barashaheed dargah
-
Rottela Panduga 2022: దారులన్నీ దర్గావైపు..!
సింహపురి దారులన్నీ బారాషహీద్ దర్గా వైపే మళ్లాయి. వరాల రొట్టెలను ఒడిసి పట్టుకునేందుకు స్వర్ణాల చెరువుకు భక్తులు పోటెత్తారు. కరోనా వైరస్ కారణంగా రెండేళ్ల విరామం తర్వాత రొట్టెల పండగ జరగడంతో దర్గా భక్తులతో కిటకిటలాడింది. మతసామరస్యానికి ప్రతీకగా జరిగే రొట్టెల పండగలో కోర్కెలు తీరిన భక్తులు రొట్టెలు వదిలేందుకు.. కొత్త కోర్కెల రొట్టెలు పట్టుకునేందుకు వివిధ రాష్ట్రాలు, ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులతో స్వర్ణాల చెరువు, బారాషహీద్ దర్గా వద్ద సందడి నెలకొంది. సాక్షి, నెల్లూరు: కుల, మతాలకు అతీతంగా, మతసామరస్యానికి ప్రతీకగా ఏటా ప్రతిష్టాత్కకంగా జరిగే రొట్టెల పండగ భక్తుల తాకిడి తొలి రోజే ద్విగుణీకృతమైంది. మంగళవారం నుంచి ప్రారంభమైన పండగ ఐదురో జుల పాటు 13వ తేదీ వరకు జరగనుంది. రెండేళ్ల విరామం తర్వాత జరుగుతున్న పండగ కావడంతో దేశ, విదేశాల నుంచి ఈ ఏడాది భారీగా భక్తులు హాజరయ్యే అవకాశం ఉంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులే కాకుండా కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల భక్తుల తొలిరోజు భారీగా హాజరయ్యారు. వరాల రొట్టెల బోర్డులు స్వర్ణాల చెరువు ఘాట్‌లో భక్తుల సౌకర్యార్థ్యం వివిధ కోర్కెల రొట్టెల బోర్డులను ఏర్పాటు చేశారు. ప్రధానంగా విద్య, ఆరోగ్యం, సౌభాగ్యం, ఉద్యోగం, వివాహం, సంతానం, ధనం రొట్టెల ఘాట్‌ల్లో భక్తుల రద్దీ ఎక్కువగా కనిపిస్తోంది. గతంలో భక్తులు ఏ కోర్కెతో రొట్టెను తీసుకున్నారో.. ఆ కోర్కె తీరితే తిరిగి రొట్టెను వదలాల్సి ఉంది. ఈ ఏడాది ఎక్కువ మంది భక్తులు ఆరోగ్య రొట్టెను తీసుకుంటున్నారు. కరోనా వైరస్ కారణంగా ఆరోగ్య రొట్టెకు డిమాండ్ పెరిగినట్లు భక్తులు చర్చించుకుంటున్నారు. మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి పరిశీలన రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి మంగళవారం బారాషహీద్ దర్గా ప్రాంగణాన్ని సందర్శించారు. రొట్టెల పండగకు హారయ్యే భక్తుల సౌకర్యాలు, ఏర్పాట్లు పర్యవేక్షించారు. పోలీసుశాఖ ఏర్పాటు చేసినా సీసీ కెమెరాల మానిటరింగ్ కేంద్రం నుంచి అన్నీ ప్రాంతాలను పరిశీలించారు. భక్తులు రద్దీ పెరిగితే అందుకు తగ్గట్లు సౌకర్యాలు నిర్వహణపై దిశానిర్దేశం చేశారు. పటిష్ట ఏర్పాట్లపై కలెక్టర్ చక్రధర్‌బాబు, ఎస్పీ విజయారావు, నగర పాలక సంస్థ కమిషనర్ హరితను అభినందించారు. రాబోయే ఏడాదిలో శాశ్వత అభివృద్ధి పనులు పూర్తి చేసి రొట్టెల పండగ నిర్వహించేలా చర్యలు తీసుకుంటామన్నారు. భక్తుల విశ్వాసానికి తగ్గట్లుగా అభివృద్ధి చేయాలని భావిస్తున్న నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిని అభినందించారు. ఎమ్మెల్యే చొరవతో వివిధ అభివృద్ధి పనులు నిర్వహణకు రూ.15 కోట్లకు ప్రభుత్వం అనుమతి లభించిందని మంత్రి తెలిపారు. పోటాపోటీగా వైద్యశిబిరాలు బారాషహీద్ దర్గాలో భక్తులకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తినా ప్రాథమిక చికిత్స అందించేందుకు వైద్య శిబిరాలు వెలిశాయి. వైద్య ఆరోగ్యశాఖ నేతృత్వంలోనే కాకుండా కార్పొరేట్ ఆస్పత్రులు మెడికేర్, అపోలో, కిమ్స్, యశోద యాజమాన్యాలు రెడ్‌క్రాస్, ఆయూష్ విభాగాలు ప్రత్యేక వైద్యశిబిరాలను ఏర్పాటు చేశారు. భక్తులకు అవసరమైన చికిత్స అందించేందుకు వైద్య సిబ్బంది, మందులను అందుబాటులో ఉంచారు. అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించుకునేందుకు అంబులెన్సులు కూడా అందుబాటులో ఉంచారు. సేవా కార్యక్రమాలు నిర్వహణ కోసం ఎవరి స్థాయిలో వారు విస్తృత ఏర్పాట్లు చేశారు. భారతి సిమెంట్స్ యాజమాన్యం ఉచితంగా వాటర్ ప్యాకెట్లు పంపిణీ చేస్తోంది. భారతి సిమెంట్స్ ప్రతినిధి మల్లికార్జునరెడ్డి దగ్గరుండీ భక్తులకు ఉచితంగా వాటర్ ప్యాకెట్లు అందించారు. పారిశుద్ధ్య పనులు భేష్ భక్తులు రద్దీ ఏ స్థాయిలో ఉన్నా బారాషహీద్ దర్గా ప్రాంగణంలో చక్కటి పారిశుద్ధ్య నిర్వహణకు కార్పొరేషన్ యంత్రాంగం శ్రీకారం చుట్టింది. మూడు షిఫ్ట్‌లు విభజించి ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య లోపం లేకుండా చర్యలు చేపట్టింది. నగర కమిషనర్ హరిత స్వీయ పర్యవేక్షణలో కార్పొరేషన్ విభాగం చురుగ్గా వ్యవహరిస్తోంది. పోలీసుశాఖ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి మానటరింగ్ కేంద్రం నుంచి పర్యవేక్షిస్తోంది. ఎస్పీ విజయారావు పర్యవేక్షణలో అదనపు ఎస్పీలు హిమవతి, చాముండేశ్వరీ, గాదె శ్రీనివాసులు, డీఎస్పీలు గాంధీ, హరినాథరెడ్డి, అబ్దుల్ సుభాహాన్, శ్రీనివాసులు తదితరులు షిప్ట్‌ల వారిగా దగ్గరుండీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. ట్రాఫిక్, బందోబస్తు నిర్వహణలో ఎలాంటి లోపం లేకుండా సమీక్షిస్తున్నారు. సమాచారశాఖ వైఖరితో మీడియా అసంతృప్తి బారాషహీద్ దర్గా కవరేజ్ నిమిత్తం మీడియాకు రెవెన్యూ యంత్రాంగం పాసులు జారీ చేసింది. సోమవారం సాయంత్రమే ఆర్డీఓ మలోల పాసులను సమాచారశాఖ ఉన్నతాధికారికి అప్పగించారు. మంగళవారం రొట్టెల పండగ ప్రారంభమైనా మీడియా ప్రతినిధుల కు పాసులు అందలేదు. పోలీసు యంత్రాంగం ఎక్కడిక్కడ మీడియాను కట్టడి చేసింది. ప్రభుత్వం జారీ చేసినా అక్రిడిటేషన్ కార్డులు చూపించినా అడ్డగించారు. ఒక దశలో నెల్లూరురూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దర్గా ప్రాంగణం పరిశీలనకు వచ్చిన మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి దృష్టికి మీడియా ప్రతినిధులకు ఈ విషయాన్ని తీసుకెళ్లారు. పాసులు ఇవ్వకపోవడంపై అక్కడే ఉన్న సదరు ఉన్నతాధికారిని మంత్రి కాకాణి ప్రశ్నిస్తే తాను సోమవారం సెలవులో ఉన్నానని చెప్పారు. సెలవులో ఉంటే పాసులు జారీ చేయడానికి ఇబ్బంది ఏమిటని నిలదీశారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు మాట్లాడుతూ జిల్లాలో ఎలాంటి అధికారిక కార్యక్రమం అయినా మీడియా ప్రతినిధులకు సమాచారశాఖ నుంచి ఇబ్బందులు తప్పడంలేదని ఆరోపించారు. భక్తిశ్రద్ధలతో షహదత్, సొందల్మాలి నెల్లూరు (బృందావనం): రొట్టెల పండగ తొలి రోజు సంప్రదాయంగా మంగళవారం రాత్రి అమరులైన 12 మంది యోథులను స్మరిస్తూ దర్గా ప్రాంగణంలో బారాషహీద్‌ల సమాధుల చెంత షహదత్ (ప్రత్యేక ప్రార్థనలు) నిర్వహించారు. షహదత్లో భాగంగా 12 మంది వీరుల సమాధులను మత పెద్దలు రాత్రి 11.30 నుంచి 2 గంటల వరకు గులాములు, పన్నీరుతో శుభ్రం చేసి అనంతరం గంధం లేపనం చేసి ‘సొందల్ మాలి’ నిర్వహించారు. నేడు గంధమహోత్సవం రొట్టెల పండగలో భాగంగా రెండో రోజు బుధవారం రాత్రి బారాషహీద్‌ల గంధమహోత్సవం జరగనుంది. కోటమిట్టలోని అమీనియా మసీదు నుంచి సంప్రదాయంగా గంధాన్ని తీసుకువచ్చి బారాషహీద్‌లకు లేపనం చేస్తారు. అనంతరం భక్తులకు ఆ గంధాన్ని, ప్రసాదాన్ని పంచి పెడతారు. రొట్టెల పండగలో ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుని అంగరంగ వైభవంగా జరిగే గంధ మహోత్సవాన్ని వీక్షించేందుకు భక్తులు లక్షలాదిగా తరలిరానున్నారు. రొట్టెల పండగపై పోలీస్ నిఘా నెల్లూరు (క్రైమ్): బారాషహీద్ దర్గాలో మంగళవారం రొట్టెల పండగ ప్రారంభమైంది. జిల్లా పోలీసు యంత్రాగం 2,173 మంది సిబ్బందితో భారీ బందోబస్తును ఏర్పాటు చేసింది. మహిళల రక్షణ నిమిత్తం స్వర్ణాలచెరువు ఘాట్, దర్గా ఆవరణలో ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేశారు. దర్గాలో 76 సీసీ కెమెరాలు, రెండు డ్రోన్లను ఏర్పాటు చేసి పోలీసు అవుట్‌పోస్టులోని తాత్కాలిక కమాండ్ కంట్రోల్ రూమ్‌కు అనుసంధానం చేశారు. పోలీసు అ«ధికారులు, సిబ్బంది అక్కడి నుంచి నిరంతర పర్యవేక్షిస్తూ అవసరమైన సూచనలు, సలహాలిస్తున్నారు. దర్గాలో మంగళవారం తప్పిపోయిన 21 మంది చిన్నారులను వారి తల్లిదండ్రులకు అప్పగించారు. క్రైమ్ పోలీసులు మఫ్టీలో తిరుగుతూ జేబు, గొలుసు దొంగలపై దృష్టి సారించారు. ఓ జేబు దొంగను అదుపులోకి తీసుకున్నారు. భద్రతా ఏర్పాట్ల పరిశీలన ఎస్పీ సీహెచ్ విజయారావు దర్గా ఆవరణలో భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. తాత్కాలిక కమాండ్ కంట్రోల్ పని తీరును ఆయన స్వయంగా వీక్షించారు. భక్తుల సంఖ్య పెరుగుతున్న క్రమంలో క్రైం పార్టీ సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. మఫ్టీలో తిరుగుతూ నేరాలు జరగకుండా చూడాలన్నారు. నేర నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలను పబ్లిక్ అడ్రస్సింగ్ సిస్టం ద్వారా భక్తులకు తెలియజేయాలన్నారు. అనంతరం ఆయన దర్గా క్యూలైన్లు, రొట్టెల మార్పిడి, పార్కింగ్ ప్రదేశాలను పరిశీలించి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. ఆయన వెంట ఏఎస్పీలు, డీఎస్పీలు తదితరులున్నారు. -
నెల్లూరు : రొట్టెల పండగ ప్రారంభం...దర్గాకు పోటెత్తిన జనం (ఫొటోలు)
-
రొట్టెల పండుగకు ముస్తాబైన బారాషహీద్ దర్గా
-
ఫలించిన ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి కృషి.. సీఎం జగన్‌కు కృతజ్ఞతలు
సాక్షి, నెల్లూరు: బారాషహీద్ దర్గా అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది. సమగ్రాభివృద్ధి కోసం రూ.15 కోట్లు మంజూరు చేస్తూ సోమవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది. కలెక్టర్ చక్రధర్‌బాబు నివేదిక ఆధారంగా నిధులు మంజూరు చేసింది. దర్గా ప్రాంగణంలో కాంప్లెక్స్, ఇంటర్నల్ సిమెంట్ రోడ్లు, స్వర్ణాల చెరువు తదితర అభివృద్ధి పనులను అనుమతి దక్కింది. రొట్టెల పండగ నాడు భక్తులకు తీపి కబురు లభించింది. బారాషహీద్ దర్గా అభివృద్ధికి ప్రజా ప్రతినిధుల అభ్యర్థన మేరకు కలెక్టర్ నివేదిక ఆధారంగా నిధులు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ‘బారాషహీద్ దర్గా ప్రాంగణంలో ఉన్నంత వరకు తాను భక్తుడినే. ప్రాంగణం బయట మాత్రమే ఎమ్మెల్యేను, చిత్తశుద్ధితో దర్గా అభివృద్ధి కోసం కృషి చేస్తానను’ అని కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి చెప్పిన మాట నిలబెట్టుకున్నారు. చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డితో సమీక్షించి, కలెక్టర్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందించారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి కోటంరెడ్డి సోదరులు ప్రత్యేకంగా తీసుకెళ్లారు. జిల్లాలో అత్యంత ప్రతిష్టాత్మకమైన బారాషహీద్ దర్గా ప్రాంగణంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులను వివరించారు. దీంతో దర్గా అభివృద్ధి పనుల కోసం రూ.15 కోట్ల నిధులు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. చదవండి: (Rottela Panduga: భక్తులతో పోటెత్తిన స్వర్ణాల చెరువు) సీఎం వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే రొట్టెల పండగ జరిగే బారాషహీద్ దర్గా అభివృద్ధికి రూ.15 కోట్ల నిధులు కేటాయించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కృతజ్ఞతలు. రొట్టెల పండగ నాడు తీపి కబురు లభించడంపై దర్గా భక్తుడిగా చాలా ఆనందంగా ఉంది. దర్గా అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేశాను. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తోడ్పాటుతో సాధ్యమైంది. – కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే చదవండి: (త్యాగానికి, ధర్మ పరిరక్షణకు ప్రతీక మొహర్రం : సీఎం వైఎస్ జగన్) -
బారాషహీద్ దర్గాకు పోటెత్తిన భక్తులు (ఫొటోలు)
-
Rottela Panduga: భక్తులతో పోటెత్తిన స్వర్ణాల చెరువు
మతాలకు, కులాలకు అతీతంగా మతసామరస్యంగా జరిగే రొట్టెల పండగ కరోనా కారణంగా రెండేళ్ల విరామం తర్వాత ఈ ఏడాది జరుగుతోంది. దీంతో ముందుగానే తీరిన కోర్కెల రొట్టెలు వదిలేందుకు.. కొత్త కోర్కెల రొట్టెలు పట్టుకునేందుకు వచ్చే భక్తులతో బారాషహీద్ దర్గా ప్రాంగణం కిటకిటలాడింది. రొట్టెల మార్చుకునే స్వర్ణాల చెరువు భక్తులతో పోటెత్తింది. సాక్షి, నెల్లూరు: రొట్టెల పండగ ప్రారంభానికి ముందే భక్తుల రాక ద్విగుణీకృతమైంది. సోమవారం ఉదయం నుంచి స్వర్ణాలచెరువు వద్ద కోర్కెల రొట్టెలను మార్చుకున్నారు. నాలుగు రోజుల నుంచి వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు బారాషహీద్ దర్గాకు చేరుకుంటున్నారు. భక్తులు భారీగా రావడంతో దర్గా ప్రాంగణంలో సందడి ప్రారంభమైంది. నగర పాలక సంస్థ, పోలీసు, విద్యుత్, ఆరోగ్యశాఖ, ఇతర శాఖల అధికారులు సమన్వయంతో అన్ని ఏర్పాట్లు చేశారు. ఏటా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే రొట్టెల పండగ మంగళవారం ప్రారంభం కానుంది. ఐదు రోజుల పాటు రొట్టెల పండగ జరుగుతోంది. జాతీయ రహదారుల నుంచి నగరంలోకి ప్రవేశించే మార్గంలో బారాషహీద్ దర్గాకు రూట్ మ్యాప్ సూచిస్తూ భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దర్గా ప్రాంగణం విద్యుత్ వెలుగులు విరజిమ్ముతున్నాయి. దర్గా ఆవరణలో చిన్నారులు ఆడుకునేందుకు ఆట వస్తువులు, జైంట్వీల్లు ఏర్పాటు చేశారు. ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి తాగునీటి కేంద్రాలు, స్నానపు గదులు, మరుగుదొడ్లు మహిళలు, పురుషులకు విడివిడిగా ఏర్పాటు చేశారు. భక్తులకు ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు అందుబాటులో 108 వాహనాలు, ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేశారు. దూరప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ఇబ్బంది పడకుండా భారీ జింక్షీట్లు ఏర్పాటు చేశారు. స్వర్ణాల చెరువు వద్ద భక్తులు ప్రమాదాలకు గురికాకుండా కంచెను ఏర్పాటు చేశారు. చెరువు వద్ద గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచారు. చెరువులో నీరు మురుగు చేరకుండా ఎప్పటికప్పుడు మోటార్లతో శుద్ధి చేస్తున్నారు. 15 వేలకు పైగా భక్తులు హాజరు దర్గాకు సోమవారం 15 వేల మందికి పైగా భక్తులు హాజరయ్యారు. కోర్కెల రొట్టెలను మార్చుకుని భక్తిశ్రద్ధలతో దర్గాను సందర్శించారు. కర్ణాటక, తమిళనాడు, కేరళ, తెలంగాణ రాష్ట్రాల నుంచి భక్తులు అధికంగా హాజరయ్యారు. రొట్టెల పండగకు ముందుగానే భక్తులు భారీగా వచ్చే అవకాశం ఉండడంతో అధికారులు కూడా ఏర్పాట్లు పూర్తి స్థాయిలో చేశారు. భక్తులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకున్నారు. అధికారుల సమన్వయంతో... కార్పొరేషన్, పోలీసు, ఆరోగ్య, విద్యుత్‌శాఖ, ఇతర శాఖల అధికారులు సమన్వయంతో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కలెక్టర్ చక్రధర్‌బాబు, ఎస్పీ విజయారావు, కార్పొరేషన్ కమిషనర్ హరిత, ఇతర శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి ఉద్యోగులకు రొట్టెల పండగ నిర్వహణపై సూచనలు చేశారు. అన్ని ఏర్పాట్లు పూర్తిచేశాం రొట్టెల పండగకు వచ్చే భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశాం. క్షేత్ర స్థాయిలో నిత్యం పరిశీలిస్తూ సిబ్బందికి సూచనలు ఇస్తున్నాం. బారాషహీద్ దర్గా ప్రాంగణం మొత్తం సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. 24 గంటలు పాటు పోలీసులు నిఘా ఉంటుంది. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాం. – చక్రధర్‌బాబు, కలెక్టర్ మది నిండా భక్తి, విశ్వాసం మది నిండా భక్తి, విశ్వాసం. అంతే నమ్మకంగా తీరుతున్న కోర్కెలతో మతసామరస్యానికి ప్రతీకగా రొట్టెల పండగ నిలుస్తోంది. కోరిన కోర్కెలు తీరితే రొట్టెలు వదిలే, పట్టుకునే భక్తులతో నెల్లూరు స్వర్ణాల తీరం సంద్రంగా మారింది. ఐదు రోజుల పాటు జరిగే పండగ ప్రారంభానికి ముందే సోమవారం భక్తులు కిటకిటలాడారు. కుల, మతాలకు అతీతంగా భక్తజనం పోటెత్తింది. వివాహం, విద్య, ఆరోగ్యం, ప్రమోషన్, గృహం, ఉద్యోగం, ధనం, సౌభాగ్యం, వ్యాపారం ఇలా అనేక సంతోషాలు తమ కుటుంబాల్లో పరిఢవిల్లాలని ఎన్నెన్నో ఆశలతో వచ్చే భక్తుల నమ్మకానికి ప్రతీకగా ఏటేటా రొట్టెల పండగ విశిష్టత పెరుగుతోంది. – నెల్లూరు(మినీబైపాస్) చదువు రొట్టె పట్టుకున్నాను పదో తరగతి పాస్ అవ్వాలని రొట్టెను పట్టుకున్నాను. గతంలో మూడేళ్లుగా రొట్టెల పండగకు వస్తున్నాను. ఈ దఫా చదువు రొట్టెను పట్టుకున్నాను. ఇంతకు ముందు ఆరోగ్య రొట్టెను పట్టుకున్నాం. – రేష్మా, హైదరాబాద్ సంతాన రొట్టెను తీసుకున్నా.. కర్ణాటకలోని తుమ్ముకూరులో వ్యాపారం చేస్తున్నాను. 13 తరాలుగా మా వంశంలో మగపిల్లలు లేరు. పోయిన సారి ఇక్కడకు వచ్చి మగ పిల్లవాడు కావాలని మొక్కుకున్నాను. ఇదిగో వీడే నా ఒక్కగానొక్క మగ పిల్లవాడు. నా కోరిక తీరింది. – మొహ్మద్ ఇలియాజ్, తుమ్ముకూరు, కర్ణాటక ఆరోగ్య రొట్టె పట్టుకున్నాను కర్ణాటకలో కేఎస్ఆర్టీసీలో కండక్టరుగా పని చేస్తున్నాను. యాక్సిడెంట్లో కాళ్లు పోగొట్టుకున్నాను. ప్రాణం మీద ఆశలు వదులు కోవాల్సిందేనని డాక్టర్లు చెప్పారు. అల్లాకు మొక్కుకున్నాను. ఆరోగ్యం మెరుగుపడాలని.. ఇక్కడికి వచ్చాను. ఆరోగ్య రొట్టెను పట్టుకున్నా. – బాబాజానర్, కేఎస్ఆర్టీసీ, కండక్టర్, కర్ణాటక ఉద్యోగ రొట్టె పట్టుకున్నా.. చదువు పూర్తయ్యంది. మంచి ఉద్యోగం రావాలని ఉద్యోగ రొట్టెను పట్టుకున్నాం. ఇంతకు ముందు మంచిగా చదువు పూర్తి కావాలని కోరుకున్నాం. అది తీరింది. ఇప్పుడు ఉద్యోగ రొట్టె పట్టుకున్నాం. – శ్రీవిద్య, ప్రవళ్లిక, నెల్లూరు -
స్వర్ణాల మురిసింది
-
భక్తజన సందోహం
-
రొట్టెల పండగను ప్రతిష్టాత్మకంగా నిర్వహించండి
మంతి నారాయణ నెల్లూరు, సిటీ: ఐదు రోజులు పాటు జరిగే రొట్టెల పండగను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని మంత్రి పొంగూరు నారాయణ పేర్కొన్నారు. నగర పాలక సంస్థ కార్యాలయంలోని మేయర్ చాంబర్లో సోమవారం పోలీస్, ఇరిగేషన్, మత్స్యశాఖ, కార్పొరేషన్ అధికారులతో సమీక్షించారు. పండగకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. పార్కింగ్ ప్రాంతాల నుంచి దర్గాకు ఆర్టీసీ బస్సులు నడిపేలా చూడాలన్నారు. గంధమహోత్సవానికి అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యే అవకాశం ఉన్నందున కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలన్నారు. రొట్టెల పండగకు సీయం చంద్రబాబునాయుడు రూ.5 కోట్లు మంజూరు చేశారని, స్వర్ణాలచెరువును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుని వినియోగిస్తామన్నారు. 4 లైన్ రోడ్డును త్వరతిగతిన ప్రారంభించండి నగరంలోని పాతచెక్‌పోస్ట్ నుంచి నాలుగోమైలు రోడ్డు వరకు నాలుగు లైన్ల రోడ్డును నిర్మించేందుకు త్వరితగతిన ప్రారంభించాలని అధికారులకు మంత్రి ఆదేశించారు. సమావేశంలో ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర, జేసీ ఇంతియాజ్, మేయర్ అజీజ్, కమిషనర్ కె వెంకటేశ్వర్లు, టీడీపీ నగర ఇన్చార్జ్ ముంగమూరు శ్రీధర్‌కృష్ణారెడ్డి, చాట్లనరసింహారావు తదితరులు పాల్గొన్నారు. -
భారీ భద్రత
దర్గాలో మెటల్ డిటెక్టర్ల ఏర్పాటు నెల్లూరు(క్రైమ్): బారాషాహీ«ద్ దర్గాలో ఈనెల 12 నుంచి 16వరకు జరగనున్న రొట్టెల పండగకు జిల్లా పోలీసు యంత్రాంగం భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తోంది. గుంటూర్, ప్రకా«శం జిల్లాలకు చెందిన 2100 మంది పోలీసులు భద్రతా విధుల్లో పాల్గొనున్నారు. ఎస్పీ విశాల్ గున్నీ అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తున్నారు. డ్రోన్‌తో నిఘా దర్గా ఆవరణం, కోటమిట్ట. ప్రధాన కూడళల్లో 40సీసీ కెమెరాలు, 2పిటీజెడ్ కెమెరాలు, నాలుగు డ్రోన్ కెమెరాలను వినియోగిస్తున్నారు. వీటిని నెల్లూరు, విజయవాడల్లోని కమాండ్ కంట్రోల్ సిస్టమ్‌కు అనుసంధానం చేస్తున్నారు. ఉన్నతాధికారులు విజయవాడనుంచే ప్రత్యక్షంగా రొట్టెల పండగను పర్యవేక్షిస్తూ సిబ్బందికి అవసరమైన సలహాలు, సూచనలు ఇస్తారు. ట్రాఫిక్‌పై ప్రత్యేక దృష్టి ట్రాఫిక్‌కు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పక్కా ప్రణాళికలు సిద్ధం చేశారు. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ డైవర్షన్లు ఏర్పాటు చేస్తున్నారు. దర్గా ఆవరణలోకి వీవీఐపీ, వీఐపీ వాహనాలతోపాటు ముందస్తు అనుమతి పొందిన వాహనాలను మాత్రమే అనుమతిస్తారు. మిగిలిన వాహనాలన్నీ పార్కింగ్ ప్రదేశాల్లోనే నిలపాలి. పార్కింగ్ ప్రదేశాలివే మాగుంటలే అవుట్‌లోని పిచ్చిరెడ్డి కల్యాణమంటపం ఎదురుగా ఉన్న స్థలం టీబీ హాస్పిటల్, కస్తూరిదేవిగార్డెన్ అండ్ స్కూల్, గుంటసుబ్బరామిరెడ్డి ఇంటి సమీపంలోని వక్ఫ్‌బోర్డు స్థలం, బట్వాడిపాలెం సెంటర్లోని మదరసా, ఏసి సుబ్బారెడ్డి స్టేడియం(హాకీ ప్లేగ్రౌండ్), కొత్తగా నిర్మిస్తున్న జిల్లా పోలీసు కార్యాలయ ఆవరణం, నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయం, సాల్వేషనార్మి చర్చి ఆవరణలో(ద్విచక్రవాహనాలు నిలపాలి) వాహనాలు నిలపాల్సి ఉంది. ట్రాఫిక్ దారిమళ్లింపు పొదలకూరువైపు నుంచి వచ్చే వాహనాలను పొదలకూరురోడ్డు , కొండాయపాలెం గేటు మీదుగా నగరంలోకి, పొదలకూరు వైపు వెళ్లే వాహనాలు కేవీఆర్ పెట్రోల్ బంక్, బొల్లినేని, కొండాయపాలెం మీదుగా పొదలకూరురోడ్డులోకి వెళుతాయి. -జొన్నవాడ నుంచి వచ్చే వాహనాలు బట్వాడిపాలెం సెంటర్, శాంతినగర్ మీదుగా నెల్లూరు నగరంలోకి, జొన్నవాడ వెళ్లే వాహనాలు అదే మార్గం గుండా జొన్నవాడకు వెళ్లేలా చర్యలు తీసుకొన్నారు. -సుజాతమ్మకాలనీ, ఎస్పీబంగ్లా, ప్రశాంతినగర్, అంబేడ్కర్ నగర వాసులకు మాత్రం వారి ఇళ్లకు వెళ్లేందుకు వాహనాలు అనుమతి ఇస్తామన్నారు. పోలీస్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు దర్గా ఆవరణలో పోలీసు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. 24 గంటలు సిబ్బంది అక్కడ భక్తులకు అందుబాటులో ఉంటారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కల్గినా డయల్ 100, 9440796303, 9440796305, 9440700015కు ఫిర్యాదు చేస్తే తక్షణమే స్పందిస్తారు. -
అంత ఖర్చు ఆ ఐదు రోజులకేనా ?
బారా షహీద్ దర్గా వద్ద పూర్తి కావచ్చిన 120 మరుగుదొడ్ల నిర్మాణం రొట్టెల పండుగ తర్వాత వీటి నిర్వహణపై గందరగోళం దర్గా నిర్వాహకులకు అప్పగించాలని అధికారుల యోచన ఈ భారం తమకు వద్దంటున్న దర్గా నిర్వాహకులు ముందు చూపులేక పోతే రూ 84 లక్షలు వృథాగా మారే ప్రమాదం రొట్టెల పండుగలో పాల్గొనడానికి తరలివచ్చే లక్షలాది మంది భక్తుల సదుపాయం కోసం రూ 84 లక్షలతో నిర్మిస్తున్న 120 మరుగుదొడ్ల నిర్వహణ విషయంలో గందరగోళం నెలకొంది. పండగ తర్వాత వీటిని దర్గాకు అప్పగించాలని కార్పొరేషన్ యోచిస్తుండగా, ఈ బాధ్యత తమకు వద్దని దర్గా నిర్వాహకులు చెబుతున్నారు. కార్పొరేషన్ మంచి ఆశయంతో ఖర్చు చేస్తున్న రూ 84 లక్షలు ఎందుకూ పనికి రాకుండా పోతాయా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సాక్షి ప్రతినిధి – నెల్లూరు నెల్లూరు నగరం బారా షహీద్ దర్గా ఆవరణంలో ఈ నె ల 12 నుంచి 16వ తేదీ వరకు జరిగే రొట్టెల పండుగకు సుమారు 10 లక్షల మంది భక్తులు తరలి వస్తారని అధికారులు అంచనా వేశారు. ప్రతి యేడు లాగే ఈ సారి కూడా మొబైల్ టాయిలెట్స్ ఏర్పాటు చేయాలని తొలుత భావించారు. రూ 84 లక్షలతో రెండు బ్లాక్‌లుగా 12 మరుగుదొడ్లు నిర్మించడానికి అధికారులు ప్లాన్ రూపొందించారు. కౌన్సిల్ ఈ పనులకు ఆమోద ముద్ర వేసింది. పనులకు టెండర్లు పిలవడం, కాంట్రాక్టర్ పనులు ప్రారంభించడం చకచకా జరిగిపోయాయి. ఈనెల 10 తేదీ నాటికి 120 మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేసి కార్పొరేషన్‌కు అప్పగించడానికి పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇందులో వృద్ధులు, వికలాంగుల కోసం ప్రత్యేకంగా 40 మరుగుదొడ్లు నిర్మిస్తున్నారు. ఈ వ్యర్థాలన్ని చెరువులో కలవకుండా ప్రత్యేకంగా మూడు గుంతలు నిర్మించారు. ఒక్కో బ్లాక్‌లో 22వేల లీటర్ల సామర్థ్యంతో రెండు చొప్పున రెండు బ్లాక్‌లకు కలిపి 44వేల లీటర్ల సామర్థ్యంతో నాలుగు ఓవర్ హెడ్ ట్యాంకులు నిర్మించారు. నగరంలోని బుజ్జమ్మ రేవు నుంచి ప్రత్యేకంగా పైప్‌లైన్ నిర్మించి నీటి సరఫరా చేయడానికి పనులు చేస్తున్నారు. రొట్టెల పండుగకు తరలివచ్చే భక్తులకు ఆ ఐదు రోజులు మరుగుదొడ్లు ఎంతో ఉపయోగ పడతాయి. ఆ తర్వాత పరిస్థితి ఏమిటి ? కార్పొరేషన్ లక్షల రూపాయలు ఖర్చు చేసి నగరంలో నిర్మించిన అనేక మరుగుదొడ్లు వృ«థాగా పడివున్నాయి. ప్రధాన కూడళ్లలోని మరుగుదొడ్లు మాత్రం సులభ్ సంస్థకు అప్పగించడంతో వినియోగదారుల నుంచి సొమ్ము వసూలు చేసి నిర్వహిస్తున్నారు. బారాషహీద్ దర్గా వద్ద రూ 84 లక్షలతో నిర్మిస్తున్న 120 మరుగుదొడ్లను సులభ్ లాంటి సంస్థలు తీసుకుని నిర్వహించే అవకాశం లేదు. రొట్టెల పండుగ తర్వాత ఇక్కడికి జనం పెద్దగా రారు. ఈ కారణంగా ఏ సంస్థ కూడా సొంతంగా డబ్బులు ఖర్చు చేసి మరుగుదొడ్లు నిర్వహించేందుకు ముందుకు వచ్చే అవకాశం లేదు. రొట్టెల పండుగ తర్వాత మరుగుదొడ్లను అలాగే వదిలేస్తే అందులోని కుళాయిలు, టైల్స్ కూడా పీక్కు పోయే ప్రమాదం వుంది. దీనికి తోడు ఇవి అసాంఘిక కార్యక్రమాలకు నిలయాలకుగా మారే అవకాశం ఉంటుంది. రూ 84 లక్షలు ఖర్చు చేసి మరుగుదొడ్లు నిర్మిస్తున్న కార్పొరేషన్ అధికారులకు వీటి నిర్వహణ ఎలా? అనే ఆందోళన పట్టుకుంది. పండగ తర్వాత వీటిని దర్గాకు అప్పగించాలని వారు భావిస్తున్నారు. అయితే దర్గా నిర్వాహకులు ఈ భారం తాము మోయలేమని చెబుతున్నారు. పండగ ఐదు రోజులు వీటిని బాగా ఉపయోగించి ఆ తర్వాత కార్పొరేషన్ వర్గాలు షరా మామూలుగా వీటి గురించి మరచిపోతే రూ 84 లక్షల ప్రజాధనం వృథాగా మారే ప్రమాదం వుంది. -
భక్తుల మనోభావాలు దెబ్బతీయొద్దు
రొట్టెల పండగలో రాజకీయ ఫ్లెక్సీలు, వీఐపీ దర్శనాలకు స్వస్తి పలకండి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి నెల్లూరు (వేదాయపాళెం) : రాష్ట్రానికే ప్రతిష్టాత్మకమైన బారాషహీద్ దర్గా వద్ద నిర్వహించనన్ను రొట్టెల పండగకు వచ్చే భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా వ్యవహరించడం ఏ మాత్రం సరికాదని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అన్నారు. బారాషహీద్ దర్గా వద్ద బుధవారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ దర్గా పరిసర ప్రాంతాల్లో ఏ రాజకీయ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయొద్దని హితవు పలికారు. ఫ్లెక్సీల కారణంగా భక్తి భావానికి, ప్రశాంతతకు భంగం కలుగుతుందన్నారు. వీఐపీ దర్శనాలతో సాధారణ క్యూలో ఉన్న భక్తులను గంటల తరబడి వేచి ఉండేలా చేయడం వల్ల తొక్కిసలాట జరుగుతుందన్నారు. అజ్మీర్ దర్గా తరహాలో బారాషహీద్ దర్గాకు ప్రాధాన్యత, విశిష్టత ఉందన్నారు. దేశ విదేశాల నుంచి భక్తులు లక్షలాది మంది వస్తారని, వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాల్సిన అవసరం ఉందన్నారు. రొట్టెల పండగను జాతీయ పండగగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించాలన్నారు. రొట్టెల పండగకు కేటాయించిన నిధులు సద్వినియోగం అయ్యేలా మంత్రి నారాయణ, మేయర్ అజీజ్, జిల్లా కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఏర్పాట్లు పరిశీలన బారాషహీద్ దర్గా వద్ద భక్తుల కోసం చేస్తున్న ఏర్పాట్లను రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి పరిశీలించారు. మరుగుదొడ్లు, చెరువు వద్ద ఘాట్ల నిర్మాణ పనులు చూశారు. ముస్లిం మత పెద్దలు, వక్భ్బోర్డ్ అధికారులు ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డిని గౌరవ పూర్వకంగా ఆహ్వానించి దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. వైఎస్సార్సీపీ నగర అధ్యక్షుడు తాటి వెంకటేశ్వరరావు, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి బిరదవోలు శ్రీకాంత్‌రెడ్డి, ముస్లిం మైనార్టీ నేతలు సలీమ్, హంజాహస్సేన్, మునీర్ సిద్దిక్, అబూబకర్, చిన్నమస్తాన్, రియాజ్, బాబు, కార్పొరేటర్ లేబురు పరమేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు. -
ఈ సారైనా నిధులిస్తారా..?
గతేడాది రొట్టెల పండుగకు రాష్ట్ర పండుగగా గుర్తింపు అయినా నిర్వహణకు నిధులను విడుదల చేయని ప్రభుత్వం రూ.కోటికిపైగా ఖర్చు చేసిన కార్పొరేషన్ ఈ ఏడాది రూ.50లక్షలు ఇవ్వాలని ప్రభుత్వానికి కమిషనర్ లేఖ నెల్లూరు, సిటీ: నెల్లూరులోని బారాషహీద్ దర్గాలో ఏటా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే రొట్టెల పండుగకు దేశ, విదేశాల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు తరలి వస్తుంటారు. రొట్టె పండుగ ప్రాముఖ్యత దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది జూన్‌లో రాష్ట్ర పండుగగా గుర్తిస్తున్నట్లు ప్రకటించింది. గత ఏడాది అక్టోబర్‌లో జరిగిన రొట్టెల పండుగ నిర్వహణకు కోటి రూపాయలకుపైగా ఖర్చు అయింది. ప్రభుత్వం నిధులను విడుదల చేయకపోవడంతో ఈ మొత్తాన్ని నెల్లూరు నగర పాలక సంస్థ భరించాల్సి వచ్చింది. దీంతో కార్పొరేషన్ ఆర్థిక భారంతో అప్పుల ఊబిలో కూరుకుపోయింది. రూ.80లక్షలతో శాశ్వత మరుగుదొడ్లు నిర్మాణం బారాషహీద్ దర్గాలో జరిగే రొట్టెల పండుగకు వచ్చే భక్తుల సౌకర్యార్థం నగర పాలక సంస్థ రూ.80లక్షలతో 120 శాశ్వత మరుగుదొడ్ల నిర్మాణం చేపడుతోంది. గత ఏడాది ఓ కాంట్రాక్ట్ సంస్థకు రూ.35లక్షలు చెల్లించి తాత్కాలిక మరుగుదొడ్లను ఏర్పాటు చేశారు. ఏటా జరిగే పండుగకు శాశ్వత మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టకుండా తాత్కాలిక మరుగుదొడ్లకు భారీగా ఖర్చుచేయడంపై అన్ని వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఈ ఏడాది శాశ్వతంగా మరుగుదొడ్లను నిర్మిస్తున్నారు. రాష్ట్ర పండుగగా గుర్తించిన ప్రభుత్వం నిధులను విడుదల చేయకపోవడంతో శాశ్వత మరుగుదొడ్ల కోసం ఖర్చు చేస్తున్న రూ.80లక్షలను ప్రస్తుతం కార్పొరేషన్ నిధులు నుంచి కాంట్రాక్టర్‌కు చెల్లిస్తున్నారు. అయితే అధికారులు మాత్రం మరుగుదొడ్లకు కేటాయించిన నిధులను త్వరలో స్వచ్ఛభారత్ నిధుల నుంచి కార్పొరేషన్‌కు మళ్లిస్తామని చెబుతుండడం విశేషం. రూ.50లక్షలు ఇవ్వాలని ప్రభుత్వానికి కమిషనర్ లేఖ రొట్టెల పండుగ నిర్వహణకు ఈ ఏడాది రూ.కోటికిపైగా ఖర్చు అయ్యే అవకాశం ఉందని, రూ.50లక్షలు విడుదల చేయాలని కార్పొరేషన్ కమిషనర్ కరణం వెంకటేశ్వర్లు ప్రభుత్వానికి లేఖ రాశారు. ఈ ఏడాదైన రాష్ట్ర ప్రభుత్వం స్పందించి రొట్టెల పండుగకు నిధులు కేటాయిస్తుందా..లేక గత ఏడాది పరిస్థితే పునరావృతం అవుతుందో వేచి చూడాల్సిందే. -
శాశ్వత మరుగుదొడ్ల నిర్మాణం
నెల్లూరు సిటీ: బారాషహీద్ దర్గా ప్రాంగణంలో భక్తుల సౌకర్యార్థం 120 శాశ్వత మరుగుదొడ్ల నిర్మాణాన్ని ప్రారంభించినట్లు మేయర్ అబ్దుల్ అజీజ్ పేర్కొన్నారు. బారాషహీద్ దర్గా ప్రాంగణంలో పనులను శనివారం ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. అక్టోబర్ రెండో వారంలో రొట్టెల పండగ జరగనుందని చెప్పారు. రెండేళ్లుగా తాత్కాలిక మరుగుదొడ్లను ఏర్పాటు చేశామని, దీని వల్ల ఏటా రూ.16 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు ఖర్చు చేయాల్సి వచ్చిందని చెప్పారు. శాశ్వత మరుగుదొడ్ల నిర్మాణంతో ఖర్చు తగ్గనుందని తెలిపారు. కార్పొరేటర్లు పిట్టి సత్యనాగేశ్వరరావు, మన్నెం పెంచలనాయుడు, ప్రశాంత్‌కుమార్, ప్రశాంత్‌కిరణ్, మేకల రామ్మూర్తి, కిన్నెరప్రసాద్, నాయకులు ప్రసాద్, నన్నేసాహెబ్, తదితరులు పాల్గొన్నారు.