద్ద మంటలను ఆర్పే సిలిండర్లు, పరికరాలను అందుబాటులో ఉంచారు. రొట్టెల మార్పిడి ప్రదేశం వద్ద ఫైర్ ఇంజిన్లు, మినీవాటర్ టెండర్లు, మిస్ట్ బుల్లెట్లు, రెస్క్యూ బోట్లను అందుబాటులో ఉంచారు. అగ్నిమాపక« అధికారి కె.శ్రీకాంత్‌రెడ్డి పర్యవేక్షణలో సిబ్బంది దర్గా ఆవరణలో విధులు నిర్వహిస్తున్నారు. రొట్టెల కోసం.. నెల్లూరు(మినీబైపాస్): కోర్కెల రొట్టెలు పట్టుకునేందుకు స్వర్ణాల చెరువు వద్దకు భక్తులు భారీగా తరలివచ్చారు. ఆరోగ్య, వ్యాపార, ధన, చదువు, గృహ తదితర రొట్టెలను తీసుకునేందుకు పోటీ పడ్డారు. ఇల్లు నిర్మించుకోవాలని.. చాలా సంవత్సరాల నుంచి ఇల్లు నిర్మంచుకోవాలని కోరిక. పలువురు చెప్పడంతో ఇక్కడికి వచ్చి గృహ రొట్టె పట్టుకున్నా. జనాన్ని చూసిన తర్వాత ఇల్లు కట్టుకుంటామని నమ్మకం కుదిరింది. – లలిత, నెల్లూరు ఆరోగ్య రొట్టె పట్టుకున్నా ప్రతి సంవత్సరం రొట్టల పండగకు వస్తున్నా. పలురకాల రొట్టె పట్టుకున్నా. ఈ ఏడాది ఆరోగ్య రొట్టె పట్టుకున్నా. అందరూ బాగుండాలని ప్రార్థించా. – రసూల్, నెల్లూరు -
రొట్టెల పండగ ముగింపు ఉత్సవంలో భక్తుల సందడి ( ఫొటోలు)
-
కోర్కెల రొట్టె.. ఒడిసి పట్టు
మతసామరస్యానికి ప్రతీకగా జరిగే రొట్టెల పండగలో విద్య, ఉద్యోగం, వ్యాపారం, ధనం, సౌభాగ్యం, వివాహం, ఆరోగ్యం, ప్రమోషన్, గృహం.. కోర్కెల రొట్టెలను ఒడిసి పట్టుకునేందుకు భక్తులు పోటీ పడ్డారు. మది నిండా భక్తి, విశ్వాసంతో కోరిన కోర్కె›లు తీరి వదిలే రొట్టెలు, కోర్కెలతో రొట్టెలను పట్టుకునే భక్తులతో పవిత్ర స్వర్ణాల తీరం జనసంద్రంగా మారింది. భక్తజనంతో బారాషహీద్ దర్గా పులికించింది. ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి నెల్లూరు సిటీ: ఎన్నెన్నో కోర్కెలతో రొట్టెల పండగకు వచ్చిన భక్తులతో బుధవారం బారాషహీద్ దర్గా పరిసరాలు కిటకిటలాడుతున్నాయి. నమ్మకానికి ప్రతీకగా ఉండే బారాషహీద్‌లను దర్శించుకునే భక్తులతో దర్గా దారులు జనప్రవాహమయ్యాయి. స్వర్గాల చెరువు జనసంద్రమైంది. విద్య, ఆరోగ్య, వివాహ, సౌభాగ్యం వరాలను పొందేందుకు భక్తులు భారీగా చేరుకున్నారు. దర్గా ఆవరణలోని స్వర్ణాల చెరువు వద్ద భక్తులు రొట్టెలు మార్చుకున్నారు. ఉద్యోగం, వివాహం, ఆరోగ్య ఇతర రొట్టెలను తీసుకున్నారు. అనంతరం క్యూలైన్లలో నిరీక్షించి 12 మంది అమరవీరులను స్మరిస్తూ, దర్శించుకున్నారు. వృద్ధులు, దివ్యాంగులకు ఉచిత రవాణా బారాషహీద్ దర్గాకు వచ్చే భక్తుల్లో నడవలేని వృద్ధులు, దివ్యాంగులను కార్పొరేషన్ ఉన్నతాధికారుల కారుల్లో దర్గా వరకు తీసుకెళ్లి తీసుకువస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులు దర్గాను సందర్శించేందుకు, రొట్టెలు మార్చుకునేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. వీల్చైర్లను సైతం ఏర్పాటు చేసి భక్తులకు దర్గాను సందర్శించేందుకు అవకాశం కల్పించారు. దీంతో భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎస్పీ విజయారావు, కమిషనర్ హరిత, ఇతర అధికారులు దర్గా ప్రాంగణంలో పర్యటించారు. ధనం రొట్టె వదిలాను మేము ఐదేళ్లు గా ఇక్కడకు వస్తున్నాం. కోరిన కోరి కలు మాకు తీరుతున్నాయి. రెండేళ్లుగా కరోనా కారణంగా రాలేదు. ఇప్పుడు ధనం రొట్టెను వదిలాను. ప్రస్తుతం ఆరోగ్య రొట్టెను పట్టుకున్నాను. మాతో పాటు మా బంధువులు కూడా వచ్చారు. – సుల్తానా బేగం, హైదరాబాద్ ప్రతి ఏటా ఇక్కడికి వస్తున్నాం. మేము కోరుకున్న కోరికలన్నీ నెరవేరాయి. నా ఆరోగ్యం చాలా బాగోలేదు. రొట్టెను పట్టుకున్నాక.. కుదుట పడింది. అందుకే ఇప్పుడు కూడా ఆరోగ్య రొట్టెను పట్టుకున్నాను. చాలా సేపటి నుంచి ప్రయత్నిస్తే ఇప్పుడు దొరికింది. – హసీనా, కోలార్ భక్త సుగంధమై.. రొట్టెల పండగలో కీలక ఘట్టం గంధమహోత్సవం. బుధవారం అర్ధరాత్రి దాటాక కోటమిట్టలోని అమీనియా మసీదులో సంప్రదాయంగా మతపెద్దలు, పీఠాధిపతుల ఆధ్వర్యంలో అత్తర్లు.. సుగం«ధ «ద్రవ్యాలు.. పన్నీరుతో పవిత్ర గంధాన్ని 12 బిందెల్లో భక్తిశ్రద్ధలతో కలిపారు. ప్రత్యేక ప్రార్థనలు, నమాజు అనంతరం గంధం నింపిన బిందెలను తీసుకుని విశేషంగా అలంకరించిన వాహనంపైకి చేర్చారు. ముందు నిషాని జెండా వెళ్తుండగా అశేష భక్తజనం వెంటరాగా భారీ బందోబస్తు నడుమ గంధమహోత్సవం కోటమిట్ట, జెండావీధి, పెద్దబజారు, ఆర్టీసీ బస్టాండ్, కేవీఆర్ పెట్రోలు బంక్, జిల్లా పోలీసు కార్యాలయం, డీకేడబ్ల్యూ కళాశాల మీదుగా బారాషహీద్‌ల దర్గా వద్దకు చేరింది. కడప పెద్ద దర్గా పీఠాధిపతి ఆరీఫుల్లా హుస్సేనీ ఆధ్వర్యంలో ముజావర్లు, ఫకీర్లు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం 12బిందెలలో తెచ్చిన గంధాన్ని బారాషహీద్‌లకు లేపనం చేశారు. అనంతరం గంధాన్ని భక్తులకు పంచారు. గంధాన్ని అందుకునేందుకు భక్తులు పోటీ పడ్డారు. కార్యక్రమాలను దర్గా ఫెస్టివల్ కమిటీ, దర్గా పరిరక్షణ కమిటీ, వక్ఫ్‌బోర్డు పర్యవేక్షించారు. – నెల్లూరు (బృందావనం) -
Rottela Panduga: కోర్కెల రొట్టె.. ఒడిసి పట్టు.. రెండో రోజు భారీగా హాజరైన భక్తులు
-
Rottela Panduga 2022: దారులన్నీ దర్గావైపు..!
సింహపురి దారులన్నీ బారాషహీద్ దర్గా వైపే మళ్లాయి. వరాల రొట్టెలను ఒడిసి పట్టుకునేందుకు స్వర్ణాల చెరువుకు భక్తులు పోటెత్తారు. కరోనా వైరస్ కారణంగా రెండేళ్ల విరామం తర్వాత రొట్టెల పండగ జరగడంతో దర్గా భక్తులతో కిటకిటలాడింది. మతసామరస్యానికి ప్రతీకగా జరిగే రొట్టెల పండగలో కోర్కెలు తీరిన భక్తులు రొట్టెలు వదిలేందుకు.. కొత్త కోర్కెల రొట్టెలు పట్టుకునేందుకు వివిధ రాష్ట్రాలు, ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులతో స్వర్ణాల చెరువు, బారాషహీద్ దర్గా వద్ద సందడి నెలకొంది. సాక్షి, నెల్లూరు: కుల, మతాలకు అతీతంగా, మతసామరస్యానికి ప్రతీకగా ఏటా ప్రతిష్టాత్కకంగా జరిగే రొట్టెల పండగ భక్తుల తాకిడి తొలి రోజే ద్విగుణీకృతమైంది. మంగళవారం నుంచి ప్రారంభమైన పండగ ఐదురో జుల పాటు 13వ తేదీ వరకు జరగనుంది. రెండేళ్ల విరామం తర్వాత జరుగుతున్న పండగ కావడంతో దేశ, విదేశాల నుంచి ఈ ఏడాది భారీగా భక్తులు హాజరయ్యే అవకాశం ఉంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులే కాకుండా కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల భక్తుల తొలిరోజు భారీగా హాజరయ్యారు. వరాల రొట్టెల బోర్డులు స్వర్ణాల చెరువు ఘాట్‌లో భక్తుల సౌకర్యార్థ్యం వివిధ కోర్కెల రొట్టెల బోర్డులను ఏర్పాటు చేశారు. ప్రధానంగా విద్య, ఆరోగ్యం, సౌభాగ్యం, ఉద్యోగం, వివాహం, సంతానం, ధనం రొట్టెల ఘాట్‌ల్లో భక్తుల రద్దీ ఎక్కువగా కనిపిస్తోంది. గతంలో భక్తులు ఏ కోర్కెతో రొట్టెను తీసుకున్నారో.. ఆ కోర్కె తీరితే తిరిగి రొట్టెను వదలాల్సి ఉంది. ఈ ఏడాది ఎక్కువ మంది భక్తులు ఆరోగ్య రొట్టెను తీసుకుంటున్నారు. కరోనా వైరస్ కారణంగా ఆరోగ్య రొట్టెకు డిమాండ్ పెరిగినట్లు భక్తులు చర్చించుకుంటున్నారు. మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి పరిశీలన రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి మంగళవారం బారాషహీద్ దర్గా ప్రాంగణాన్ని సందర్శించారు. రొట్టెల పండగకు హారయ్యే భక్తుల సౌకర్యాలు, ఏర్పాట్లు పర్యవేక్షించారు. పోలీసుశాఖ ఏర్పాటు చేసినా సీసీ కెమెరాల మానిటరింగ్ కేంద్రం నుంచి అన్నీ ప్రాంతాలను పరిశీలించారు. భక్తులు రద్దీ పెరిగితే అందుకు తగ్గట్లు సౌకర్యాలు నిర్వహణపై దిశానిర్దేశం చేశారు. పటిష్ట ఏర్పాట్లపై కలెక్టర్ చక్రధర్‌బాబు, ఎస్పీ విజయారావు, నగర పాలక సంస్థ కమిషనర్ హరితను అభినందించారు. రాబోయే ఏడాదిలో శాశ్వత అభివృద్ధి పనులు పూర్తి చేసి రొట్టెల పండగ నిర్వహించేలా చర్యలు తీసుకుంటామన్నారు. భక్తుల విశ్వాసానికి తగ్గట్లుగా అభివృద్ధి చేయాలని భావిస్తున్న నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిని అభినందించారు. ఎమ్మెల్యే చొరవతో వివిధ అభివృద్ధి పనులు నిర్వహణకు రూ.15 కోట్లకు ప్రభుత్వం అనుమతి లభించిందని మంత్రి తెలిపారు. పోటాపోటీగా వైద్యశిబిరాలు బారాషహీద్ దర్గాలో భక్తులకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తినా ప్రాథమిక చికిత్స అందించేందుకు వైద్య శిబిరాలు వెలిశాయి. వైద్య ఆరోగ్యశాఖ నేతృత్వంలోనే కాకుండా కార్పొరేట్ ఆస్పత్రులు మెడికేర్, అపోలో, కిమ్స్, యశోద యాజమాన్యాలు రెడ్‌క్రాస్, ఆయూష్ విభాగాలు ప్రత్యేక వైద్యశిబిరాలను ఏర్పాటు చేశారు. భక్తులకు అవసరమైన చికిత్స అందించేందుకు వైద్య సిబ్బంది, మందులను అందుబాటులో ఉంచారు. అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించుకునేందుకు అంబులెన్సులు కూడా అందుబాటులో ఉంచారు. సేవా కార్యక్రమాలు నిర్వహణ కోసం ఎవరి స్థాయిలో వారు విస్తృత ఏర్పాట్లు చేశారు. భారతి సిమెంట్స్ యాజమాన్యం ఉచితంగా వాటర్ ప్యాకెట్లు పంపిణీ చేస్తోంది. భారతి సిమెంట్స్ ప్రతినిధి మల్లికార్జునరెడ్డి దగ్గరుండీ భక్తులకు ఉచితంగా వాటర్ ప్యాకెట్లు అందించారు. పారిశుద్ధ్య పనులు భేష్ భక్తులు రద్దీ ఏ స్థాయిలో ఉన్నా బారాషహీద్ దర్గా ప్రాంగణంలో చక్కటి పారిశుద్ధ్య నిర్వహణకు కార్పొరేషన్ యంత్రాంగం శ్రీకారం చుట్టింది. మూడు షిఫ్ట్‌లు విభజించి ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య లోపం లేకుండా చర్యలు చేపట్టింది. నగర కమిషనర్ హరిత స్వీయ పర్యవేక్షణలో కార్పొరేషన్ విభాగం చురుగ్గా వ్యవహరిస్తోంది. పోలీసుశాఖ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి మానటరింగ్ కేంద్రం నుంచి పర్యవేక్షిస్తోంది. ఎస్పీ విజయారావు పర్యవేక్షణలో అదనపు ఎస్పీలు హిమవతి, చాముండేశ్వరీ, గాదె శ్రీనివాసులు, డీఎస్పీలు గాంధీ, హరినాథరెడ్డి, అబ్దుల్ సుభాహాన్, శ్రీనివాసులు తదితరులు షిప్ట్‌ల వారిగా దగ్గరుండీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. ట్రాఫిక్, బందోబస్తు నిర్వహణలో ఎలాంటి లోపం లేకుండా సమీక్షిస్తున్నారు. సమాచారశాఖ వైఖరితో మీడియా అసంతృప్తి బారాషహీద్ దర్గా కవరేజ్ నిమిత్తం మీడియాకు రెవెన్యూ యంత్రాంగం పాసులు జారీ చేసింది. సోమవారం సాయంత్రమే ఆర్డీఓ మలోల పాసులను సమాచారశాఖ ఉన్నతాధికారికి అప్పగించారు. మంగళవారం రొట్టెల పండగ ప్రారంభమైనా మీడియా ప్రతినిధుల కు పాసులు అందలేదు. పోలీసు యంత్రాంగం ఎక్కడిక్కడ మీడియాను కట్టడి చేసింది. ప్రభుత్వం జారీ చేసినా అక్రిడిటేషన్ కార్డులు చూపించినా అడ్డగించారు. ఒక దశలో నెల్లూరురూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దర్గా ప్రాంగణం పరిశీలనకు వచ్చిన మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి దృష్టికి మీడియా ప్రతినిధులకు ఈ విషయాన్ని తీసుకెళ్లారు. పాసులు ఇవ్వకపోవడంపై అక్కడే ఉన్న సదరు ఉన్నతాధికారిని మంత్రి కాకాణి ప్రశ్నిస్తే తాను సోమవారం సెలవులో ఉన్నానని చెప్పారు. సెలవులో ఉంటే పాసులు జారీ చేయడానికి ఇబ్బంది ఏమిటని నిలదీశారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు మాట్లాడుతూ జిల్లాలో ఎలాంటి అధికారిక కార్యక్రమం అయినా మీడియా ప్రతినిధులకు సమాచారశాఖ నుంచి ఇబ్బందులు తప్పడంలేదని ఆరోపించారు. భక్తిశ్రద్ధలతో షహదత్, సొందల్మాలి నెల్లూరు (బృందావనం): రొట్టెల పండగ తొలి రోజు సంప్రదాయంగా మంగళవారం రాత్రి అమరులైన 12 మంది యోథులను స్మరిస్తూ దర్గా ప్రాంగణంలో బారాషహీద్‌ల సమాధుల చెంత షహదత్ (ప్రత్యేక ప్రార్థనలు) నిర్వహించారు. షహదత్లో భాగంగా 12 మంది వీరుల సమాధులను మత పెద్దలు రాత్రి 11.30 నుంచి 2 గంటల వరకు గులాములు, పన్నీరుతో శుభ్రం చేసి అనంతరం గంధం లేపనం చేసి ‘సొందల్ మాలి’ నిర్వహించారు. నేడు గంధమహోత్సవం రొట్టెల పండగలో భాగంగా రెండో రోజు బుధవారం రాత్రి బారాషహీద్‌ల గంధమహోత్సవం జరగనుంది. కోటమిట్టలోని అమీనియా మసీదు నుంచి సంప్రదాయంగా గంధాన్ని తీసుకువచ్చి బారాషహీద్‌లకు లేపనం చేస్తారు. అనంతరం భక్తులకు ఆ గంధాన్ని, ప్రసాదాన్ని పంచి పెడతారు. రొట్టెల పండగలో ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుని అంగరంగ వైభవంగా జరిగే గంధ మహోత్సవాన్ని వీక్షించేందుకు భక్తులు లక్షలాదిగా తరలిరానున్నారు. రొట్టెల పండగపై పోలీస్ నిఘా నెల్లూరు (క్రైమ్): బారాషహీద్ దర్గాలో మంగళవారం రొట్టెల పండగ ప్రారంభమైంది. జిల్లా పోలీసు యంత్రాగం 2,173 మంది సిబ్బందితో భారీ బందోబస్తును ఏర్పాటు చేసింది. మహిళల రక్షణ నిమిత్తం స్వర్ణాలచెరువు ఘాట్, దర్గా ఆవరణలో ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేశారు. దర్గాలో 76 సీసీ కెమెరాలు, రెండు డ్రోన్లను ఏర్పాటు చేసి పోలీసు అవుట్‌పోస్టులోని తాత్కాలిక కమాండ్ కంట్రోల్ రూమ్‌కు అనుసంధానం చేశారు. పోలీసు అ«ధికారులు, సిబ్బంది అక్కడి నుంచి నిరంతర పర్యవేక్షిస్తూ అవసరమైన సూచనలు, సలహాలిస్తున్నారు. దర్గాలో మంగళవారం తప్పిపోయిన 21 మంది చిన్నారులను వారి తల్లిదండ్రులకు అప్పగించారు. క్రైమ్ పోలీసులు మఫ్టీలో తిరుగుతూ జేబు, గొలుసు దొంగలపై దృష్టి సారించారు. ఓ జేబు దొంగను అదుపులోకి తీసుకున్నారు. భద్రతా ఏర్పాట్ల పరిశీలన ఎస్పీ సీహెచ్ విజయారావు దర్గా ఆవరణలో భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. తాత్కాలిక కమాండ్ కంట్రోల్ పని తీరును ఆయన స్వయంగా వీక్షించారు. భక్తుల సంఖ్య పెరుగుతున్న క్రమంలో క్రైం పార్టీ సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. మఫ్టీలో తిరుగుతూ నేరాలు జరగకుండా చూడాలన్నారు. నేర నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలను పబ్లిక్ అడ్రస్సింగ్ సిస్టం ద్వారా భక్తులకు తెలియజేయాలన్నారు. అనంతరం ఆయన దర్గా క్యూలైన్లు, రొట్టెల మార్పిడి, పార్కింగ్ ప్రదేశాలను పరిశీలించి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. ఆయన వెంట ఏఎస్పీలు, డీఎస్పీలు తదితరులున్నారు. -
నెల్లూరు : రొట్టెల పండగ ప్రారంభం...దర్గాకు పోటెత్తిన జనం (ఫొటోలు)
-
రొట్టెల పండుగకు ముస్తాబైన బారాషహీద్ దర్గా
-
ఫలించిన ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి కృషి.. సీఎం జగన్‌కు కృతజ్ఞతలు
సాక్షి, నెల్లూరు: బారాషహీద్ దర్గా అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది. సమగ్రాభివృద్ధి కోసం రూ.15 కోట్లు మంజూరు చేస్తూ సోమవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది. కలెక్టర్ చక్రధర్‌బాబు నివేదిక ఆధారంగా నిధులు మంజూరు చేసింది. దర్గా ప్రాంగణంలో కాంప్లెక్స్, ఇంటర్నల్ సిమెంట్ రోడ్లు, స్వర్ణాల చెరువు తదితర అభివృద్ధి పనులను అనుమతి దక్కింది. రొట్టెల పండగ నాడు భక్తులకు తీపి కబురు లభించింది. బారాషహీద్ దర్గా అభివృద్ధికి ప్రజా ప్రతినిధుల అభ్యర్థన మేరకు కలెక్టర్ నివేదిక ఆధారంగా నిధులు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ‘బారాషహీద్ దర్గా ప్రాంగణంలో ఉన్నంత వరకు తాను భక్తుడినే. ప్రాంగణం బయట మాత్రమే ఎమ్మెల్యేను, చిత్తశుద్ధితో దర్గా అభివృద్ధి కోసం కృషి చేస్తానను’ అని కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి చెప్పిన మాట నిలబెట్టుకున్నారు. చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డితో సమీక్షించి, కలెక్టర్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందించారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి కోటంరెడ్డి సోదరులు ప్రత్యేకంగా తీసుకెళ్లారు. జిల్లాలో అత్యంత ప్రతిష్టాత్మకమైన బారాషహీద్ దర్గా ప్రాంగణంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులను వివరించారు. దీంతో దర్గా అభివృద్ధి పనుల కోసం రూ.15 కోట్ల నిధులు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. చదవండి: (Rottela Panduga: భక్తులతో పోటెత్తిన స్వర్ణాల చెరువు) సీఎం వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే రొట్టెల పండగ జరిగే బారాషహీద్ దర్గా అభివృద్ధికి రూ.15 కోట్ల నిధులు కేటాయించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కృతజ్ఞతలు. రొట్టెల పండగ నాడు తీపి కబురు లభించడంపై దర్గా భక్తుడిగా చాలా ఆనందంగా ఉంది. దర్గా అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేశాను. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తోడ్పాటుతో సాధ్యమైంది. – కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే చదవండి: (త్యాగానికి, ధర్మ పరిరక్షణకు ప్రతీక మొహర్రం : సీఎం వైఎస్ జగన్) -
బారాషహీద్ దర్గాకు పోటెత్తిన భక్తులు (ఫొటోలు)
-
Rottela Panduga: భక్తులతో పోటెత్తిన స్వర్ణాల చెరువు
మతాలకు, కులాలకు అతీతంగా మతసామరస్యంగా జరిగే రొట్టెల పండగ కరోనా కారణంగా రెండేళ్ల విరామం తర్వాత ఈ ఏడాది జరుగుతోంది. దీంతో ముందుగానే తీరిన కోర్కెల రొట్టెలు వదిలేందుకు.. కొత్త కోర్కెల రొట్టెలు పట్టుకునేందుకు వచ్చే భక్తులతో బారాషహీద్ దర్గా ప్రాంగణం కిటకిటలాడింది. రొట్టెల మార్చుకునే స్వర్ణాల చెరువు భక్తులతో పోటెత్తింది. సాక్షి, నెల్లూరు: రొట్టెల పండగ ప్రారంభానికి ముందే భక్తుల రాక ద్విగుణీకృతమైంది. సోమవారం ఉదయం నుంచి స్వర్ణాలచెరువు వద్ద కోర్కెల రొట్టెలను మార్చుకున్నారు. నాలుగు రోజుల నుంచి వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు బారాషహీద్ దర్గాకు చేరుకుంటున్నారు. భక్తులు భారీగా రావడంతో దర్గా ప్రాంగణంలో సందడి ప్రారంభమైంది. నగర పాలక సంస్థ, పోలీసు, విద్యుత్, ఆరోగ్యశాఖ, ఇతర శాఖల అధికారులు సమన్వయంతో అన్ని ఏర్పాట్లు చేశారు. ఏటా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే రొట్టెల పండగ మంగళవారం ప్రారంభం కానుంది. ఐదు రోజుల పాటు రొట్టెల పండగ జరుగుతోంది. జాతీయ రహదారుల నుంచి నగరంలోకి ప్రవేశించే మార్గంలో బారాషహీద్ దర్గాకు రూట్ మ్యాప్ సూచిస్తూ భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దర్గా ప్రాంగణం విద్యుత్ వెలుగులు విరజిమ్ముతున్నాయి. దర్గా ఆవరణలో చిన్నారులు ఆడుకునేందుకు ఆట వస్తువులు, జైంట్వీల్లు ఏర్పాటు చేశారు. ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి తాగునీటి కేంద్రాలు, స్నానపు గదులు, మరుగుదొడ్లు మహిళలు, పురుషులకు విడివిడిగా ఏర్పాటు చేశారు. భక్తులకు ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు అందుబాటులో 108 వాహనాలు, ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేశారు. దూరప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ఇబ్బంది పడకుండా భారీ జింక్షీట్లు ఏర్పాటు చేశారు. స్వర్ణాల చెరువు వద్ద భక్తులు ప్రమాదాలకు గురికాకుండా కంచెను ఏర్పాటు చేశారు. చెరువు వద్ద గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచారు. చెరువులో నీరు మురుగు చేరకుండా ఎప్పటికప్పుడు మోటార్లతో శుద్ధి చేస్తున్నారు. 15 వేలకు పైగా భక్తులు హాజరు దర్గాకు సోమవారం 15 వేల మందికి పైగా భక్తులు హాజరయ్యారు. కోర్కెల రొట్టెలను మార్చుకుని భక్తిశ్రద్ధలతో దర్గాను సందర్శించారు. కర్ణాటక, తమిళనాడు, కేరళ, తెలంగాణ రాష్ట్రాల నుంచి భక్తులు అధికంగా హాజరయ్యారు. రొట్టెల పండగకు ముందుగానే భక్తులు భారీగా వచ్చే అవకాశం ఉండడంతో అధికారులు కూడా ఏర్పాట్లు పూర్తి స్థాయిలో చేశారు. భక్తులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకున్నారు. అధికారుల సమన్వయంతో... కార్పొరేషన్, పోలీసు, ఆరోగ్య, విద్యుత్‌శాఖ, ఇతర శాఖల అధికారులు సమన్వయంతో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కలెక్టర్ చక్రధర్‌బాబు, ఎస్పీ విజయారావు, కార్పొరేషన్ కమిషనర్ హరిత, ఇతర శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి ఉద్యోగులకు రొట్టెల పండగ నిర్వహణపై సూచనలు చేశారు. అన్ని ఏర్పాట్లు పూర్తిచేశాం రొట్టెల పండగకు వచ్చే భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశాం. క్షేత్ర స్థాయిలో నిత్యం పరిశీలిస్తూ సిబ్బందికి సూచనలు ఇస్తున్నాం. బారాషహీద్ దర్గా ప్రాంగణం మొత్తం సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. 24 గంటలు పాటు పోలీసులు నిఘా ఉంటుంది. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాం. – చక్రధర్‌బాబు, కలెక్టర్ మది నిండా భక్తి, విశ్వాసం మది నిండా భక్తి, విశ్వాసం. అంతే నమ్మకంగా తీరుతున్న కోర్కెలతో మతసామరస్యానికి ప్రతీకగా రొట్టెల పండగ నిలుస్తోంది. కోరిన కోర్కెలు తీరితే రొట్టెలు వదిలే, పట్టుకునే భక్తులతో నెల్లూరు స్వర్ణాల తీరం సంద్రంగా మారింది. ఐదు రోజుల పాటు జరిగే పండగ ప్రారంభానికి ముందే సోమవారం భక్తులు కిటకిటలాడారు. కుల, మతాలకు అతీతంగా భక్తజనం పోటెత్తింది. వివాహం, విద్య, ఆరోగ్యం, ప్రమోషన్, గృహం, ఉద్యోగం, ధనం, సౌభాగ్యం, వ్యాపారం ఇలా అనేక సంతోషాలు తమ కుటుంబాల్లో పరిఢవిల్లాలని ఎన్నెన్నో ఆశలతో వచ్చే భక్తుల నమ్మకానికి ప్రతీకగా ఏటేటా రొట్టెల పండగ విశిష్టత పెరుగుతోంది. – నెల్లూరు(మినీబైపాస్) చదువు రొట్టె పట్టుకున్నాను పదో తరగతి పాస్ అవ్వాలని రొట్టెను పట్టుకున్నాను. గతంలో మూడేళ్లుగా రొట్టెల పండగకు వస్తున్నాను. ఈ దఫా చదువు రొట్టెను పట్టుకున్నాను. ఇంతకు ముందు ఆరోగ్య రొట్టెను పట్టుకున్నాం. – రేష్మా, హైదరాబాద్ సంతాన రొట్టెను తీసుకున్నా.. కర్ణాటకలోని తుమ్ముకూరులో వ్యాపారం చేస్తున్నాను. 13 తరాలుగా మా వంశంలో మగపిల్లలు లేరు. పోయిన సారి ఇక్కడకు వచ్చి మగ పిల్లవాడు కావాలని మొక్కుకున్నాను. ఇదిగో వీడే నా ఒక్కగానొక్క మగ పిల్లవాడు. నా కోరిక తీరింది. – మొహ్మద్ ఇలియాజ్, తుమ్ముకూరు, కర్ణాటక ఆరోగ్య రొట్టె పట్టుకున్నాను కర్ణాటకలో కేఎస్ఆర్టీసీలో కండక్టరుగా పని చేస్తున్నాను. యాక్సిడెంట్లో కాళ్లు పోగొట్టుకున్నాను. ప్రాణం మీద ఆశలు వదులు కోవాల్సిందేనని డాక్టర్లు చెప్పారు. అల్లాకు మొక్కుకున్నాను. ఆరోగ్యం మెరుగుపడాలని.. ఇక్కడికి వచ్చాను. ఆరోగ్య రొట్టెను పట్టుకున్నా. – బాబాజానర్, కేఎస్ఆర్టీసీ, కండక్టర్, కర్ణాటక ఉద్యోగ రొట్టె పట్టుకున్నా.. చదువు పూర్తయ్యంది. మంచి ఉద్యోగం రావాలని ఉద్యోగ రొట్టెను పట్టుకున్నాం. ఇంతకు ముందు మంచిగా చదువు పూర్తి కావాలని కోరుకున్నాం. అది తీరింది. ఇప్పుడు ఉద్యోగ రొట్టె పట్టుకున్నాం. – శ్రీవిద్య, ప్రవళ్లిక, నెల్లూరు -
ప్రతిష్టాత్మకంగా రొట్టెల పండగ
నెల్లూరు (సెంట్రల్): ఆగస్టు 9 నుంచి నెల్లూరు బారాషహీద్ దర్గా రొట్టెల పండగను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, కలెక్టర్ చక్రధర్‌బాబు, ఎస్పీ విజయారావు, కమిషనర్ జాహ్నవి, మేయర్ స్రవంతితో కలిసి వివిధ శాఖలతో శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రెండేళ్లుగా కరోనా కారణంగా రొట్టెల పండగను నిర్వహించ లేకపోయామన్నారు. ఈ ఏడాది రొట్టెల పండగను ప్రతిష్టాత్మకంగా చేయాలన్నారు. జిల్లాలోని అన్ని శాఖల అధికార యంత్రాంగాన్ని భాగస్వాములను చేద్దామన్నారు. ఈ ఏడాది భక్తులు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నందున ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ముందుకు పోవాలన్నారు. గత అనుభవాలు, లోపాలను దృష్టిలో పెట్టుకుని ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని సూచించారు. ప్రధానంగా వైద్యం, మంచి నీరు, టాయిలెట్స్, విద్యుత్, పారిశుధ్యం, పోలీసులు సమన్వయంతో ప్రణాళిక సిద్ధం చేసుకుని ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. ఈ దఫా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని తీసుకు వచ్చేందుకు కృషి చేస్తామన్నారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ ఎంతో ప్రఖ్యాతి పొందిన ఈ రొట్టెల పండగను అందరం గర్వించేలా చేసుకుందామన్నారు. రెండేళ్ల తర్వాత నిర్వహించే ఈ పండగకు గతంలో కంటే లక్షల సంఖ్యలో అధికంగా భక్తులు వచ్చే అవకాశాలు ఉన్నాయని, వాటిని దృష్టిలో పెట్టుకుని ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. ఈ పండగలో కులమతాలకు అతీతంగా భక్తులు పాల్గొంటారని, అందుకు తగినట్లు ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. బడ్జెట్ విషయంలో రాజీలేకుండా అన్ని ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. ఈ ప్రాంతంలో పలు అభివృద్ధి పనులు చేపట్టాలని కోరుతున్నారని, ముస్లిం మతపెద్దల సూచనల మేరకు రొట్టెల పండగ పూర్తి చేసుకున్న తర్వాత చేస్తామన్నారు. కలెక్టర్ చక్రధర్‌బాబు మాట్లాడుతూ అన్ని శాఖల అధికారులు ముందుగా సమన్వయం చేసుకుని ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. ఏర్పాట్లలో ఎక్కడా ఎటువంటి చిన్న పొరపాటు, లోపాలు ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఇతర రాష్ట్రాల నుంచే కాకుండా, ఇతర దేశాల నుంచి కూడా భక్తులు వచ్చే అవకాశాలు ఉన్నాయని, అటువంటి వారికి ఎటువంటి ఇబ్బందులు ఉండకుండా ఏర్పాట్లు ఉండాలన్నారు. పండగ ముందు నుంచి ముగిసే వరకు అధికార యంత్రాంగం అందుబాటులో ఉంటూ నిత్యం పర్యవేక్షణ చేయాలన్నారు. ఎస్పీ విజయారావు మాట్లాడుతూ పోలీసు శాఖ నుంచి ఎక్కడా ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయడం జరుగుతుందన్నారు. ప్రధానంగా ఈ పండగను గతంలో నిర్వహించిన అనుభవం ఉన్న అధికారులను కూడా ఉన్నతాధికారుల అనుమతితో ఇక్కడకు తీసుకువస్తామన్నారు. ట్రాఫిక్ నియంత్రణ, సీసీ కెమరాలు ఏర్పాటు, పార్కింగ్, శాంతిభద్రతలకు ఎక్కడా విఘాతం కలుగకుండా ఉండే అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డి, డిప్యూటీ మేయర్ ఖలీల్‌అహ్మద్, పలువురు మతపెద్దలు పాల్గొన్నారు. -
కోర్కెల రొట్టె.. ఈ ఏడు లేదాయే
పవిత్రమైన బారాషహీద్ దర్గాలో ప్రార్థనలు చేసి.. స్వర్ణాల చెరువులో నిలువెల్లా నీటిలో మునిగి నిష్కల్మషమైన మనస్సులో కోరిన రొట్టెను స్వీకరిస్తే కోర్కెలు నెరవేరుతాయని కుల,మతాలకు అతీతంగా భక్తుల విశ్వాసం. ఏటా మొహర్రం పర్వదినాన్ని పురస్కరించుకుని ఐదు రోజుల పాటు రొట్టెల పండగ జరుగుతుంది. తొలినాళ్లలో ఏడాదికి ఒక్క రోజే జరిగే ఈ పండగపై భక్తుల్లో నమ్మకం పెరగడంతో ఏడాదికేడాది భక్తుల రాక ద్విగుణీకృతం కావడంతో విశిష్టతగా మారింది. రొట్టెల పండగకు రాష్ట్ర పండగగా గుర్తింపు లభించింది. రెండున్నర శతాబ్ద కాలంగా నిర్విఘ్నంగా సాగుతున్న రొట్టెల పండగకు ఈ ఏడాది కరోనాతో బ్రేక్ పడింది. ఈ దఫా కేవలం మత పెద్దల సమక్షంలో మొహర్రం వేడుకలు నిర్వహిస్తున్నారు. నెల్లూరు సిటీ: నెల్లూరు రొట్టెల పండగకు దేశ, విదేశాల్లో విశిష్టత ఉంది. రెండున్నర శతాబ్దాలుగా నమ్మకానికి, మత సామరస్యానికి, ప్రతీకగా రొట్టె ల పండగ రాష్ట్రానికే ప్రతిష్టాత్మకంగా, జిల్లాకే తలమానికంగా జరుగుతోంది. రొట్టెల పండగకు దేశ నలుమూల నుంచే కాకుండా విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివచ్చేవారు. కోర్కెన రొట్టెను పట్టుకుంటే కోర్కెలు తీరుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. అంతటి విశిష్టమైన రొట్టెల పండగకు కరోనా విపత్తు అడ్డంకిగా మారింది. ఈ నెల 30 నుంచి ఐదు రోజుల పాటు జరిగే రొట్టెల పండగ నిర్వహించాల్సి ఉంది. జిల్లా వ్యాప్తంగానే కాక.. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి విశృంఖలం కావడంతో పండగ నిర్వహణను ఈ ఏడాదికి నిలిపివేస్తూ జిల్లా అధికారులు ఆదేశాలు జారీ చేశారు. దర్గా వద్దకు భక్తులు ఎవరూ రాకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. పండగ విశిష్టత.. రోట్టెల పండగకు సంవత్సరాల చరిత్ర ఉంది. దర్గాలోని షహీద్‌లను (అమరులను) దర్శించుకునేందుకు ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల నుంచి భక్తులు తరలివ స్తుంటారు. ♦బారాషహీలను స్మరిస్తూ తమ కోర్కెలను తీర్చుకోవాలని భక్తులు స్వర్ణాల చెరువులో రొట్టెలను ఒకరికొకరు మార్చుకుంటారు. ♦కోరిన కోర్కెలు తీరిన తర్వాత ఆ రొట్టెను వదులుతారు. మరో కోరిక రొట్టెను పట్టుకుని వెళ్తారు. ♦విద్య, ఉద్యోగం, ఉద్యోగన్నతి, వ్యాపారం, ధన, వివాహం, సంతానం, సౌభాగ్యం, ఆరోగ్యం, స్వగృహం, విదేశీయానం ఇలా... వివిధ కోర్కెల రొట్టెలను ఇచ్చిపుచ్చుకుంటారు. ♦మతసామరస్యాలకు అతీతంగా భక్తులు లక్షల సంఖ్యలో పాల్గొంటారు. ఏటా పది లక్షల నుంచి 12 లక్షలు మంది భక్తులు హాజరవుతుంటారు. ♦గతంలో ఒక్క రోజే పండగ జరిగేది. ఆ తర్వాత మూడు రోజుల పాటు నిర్వహించే వారు. క్రమేపీ ఐదు రోజులు పండగగా మారింది. ♦2015లో రొట్టెల పండగకు రాష్ట్ర పండగగా గుర్తింపు లభించింది. ♦సుమారు 250 ఏళ్ల నుంచి స్వర్ణాల చెరువు వద్ద భక్తులు రొట్టెల పండగను సంప్రదాయబద్ధంగా జరుపుకునే వారు. ♦మొదటిసారి కరోనా కారణంగా ఈ ఏడాది పండగను నిర్వహించుకోలేని పరిస్థితి ఏర్పడింది. షహీద్‌లు కొలువున్న చోటే బారాషహీద్ దర్గా టర్కీ నుంచి మహ్మద్ ప్రవక్త సందేశాన్ని ప్రపంచ వ్యాప్తం చేయడంలో భాగంగా సుమారు 250 ఏళ్ల క్రితం 12 మంది మతబోధకులు భారతదేశానికి వచ్చారు. ♦ఆ సమయంలో కొడవలూరు మండలంలోని గండవరంలో తమిళనాడు వాల్జారాజులకు, బీజాపూర్ సుల్తాన్లకు మధ్య పవిత్ర యుద్ధం జరిగింది. ♦ఆ యుద్ధంలో టర్కీ కమాండర్, మత ప్రచారకుడు జుల్ఫేఖార్ బేగ్‌తో పాటు మరో 11 మంది వీర మరణం పొందారు. ♦వారి తలలు గండవరంలో తెగి పడగా వీరుల మొండాలను గుర్రాలు నెల్లూరులోని స్వర్ణాల చెరువు వద్దకు తీసుకువచ్చాయి. ♦వీర మరణం పొందిన 12 మంది నెల్లూరు ఖ్వాజీకి కలలో కనపడి తమను అక్కడే సమాధి చేయాలని కోరడంతో అక్కడే సమాధులు నిర్మించారు. ♦12 సంఖ్యను ఉర్దూలో బారా, వీర మరణం పొందిన అమరులను ఉర్దూలో షహీద్‌లుగా పిలువబడతారు. అందుకే ఈ దర్గాకు బారాషహీద్ అనే పేరొచ్చింది. తలలు తెగిపడిన చోట గండవరంలో జరిగిన పవిత్ర యుద్ధంలో మత ప్రచారకుల 12 మంది తలలు తెగి పడ్డాయి. వాటిలో 7 మాత్రమే లభ్యమయ్యాయి. అవన్నీ సమాధులుగా మారిన చోటే నేడు సాతోషహీద్ (సాత్ అంటే ఏడు, షహీద్ అంటే అమరులు) దర్గాగా పిలువబడుతుంది. షహదత్‌తో ప్రారంభం మొహర్రం నెలలో నెలవంక కనిపించిన 11వ రోజున రొట్టెల పండగ ప్రారంభమవుతుంది. తొలి రోజు షహద్‌త్‌తో ప్రారంభవుతుంది. తర్వాత రోజు గంధమహోత్సం చేస్తారు. కోటమిట్ట అమీనియా మసీదు నుంచి గంధాన్ని తీసుకొచ్చి 12 మంది షహీద్‌ల సమాధులకు లేపనం చేసి, భక్తులకు పంచుతారు. మరుసటి రోజు తమ కోర్కెలు తీరాలని భక్తులు వివిధ రకాల రొట్టెలను ఒకరికొకరు మార్చుకుంటారు. తహలీల్ ఫాతెహాతో పండగ ముగుస్తుంది. కోర్కెలు తీరిన భక్తులు మళ్లీ పండగలో రొట్టెను వదలాల్సిందే తమ కోర్కెలు తీరాలని రొట్టెలు పట్టుకునే వారు.. కోర్కెలు తీరితే ఆ రొట్టెను మళ్లీ పండగలో వదిలాలి. స్వర్లాల చెరువు వద్దకు వచ్చి రొట్టెల మార్పిడి చేసుకునేవారు. అయితే ఏడాది రొట్టెల పండగకు భక్తులను అనుమతించకపోవడంతో కోర్కెలు తీరిన భక్తులు రొట్టెను వదిలేందుకు వీలు లేకపోవడంతో ప్రశ్నార్థకంగా మారింది. కరోనా నేపథ్యంలో ప్రాణాలు ముఖ్యం కాబట్టి భక్తులు ప్రభుత్వం ఆదేశాలను పాటించడం మంచిదని మత పెద్దలు చెబుతున్నారు. రొట్టెలను పేదలకు దానం చేయడం ద్వారా పుణ్యం వస్తుందని, తర్వాత ఏడాది అదే సంకల్పంతో నెరవేరిన కోర్కెల రొట్టెలను వదులుకోవచ్చునని మత పెద్దలు చెబుతున్నారు. రొట్టెలను దానం చేస్తే పుణ్యం ఏటా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే రొట్టెల పండగ ఈ ఏడాది జరగకపోవడం బాధాకరం. ప్రాణాంతకమైన వైరస్ కరోనా కాబట్టి ముందు ప్రాణాలు ముఖ్యం. భక్తులు కూడా ప్రభుత్వ ఆదేశాలను పాటించాలి. కోర్కెలు తీరిన భక్తులు ఈ ఏడాది పేదలకు రొట్టెలను దానం చేయడం ద్వారా పుణ్యం వస్తుంది. ఆ తర్వాత ఏడాదిలో మీ సంకల్ప రొట్టెలను వదులుకోవచ్చు. 30వ తేదీ – షహదత్ 31వ తేదీ – గంధమహోత్సవం 01వ తేదీ – రొట్టెల పండగ 02వ తేదీ – తహలీల్ ఫాతెహా 03వ తేదీ – ముగింపు సభ (ఈ ఏడాది లేదు) -
ముగిసిన రొట్టెల పండగ
-
రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో అన్నదాతలకు సమృద్ధిగా పంటలు పండి అందరికీ మేలు జరగాలని రాష్ట్ర హోం, నెల్లూరు జిల్లా ఇన్చార్జి మంత్రి మేకతోటి సుచరిత ఆకాంక్షించారు. శుక్రవారం ఆమె నెల్లూరులోని బారాషాహిద్ దర్గాలో జరుగుతున్న రొట్టెల పండుగకు హాజరై రొట్టె పట్టుకున్నారు. హోం మంత్రితోపాటు జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ పి.అనిల్‌కుమార్ యాదవ్, కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్ రెడ్డి పాల్గొన్నారు. బారాషాహీద్‌లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. జగన్ పాలనలో రైతులకు మంచి జరగాలని ఆకాంక్షిస్తూ స్వర్ణాల చెరువులో కోర్కెల రొట్టె పట్టుకున్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ..వైఎస్సార్ సీపీ 100 రోజుల పాలన బాగా జరిగిందని, రానున్న రోజుల్లోనూ సంక్షేమ సర్కారుగా తాము పనిచేస్తామని తెలిపారు. మంత్రి అనిల్‌కుమార్‌యాదవ్ మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని పంటలకు నీరు ఇచ్చేలా ప్రణాళికాబద్ధంగా తాము పనిచేస్తున్నామని తెలిపారు. అనంతరం దర్గా ప్రాంగణంలో వైఎస్సార్సీపీ నెల్లూరు రూరల్ నేత కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డి నేతృత్వంలో ఏర్పాటు చేసిన అన్నదాన శిబిరాన్ని, కమాండ్ కంట్రోల్ రూమ్‌ను పరిశీలించారు. ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, కలెక్టర్ ఎంవీ శేషగిరిబాబు, ఎస్పీ ఐశ్వర్య రస్తోగి తదితరులు పాల్గొన్నారు. కాగా శనివారంతో రొట్టెల పండుగ ముగియనుంది. శుక్రవారం కావడంతో దర్గా ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. -
పోలీసుల ఓవరాక్షన్!.. దర్గాలో..
సాక్షి, నెల్లూరు: బారాషహీద్ దర్గాలో కుల, మతాలకు అతీతంగా జరిగే రొట్టెల పండగకు వచ్చే భక్తుల కోసం ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఇబ్బందులు పడకుండా జిల్లా యంత్రాంగం నిరంతరం కష్టపడుతూనే ఉంది. భక్తులకు రక్షణ కల్పించి పండగను ప్రశాంతంగా జరిపేందుకు పోలీసుశాఖ శ్రమిస్తోంది. అయితే కొందరు పోలీసుల ఓవర్ యాక్షన్ భక్తుల మనోభావాలను దెబ్బతిస్తోంది. పోలీసు శాఖకు చెడ్డపేరు తెస్తోంది. గురువారం దర్గా ప్రాంగణంలో కొందరు పోలీసు సిబ్బంది, అధికారులు ఓవర్‌యాక్షన్ చేయడంపై భక్తులు తీవ్రస్థాయిలో అసహనానికి గురయ్యారు. ఓ దశలో ఎస్సై స్థాయి అధికారి అనుచిత ప్రవర్తనతో విసిగిపోయిన భక్తులు నిరసన వ్యక్తం చేశారు. రద్దీ తక్కువగా ఉన్న సమయంలో కూడా మహిళలను చేతులతో నెట్టడంపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. మహిళలని కూడా చూడకుండా చేతులతో నెట్టడంపై భక్తులు అసహనానికి గురయ్యారు. అలాగే దర్గా నుంచి వెలుపలకు వెళ్లే దారిలో ఉన్న ఎస్సై స్థాయి అధికారి భక్తుల పట్ల దురుసుగా ప్రవర్తించారు. భక్తులను ఏరా..పోరా..అంటూ అతిగా ప్రవర్తించడంతో వారు నిరసన వ్యక్తం చేశారు. ఓ దశలో ఎస్సైతో వాగ్వాదానికి దిగారు. అక్కడే విధులు నిర్వహిస్తున్న డీఎస్పీ స్థాయి అధికారి కూడా భక్తుల మనోభావాలు పట్టించుకోకుండా వారిపైనే కన్నెర్ర చేయడం గమనార్హం. ప్రశంసలు ఉన్నాయి. గుంటూరు రేంజ్ పరిధిలోని సివిల్ పోలీసులు, సాయుధ దళాలు రొట్టెల పండగ విజయవంతానికి కృషి చేసి భక్తుల మన్ననలు పొందుతున్నారు. పోలీసు కంట్రోలు రూం ఏర్పాటు చేసి తప్పిపోయిన పిల్లలను వారి తల్లిదండ్రుల చెంతకు చేర్చడంతో పాటు ఎన్నో సేవలు అందిస్తూ్త ప్రశంసలు అందుకుంటున్నారు. కానీ కొందరు పోలీసుల ఓవర్ యాక్షన్ వల్లే ఆ శాఖకు చెడ్డపేరు వస్తోంది. పోలీసు ఉన్నతాధికారులు ఓవర్‌యాక్షన్ చేస్తున్న అధికారులపై చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. -
రొట్టెల పండగలో రాష్ట్రమంత్రులు
రొట్టెల పండగలో కీలక ఘట్టమైన గంధోత్సవంతో బారాషహీద్ దర్గా ప్రాంగణం సుగంధ పరిమళమైంది. స్వర్ణాల తీరం పవిత్రమైంది. భక్త జనులతో రొట్టెల పండగ జన సంద్రంగా మారింది. రెండో రోజూ తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ, విదేశాల నుంచి భక్తులు పోటెత్తారు. కోరిన కోరికలు నెరవేరిన వారు.. కోరికలతో వచ్చిన వారు భక్తితో సంప్రదాయబద్ధంగా రొట్టెలు ఇచ్చి పుచ్చుకున్నారు. తమ ఇచ్ఛలు నెరవేరాలని భక్తితో షహీదుల సమాధులను దర్శించుకుని ప్రార్థనలు చేశారు. అర్ధరాత్రి తర్వాత జరిగిన గంధోత్సవంలో గంధం కోసం భక్తులు పోటీపడ్డారు. సాక్షి, నెల్లూరు: నెల్లూరు బారాషహీద్ దర్గా ప్రాంగణంలో గంధ మహోత్సవంలో సుగంధపరిమళాలు వెదజల్లాయి. బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన ఈ ఉత్సవం అంగరంగ వైభవంగా కొనసాగింది. కులాలకు అతీతంగా, మత సామరస్యంగా జరుగుతున్న రొట్టెల పండగకు రెండో రోజు బుధవారం భారీగా భక్తులు పోటెత్తారు. స్వర్ణాల చెరువు తీరాన పవిత్ర స్నానమాచరించి తీరిన కోర్కెలతో భక్తులు రొట్టెలు వదలగా.. కోర్కెలతో వచ్చిన భక్తులు రొట్టెలు పట్టుకున్నారు. అనంతరం బారాషహీద్‌లను భక్తితో దర్శించుకున్నారు. దేశ, విదేశాల నుంచి వస్తున్న భక్తులు తమ మొక్కులు తీర్చుకుని వెళ్తున్నారు. భద్రత మరింత పటిష్టం రొట్టెల పండగలో ముఖ్య ఘట్టమైన గంధోత్సవం బుధవారం అర్ధరాత్రి నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో మధ్యాహ్నం నుంచి భక్తులు రాక ద్విగుణీకృతమైంది. దర్గా ప్రాంగణంలోని స్వర్ణాల చెరువు జనసంద్రంగా మారింది. భక్తజనంతో చెరువు కిటకిటలాడింది. ఇప్పటికే భక్తుల రాకను అంచనా వేసి నగర పాలక సంస్థ అధికారులు విస్తృతమైన వసతి ఏర్పాట్లు చేశారు. ఎక్కడికక్కడ భక్తుల రద్దీ లేకుండా చర్యలు చేపట్టారు. దర్గా, స్వర్ణాల చెరువు ప్రాంతాలతో పాటు భక్తుల రద్దీగా ఉండే ప్రదేశాల్లో భద్రతను పోలీస్ కమాండ్ కంట్రోల్ నుంచి పర్యవేక్షించారు. షహీదులను దర్శించుకున్న రాష్ట్రమంత్రులు బారాషహీద్ దర్గా ప్రాంగణంలో జరుగుతున్న రొట్టెల పండగ నేపథ్యంలో రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి, ఇరిగేషన్ శాఖమంత్రి పోలుబోయిన అనిల్‌కుమార్‌యాదవ్‌తో పాటు నెల్లూరురూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి స్వర్ణాలచెరువులో సంప్రదాయబద్ధంగా కోరికల రొట్టెలను పట్టుకున్నారు. అనంతరం షహీదులను దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా భక్తులను పలకరిస్తూ ఏర్పాట్లపై అడిగి తెలుసుకున్నారు. రొట్టెల పండగ ఏర్పాట్లను పరిశీలించారు. వివిధ శాఖల అధికారులతో చర్చించి భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు రూరల్ పార్టీ కార్యాలయం ఇన్చార్జి గిరిధర్‌రెడ్డి, వైఎస్సార్సీపీ యువజన నాయకుడు రూప్‌కుమార్‌యాదవ్, అధికారులు ఉన్నారు. కొనసాగుతున్న సేవా కార్యక్రమాలు భక్తుల సౌకర్యార్థం దర్గా ప్రాంగణంలో పలు స్వచ్ఛంద సంస్థలు సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నాయి. భక్తులకు అన్నదానం, వాటర్ ప్యాకెట్లు అందజేస్తున్నారు. ప్రైవేట్ ఆస్పత్రుల వైద్యులు మెడికల్ క్యాంప్‌లు నిర్వహిస్తున్నారు. వైభవంగా ‘గంధ’మహోత్సవం బుచ్చిరెడ్డిపాళెం: రొట్టెల పండగలో భాగంగా బుధవారం అర్ధరాత్రి గంధమహోత్సవం వైభవంగా జరిగింది. ప్రధాన ఘట్టమైన గంధమహోత్సవానికి ఏర్పాట్లు మందుస్తుగానే జరిగాయి. తొలుత కర్ణాటకతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చిన ప్రత్యేక గంధాన్ని కోటమిట్టలోని అమీనియా మసీదు వద్దకు చేర్చారు. ఖలీఫాలు, సూఫీ మత గురువులు తదితరులు అక్కడికి చేరారు. అప్పటికే సిద్ధం చేసిన ప్రత్యేక బిందెల్లో గంధాన్ని నింపారు. సుగంధ ద్రవ్యాలను అందులో కలిపారు. మసీదులో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం అప్పటికే సిద్ధం చేసిన ప్రత్యేక వాహనంలో గంధం బిందెలను చేర్చారు. బాణసంచా, భక్తి గీతాలాపనల నడుమ వాహనం ముందుకు సాగింది. పురవీధుల మీదుగా ఈద్గా వద్దకు చేరింది. అక్కడ ఉంచి వాటికి ప్రార్థనలు జరిపారు. ఫకీర్లు అబ్బుర పరిచే విన్యాసాలు చేశారు. అనంతరం ఒక బిందెను గుర్రంపై చేర్చి, మిగతా 11 బిందెలను 11 మంది తీసుకుని బారాషహీద్ దర్గాకు చేరారు. అక్కడ కడప పీఠాధిపతి ఖ్వాజా సయ్యద్‌షా అరీఫుల్లా హుస్సేని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. గంధాన్ని షహీద్‌ల సమాధులకు లేపనం చేశారు. అనంతరం భక్తులకు పంచిపెట్టారు. అధిక సంఖ్యలో చేరుకున్న భక్తులు పరమపవిత్ర గంధాన్ని తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మతపెద్దలు, మత గురువులు, సూఫీ మత గురువులు, అధికసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. -
నెల్లూరు : రొట్టెల పండుగ ప్రారంభం
-
రొట్టెల పండుగకు రెడీ అయిన దర్గాలు
ముస్తాబవుతున్న సాతో షహీద్ దర్గా కొడవలూరు: మండలంలోని గండవరం సాతో షహీద్ దర్గా రొట్టెల పండగకు ముస్తాబవుతోంది. ఇక్కడ మొహర్రం నెల 13వ రోజున రొట్టెల పండగ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. సాతో షహీద్ దర్గా ఆవిర్భావానికి ఒక చరిత్ర ఉందని ముస్లిం పెద్లు చెబుతున్నారు. సుమారు 4 వందల సంవత్సరాల క్రితం మత ప్రచారం కోసం 12 మంది ముస్లిం మత ప్రవక్తలు ఈ ప్రాంతానికి వచ్చారు. ఇక్కడ జరిగిన పవిత్రయుద్ధంలో ఏడుగురు ప్రవక్తల తలలు ఈ ప్రాంతంలో పడ్డాయని చెబుతుంటారు. ప్రవక్తల మొండెలు మాత్రం నెల్లూరులోని స్వర్ణాల చెరువు వద్ద పడ్డాయని అందువల్లే అక్కడ 12 సమాధులతో బారా షహీద్ దర్గా ఆవిర్భవించగా, ఏడు తలలు పడిన చోట సాతో షహీద్ దర్గా నిర్మాణం జరిగిందని నానుడి ఉంది. ఇక్కడి దర్గాలోని ఏడు సమాధులు కూడా మత ప్రవక్తల తలలకు చిహ్నాలేనన్నది ముస్లిం భక్తుల విశ్వాసం. వీరిని మొహరం నెల పదో రోజున హతమార్చినందున ఆ రోజున బారాహహీద్ దర్గాలో రొట్టెల పండగ జరుగుతుందని, ఆ రోజుకు మూడో రోజైన జియారత్ (చిన్న కర్మ) రోజున సాతోషహీద్ దర్గాలో రొట్టెల పండగ నిర్వహించడం జరగడం ఆనవాయితీ. బారాషహీద్ దర్గాకు వచ్చిన భక్తుల్లో చాలా మంది ఇక్కడకూ వచ్చి రొట్టెలు పట్టుకుంటారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల వారితో పాటు కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడకు భక్తులు వచ్చి రొట్టెలు పట్టుకుంటారు. నెల్లూరు నుంచి కావలి వైపు వచ్చే బస్సుల్లో జాతీయ రహదారిపై గండవరం క్రాస్ రోడ్డులో దిగి ఆటోల్లో ఇక్కడకు చేరుకోవచ్చు. నెల్లూరు నుంచి ఇక్కడికి 15 కిలో మీటర్లు ఉంటుంది. హిందు, ముస్లిం ఆరాధ్య క్షేత్రం అనుమసముద్రంపేట: దక్షిణ భారతదేశంలో మత సామరస్యానికి ప్రతీకగా హిందు, ముస్లింల ఆరాధ్య క్షేత్రంగా ఏఎస్‌పేట దర్గా విరాజిల్లుతుంది. 1747–1750 హిజ్రి శకం మధ్య కాలంలో 1161–1164లో హజరత్ నాయబ్ రసూల్ రహమతాబాద్లో ఆ గ్రామాన్ని నిర్మించారని, వారి కాలంలో నిర్మించిన కట్టడాలు చెబుతున్నాయి. ముస్లింల ఆరాధ్యదైవం అల్ హజ్ హజరత్ సయ్యద్ ఖాజారంతుల్లా ఖాజ హలాం నక్షబంద్, ఖుర్షీద్ బేగం పుణ్యదంపతులకు జన్మించారు. నక్షబంద్ పరమ సాత్వికుడు. అత్యంత దైవభక్తి గలవాడు. ఇరాన్ దేశం నుంచి భారతదేశానికి వచ్చి బీజాపూర్‌లోని బెల్గాంలో నివాసం ఏర్పరుచుకున్నారు. అక్కడే నాయబ్ రసూల్ జన్మించారు. చిన్నతనం నుంచి వినయ విధేయతలతో సత్పవర్తనతో మెలిగేవారు. నాయబ్ రసూల్ తల్లి చిన్నతనంలో మరణించడంతో సవతి తల్లి ప్రేమకు నోచుకోక తండ్రి అనుమతితో ఏడేళ్ల వయస్సులోనే పవిత్ర గ్రంధం ఖురాన్ పఠనం పూర్తి చేసి లోకజ్ఞానం సంపాదించారు. అనంతరం దేశాటనకు బయలుదేరి మక్కా మసీదును సందర్శించారు. అక్కడ రసూల్ గురువుల ఆశీర్వాదం పొందారు. తర్వాత కర్నూలు జిల్లా నంధ్యాలకు చేరుకుని కొంత కాలం అక్కడ నివాసముండి తల్లి మరణానంతరం కర్నూలు నవాబు వద్ద సిపాయిగా ఉద్యోగంలో చేరారు. అప్పటికే ఆ ప్రాంతంలో ఘోర కరువు రావడంతో ప్రజలు తీవ్ర వేదనకు గురవుతుండడంతో నాయబ్ రసూల్ తన గురువుల ఆశీర్వాద బలంతో వర్షాలు కురిపించారని చరిత్ర చెబుతుంది. నాయబ్ రసూల్ మహిమలను గుర్తించిన కర్నూలు నవాబు తన కుమార్తెనిచ్చి వివాహం జరిపించాడు. అనంతరం నెల్లూరు జిల్లా ఉదయగిరికి చేరుకున్న ఆయన 1762లో ప్రస్తుత దర్గా ఉన్న ప్రాంతం అనుమసముద్రంపేటకు వచ్చి స్థిర నివాసం ఏర్పర్చుకున్నాడు. ఆయన తన బోధనలు, మహిమలతో ప్రజల కష్ట సుఖాల్లో పాలు పంచుకుని కీర్తి గడించాడు. దర్గాకు వచ్చే భక్తులకు తాగునీటి ఇబ్బందులు లేకుండా రహమతాబాద్లోని దర్గా ప్రాంతంలో కోనేటిని నిర్మించారు. క్రీస్తు శకం 1780లో ఖాజానాయబ్ రసూల్ మరణించడంతో ఆయన సతీమణి హబీబాఖాతూన్ (దొరసానమ్మ) దర్గా నిర్మించారు.దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి ఎంతో మంది భక్తులు నిత్యం వస్తూ ఉంటారు. దర్గాకు చేరేందుకు మార్గాలు హజరత్ నాయబ్‌రసూల్, దొరసానమ్మ దర్గాకు చేరాలంటే నెల్లూరు రైల్వేస్టేషన్ లేదా బస్టాండ్ నుంచి ఏఎస్‌పేటకు బస్సు వసతి ఉంది. బుచ్చి, సంగం, హసనాపురం మార్గాల మీదుగా చేరవచ్చు. నెల్లూరు నుంచి 55 కిలోమీటర్ల దూరం దర్గాకు చేరవచ్చు. నెల్లూరు నుంచి ఆత్మకూరుకు చేరుకుని అక్కడి నుంచి నెల్లూరుపాళెం మీదుగా దర్గాకు చేరుకోవచ్చు. 13 కిలో మీటర్ల దూరం ఉంటుంది. మత సామరస్యానికి ప్రతీక కసుమూరు దర్గా వెంకటాచలం: మత సామరస్యానికి ప్రతీకగా కసుమూరు మస్తాన్ వలీ (హజరత్ సయ్యద్ కరీముల్లా షా ఖాద్రి ఉరఫ్ కాలేషా పీర్ మస్తాన్ వలీ) దర్గా విరాజిల్లుతోంది. హిందూ, ముస్లింలు ఆరాధ్య దైవంగా భావించే మస్తానవలీ దర్గా దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధిగా గుర్తింపు పొందింది. దేశ నలుమూలల నుంచే కాక విదేశాల నుంచి భక్తులు దర్గాకు హాజరవుతారు. నెల్లూరు నగరంలోని బారాషహీద్ దర్గా వద్ద మంగళవారం నుంచి రొట్టెల పండగ ప్రారంభం కానుండటంతో కసుమూరు దర్గాకు భక్తుల తాకిడి పెరుగుతోంది. రొట్టెల పండగ నుంచి కసుమూరుకు.. బారాషహీద్ వద్ద రొట్టెల పండగకు వచ్చే భక్తులు కసుమూరు మస్తాన్‌వలీ దర్గాను దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. నెల్లూరు నుంచి కసుమూరు దర్గాకు చేరుకునేందుకు భక్తులు నెల్లూరు ఆర్టీసీ బస్టాండ్ నుంచి నేరుగా కసుమూరు బస్సులు నడుపుతున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ అధికారులు కసుమూరుకు అదనపు బస్సులు నడిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నెల్లూరు నగరం నుంచి కసుమూరుకు 25 కిలో మీటర్ల దూరం ఉంది. ప్రైవేట్ వాహనాల్లో వచ్చే భక్తులు బారాషహీద్ దర్గా నుంచి పొదలకూరు రోడ్డు మీదుగా పాలిచెర్లపాడు అడ్డరోడ్డు నుంచి కసుమూరుకు చేరుకోవచ్చు. బారాషహీద్ దర్గా నుంచి అయ్యప్పగుడి, వెంకటాచలం మీదుగా కసుమూరుకు చేరుకోవచ్చు. దీంతో కసుమూరులో పోలీసు బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి నెల్లూరు బారాషహీద్ దర్గా వద్ద రొట్టెల పండగకు వచ్చే భక్తులంతా వేల సంఖ్యలో కసుమూరు దర్గాను దర్శించుకోనుండటంతో వసతుల కల్పనపై అధికారులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. ఎంపీడీఓ సరళ కసుమూరులో భక్తులకు కల్పించాల్సిన మౌలిక సదుపాయాలపై ప్రణాళికలు తయారు చేశారు. తాగునీరు, పారిశుధ్యం, మరుగుదొడ్లు తదితర సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకున్నారు. చిల్లకూరులో దో షహీద్ దర్గా.. చిల్లకూరు: నెల్లూరులోని బారాషహీద్ దర్గాకు అనుబంధంగా అంతటి ప్రాముఖ్యం ఉన్న చిల్లకూరులోని దో షహీద్ దర్గాలో ఈ నెల 12న రొట్టెల పండగ నిర్వహణకు ముస్తాబు చేస్తున్నారు. కొడవలూరు మండలం గండవరం వద్ద జరిగిన పవిత్ర యుద్ధంలో సయ్యద్ అహ్మద్ షా, సయ్యద్ మహ్మాద్ షా అనే వీరుల తలలు తెగి అక్కడ నుంచి గుర్రాలపై మొండాలు ఇక్కడికి వచ్చి పడి పోవడంతో చిల్ల కూరు ముఖ ద్వారంలో ఉన్న దో షహీద్ దర్గాను వందల ఏళ్ల క్రితం నిర్మించారని ప్రతీతి. బొబ్బిలికి చెందిన ఒక మహారాణి ఈ మార్గంలో చెన్నైకు పయనిస్తూ ఇక్కడ విశ్రమించడంతో ఆమెకు కలలో దోషహీద్లు కనిపించాయి. అవి దర్గాను అభివృద్ధి చేయాలని చెప్పడంతో వారు సహకారంతో అప్పటి నుంచి ఇక్కడ నెల్లూరులో రొట్టెల పండగ జరిగిన మూడో రోజు చిల్లకూరులో రొట్టెల పండగను నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ నెల 12న రొట్టెల పండగ, 25వ తేదీ గంధోత్సవం నిర్వహిస్తున్నట్లు దర్గా ముతవల్లి జుబేర్‌బాషా తెలిపారు. నెల్లూరు బారాషహీద్ దర్గాను దర్శించుకున్న భక్తులు దో షహీద్ దర్గాను దర్శించుకోవాలంటే బస్సులో గూడూరు వరకు వచ్చి అక్కడ నుంచి ఆటోలో రావచ్చు. ప్రత్యేక వాహనాల్లో వచ్చే వారైతే నేరుగా జాతీయ రహదారిలోని గూడూరు సర్కిల్ వరకు వచ్చి అక్కడ నుంచి ఒక కి.మీ. దూరంలోని దర్గా వద్దకు చేరుకోవచ్చు . వేనాడులో మహిమాన్విత షావలీ దర్గా తడ: తడ మండలం వేనాడులోని షేక్ దావూద్ షావలీ అల్లా మహిమాన్విత బాబా దర్గాగా ప్రసిద్ధి చెందారు. నెల్లూరులో జరిగే రొట్టెల పండగ హాజరయ్యే భక్తులు చాలా మంది వేనాడు దర్గాను కూడా దర్శించుకోవడం ఆనవాయితీ. తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల నుంచి నెల్లూరు వెళ్లే భక్తులు కొంత మంది తొలుత వేనాడు బాబా దర్శనం చేసుకుని వెళుతుండగా, మరి కొందరు నెల్లూరులో పండగ అనంతరం వేనాడుకు వస్తున్నారు. దర్గాకు వచ్చే భక్తుల సౌకర్యార్థం దర్గా వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 144 అడుగుల పొడవుతో ఆసియాల్లోనే అత్యంత పొడవైన దర్గాగా వేనాడు దర్గాకు పేరుంది. తీరని కోర్కెలు ఉన్నవారు, కోరికలు తీరిన వారు అమావాస్య రోజున బాబా దర్గా వద్ద నిద్ర చేసి తమ మొక్కులు చెల్లించుకుంటారు. ఆదివారం అమావాస్య రోజున వేలాదిగా భక్తులు తరలివచ్చి నిద్ర చేస్తారు. దర్గా వద్ద ఏడాదికి ఒకసారి అత్యంత వైభవంగా గంధోత్సవం నిర్వహిస్తారు. నెల్లూరు నుంచి సూళ్లూరుపేట వచ్చి అక్కడ నుంచి శ్రీహరికోట మార్గంలో 17 కిలో మీటర్లు ప్రయాణించిన తర్వాత అటకానితిప్ప వద్ద నుంచి కుడి వైపునకు గ్రావెల్‌రోడ్డు వెళ్తుంది. ఆ మార్గంలో 11 కిలో మీటర్లు ప్రయాణిస్తే దర్గాకి చేరుకోవచ్చు. సూళ్లూరుపేట నుంచి నిర్ణీత వేళల్లో ఆర్టీసీ బస్సులు నడుస్తుండగా జీపులు, ఆటోల సౌకర్యం ఉంది. -
వరాల రొట్టె.. ఒడిసి పట్టు
రెండున్నర శతాబ్దాలకుపైగా నమ్మకానికి, మత సామరస్యానికి ప్రతీకగా రాష్ట్రానికే ప్రతిష్టాత్మకంగా జరిగే రొట్టెల పండగకు నెల్లూరు నగరం ముస్తాబైంది. ఏటా మొహర్రం పండగ రోజు రొట్టెల పండగ ప్రారంభం అవుతుంది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాలు, సౌదీ దేశాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరానున్న క్రమంలో అందుకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక జిల్లాలో జరుగుతున్న మొదటి పండగ కావడంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. ఈ నెల 10న ప్రారంభమయ్యే రొట్టెల పండగ 14వ తేదీ వరకు జరగనుంది. నెల్లూరు నగరపాలక సంస్థ, జిల్లా పోలీసు యంత్రాంగం, నీటి పారుదల శాఖ, పలు శాఖల అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. దర్గా ప్రాంగణమంతా విద్యుత్ దీపాలతో ముస్తాబు చేశారు. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: వరాల రొట్టెల పండగ వచ్చేసింది. కోరుకున్న కోర్కెలు తీరి వదిలే వరాల రొట్టెను.. కోర్కెలతో ఒడిసి పట్టుకునేందుకు భక్తులు వచ్చేశారు. హిందూ, ముస్లిం మతాల సామరస్యానికి ప్రతీకగా జరిగే పండగ మంగళవారం షహదాత్‌తో ప్రారంభమవుతుంది. 11న గంధం మహోత్సవం, 12న రొట్టెల పండగ 13న తహలీల్ ఫాతేహా, 14న ముగింపు సభతో రొట్టెల పండగ ముగియనుంది. గతేడాది ఉత్సవాలకు 10 లక్షల మంది హజరయ్యారు. దానిని ప్రామాణికంగా తీసుకొని అధికారులు ఈ ఏడాది కూడా ఆ మేరకు ఏర్పాట్లు పూర్తి చేశారు. రూ.1.57 కోట్లతో దర్గా ప్రాంగణంలో తాగునీరు, విద్యుత్, పారిశుధ్య, ఇతర ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటికే రెండు రోజుల నుంచి దర్గాలో భక్తు రద్దీ బాగా పెరిగింది. విద్యుత్ వెలుగులో బారాషహీద్ దర్గా ప్రాంగణం ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి భక్తుల రాక ముఖ్యంగా కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. రొట్టెల పండగకు రాష్ట్రం నుంచే కాకుండా తమిళనాడు, కేరళ, కర్ణాటక, తెలంగాణ, రాష్ట్రాలతో పాటు దుబాయ్ నుంచి కూడా పెద్ద సంఖ్యలో తరలివస్తారు. దర్గా ప్రాంగణంలోని స్వర్ణాల చెరువులో నీటి నిల్వలను ఉండేలా చర్యలు తీసుకున్నారు. ముందుగానే సోమశిల నుంచి నీరు విడుదల చేసి 11.5 అడుగుల మేర నీటి మట్టం తగ్గకుండా అన్ని చర్యలు తీసుకున్నారు. మరో వైపు భక్తుల రద్దీ దృష్ట్యా నీటి శుద్ధి కోసం మంగళవారం నుంచి 300 క్యూసెక్ల నీటిని విడుదల చేసేలా అన్ని చర్యలు తీసుకున్నారు. దీంతో పాటు నీటిని ఎప్పటికప్పుడు క్లోరినేషన్ చేయడానికి ప్రత్యేక ఏర్పాటు చేశారు. రాష్ట్ర నీటిపారదుల శాఖ మంత్రి డాక్టర్ పి. అనిల్‌కుమార్‌యాదవ్, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి జిల్లా కలెక్టర్ ఎంవీ శేషగిరిబాబు, జిల్లా ఎస్పీ ఐశ్వర్య రస్తోగి, నెల్లూరు నగర కమిషనర్ మూర్తి నిరంతరం దర్గా ప్రాంగణంలో ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. రొట్టెల పండగలో 11, 12 తేదీలో భారీగా భక్తులు తరలిరానుండటంతో ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలు ముందస్తుగా చేపట్టారు. వర్షాల వల్ల ఇబ్బంది వస్తే ప్రాంగణంలో ఉండే భక్తుల కోసం అందుబాటులో ఉన్న రెండు కల్యాణ మండలపాలను బస కోసం సిద్ధం చేసి ఉంచారు. అన్ని విభాగాల అధికారులు మంగళవారం నుంచి రొట్టెల పండగ విధుల్లో ఉంటారు. కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా పర్యవేక్షణ దర్గా ప్రాంగణంలో 48 సీసీ కెమెరాలు, రెండు డ్రోన్ కెమెరాలు ఏర్పాటు చేశారు. వీటిని దర్గా ప్రాంగణంలోని కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా పరిస్థితిని పర్యవేక్షించనున్నారు. 1,891 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడా అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా అన్ని ముందస్తు చర్యలు తీసుకున్నారు. దీంతో పాటు రొట్టెల పండగకు వచ్చే వారి సంఖ్యను గుర్తించటానికి ప్రత్యేకంగా సాప్ట్వేర్ సిద్దం చేశారు. అలాగే నగరంకు అన్ని వైపుల నుంచి వచ్చే వాహనాలకు వీలుగా 14 చోట్ల పార్కింగ్ సెంటర్లు ఏర్పాటు చేశారు. మూడు షిప్టుల్లో 4,500 మంది కార్మికులు రొట్టెల పండగ నేపథ్యంలో మూడు షిప్టుల్లో 4,500 మంది పారిశుధ్య కార్మికులు దర్గాలో, నగరంలో పని చేయనున్నారు. నీటిని శుభ్ర చేయడం మొదలుకొని దర్గా పరిశుభ్రంగా ఉంచడం వరకు అన్ని పనులు నిర్వహించనున్నారు. ఉత్సవాలకు హాజరయ్యే దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. అగ్నిమాపక శాఖ సిబ్బంది 63 మందిని విధులకు కేటాయించారు. అప్రమత్తంగా ఉండాలి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వహించాలని ఎస్పీ ఐశ్వర్యరస్తోగి సూచించారు. మంగళవారం రొట్టెల పండగ ప్రారంభం కానుంది. జిల్లాతోపాటు ప్రకాశం, గుంటూరు, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు చెందిన 2,500 మంది సిబ్బంది బందోబస్తు విధుల్లో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం ఎస్పీ బారాషహీద్ దర్గాను పరిశీలించి భద్రతాపరంగా తీసుకోవాల్సిన చర్యలను సిబ్బందికి వివరించారు. అనంతరం పోలీసు కవాతు మైదానంలో విధుల్లో పాల్గొనే సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. 11వ తేదీ రాత్రి గంధ మహోత్సవం, 12వ తేదీ ప్రధానమైన రోజులన్నారు. ఆ రోజుల్లో పెద్దసంఖ్యలో భక్తులు దర్గాను దర్శించుకుంటారన్నారు. దర్గాలోకి ప్రవేశించే ద్వారం వద్ద, దర్శనం అయ్యాక బయటకు వచ్చేద్వారాల వద్ద ఇబ్బందులు కలుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. స్వర్ణాల ఘాట్ వద్ద విధులు నిర్వహించే సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. క్రైమ్ పార్టీలు విస్తృతంగా తిరుగుతూ నేరాలు జరగకుడా చూడాలన్నారు. అనుమానాస్పద వ్యక్తులు తారసపడితే వెంటనే వారిని అదుపులోకి తీసుకోవాలన్నారు. జిల్లా అధికారులందరూ ఇతర జిల్లాల నుంచి బందోబస్తు విధులకు హాజరైన సిబ్బందిని సమన్వయం చేసుకుని పండగ ప్రశాంత వాతావరణంలో జరిగేలా చూడాలన్నారు. ట్రాఫిక్ సిబ్బంది విధిగా రేడియం జాకెట్లు, హ్యాండ్సిగ్నల్ బ్యాట్లు వెంట ఉంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఏఎస్పీలు, డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
నెల్లూరులో ఐదు రోజుల పాటు రొట్టెల పండుగ
-
నేటి నుంచి రొట్టెల పండుగ
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: నెల్లూరు నగరంలోని ప్రసిద్ధిగాంచిన బారా షాహిద్దర్గాలో మంగళవారం నుంచి రొట్టెల పండుగ ప్రారంభంకానుంది. రాష్ట్రం నుంచే కాకుండా తమిళనాడు, కేరళ, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలతో పాటు.. దుబాయ్ నుంచి కూడా మత విశ్వాసకులు పెద్ద సంఖ్యలో తరలిరానున్నారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ప్రధానంగా రూ.1.57 కోట్లతో విద్యుత్, తాగునీరు, పారిశుధ్యం తదితర ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వం రాష్ట్ర పండుగ హోదా కల్పించిన నేపథ్యంలో ఏర్పాట్లు భారీగా చేస్తున్నారు. 1,981 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు. పారిశుధ్య సమస్య తలెత్తకుండా 4,500 మంది పారిశుధ్య కార్మికులను నియమించారు. దర్గా ప్రాంగణాన్ని విద్యుద్దీపాలతో అలంకరించడంతో పాటు.. దర్గాలో ఉన్న స్వర్ణాల చెరువులో నీటి నిల్వకు ఇబ్బంది లేకుండా చూస్తున్నారు. స్వర్ణాల చెరువులో 11.5 అడుగుల మేర నీరుండేలా చర్యలు తీసుకున్నారు. దర్గా ప్రాంగణంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ రూమ్‌కి అనుసంధానం చేశారు. ప్రధాన విభాగాల అధికారులంతా పర్యవేక్షించనున్నారు. కిటకిటలాడుతున్న దర్గా ప్రాంగణం మంత్రి డాక్టర్ అనిల్‌కుమార్‌యాదవ్, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధరరెడ్డి, కలెక్టర్ ఎంవీ శేషగిరిబాబు, జిల్లా ఎస్పీ ఐశ్యర్య రస్తోగిలు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. సోమవారం మంత్రి, ఎమ్మెల్యే తదితరులు దర్గా ప్రాంగణంలో ఏర్పాట్లను పరిశీలించారు. ఇతర రాష్ట్రాల వారు ఆదివారం నుంచే తరలివస్తుండటంతో దర్గా ప్రాంగణం కిటకిటలాడుతోంది. పదో తేదీన షహదాత్, 11న గంధం మహోత్సవం, నగరంలోని కోటమిట్ట వద్ద ఉన్న మసీదు నుంచి గంధం ఉరేగింపు నిర్వహించి దర్గాకు తీసుకొస్తారు. 12న రొట్టెల పండుగ, 13న తహలీల్ ఫాతేహో, 14న ముగింపు సభ నిర్వహించనున్నారు. -
కోర్కెలు తీర్చే రొట్టెల పండుగ వచ్చింది
సాక్షి, నెల్లూరు : రొట్టెల పండగకు వందల సంవత్సరాల చరిత్ర ఉంది. దర్గాలోని షహీద్‌లను (అమరుల సమాధులను) దర్శించుకునేందుకు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ నలుమూల నుంచే కాకుండా వివిధ దేశాల నుంచి భక్తులు తరలి వస్తుంటారు. బారాషహీలను స్మరిస్తూ తమ కోర్కెలను తీర్చుకోవాలని భక్తులు స్వర్ణాల చెరువులో రొట్టెలను ఒకరికొకరు మార్చుకుంటారు. కోరిన కోర్కెలు తీరిన తర్వాత మళ్లీ తిరిగి రొట్టెను వదులుతారు. మళ్లీ మరో కోరిక రొట్టెను పట్టుకుని తీసుకెళుతుంటారు. మతసామరస్యాలకు ప్రతీకగా భక్తులు లక్షల సంఖ్యలో పాల్గొంటారు. ఏటా 10 లక్షల నుంచి 12 లక్షలు మంది భక్తులు హాజరవుతుంటారు. షహీద్‌లు కొలువున్న చోటే బారాషహీద్ దర్గా టర్కీ నుంచి మహ్మద్ ప్రవక్త సందేశాన్ని ప్రపంచ వ్యాప్తం చేయడంలో భాగంగా 12 మంది మతబోధకులు భారతదేశానికి వచ్చారు. ఆ సమయంలో కొడవలూరు మండలంలోని గండవరంలో తమిళనాడు వాల్జారాజులకు, బీజాపూర్ సుల్తాన్లకు మధ్య పవిత్ర యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో టర్కీ కమాండర్, మత ప్రచారకుడు జుల్ఫేఖార్ బేగ్‌తో పాటు 11 మంది వీర మరణం పొందారు. వారి తలలు గండవరంలో తెగి పడగా వీరుల మొండాలను గుర్రాలు నెల్లూరులోని స్వర్ణాల చెరువు వద్దకు తీసుకువచ్చాయి. వీరమరణం పొందిన 12 మంది నెల్లూరు ఖ్వాజీకి కలలో కనపడి తమను అక్కడే సమాధి చేయాలని కోరడంతో అక్కడే సమాధులు నిర్మించారు. 12 సంఖ్యను ఉర్దూలో బారా, వీర మరణం పొందిన అమరులను ఉర్దూలో షహీద్‌లుగా పిలువబడతారు. అందుకే ఈ దర్గాకు బారాషహీద్ అనే పేరొచ్చింది. తలలు తెగిపడిన చోట గండవరంలో జరిగిన పవిత్ర యుద్ధంలో మత ప్రచారకుల 12 మంది తలలు తెగి పడ్డాయి. వాటిలో 7 మాత్రమే లభ్యమయ్యాయి. అవన్నీ సమాధులుగా మారిన చోటే నేడు సాతోషహీద్(సాత్ అంటే ఏడు, షహీద్ అంటే అమరులు) దర్గాగా పిలువబడుతుంది. షహదత్‌తో ప్రారంభం మొహరం నెలలో నెలవంక కనిపించిన 11వ రోజున రొట్టెల పండగ ప్రారంభమవుతుంది. తొలి రోజు షహద్‌త్‌తో ప్రారంభవుతుంది. తర్వాత రోజు గంధమహోత్సం చేస్తారు. కోటమిట్ట అమీనియా మసీదు నుంచి గంధాన్ని తీసుకొచ్చి 12 మంది షహీద్‌ల సమాధులకు లేపనం చేసి, భక్తులకు పంచుతారు. మరుసటి రోజు తమ కోర్కెలు తీరాలని భక్తులు వివిధ రకాల రొట్టెలను ఒకరికొకరు మార్చుకుంటారు. తహలీల్ ఫాతెహాతో పండగ ముగుస్తుంది. 4,500 మంది పారిశుధ్య కార్మికులతో బారాషహీద్ దర్గా ఆవరణ, స్వర్ణాలచెరువు, పార్కింగ్ ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు పారిశుధ్య పనులు చేసేందుకు నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో 4,500 మంది కార్మికులను కాంట్రాక్ట్ పద్ధతిన తీసుకోనున్నారు. కార్మికులను మూడు షిఫ్ట్‌లుగా విభజించి పనులు చేయిస్తారు. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు, 2 నుంచి రాత్రి 10 గంటల వరకు, రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల వరకు షిఫ్ట్‌లుగా విభజించారు. చెత్తను ప్రతి నిమిషం తొలగించేందుకు చర్యలు తీసుకున్నారు. మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ వెంకటరమణ, శానిటరీ సూపర్వైజర్లు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, మేస్త్రీలకు ప్రాంతాలు వారీగా విధులు కేటాయించారు. 8 వేల చదరపు అడుగుల్లో వసతి సదుపాయం దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు సేద దీరేందుకు కార్పొరేషన్ ఆధ్వర్యంలో 8 వేలు చదరపు అడుగులతో జింక్ షీటింగ్, షామియానాలు ఏర్పాట్లు చేశారు. ఐదు రోజుల పండగ సమయంలో వర్షం వస్తే ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందస్తు చర్యలు తీసుకున్నారు. మంత్రి అనిల్, నెల్లూరురూరల్ ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి కల్యాణమండపాల నిర్వాహకులతో మాట్లాడి వర్షం వచ్చిన సమయంలో కల్యాణ మండపాల్లో సేదదీరేందుకు ఏర్పాట్లు చేశారు. స్వచ్ఛంద సంస్థలతో మాట్లాడి నిరంతరాయంగా భోజనాలు, తాగునీరు కల్పించేందుకు ఏర్పాట్లు చేశారు. ప్రతిష్టాత్మకంగా నిర్వహణకు ఏర్పాట్లు వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పడి తర్వాత మొదటి సంవత్సరం నిర్వహిస్తున్న రొట్టెల పండగను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు పాలకులు, అధికారులు చర్యలు తీసుకున్నారు. భక్తులకు అన్ని విధాలా సౌకర్యాలు కల్పించి, సంతోషంగా వెళ్లేందుకు చర్యలు తీసుకున్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో అవసరం లేకపోయినా ఆర్భాటంగా ఖర్చులు చేసి కార్పొరేషన్ నిధులను దుర్వినియోగం చేశారు. భక్తుల సౌకర్యాలను మాత్రం పట్టించుకోలేదు. దుకాణాలు ఏర్పాటుకు కొలతలు వేస్తున్న దృశ్యం అన్ని శాఖల సమన్వయంతో.. రొట్టెల పండగకు అన్ని శాఖలు సమన్వయంతో విజయవంతంగా నిర్వహించేం దుకు మంత్రి అనిల్, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిలు కలెక్టర్, ఎస్పీలతో ఇప్పటికే సమావేశాలు నిర్వహించారు. రెవెన్యూ, పోలీస్ శాఖ, కార్పొరేషన్, విద్యు త్, ఆర్టీసీ, అగ్ని మాపక ఇతర శాఖల సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. 7 జోన్లుగా దర్గా ఆవరణలో విభాగాలు కేటాయింపు బారాషహీద్ దర్గా ఆవరణ మొత్తాన్ని 7 జోన్లుగా విభజించారు. మొదటి జోన్లో దుకాణాలు, పోలీసు కంట్రోల్ రూమ్, రెండో జోన్లో వాటర్ స్టాల్స్, దుకాణాలు, మరుగుదొడ్లు, శానిటరీ కార్యాలయం ఉంటాయి. మూడో జోన్లో షెల్టర్లు, దుకాణాలు, ఆసిఫ్ హుస్సేన్ బాబా దర్గా, నాల్గో జోన్లో ముసిఫిర్ ఖానా, సయద్ అహ్మద్ బాబాదర్గా, రిసెప్షన్ సెంటర్, ఐదో జోన్లో పిల్లల ఆట స్థలం, వాటర్ స్టాల్స్, దుకాణాలు, ఆరో జోన్లో బారాషహీద్ దర్గా, దర్గా కార్యాలయం ఉంటుంది. ఏడో జోన్లో పొదలకూరు రోడ్డును ఉంచారు. షవర్ బాత్‌ల వద్ద పనులు చేస్తున్న కూలీలు 50 కెమారాలతో నిఘా బారాషహీద్ దర్గా ఆవరణ మొత్తం 50 కెమారాల నిఘాలో ఉండనుంది. 40 ఫిక్స్డ్ కెమారాలు, 8 రొటేడెడ్ కెమారాలు, రెండు డ్రోన్లతో నిరంతరం ని«ఘాలో ఉండనుంది. దర్గా ఆవరణలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎప్పటికప్పుడు పోలీసు శాఖ 5 మానిటరింగ్ టీవీల్లో వీక్షించనున్నారు. స్వర్ణాలచెరువు వద్ద రెడ్ మార్కును ఎవరైనా భక్తులు దాటితే అప్రమత్తం చేసేందుకు ఓ కెమారాను ఏర్పాటు చేశారు. భక్తులు రెడ్ మార్కు దాటగానే పోలీసుశాఖను అలర్ట్ చేస్తుంది. హైటెక్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఆధ్వర్యంలో ఓ సాఫ్ట్వేర్ ద్వారా బారాషహీద్ దర్గాలోకి ఎంత మంది భక్తులు వస్తున్నారనే దానిపై ఎప్పటికప్పుడు కౌంటింగ్ చేసేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. దర్గా ఆవరణను ఏడు జోన్లుగా ఏర్పాటుచేసిన చిత్రం -
బారాషహీద్ దర్గాను సందర్శించిన పవన్‌కల్యాణ్
నెల్లూరు (మినీబైపాస్/స్టోన్ హౌస్పేట): శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని బారాషహీద్ దర్గాను జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా దర్గాలోని బారాషహీద్‌లను ఆయన దర్శించుకున్నారు. అనంతరం ఏపీ, తెలంగాణ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ఆకాక్షింస్తూ.. పవన్ స్వర్ణాల చెరువులో రొట్టెను పట్టుకున్నారు. కార్యక్రమంలో హాస్యనటుడు అలీ, జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీ జెండాలు మోస్తే నాయకులు కాలేరు: పవన్ పార్టీ జెండాలు మోస్తే నాయకులు కాలేరని, ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో పనిచేసేవారికే జనసేన పార్టీలో గుర్తింపు ఉంటుందని పవన్‌కల్యాణ్ వ్యాఖ్యానించారు. రొట్టెల పండుగ సందర్భంగా ఆదివారం నెల్లూరు వచ్చిన పవన్ మాగుంట లేఔట్‌లోని ఓ హోటల్లో జనసేన పార్టీ నేతలతో సమావేశం నిర్వహించారు. -
బారాషహీద్ దర్గా కిటకిట
నెల్లూరు సిటీ: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని బారాషహీద్ దర్గా లక్షలాది మంది భక్తులతో కిటకిటలాడుతోంది. రొట్టెల పండుగకు రెండో రోజు శనివారం భక్తులు భారీగా తరలివచ్చారు. భక్తులు ఆయా ఘాట్లలో రొట్టెలను పట్టుకుని బారాషహీదులను దర్శించుకున్నారు. కడప దర్గా పీఠాధిపతి ఆధ్వర్యంలో గంధంను సంప్రదాయబద్ధంగా కలిపి ఊరేగింపుగా దర్గాకు తీసుకువచ్చారు. బారాషహీదులకు గంధం సమర్పించి, అనంతరం భక్తులకు పంపిణీ చేశారు. వైఎస్ జగన్ సీఎం కావాలి: మేకపాటి ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉంటారని మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. ఆయన శనివారం స్థానిక దర్గామిట్టలోని బారాషహీద్ దర్గాను సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం స్వర్ణాల చెరువులో వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావాలని రొట్టెను పట్టుకున్నారు. -
అభీష్టం కొద్దీ రొట్టె
రొట్టెలమ్మా రొట్టెలు... ఇంటి రొట్టె, చదువుల రొట్టె, ఉద్యోగాల రొట్టె, పెళ్లి రొట్టె, విదేశీ రొట్టె, సంతానం రొట్టె, ఆరోగ్య రొట్టె... మీకు ఏ రొట్టె కావాలి? అంటూ అడుగుతుంటారక్కడ. అలాగని అమ్ముకోరు. ప్రేమగా పిలిచి మరీ ఇస్తారు. తీసుకునే వాళ్లు కూడా భక్తిశ్రద్ధలతో రొట్టెను అందుకుంటారు. ఈ సంవత్సరం రొట్టెను తీసుకున్న వారి కోరిక నెరవేరితే వచ్చే సంవత్సరం తామే రొట్టెలు తయారు చేసి వాటిని కావలసిన వాళ్లకు దానిని అందిస్తారు. అందుకోసం ప్రత్యేకంగా ఘాట్లు కూడా ఉంటాయి. హిందూ, ముస్లిం భేదం లేకుండా మతసామరస్యానికి ప్రతీకగా రొట్టెలపండగ ప్రతి సంవత్సరం నెల్లూరు నగరంలో జరుగుతుంది. ఉద్యోగం మొదలుకొని వీసా వరకు అన్ని రొట్టెలు ఇక్కడ భక్తులు భక్తితో సమర్పించి కోరిక తీరాక మళ్లీ రొట్టెలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. భక్తులు సమర్పించే రొట్టెలకు బారాషహిద్ సంతసించి కోరిన కోర్కెలు తీర్చే దర్గాగా ఖ్యాతి గాంచడంతో రాష్ట్రంతో పాటు దేశంలోని పలు రాష్ట్రాల నుంచి, అరబ్ దేశాల నుంచి ఏటా ఉత్సవాలకు లక్షల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఇందుకే కాబోలు నెల్లూరులో జరిగే రొట్టెల పండగకు రాష్ట్రపండగ హోదాను 2015లో ప్రకటించింది ప్రభుత్వం. 1751లో మొదటిగా రొట్టెల పండగను ఆర్కాట్నవాబులు నిర్వహించారు. తదనంతరం అన్ని మతాల భక్తులు ఇందులో భాగస్వాములై కులమతాలకు అతీతంగా ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ శుక్రవారం మొదలైన ఈ పండుగ ఐదు రోజులపాటు అంటే మంగళవారం, 25వ తేదీ వరకు జరుగుతుంది. ఖండాంతరాలకు ఎగిరిన రొట్టె బారాషహిద్ దర్గా కంటే రొట్టెల పండగ దర్గాగా అంతర్జాతీయ ఖ్యాతి గాంచింది. మొదట్లో వ్యాపారం, ఆరోగ్యం రెండు రొట్టెలు మాత్రమే ఉండేవి. కాలక్రమేణా కోరికల రొట్టెలు పెరిగాయి. భక్తులు కోరుకున్న కోరికలు నెరవేరుతున్నాయి. ఇప్పడు ఉద్యోగం రొట్టె, ప్రమోషన్ రొట్టె, వ్యాపారం రొట్టె, ఆరోగ్యం రొట్టె, విద్య రొట్టె, రాజకీయ రొట్టె, సంతానరొట్టె, వీసా రొట్టెల ఇలా అనేకం ఉన్నాయి. ఉత్సవాల్లో స్వర్ణాల చెరువు వద్ద ప్రత్యేకంగా ఒక్కో రొట్టెకు సంబంధించి ఒక్కో ఘాట్‌ను ఏర్పాటు చేయడంతో, ఆయా ఘాట్ల వద్ద భక్తులు మార్చుకుంటారు. ముఖ్యంగా సంతానం, ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్య రొట్టెలు లక్షల సంఖ్యలో భక్తులు మార్చుకుంటారు. కోరిన కోర్కెలు నెరవేరాలని మొదటగా ఒకరు రొట్టె ఇస్తారు. దానిని స్వీకరించిన వారు వారి కోరిక నెరవేరగానే మరుసటి సంవత్సరం వచ్చి మళ్లీ వారు మొక్కు తీర్చుకుంటారు. ఏటా రాష్ట్రంతో పాటు తెలంగాణ రాష్ట్రం, కర్ణాటక, తమిళనాడు, కేరళ, మహారాష్ట్రతోపాటు అరబ్ దేశాల నుంచి కూడా ఇక్కడకు వస్తుంటారు. అధికార, ప్రతిపక్షనేతలతో పాటు ఇతర రాజకీయ పార్టీల నేతలు వచ్చి రాజకీయ ఆకాంక్షలు నెరవేర్చాలని రొట్టెలు సమర్పిస్తుండటం విశేషం. ఎలా తయారు చేయాలంటే..? గోధుమ, బియ్యం పిండి కలిపి అర కిలోకు ఐదు రొట్టెలు వచ్చేలా సిద్ధం చేస్తారు. రొట్టెలపై ఏదైనా కూర ఉంచి స్వర్ణాల చెరువులోని నీటిలో నిలుచొని రొట్టెలను కావాల్సిన వారికి ఇస్తారు. ఉద్యోగం, పెళ్లిరొట్టెను బెల్లంతో కలిపి అందజేస్తారు. ఐదు రొట్టెలను ఏదైనా కోరికతో సిద్ధం చేసి ఒకటి ఇంట్లో ఉంచి మిగిలిన నాలుగు రొట్టెలను దర్గాకు తీసుకువచ్చి బారాషహిద్కు సమర్పించి స్వర్ణాల చెరువులో రెండు విడిచి మిగిలిన రెండింటిని కావాల్సిన వారితో మార్చుకుంటారు. బారా అంటే 12 షహీద్ అంటే అమరుడు అని అర్థం. మత ప్రబోధం చేస్తూ జరిగిన పవిత్ర యుద్ధం మరణించిన 12 మంది వీరులు ఒకే ప్రాంతంలో సమాధి కావడం ఇక్కడ విశేషం. 1751లో 12 మంది సౌదీ అరేబియాలోని మక్కా నుంచి భారత్‌కు మతప్రచారం నిమిత్తం వచ్చారు. బీజాపూర్ సుల్తాన్ కు, తమిళనాడు వాలాజా రాజులకు మధ్య జరిగిన యుద్ధంలో మరణించిన 12 మంది సమాధుల ప్రాంతమే బారాషహిద్ దర్గా. అప్పట్లో నెల్లూరు ప్రాంతం తమిళనాడు రాష్ట్రం పాలించిన ఆర్కాట్ నవాబుల పాలనలో ఉండేది. వందల ఏళ్ల క్రితం నెల్లూరుకు ఎటువంటి రాకపోకలు లేని విధంగా పూర్తి అటవీ ప్రాంతంగా, సహజసిద్ధంగా ఏర్పడిన స్వర్ణాల చెరువు మాత్రమే ఉండేది. అప్పటి ఆర్కాట్ నవాబు సతీమణి అనారోగ్యంతో బాధపడుతోంది. ఈ క్రమంలో ఒకరోజు బారాషహీద్లలో ఒకరు ఆమెకు కలలో కనిపించి తాను స్వర్ణాల చెరువు వద్ద సమాధి అయ్యానని, తనకు అక్కడ దర్గా నిర్మించమని ఆమెకు ఉపదేశించారు. తనకొచ్చిన స్వప్నాన్ని ఆర్కాట్ నవాబుకు ఆమె చెప్పగా వెంటనే భారీగా సైన్యంతో అటవీ ప్రాంతంలో ఉన్న స్వర్ణాల చెరువు వద్దకు వచ్చి బారాషహీద్ కోరిన విధంగా సమాధి నిర్మాణ పనులు మొదలు పెట్టారు. ఈ క్రమంలో అప్పట్లో దూరప్రాంతాలకు వచ్చే క్రమంలో రొట్టెలే ఆహారంగా ఎక్కువ వినియోగంలో ఉండేది. నవాబు, అతని సతీమణి రొట్టెలు తిని స్వర్ణాల చెరువులో నిలబడి మిగిలిన రొట్టెలను తమతో వచ్చిన పరివారానికి పంచి పెట్టారు. ఆమె వెంటనే కోలుకోవడంతో షహీద్‌పై భక్తివిశ్వాసాలు మెండుగా పెరిగాయి. ఆ తర్వాత ఆర్కాట్నవాబు షహీద్‌కు సమాధి నిర్మించి కొంత భూభాగాన్ని దర్గాకు కేటాయించారు. ఏటా మొహర్రం కలిసి వచ్చేలా బారాషహీద్ దర్గా ఉత్సవాలు జరుగుతుంటాయి. ఆనాడు మొదలైన ఈ ఉత్సవాలు ఈ విధంగా 266 సంవత్సరాలుగా జరుగుతున్నాయి. – కాట్రపాటి కిశోర్, సాక్షి, నెల్లూరు -
రొట్టెల పండగ ప్రారంభం
-
నెల్లూరులో సందడిగా రొట్టెల పండగ
-
రొట్టెల పండుగలో పాల్గొన్న వైఎస్ జగన్
-
రొట్టెల కోసం ఆరాటం
స్వర్ణాల చెరువు వద్ద భక్తుల కోలాహలం షహీదులకు ఘనంగా తహలీల్ ఫాతెహా అలరించిన క్రాకర్స్ షో నేడూ కొనసాగనున్న పండుగ నెల్లూరు(అర్బన్) : బారా షహీద్ దర్గాలో శనివారం కూడా భక్తుల కోలాహలం కొనసాగింది. దేశ, విదేశాలతో పాటు స్థానికులు కూడా ఎక్కువగా తరలివచ్చారు. వీరితో దర్గా ప్రాంగణం కిక్కిరిసింది. నాలుగో రోజు నిర్వహించిన తహలీల్ ఫాతెహాకు వేలాదిమంది హాజరయ్యారు. స్వర్ణాల చెరువు తీరంలో రొట్టెల మార్పిడి కొనసాగుతూనే ఉంది. భక్తులు రొట్టెల కోసం ఆరాటపడుతూనే ఉన్నారు. ఆరోగ్యం, విద్య, వివాహం, సౌభాగ్యం, విదేశీయానం, పదోన్నతి, సంతానం, నూతన గృహాల రొట్టెలను భక్తులు ఎక్కువగా ఇచ్చి పుచ్చుకున్నారు. ఆదివారం కూడా పండుగ కొనసాగనుంది. కులమతాలకు అతీతంగా.. రొట్టెల పండుగ ఈ నెల 12వ తేదీ బుధవారం రాత్రి మత గురువులు బారాషహీదులకు సొందల్ మాలిక్‌ను లేపనం చేయడంతో ప్రారంభమైంది. కులమతాలు, ప్రాంతాలు, సంప్రదాయాలకు అతీతంగా తమ కోర్కెలు తీరాలంటూ అనేకమంది భక్తులు సంకల్పిచారు. పాకిస్తాన్, దుబాయ్ తదితర దేశాల నుంచి కూడా భక్తులు వచ్చారు. తమ కోర్కెలు తీరాలని స్వర్ణాల చెరువులో పుణ్యస్నానమాచరించారు. రొట్టెలు మార్చుకున్నారు. బారాషహీదులను దర్శించుకుని వరములిమ్మని మొక్కుకున్నారు. నెల్లూరుకే ప్రత్యేకత రొట్టెల పండుగ దేశంలోనే గుర్తింపు పొందింది. నెల్లూరు బారాషహీద్ దర్గా వద్ద జరిగే ఈ పండుగ నెల్లూరుకే ప్రత్యేకతను తెచ్చింది. ప్రభుత్వం సైతం గత సంవత్సరం రొట్టెల పండుగను రాష్ట్ర పండుగగా గుర్తించి నిధులు విడుదల చేసింది. కోర్కెలు తీరిన వారు స్వర్ణాల చెరువులో రొట్టెలు వదులుతారు. కొత్తగా కోర్కెలు కోరే వారు ఆరొట్టెలు అందుకోవడం ఆనవాయితీగా జరుగుతోంది. తహలీల్ ఫాతెహాతో ముగిసిన పండుగ శనివారం ఉదయం 11 గంటల ప్రాంతంలో ముజావర్లు, మతగురువులు తహలీల్ ఫాతెహా నిర్వహించారు. బిందె నిండా గంధాన్ని తీసుకుని ఫకీర్ల జరుబులు(తప్పెట్లు)తో దర్గా చుట్టూ ఊరేగింపు నిర్వహించారు. గంధాన్ని బారాషహీదులకు లేపనం చేశారు. ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. గంధాన్ని భక్తులకు పంచి పెట్టారు. అనంతరం పండుగ ముగిసినట్టు మత పెద్దలు ప్రకటించారు. ఈ తహలీల్ ఫాతెహాలో దర్గా కమిటీ అధ్యక్షుడు జంషీద్, దర్గా ముజావర్ రఫీ, వక్ఫ్‌బోర్డు ఇన్స్పెక్టర్ అహ్మద్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. ఆదివారం కూడా ప్రత్యేక ఏర్పాట్లు పండుగ ముగిసినప్పటికీ భక్తుల రద్దీ తగ్గడం లేదు. మధ్యాహ్నం పలుచగా ఉన్న భక్తులు సాయంకాలం అయ్యే సరికి ఒక్కసారిగా పెరిగిపోతున్నారు. రోడ్లన్నీ ట్రాఫిక్‌తో కిటకిటలాడుతున్నాయి. అధికారులు 15లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేశారు. ఇప్పటికి 12లక్షల మంది వచ్చినట్టు తెలుస్తోంది. మరో రెండు రోజులు కూడా భక్తులు దర్గాకు రానున్నారు. గత అనుభవాన్ని దృష్టిలో ఉంచుకున్న అధికారులు పండుగ ముగిసినప్పటికీ ఆదివారం కూడా భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు యథావిథిగా కల్పిస్తున్నారు. పారిశుద్ధ్య పరిరక్షణ, లైటింగ్, తాగునీరు తదితర వసతులు కొనసాగిస్తున్నారు. ఉద్యోగం , ఆరోగ్య రొట్టెలకు డిమాండ్ ఈ దఫా నిర్వహించిన పండుగలో ఉద్యోగం, ఆరోగ్య రొట్టెల కోసం డిమాండ్ కన్పించింది. పలువురు నిరుద్యోగులు ఉద్యోగం రొట్టె కోసం తిరిగారు. ఆరోగ్యం కోసం అనేకమంది రొట్టెలు మార్చుకున్నారు. కొంతమంది తమ బిడ్డలకు మంచి సంబంధాలు రావాలని కోరుకుంటూ పెళ్లి రొట్టెలు మార్చుకున్నారు. గతంలో రొట్టె పట్టుకుని పెళ్లయిన నూతన దంపతులు ఈ సంవత్సరం రొట్టెలు వదిలారు. నేడు అవార్డులు పండుగ నిర్వహణలో కష్టపడి పని చేసిన అధికారులకు, సిబ్బందికి ఆదివారం అవార్డులు ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి నారాయణ, మేయర్ అబ్దుల్ అజీజ్‌తో ఎమ్మెల్యేలు, అధికారులు తదితరులు పాల్గొననున్నారు. -
రొట్టెల పండుగలో పాల్గొన్న వైఎస్ జగన్
నెల్లూరు: ఆంధప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం మధ్యాహ్నం రొట్టెల పండుగలో పాల్గొన్నారు. బారాషహీద్ దర్గాలో ఆయన ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం స్వర్ణాల చెరువులో రోట్టెలు పట్టారు. ఈ ఉదయం హైదరాబాద్ నుంచి విమానంలో రేణిగుంట చేరుకుని రోడ్డు మార్గంలో నెల్లూరు వచ్చారు. రేణిగుంట విమానాశ్రయంలో వైఎస్ జగన్ కు వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. రొట్టెల పండుగలో పాల్గొన్న తర్వాత తిరుపతికి వైఎస్ జగన్ పయనమయ్యారు. -
ఘనంగా మూడో రోజు రొట్టెల పండగ
-
రొట్టెల పండగలో పాల్గొన్న చంద్రబాబు
-
నేడు నెల్లూరులో వైఎస్ జగన్ పర్యటన
హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం నెల్లూరులో పర్యటిస్తారు. బారాషహీద్ దర్గాలో ఆయన ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. ఆ తర్వాత స్వర్ణాల చెరువులో జరిగే రొట్టెల పండుగలో వైఎస్ జగన్ పాల్గొంటారు. అయితే దర్గాలో ఈ రోజు వైభవం గంధ మహోత్సవం జరిగింది. ఈ నేపథ్యంలో భారీగా భక్తులు తరలివచ్చారు. -
ఘనంగా రెండోరోజు రొట్టెల పండుగ
-
ఘనంగా రెండో రోజు రొట్టెల పండగ
నెల్లూరు: బారా షహీద్ దర్గాలో గురువారం రొట్టెల పండగ రెండో రోజుకు చేరుకుంది. ఈ పండగ నేపథ్యంలో ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. రొట్టెల పండగలో రాత్రికి గంధమహోత్సవం జరగనుంది. అయితే ఈ రోజు మధ్యాహ్నం బారా షహిద్ దర్గాలో సీఎం చంద్రబాబు పాల్గొని ప్రార్థనలు చేయనున్నారు. దీంతో దర్గా వద్ద పటిష్టమైన భద్రత చర్యలు చేపట్టారు. మరో రెండు రోజులు ఈ రొట్టెల పండగ కొనసాగనుంది. -
ప్రారంభమైన రొట్టెల పండుగ
-
భక్తుల మనోభావాలు దెబ్బతీయొద్దు
రొట్టెల పండగలో రాజకీయ ఫ్లెక్సీలు, వీఐపీ దర్శనాలకు స్వస్తి పలకండి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి నెల్లూరు (వేదాయపాళెం) : రాష్ట్రానికే ప్రతిష్టాత్మకమైన బారాషహీద్ దర్గా వద్ద నిర్వహించనన్ను రొట్టెల పండగకు వచ్చే భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా వ్యవహరించడం ఏ మాత్రం సరికాదని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అన్నారు. బారాషహీద్ దర్గా వద్ద బుధవారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ దర్గా పరిసర ప్రాంతాల్లో ఏ రాజకీయ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయొద్దని హితవు పలికారు. ఫ్లెక్సీల కారణంగా భక్తి భావానికి, ప్రశాంతతకు భంగం కలుగుతుందన్నారు. వీఐపీ దర్శనాలతో సాధారణ క్యూలో ఉన్న భక్తులను గంటల తరబడి వేచి ఉండేలా చేయడం వల్ల తొక్కిసలాట జరుగుతుందన్నారు. అజ్మీర్ దర్గా తరహాలో బారాషహీద్ దర్గాకు ప్రాధాన్యత, విశిష్టత ఉందన్నారు. దేశ విదేశాల నుంచి భక్తులు లక్షలాది మంది వస్తారని, వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాల్సిన అవసరం ఉందన్నారు. రొట్టెల పండగను జాతీయ పండగగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించాలన్నారు. రొట్టెల పండగకు కేటాయించిన నిధులు సద్వినియోగం అయ్యేలా మంత్రి నారాయణ, మేయర్ అజీజ్, జిల్లా కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఏర్పాట్లు పరిశీలన బారాషహీద్ దర్గా వద్ద భక్తుల కోసం చేస్తున్న ఏర్పాట్లను రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి పరిశీలించారు. మరుగుదొడ్లు, చెరువు వద్ద ఘాట్ల నిర్మాణ పనులు చూశారు. ముస్లిం మత పెద్దలు, వక్భ్బోర్డ్ అధికారులు ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డిని గౌరవ పూర్వకంగా ఆహ్వానించి దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. వైఎస్సార్సీపీ నగర అధ్యక్షుడు తాటి వెంకటేశ్వరరావు, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి బిరదవోలు శ్రీకాంత్‌రెడ్డి, ముస్లిం మైనార్టీ నేతలు సలీమ్, హంజాహస్సేన్, మునీర్ సిద్దిక్, అబూబకర్, చిన్నమస్తాన్, రియాజ్, బాబు, కార్పొరేటర్ లేబురు పరమేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు. -
రొట్టెల పండగకు జోరుగా ఏర్పాట్లు
10 లక్షల మంది హాజరవుతారని అధికారుల అంచనా భక్తులకు మజ్జిగ, నీళ్ల పంపిణీకి ప్రభుత్వ ఆదేశం ఈ సారి రూ.కోటికి పైగానే కార్పొరేషన్‌కు భారం అదనంగా రూ.1.40 కోట్లు కాంట్రాక్టర్‌కు చెల్లించాలని కార్పొరేషన్ మీద ఒత్తిడి ఈ ఖర్చు సుమారు రూ.80 లక్షలు రూ.16 లక్షలు వక్ఫ్ సాయం సాక్షి ప్రతినిధి, నెల్లూరు: నెల్లూరులో ఈ నెల 12 నుంచి 16వ తేదీ వరకు నిర్వహించనున్న రొట్టెల పండగకు ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. ఈ సారి 10 లక్షలకు పైగా జనం హాజరవుతారని అధికారులు అంచనా వేశారు. పండగ ఏర్పాట్ల ఖర్చు రూ.కోటితో పాటు స్వర్ణాల చెరువుకు శాశ్వతంగా ఘాట్లు నిర్మించేందుకు జరుగుతున్న పనికి సంబంధించి రూ.1.40 కోట్లు కార్పొరేషన్ నెత్తిన భారం మోపే ప్రయత్నం ప్రభుత్వం చేస్తోంది. అసలే నిధులు లేవని అల్లాడుతున్న కార్పొరేషన్ వర్గాలు ఈ బిల్లులు తాము చెల్లించలేం మహాప్రభో అని బావురుమంటున్నాయి. ఇదిలా ఉండగా రొట్టెల పండగను ఈ సారి భారీ ఎత్తున నిర్వహించాలని ప్రభుత్వం భావించింది. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు, భక్తులకు సదుపాయాలు కల్పించే బాధ్యత మాత్రం యథాతథంగానే కార్పొరేషన్ మీద మోపింది. ప్రభుత్వం నుంచి ఏమైనా నిధులు వస్తాయేమోనని ఎదురు చూసిన అధికారులు ఇక లాభం లేదనుకుని 15 రోజుల నుంచి పనులు ప్రారంభించారు. శాశ్వత ఏర్పాట్లు కేవలం రొట్టెల పండగ సమయంలోనే కాకుండా ఏడాది మొత్తం నెల్లూరు వాసులకు వినోదం, ఆహ్లాదం కల్పించడానికి చెరువుకు ఘాట్ల నిర్మాణం, మొక్కల పెంపకం, జనం కూర్చోవడానికి అనువుగా సదుపాయాలతో శాశ్వత ఏర్పాట్లు చేస్తున్నారు. రూ.4 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న ఈ పనులకు కేంద్ర ప్రభుత్వం రూ.2.60 కోట్లు ఇచ్చింది. దర్గా, చెరువుకు వచ్చే జనానికి సౌకర్యంగా ఉండేదు కోసం భూమి చదును, 120 శాశ్వత మరుగుదొడ్లు నిర్మిస్తున్నారు. భక్తులకు నీడ కల్పించడం కోసం షెడ్లు, అలకరణలో భాగంగా ఆర్చిలు నిర్మిస్తున్నారు. బారాషహీద్ దర్గాకు వక్ఫ్‌బోర్డు రంగులు వేయింస్తోంది. భక్తులకు మజ్జిగ, నీళ్లు పంపిణీ రొట్టెల పండుగకు వచ్చే భక్తులందరికీ మజ్జిగ, నీళ్లు పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం సుమారు రూ.80 లక్షలు ఖర్చు అవుతుందని అధికారులు అంచనా వేశారు. దీంతో పాటు భక్తులకు వినోదం కల్పించడం కోసం ఈ సారి ఖవ్వాలి ఏర్పాటు చేయడానికి నిర్ణయించారు. రూ.18.90 లక్షలతో విద్యుత్ అలంకరణలు, మూడు పార్కింగ్ ప్రదేశాల్లో రూ.12 లక్షలతో 100 మొబైల్ టాయిలెట్లు, సీసీ కెమెరాలు, డ్రోన్లతో నిఘాకు రూ.20 లక్షలు ఖర్చు చేయబోతున్నారు. వక్ఫ్ రూ.16 లక్షల సాయం గత ఏడాది రొట్టెల పండగకు కార్పొరేషన్‌కు రూ.15 లక్షలు ఇచ్చిన వక్ఫ్‌బోర్డు ఈసారి రూ.16 లక్షలు అందించనుంది. గతేడాది రూ.10 లక్షలు అందించిన పర్యాటక శాఖ ఈ సారి తామే ఏర్పాట్లు చేస్తున్నందువల్ల ఆర్థికంగా సహకారం అందించలేమని తేల్చింది. గత ఏడాది నిర్వహించిన టెండర్లో రూ.60 లక్షలు ఆదాయం వచ్చినందువల్ల ఇందులో నుంచి ఈ సారి రూ.40 లక్షలు తమకు చెల్లించాల్సి ఉందని కార్పొరేషన్ వర్గాలు వక్ఫ్ బోర్డును కోరాలని నిర్ణయించాయి. దీంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాన్ని రూ.3 కోట్లు అడిగేందుకు నిర్ణయం తీసుకున్నారు. పుండు మీద కారం రొట్టెల పండగ నిర్వహణ కోసం అవసరమయ్యే రూ.కోటి భరించడమే ఇబ్బందిగా ఉన్న కార్పొరేషన్ మీద మరో రూ.1.40 కోట్లు మోపేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. స్వర్ణాల చెరువు అభివృద్ధి, ఘాట్ల నిర్మాణానికి రూ.4 కోట్లతో పంపిన ప్రతిపాదనలకు కేంద్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేసి తమ వంతుగా రూ.2.60 కోట్లు ఇచ్చింది. మిగిలిన రూ.1.40 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా ఇవ్వాలని సూచించింది. అయితే కాంట్రాక్టరు పనులు వేగంగా చేస్తూ బిల్లుల కోసం కార్పొరేషన్ అధికారుల మీద ఒత్తిడి చేస్తున్నారు. మంత్రితో కూడా సిఫారసు చేయించారు. కాగా రూ.1.40 కోట్లు తాము ఇవ్వలేమని కార్పొరేషన్ వర్గాలు తేల్చి చెప్పాయి. -
ఈ సారైనా నిధులిస్తారా..?
గతేడాది రొట్టెల పండుగకు రాష్ట్ర పండుగగా గుర్తింపు అయినా నిర్వహణకు నిధులను విడుదల చేయని ప్రభుత్వం రూ.కోటికిపైగా ఖర్చు చేసిన కార్పొరేషన్ ఈ ఏడాది రూ.50లక్షలు ఇవ్వాలని ప్రభుత్వానికి కమిషనర్ లేఖ నెల్లూరు, సిటీ: నెల్లూరులోని బారాషహీద్ దర్గాలో ఏటా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే రొట్టెల పండుగకు దేశ, విదేశాల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు తరలి వస్తుంటారు. రొట్టె పండుగ ప్రాముఖ్యత దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది జూన్‌లో రాష్ట్ర పండుగగా గుర్తిస్తున్నట్లు ప్రకటించింది. గత ఏడాది అక్టోబర్‌లో జరిగిన రొట్టెల పండుగ నిర్వహణకు కోటి రూపాయలకుపైగా ఖర్చు అయింది. ప్రభుత్వం నిధులను విడుదల చేయకపోవడంతో ఈ మొత్తాన్ని నెల్లూరు నగర పాలక సంస్థ భరించాల్సి వచ్చింది. దీంతో కార్పొరేషన్ ఆర్థిక భారంతో అప్పుల ఊబిలో కూరుకుపోయింది. రూ.80లక్షలతో శాశ్వత మరుగుదొడ్లు నిర్మాణం బారాషహీద్ దర్గాలో జరిగే రొట్టెల పండుగకు వచ్చే భక్తుల సౌకర్యార్థం నగర పాలక సంస్థ రూ.80లక్షలతో 120 శాశ్వత మరుగుదొడ్ల నిర్మాణం చేపడుతోంది. గత ఏడాది ఓ కాంట్రాక్ట్ సంస్థకు రూ.35లక్షలు చెల్లించి తాత్కాలిక మరుగుదొడ్లను ఏర్పాటు చేశారు. ఏటా జరిగే పండుగకు శాశ్వత మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టకుండా తాత్కాలిక మరుగుదొడ్లకు భారీగా ఖర్చుచేయడంపై అన్ని వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఈ ఏడాది శాశ్వతంగా మరుగుదొడ్లను నిర్మిస్తున్నారు. రాష్ట్ర పండుగగా గుర్తించిన ప్రభుత్వం నిధులను విడుదల చేయకపోవడంతో శాశ్వత మరుగుదొడ్ల కోసం ఖర్చు చేస్తున్న రూ.80లక్షలను ప్రస్తుతం కార్పొరేషన్ నిధులు నుంచి కాంట్రాక్టర్‌కు చెల్లిస్తున్నారు. అయితే అధికారులు మాత్రం మరుగుదొడ్లకు కేటాయించిన నిధులను త్వరలో స్వచ్ఛభారత్ నిధుల నుంచి కార్పొరేషన్‌కు మళ్లిస్తామని చెబుతుండడం విశేషం. రూ.50లక్షలు ఇవ్వాలని ప్రభుత్వానికి కమిషనర్ లేఖ రొట్టెల పండుగ నిర్వహణకు ఈ ఏడాది రూ.కోటికిపైగా ఖర్చు అయ్యే అవకాశం ఉందని, రూ.50లక్షలు విడుదల చేయాలని కార్పొరేషన్ కమిషనర్ కరణం వెంకటేశ్వర్లు ప్రభుత్వానికి లేఖ రాశారు. ఈ ఏడాదైన రాష్ట్ర ప్రభుత్వం స్పందించి రొట్టెల పండుగకు నిధులు కేటాయిస్తుందా..లేక గత ఏడాది పరిస్థితే పునరావృతం అవుతుందో వేచి చూడాల్సిందే. -
రొట్టెల పండగకు ఏర్పాట్లు
కలెక్టర్ ముత్యాలరాజు నెల్లూరు, సిటీ: వచ్చే నెల 13 నుంచి ప్రారంభం కానున్న రొట్టెల పండగకు ఏర్పాట్లు త్వరితగతిన పూర్తిచేయాలని కలెక్టర్ ముత్యాలరాజు అధికారులను ఆదేశించారు. నగరంలోని బారాషాహిద్ దర్గా ప్రాంగణాన్ని ఆదివారం నగర మేయర్ అజీజ్, కమిషనర్ వెంకటేశ్వర్లు, ఇరిగేషన్, టూరిజం అధికారులతో కలసి కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దేశ, విదేశాల నుంచి వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు. నగర మేయర్ అజీజ్ మాట్లాడుతూ దర్గా ప్రాంగణంలో నిర్మిస్తున్న 120 శాశ్వత మరుగుదొడ్లను అక్టోబర్ 2వ తేదీ నాటికి పూర్తిచేస్తామని తెలిపారు. భక్తుల సౌకర్యార్థం చెరువలో ఘాట్లు నిర్మాణం, లైటింగ్, గార్డెనింగ్‌కు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు టూరిజం వారి సహకారంతో రూ.2.62 కోట్లు మంజూరు చేశారన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కార్పొరేటర్లు పాల్గొన్నారు. -
శాశ్వత మరుగుదొడ్ల నిర్మాణం
నెల్లూరు సిటీ: బారాషహీద్ దర్గా ప్రాంగణంలో భక్తుల సౌకర్యార్థం 120 శాశ్వత మరుగుదొడ్ల నిర్మాణాన్ని ప్రారంభించినట్లు మేయర్ అబ్దుల్ అజీజ్ పేర్కొన్నారు. బారాషహీద్ దర్గా ప్రాంగణంలో పనులను శనివారం ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. అక్టోబర్ రెండో వారంలో రొట్టెల పండగ జరగనుందని చెప్పారు. రెండేళ్లుగా తాత్కాలిక మరుగుదొడ్లను ఏర్పాటు చేశామని, దీని వల్ల ఏటా రూ.16 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు ఖర్చు చేయాల్సి వచ్చిందని చెప్పారు. శాశ్వత మరుగుదొడ్ల నిర్మాణంతో ఖర్చు తగ్గనుందని తెలిపారు. కార్పొరేటర్లు పిట్టి సత్యనాగేశ్వరరావు, మన్నెం పెంచలనాయుడు, ప్రశాంత్‌కుమార్, ప్రశాంత్‌కిరణ్, మేకల రామ్మూర్తి, కిన్నెరప్రసాద్, నాయకులు ప్రసాద్, నన్నేసాహెబ్, తదితరులు పాల్గొన్నారు. -
రెండో రోజు కొనసాగుతున్న రొట్టెల పండుగ
-
రెండో రోజు కొనసాగుతున్న రొట్టెల పండుగ
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా : జిల్లాలో శనివారం ఘనంగా ప్రారంభమైన రొట్టెల పండుగ రెండో రోజు కొనసాగుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో బారా షహీద్ దర్గాకు చేరుకుంటున్నారు. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం గంధం(సందల్) ఊరేగింపు ఉండటంతో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలుగకుండా నగర పాలక సంస్థతోపాటు వక్ఫ్ బోర్డు జాగ్రత్తలు తీసుకుంది. -
కోలాహలంగా రొట్టెల పండుగ
-
కోలాహలంగా రొట్టెల పండుగ
శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా : పట్టణంలోని బారా షహీద్ దర్గా వద్ద శనివారం రొట్టెల పండుగ కోలాహలంగా ప్రారంభమైంది. మహిళలు పరస్పరం రొట్టెలను మార్చుకున్నారు. సర్వ మతాల వారు ఐక్యంగా జరుపుకునే ఈ పండుగకు ఘనమైన చరిత్ర ఉంది. దేశవిదేశాల నుంచి వచ్చే భక్తులతో ఆ ప్రాంతమంతా కిటకిటలాడుతోంది. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం గంధ మహోత్సవం, సోమవారం రొట్టెల పండుగ నిర్వహిస్తారని దర్గా ముజావర్ రఫీ తెలిపారు. లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు వక్ఫ్ బోర్డు, నగరపాలక సంస్థ విస్తృత ఏర్పాట్లు చేశారు. మరుగుదొడ్లు, వాటర్ ప్రూఫ్ షామియానాలను ఏర్పాటు చేశారు. కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఉచిత మంచి నీటిని అందిస్తుండగా, మరి కొన్ని సంస్థలు అన్నదాన సదుపాయాన్ని కల్పించాయి. నగరంలోని ఆసుపత్రులు ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేశాయి. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలుగకుండా ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ జానకి తెలిపారు.