
జగన్ సీఎం కావాలని రొట్టెను పట్టుకుంటున్న మాజీ ఎంపీ మేకపాటి తదితరులు
నెల్లూరు సిటీ: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని బారాషహీద్ దర్గా లక్షలాది మంది భక్తులతో కిటకిటలాడుతోంది. రొట్టెల పండుగకు రెండో రోజు శనివారం భక్తులు భారీగా తరలివచ్చారు. భక్తులు ఆయా ఘాట్లలో రొట్టెలను పట్టుకుని బారాషహీదులను దర్శించుకున్నారు. కడప దర్గా పీఠాధిపతి ఆధ్వర్యంలో గంధంను సంప్రదాయబద్ధంగా కలిపి ఊరేగింపుగా దర్గాకు తీసుకువచ్చారు. బారాషహీదులకు గంధం సమర్పించి, అనంతరం భక్తులకు పంపిణీ చేశారు.
వైఎస్ జగన్ సీఎం కావాలి: మేకపాటి
ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉంటారని మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. ఆయన శనివారం స్థానిక దర్గామిట్టలోని బారాషహీద్ దర్గాను సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం స్వర్ణాల చెరువులో వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావాలని రొట్టెను పట్టుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment