భారీ భద్రత
-
దర్గాలో మెటల్ డిటెక్టర్ల ఏర్పాటు
నెల్లూరు(క్రైమ్):
బారాషాహీ«ద్ దర్గాలో ఈనెల 12 నుంచి 16వరకు జరగనున్న రొట్టెల పండగకు జిల్లా పోలీసు యంత్రాంగం భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తోంది. గుంటూర్, ప్రకా«శం జిల్లాలకు చెందిన 2100 మంది పోలీసులు భద్రతా విధుల్లో పాల్గొనున్నారు. ఎస్పీ విశాల్ గున్నీ అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తున్నారు.
డ్రోన్‌తో నిఘా
దర్గా ఆవరణం, కోటమిట్ట. ప్రధాన కూడళల్లో 40సీసీ కెమెరాలు, 2పిటీజెడ్ కెమెరాలు, నాలుగు డ్రోన్ కెమెరాలను వినియోగిస్తున్నారు. వీటిని నెల్లూరు, విజయవాడల్లోని కమాండ్ కంట్రోల్ సిస్టమ్‌కు అనుసంధానం చేస్తున్నారు. ఉన్నతాధికారులు విజయవాడనుంచే ప్రత్యక్షంగా రొట్టెల పండగను పర్యవేక్షిస్తూ సిబ్బందికి అవసరమైన సలహాలు, సూచనలు ఇస్తారు.
ట్రాఫిక్‌పై ప్రత్యేక దృష్టి
ట్రాఫిక్‌కు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పక్కా ప్రణాళికలు సిద్ధం చేశారు. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ డైవర్షన్లు ఏర్పాటు చేస్తున్నారు. దర్గా ఆవరణలోకి వీవీఐపీ, వీఐపీ వాహనాలతోపాటు ముందస్తు అనుమతి పొందిన వాహనాలను మాత్రమే అనుమతిస్తారు. మిగిలిన వాహనాలన్నీ పార్కింగ్ ప్రదేశాల్లోనే నిలపాలి.
పార్కింగ్ ప్రదేశాలివే
-
మాగుంటలే అవుట్‌లోని పిచ్చిరెడ్డి కల్యాణమంటపం ఎదురుగా ఉన్న స్థలం
-
టీబీ హాస్పిటల్, కస్తూరిదేవిగార్డెన్ అండ్ స్కూల్, గుంటసుబ్బరామిరెడ్డి ఇంటి సమీపంలోని వక్ఫ్‌బోర్డు స్థలం, బట్వాడిపాలెం సెంటర్‌లోని మదరసా, ఏసి సుబ్బారెడ్డి స్టేడియం(హాకీ ప్లేగ్రౌండ్), కొత్తగా నిర్మిస్తున్న జిల్లా పోలీసు కార్యాలయ ఆవరణం, నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయం, సాల్వేషనార్మి చర్చి ఆవరణలో(ద్విచక్రవాహనాలు నిలపాలి) వాహనాలు నిలపాల్సి ఉంది.
-
ట్రాఫిక్ దారిమళ్లింపు
-
పొదలకూరువైపు నుంచి వచ్చే వాహనాలను పొదలకూరురోడ్డు , కొండాయపాలెం గేటు మీదుగా నగరంలోకి, పొదలకూరు వైపు వెళ్లే వాహనాలు కేవీఆర్ పెట్రోల్ బంక్, బొల్లినేని, కొండాయపాలెం మీదుగా పొదలకూరురోడ్డులోకి వెళుతాయి.
-
-జొన్నవాడ నుంచి వచ్చే వాహనాలు బట్వాడిపాలెం సెంటర్, శాంతినగర్ మీదుగా నెల్లూరు నగరంలోకి, జొన్నవాడ వెళ్లే వాహనాలు అదే మార్గం గుండా జొన్నవాడకు వెళ్లేలా చర్యలు తీసుకొన్నారు.
-
-సుజాతమ్మకాలనీ, ఎస్పీబంగ్లా, ప్రశాంతినగర్, అంబేడ్కర్ నగర వాసులకు మాత్రం వారి ఇళ్లకు వెళ్లేందుకు వాహనాలు అనుమతి ఇస్తామన్నారు.
పోలీస్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు
దర్గా ఆవరణలో పోలీసు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. 24 గంటలు సిబ్బంది అక్కడ భక్తులకు అందుబాటులో ఉంటారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కల్గినా డయల్ 100, 9440796303, 9440796305, 9440700015కు ఫిర్యాదు చేస్తే తక్షణమే స్పందిస్తారు.