
నెల్లూరు (మినీబైపాస్/స్టోన్ హౌస్‌పేట): శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని బారాషహీద్ దర్గాను జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా దర్గాలోని బారాషహీద్‌లను ఆయన దర్శించుకున్నారు. అనంతరం ఏపీ, తెలంగాణ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ఆకాక్షింస్తూ.. పవన్ స్వర్ణాల చెరువులో రొట్టెను పట్టుకున్నారు. కార్యక్రమంలో హాస్యనటుడు అలీ, జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.
పార్టీ జెండాలు మోస్తే నాయకులు కాలేరు: పవన్
పార్టీ జెండాలు మోస్తే నాయకులు కాలేరని, ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో పనిచేసేవారికే జనసేన పార్టీలో గుర్తింపు ఉంటుందని పవన్‌కల్యాణ్ వ్యాఖ్యానించారు. రొట్టెల పండుగ సందర్భంగా ఆదివారం నెల్లూరు వచ్చిన పవన్ మాగుంట లేఔట్‌లోని ఓ హోటల్‌లో జనసేన పార్టీ నేతలతో సమావేశం నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment