rottela pandaga
-
ఆకాంక్షలే ఆలంబనగా రొట్టెల పండగ
అక్కడకు తరలి వచ్చేవారివి చిన్న చిన్న కోరికలే. చదువు రావాలి, ఉద్యోగం రావాలి, వివాహం జరగాలి, సంతానం కలగాలి అనే... జీవితంలో ఆకాంక్షలు ఉండాలి. ఆ ఆకాంక్షలు నెరవేరతాయనే ఆశ ఉండాలి. అలాంటి వారికి అభయమిచ్చే ఆధ్యాత్మిక వేడుకలు ఎన్నో. అలాంటి వాటిలో ఒకటి ‘రొట్టెల పండగ’ నెల్లూరులో జరిగే ఈ పండగలో స్త్రీలు విశేషంగా ΄ాల్గొంటారు. ప్రతి సంవత్సరం మొహరం పండగ వేళలో నెల్లూరు వీధులు ΄ోటెత్తుతాయి. దేశ విదేశాల నుంచి జనం నెల్లూరులోని బారా షహీద్ దర్గా దగ్గరకు చేరుకుంటారు. కులం, మతం, భాష, ్ర΄ాంతం... తేడా లేకుండా అక్కడి స్వర్ణాల చెరువులో మొక్కు మొక్కుకుంటారు. లేదా తీర్చుకుంటారు. మొక్కు తీరిన వారు రొట్టె పంచుతారు. మొక్కుకునే వారు ఆ రొట్టెను స్వీకరిస్తారు. తరాలుగా వస్తున్న ఈ సంప్రదాయం చెక్కు చెదరడం లేదు. ప్రతి సంవత్సరం ఐదు రోజుల ΄ాటు జరిగే ఈ వేడుక నిన్నటి నుంచి çఘనంగా జరుగుతోంది. ఇది ప్రధానంగా స్త్రీల పండగ.ఎవరు ఈ బారా షహీద్?మహమ్మద్ ప్రవక్త సందేశాన్ని ప్రపంచ వ్యాప్తం చేయడంలో భాగంగా టర్కీ నుంచి సుమారు 300 ఏళ్ల క్రితం 12 మంది మతబోధకులు భారతదేశానికి వచ్చారు. ఆ సమయంలో కొడవలూరు మండలంలోని గండవరంలో తమిళనాడు వాల్జారాజులకు, బీజాపూర్ సుల్తాన్లకు మధ్య యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో ఈ 12 మంది వీరమరణం ΄÷ందారు. వీరి తలలు గండవరంలో తెగిపడగా మొండాలను గుర్రాలు నెల్లూరులోని స్వర్ణాల చెరువు వద్దకు తీసుకు వచ్చాయి. ఈ 12 మంది నెల్లూరు ఖ్వాజీకి కలలో కనపడి తమను అక్కడే సమాధి చేయాలని కోరడంతో అక్కడే సమాధులు నిర్మించారు. 12ను ఉర్దూలో బారా, వీర మరణం ΄÷ందిన అమరులను షహీద్‌లుగా పిలుస్తారు. అందుకే ఈ దర్గాకు బారా షహీద్ అనే పేరొచ్చింది. రొట్టెల ఆనవాయితీతమిళనాడు నుంచి నెల్లూరు వరకు ఆర్కాట్ నవాబుల ఏలుబడిలో ఉన్నప్పుడు నవాబు భార్య జబ్బు పడితే ఆమెకు నయం అయ్యే మార్గం కోసం నవాబు ఎదురు చూస్తున్నాడు. అదే సమయంలో బారా షహీద్ దర్గా దగ్గర బట్టలు ఉతుకుతున్న రజకునికి ఆ రాత్రి బారా షహీద్‌లు కనబడి మా సమాధుల దగ్గరి మట్టి తీసుకుని నవాబు భార్య నుదుటికి రాస్తే నయం అవుతుందని చె΄్పారు. ఆ సంగతి రజకుడు ఊరి వారికి తెలుపగా వారు నవాబుకు తెలియచేశారు. మట్టి తెప్పించిన నవాబు దానిని తన భార్య నుదుటికి రాయగా 24 గంటల్లో ఆమెకు నయం అయ్యింది. దాంతో అతడు అంత దూరం నుంచి బారా షహీద్ దర్గాను చూడటానికి వచ్చాడు. దర్శనం అయ్యాక అక్కడ ఉన్న పేదలకు రొట్టెలు పంచాడు. మొక్కు తీరాక ఇలా రొట్టెలు పంచడం ఆనవాయితీ అయ్యింది. ఈ నెల 21 వరకు రొట్టెల పండగ జరుగుతుంది.వివాహం రొట్టె.. సంతాన రొట్టెనెల్లూరు బారా షహీద్ దర్గాలో మొక్కు రొట్టెతో ముడిపడి ఉంటుంది. ఇక్కడకు వచ్చే భక్తులు ఉద్యోగం, ప్రమోషన్, సౌభాగ్యం, సంతానం, విద్య, స్వగృహం, వ్యా΄ారం... ఈ కోరికలు నెరవేరాలని మొక్కుకునేందుకు వస్తారు. గతంలో మొక్కిన మొక్కులు తీరిన వారు రొట్టెలతో వస్తారు. వారి నుంచి రొట్టె తీసుకోవాలి. అంటే గతంలో వివాహ మొక్కు మొక్కుకుని వివాహం జరిగిన వారు రొట్టెలతో వస్తారు. వివాహం కావలసిన వారు వారి దగ్గర నుంచి రొట్టె స్వీకరించి తినాలి. మొక్కు తీరాక వాళ్లు ఇలాగే రొట్టెను తెచ్చి ఇవ్వాలి. బారా షహీద్ దర్గా పక్కనే ఉన్న స్వర్ణాల చెరువులో మోకాళ్ల లోతుకు దిగి స్త్రీలు ఈ రొట్టెల బదలాయింపు చేసుకుంటారు. బాకీ తీరాలనే రొట్టె, స్థలం కొనాలనే రొట్టె, ర్యాంకుల రొట్టె... ఇవన్నీ అదృష్టాన్ని బట్టి దొరుకుతాయి. అన్నింటి కంటే ఎక్కువగా ఆరోగ్య రొట్టె కోసం వస్తారు. – కొండా సుబ్రహ్మణ్యం, సాక్షి, నెల్లూరు -
నేటి నుంచి రొట్టెల పండగ
కోరికలు తీర్చే వరాల పండగ వచ్చేసింది. నమ్మకాలకు, మతసామరస్యానికి ప్రతీకగా జరుపుకునే రొట్టెల పండగకు నెల్లూరు నగరం ముస్తాబైంది. బారాషహీద్ దర్గా, స్వర్ణాల చెరువు ప్రాంతాలు సర్వాంగ సుందరంగా మారాయి. నమ్మకంతో కోర్కెలు కోరుకుని రొట్టెలు పట్టుకోవడం.. అవి తీరడంతో ఏడాది తర్వాత రొట్టెలు ఇచ్చుకోవడం ఆనవాయితీగా సాగుతోంది. 1751 సంవత్సరం నుంచి ఏటా జరిగే రొట్టెల పండగ విశిష్టత సరిహద్దులు చేరిపేసింది. జిల్లాలు, రాష్ట్రాలు దాటి విదేశాల నుంచి భక్తుల రాకకు వేదికగా మారింది. శుక్రవారం నుంచి అంగరంగ వైభవంగా ప్రారంభమై 25వ తేదీ వరకూ జరిగే కార్యక్రమాలకు అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. సుమారు 10 లక్షల మంది భక్తులు హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా నగరపాలక సంస్థ అధికారులు ఏర్పాట్లు చేశారు. నెల్లూరు(వీఆర్సీసెంటర్): రొట్టెల పండగ సందర్భంగా రెండువేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఐదురోజులపాటు ప్రతిష్టాత్మకంగా జరిగే పండగకు పలు వివిధ దేశాలు, రాష్టాల నుంచి భక్తులు రానున్నారు. ఈ నేథ్యంలో జిల్లా ఇన్చార్జి ఎస్పీ సత్య ఏసుబాబు ఆదేశాల మేరకు ఏఎస్పీ పి.పరమేశ్వరరెడ్డి, జిల్లా పోలీసు అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేశారు. బుధవారమే గుంటూరు రూరల్, అర్బన్, ప్రకాశం జిల్లాలకు చెందిన పోలీసు అధికారులు, సిబ్బంది నగరానికి చేరుకున్నారు. ముగ్గురు ఏఎస్పీలు, 12 మంది డీఎస్పీలు, 41 మంది సీఐలు, 112 మంది ఎస్సైలు, 275 మంది ఏఎస్సైలు, 90 మంది హెడ్‌కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు, 100 మంది మహిళా కానిస్టేబుళ్లు, 399 మంది హోంగార్డులు, 52 మంది మహిళా హోంగార్డులు, 100 మంది ఏఆర్ సిబ్బంది, కృష్ణపట్నం పోర్టుకు చెందిన సెక్యూరిటీ సిబ్బంది, 200 మంది ఎన్సీసీ క్యాడెట్లు, ఎన్ఎఫ్ఎస్, సేవాదళ్ బృందాలు, అగ్నిమాక సిబ్బంది బందోబస్తులో ఉంటారు. కమాండ్ కంట్రోల్‌కు అనుసంధానం రొట్టెల పండగ జరిగే బారాషహీద్ దర్గా, స్వర్ణాల చెరువు, పరిసర ప్రాంతాల్లో 50 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వాటిని కమాండ్ కంట్రోల్‌రూంకు అనుసంధానం చేశారు. అంతేకాకుండా అత్యాధునిక డ్రోన్ కెమరాలను వినియోగించి నిత్యం బందోబస్తును పర్యవేక్షించనున్నారు. ప్రభుత్వ అధికారులకు.. విధులకు హాజరయ్యే ప్రభుత్వ అధికారుల వాహనాల కోసం పార్కింగ్ స్థలాలను కేటాయించారు. వీఐపీ, పోలీసు వాహనాలను పొదలకూరురోడ్డులో ఉన్న సాల్వేషన్ ఆర్మీ చర్చి, నర్సింగ్ కళాశాల ప్రాంతం, పోలీసు వసతి గృహం, డీకేడబ్ల్యూ కళాశాలలో, పోలీసు కవాతు మైదాన ప్రాంతాల్లో పార్కింగ్ చేయాల్సి ఉంటుంది. మిగిలిన శాఖల అధికారుల వాహనాలను పాత టీబీ ఆస్పత్రి ఆవరణ, నగరపాలకసంస్థ ఆవరణ, జిల్లా పరిషత్ కార్యాలయ ప్రాంగణాల్లో పార్కింగ్ చేయాలి. అదేవిధంగా ద్విచక్ర వాహనాలు, కార్లు, ఆటోలను కొత్త పోలీసు కార్యాలయం, కస్తూరిదేవి స్కూల్ మైదానం, ఉర్దూ మదరాసా స్కూల్ ప్రాంతం, కస్తూరిదేవి స్కూల్ ఎదురుగా ఉన్న ఖాళీ ప్రదేశం, సర్వోదయ కళాశాల మైదాన ప్రాంగణం, పాత సీవీ రామన్ స్కూల్, మాగుంటలేఅవుట్‌లోని రైల్వే స్థలం రోడ్డు, పిచ్చిరెడ్డి కల్యాణ మండపం ఎదురుగా, శబరి రామక్షేత్రం రోడ్డు, ఎస్సీ హాస్టల్, ఏసీ సుబ్బారెడ్డి మైదానం, ప్రభుత్వాస్పత్రి ప్రాంగణాల్లో పార్కింగ్ చేయొచ్చు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి ఈ పార్కింగ్ స్థలాల గురించి నగరంలోని పలు ప్రాంతాల్లో పోలీసు సిబ్బంది సూచనలిస్తారు. అందుబాటులో గజ ఈతగాళ్లు రొట్టెలు పట్టుకునే స్వర్ణాల చెరువులో ప్రమాదవశాత్తు ఎవరైనా ప్రమాదాలకు గురికాకుండా పోలీసులు, ఫైర్ సిబ్బంది 30 మంది గజ ఈతగాళ్లను నియమించారు. వీరు మూడు షిప్టుల్లో నిరంతరం చెరువు వద్ద పహారా కాస్తారు. పోలీసు కంట్రోల్ రూం ఏర్పాటు దర్గా వద్ద పోలీస్ కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. పండగ కోలాహలంలో ఎవరైనా తప్పిపోయినా, కనిపించకపోయినా కంట్రోల్ రూంకు వచ్చి ఆనవాళ్లతో సమాచారం అందజేయొచ్చు. మఫ్టీలో సీసీఎస్ సిబ్బందిచైన్ స్నాచింగ్, పిక్‌పాకెట్, దొంగతనాలు జరిగే అవకాశం ఉన్నందున సీసీఎస్ సిబ్బంది మఫ్టీలో తిరుగుతూ బందోబస్తు చేస్తారు. ప్రత్యేక శిక్షణ తీసుకున్న, అనుభవం ఉన్న వారిని ఏర్పాటు చేశారు. బస్సులు, భారీ వాహనాల మళ్లింపు పండగ నేపథ్యంలో శుక్రవారం నుంచి మంగళవారం వరకు నెల్లూరు నగరంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా వాహనాల మళ్లిస్తారు. పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేయటం జరిగింది. తిరుపతి వైపు నుంచి వచ్చే వాహనాలను నగరంలోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వద్ద, కావలి వైపు నుంచి వచ్చే వాహనాలను సర్వోదయ కళాశాల మైదానంలో, ఆత్మకూరు వైపు నుంచి వచ్చే వాహనాలను ఇరుగాళమ్మ దేవస్థానం, బట్వాడిపాలెం వద్ద, గొలగమూడి, అనికేపల్లి వైపు వచ్చే వాహనాలను మాగుంటలేఅవుట్ వద్ద ఉన్న పిచ్చిరెడ్డి కల్యాణ మండపం ఎదురుగా ఉన్న ప్రాంతాల్లో పార్కింగ్ చేసుకోవచ్చు. -
క్రాకర్స్ షో అదుర్స్
-
భక్తజన సందోహం
-
స్వర్ణాల మురిసింది
-
మదినిండుగ.. వరాల పండుగ
గంధం ముగిసిన రోజు భారీగా తరలివచ్చిన భక్తులు విద్యుత్ స్తంభం విరిగిపడి ఇద్దరికి స్వల్పగాయాలు సాక్షి ప్రతినిధి – నెల్లూరు: రొట్టెల పండుగకు శుక్రవారం భక్త జనం పెద్ద ఎత్తున తరలివచ్చారు. గంధం ముగిసిన మరుసటి రోజు విశిష్టమైనదిగా భావించి ఇతర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులతోపాటు స్థానికులు పెద్ద ఎత్తున దర్గాను దర్శించుకుని రొట్టెల పండుగలో పాల్గొన్నారు. 11 గంటల వరకు.. బారాషహీద్ దర్గాలో శుక్రవారం తెల్లవారు జామున జరిగిన గంధం కార్యక్రమానికి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఉదయం 11 గంటల వరకు ఈ రద్దీ కొనసాగింది. ఎండ కారణంగా సాయంత్రం 5 గంటల వరకు భక్తుల సంఖ్య తగ్గింది. 5 గంటల తర్వాత ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో పాటు స్థానికులు తరలి వచ్చారు. పండుగ ప్రారంభమైన తర్వాత శుక్రవారం సాయంత్రానికి పొదలకూరు రోడ్డు వైపు నుంచి, పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ వైపు నుంచి నిండుగా జనం కనిపించారు. స్వచ్చంద సేవా సంస్థలు భక్తులకు మజ్జిగ, తాగునీరు, భోజనం ఉచితంగా అందించాయి. మంత్రి నారాయణ, మేయర్ అజీజ్, కలెక్టర్ ముత్యాలరాజు ఏర్పాట్లను పర్యవేక్షించారు. మంత్రి నారాయణ తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మ, మేయర్ అజీజ్‌తో కలసి చెరువులో బోటు విహారం చేసి పర్యాటక శాఖ అందిస్తున్న సేవలను పరిశీలించారు. జనం పెద్దగా లేక పోవడంతో ఉదయం 11 గంటల నుంచి దర్గా ముఖద్వారంలో ఏర్పాటు చేసిన ఆర్చిల వరకు పాసులు లేక పోయినా పోలీసులు వాహనాలను అనుమతించారు. సాయంత్రం నుంచి రద్దీ పెరగడంతో పోలీసులు వాహనాల రాక పోకలను నియంత్రించారు. దర్గా దర్శనానికి వచ్చిన వీఐపీల సంఖ్య కూడా భారీగా పెరిగింది. ఇదిలా ఉంటే చెరువు ఘాట్ల వద్ద ఏర్పాటు చేసిన విద్యుత్ స్తంభం మధ్యాహ్నం సమయంలో కింద పడి ఇద్దరు భక్తులు స్వల్పంగా గాయపడ్డారు. సిబ్బంది వేగంగా స్పందించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. కృష్ణపట్నం పోర్టు, సీవీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసి 25 వేల మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. అప్పుడే ఊడిన ఘాట్ల టైల్స్ చెరువు ఒడ్డున శాశ్వతంగా ఉండే ఉద్దేశంతో నిర్మించి ఫ్లోరింగ్ టైల్స్ శుక్రవారం నాటికే అక్కడక్కడా ఊడిపోయి కనిపించాయి. పనులు వేగంగా చేయాల్సి వచ్చినందువల్ల ఈ పరిస్థితి ఏర్పడిందా? లేక పనుల్లో నాణ్యత లేకపోవడం కారణమా? అనేది అధికారులు పరిశీలించాల్సి వుంది. -
పండుగ ఏర్పాట్లు నిష్ఫలం
కమిషనర్‌పై చర్యకు మంత్రి ఆదేశం జిల్లా కలెక్టర్, ఈఎండీతో మంత్రి సమీక్ష విధుల్లో అలసత్వం వహించిన ఇద్దరు ఉద్యోగుల సస్పెన్షన్ పండుగ తర్వాత మరింత మందిపై చర్యలకు అవకాశం సాక్షి ప్రతినిధి–ఽనెల్లూరు : రొట్టెల పండుగను బ్రహ్మాండంగా నిర్వహించి భేష్ అనిపించుకోవాలనుకున్న ప్రభుత్వం అంచనాలు తల్లకిందులయ్యాయి. మున్సిపల్ మంత్రి నారాయణ నెలరోజులుగా దీనిపై దృష్టిపెట్టినా చివరికొచ్చే సరికి ఏర్పాట్లు అసంతృప్తిని మిగిల్చాయి. దీనికి తోడు గత ఏడాదితో పోల్చితే భక్తుల సంఖ్య కూడా పలుచగా కనిపించడంతో మంత్రికి ఆగ్రహం రెట్టింపైంది. కార్పొరేషన్ కమిషనర్ మీద చర్యలకు ఆయన మున్సిపల్ పరిపాలన విభాగం డైరెక్టర్‌ను ఆదేశించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. రొట్టెల పండుగ సందర్భంగా ఈ సారి 15 లక్షల మంది భక్తులు హాజరు కావచ్చని అధికారులు అంచనా వేశారు. ఒక్కరూ ఇబ్బంది పడకుండా ఉండేలా ఏర్పాట్లు చేసి ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని మంత్రి నారాయణ ప్రయత్నించారు. మేయర్ అబ్దుల్ అజీజ్, కమిషనర్ వెంకటేశ్వర్లు, ఇతర అధికారులతో కూడా ఆయన సమీక్ష జరిపారు. పండుగ ప్రారంభానికి ముందు దర్గా, స్వర్ణాల చెరువు ప్రాంతాన్ని పరిశీలించి ఏర్పాట్లు ఎలా ఉండాలనే విషయం గురించి అధికారులకు సూచనలు ఇచ్చారు. ఈ నెల 8వ తేదీ నాటికి పనులన్నీ పూర్తి కావాలని మంత్రి ఆదేశించినా పండుగ ప్రారంభమైన 12వ తేదీ నాటికి కూడా కొన్ని పనులు మిగిలిపోయాయి. ఇక పారిశుద్ధ్యం విషయానికి వస్తే తొలిరోజు అపరిశుభ్రవాతావరణం కనిపించింది. కొత్తగా నిర్మించిన మరుగుదొడ్ల నిర్వహణ అస్తవ్యస్తమై భక్తులు ఇబ్బంది పడ్డారు. దర్గా, చెరువు ప్రాంతమంతా దుమ్ముతో నిండిపోయింది. ఎండ వేడిమి తట్టుకోలేని భక్తులు సేద తీరడానికి సరైన షెడ్లు కూడా నిర్మించలేదు. రూ.కోటికి పైగా ఖర్చు చేసినా సరైన ఏర్పాట్లు చేయకపోవడం పట్ల మంత్రి నారాయణ అధికారులతో పాటు మేయర్ మీద కూడా అసహనం వ్యక్తం చేశారు. ప్రత్యేకాధికారి నియామకం కార్పొరేషన్ అధికారులు, సిబ్బంది వైఫల్యం మీద ఆగ్రహించిన మంత్రి నారాయణ గతంలో ఇక్కడ కమిషనర్‌గా పనిచేసిన మూర్తిని రొట్టెల పండుగ ప్రత్యేకాధికారిగా నియమింప చేశారు. సూళ్లూరుపేట, కావలి, ఆత్మకూరు, వెంకటగిరి, నాయుడుపేట, గూడూరు మున్సిపల్ కమిషనర్లను ఇక్కడకు రప్పించి పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. ఒంగోలు కార్పొరేషన్‌తో పాటు జిల్లాలోని మున్సిపాలిటీల నుంచి 365 మంది పారిశుధ్య సిబ్బందిని రప్పించారు. గురువారం నాటికి మున్సిపల్ పరిపాలనా డైరెక్టర్ కన్నబాబును నెల్లూరు రప్పించారు. ఏర్పాట్లలో కార్పొరేషన్ వైఫల్యం వల్ల మహిళా భక్తులు పర్యాటక శాఖ కార్యాలయం ఆవరణలోని మూత్రశాలల వద్ద క్యూ కట్టిన తీరు ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చిందనే విషయం మంత్రి గ్రహించారు. శుక్రవారం ఉదయం జిల్లా కలెక్టర్ రేవు ముత్యాలరాజు, డీఎంఈ కన్నబాబుతో రొట్టెల పండుగ ఏర్పాట్ల గురించి సమావేశమయ్యారు. పండుగ ఏర్పాట్లను కమిషనర్ సీరియస్‌గా తీసుకోలేదని, మేయర్ కూడా సిబ్బందిని అదుపులో ఉంచుకుని వేగంగా పనులు జరిపించలేక పోయారని మంత్రి అసహనం వ్యక్తం చేశారు. కమిషనర్ మీద చర్యలు తీసుకోవాలని డీఎంఈని ఆదేశించినట్లు తెలిసింది. మంత్రి ఆగ్రహం నేపథ్యంలో కార్పొరేషన్లో పనిచేస్తున్న ఇద్దరు ఉద్యోగుల మీద శుక్రవారం సస్పెన్షన్ వేటు వేశారు. ఏర్పాట్లలో వైఫల్యం కారణంగా పండుగ ముగిసిన అనంతరం మరింత మంది మీద చర్యలు ఉండొచ్చని అధికార వర్గాలు చెబుతున్నాయి. -
జన స్వాగతం
రేణిగుంట నుంచి నెల్లూరు దాకా జగన్‌కు భారీ స్వాగతం పలుచోట్ల కాన్వాయ్ ఆపడటంతో గంట ఆలస్యంగా నెల్లూరు చేరుకున్న జగన్ ప్రత్యేక హోదా కోసం దర్గాలో ప్రార్థనలు హోదా రొట్టె పట్టి పంచిన ప్రతిపక్ష నేత సాక్షి ప్రతినిధి–నెల్లూరు : రొట్టెల పండుగలో పాల్గొనడానికి శుక్రవారం ఉదయం రేణిగుంట విమానాశ్రయం నుంచి బయల్దేరిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, శాసనసభలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి దారి పొడువునా జనం ఘన స్వాగతం పలికారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం బారా షహీద్ దర్గాలో ప్రార్థనలు చేసిన అనంతరం చెరువులో రొట్టెను పట్టి అందరికీ పంచారు. అడుగడుగునా.. ప్రపంచ గుర్తింపు పొందిన రొట్టెల పండుగ ఈ నెల 12వ తేదీ నుంచి ప్రారంభమైంది. మతసామరస్యానికి ప్రతీకగా నిలిచిన ఈ పండుగలో పాల్గొనడం కోసం వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం ఉదయం హైదరాబాద్ నుంచి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. నెల్లూరు, చిత్తూరు జిల్లాలకు చెందిన పార్టీ నేతలు, కార్యకర్తలతో పాటు ప్రజలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో నెల్లూరు బయల్దేరిన జగన్‌కు శ్రీకాళహస్తి, నాయుడు పేట, గూడూరుతో పాటు దారి పొడవునా జనం స్వాగతం పలికారు. తన కోసం ప్రజలు ఎదురు చూస్తుండటంతో జగన్ వాహనం ఆపి అభివాదం చేస్తూ ముందుకు సాగారు. నెల్లూరు పట్టణంలోకి ప్రవేశించిన జగన్‌కు పార్టీ నేతలు భారీ ఎత్తున స్వాగతం పలికి బారా షహీద్ దర్గాకు తీసుకుని వచ్చారు. దీంతో మధ్యాహ్నం 12 గంటలకు దర్గాకు చేరుకోవాల్సిన ఆయన 1 గంటకు వచ్చారు. దర్గాలో ప్రార్థనల అనంతరం బయటకు వస్తున్న జగన్‌ను చూడటానికి భక్తులు ఎగబడ్డారు. ఆయనతో చేతులు కలపడానికి, సెల్ఫీలు దిగడానికి పోటీ పడ్డారు. దర్గా నుంచి స్వర్ణాల చెరువు వద్దకు వచ్చిన జగన్‌ను చూడటానికి భక్తులు చుట్టుముట్టారు. పార్టీ నాయకులతో కలసి చెరువు గట్టుకు చేరుకున్న జగన్, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం విడిచిన రొట్టెను పట్టి పార్టీ నేతలకు తినిపించారు. అక్కడి నుంచి నేరుగా తిరుగు ప్రయాణమయ్యారు. ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కాకాణిగోవర్ధన్‌రెడ్డి, అనిల్‌కుమార్ యాదవ్, మేకపాటి గౌతంరెడ్డి, కిలివేటి సంజీవయ్య, అంజాద్‌బాషా (కడప), డిప్యూటీ మేయర్ ముక్కాల ద్వారకనాథ్, ఫ్లోర్ లీడర్ రూప్ కుమార్ యాదవ్, నగర పార్టీ అధ్యక్షుడు తాటి వెంకటేశ్వర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
భారీ భద్రత ఏర్పాట్లు
నెల్లూరు(క్రైమ్): రొట్టెల పండగ నేపథ్యంలో పోలీసులు భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. దర్గాకు వెళ్లే మూడు రహదారుల్లో మెటల్ డిటెక్టర్లు, హ్యాండ్‌మేడ్ డిటెక్టర్లను ఏర్పాటు చేసి ప్రతి ఒక్కర్నీ క్షుణ్ణంగా తనిఖీ చేసిన అనంతరమే దర్గా ఆవరణలోకి అనుమతిస్తున్నారు. స్వర్ణాల చెరువు వద్ద భారీగా పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. ప్రత్యేక సేవాదళ్ సిబ్బంది దర్గా ఆవరణలో తిరుగుతూ వయోవృద్ధులు, వికలాంగులను దగ్గరుండి దర్గాను దర్శించుకునేలా చర్యలు చేపట్టారు. కొందరు చిన్నారులు తమ వారి నుంచి తప్పిపోయి ఏడుస్తూ కనిపించడంతో వారిని పోలీస్ ఔట్‌పోస్ట్ ద్వారా బాధిత కుటుంబసభ్యులకు అప్పగించేలా చర్యలు చేపట్టారు. వయోవృద్ధులు, వికలాంగులు దర్గాను దర్శించుకునేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. çవికలాంగులు, వయోవృద్ధుల వాహనాలను దర్గా సమీపంలోని చర్చి వరకు అనుమతించారు. అక్కడి నుంచి సేవాదళ్ సిబ్బంది వారిని వీల్చైర్లలో దర్గాను దర్శించుకునేలా చర్యలు చేపట్టారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా పోలీస్ అధికారులు చర్యలు చేపట్టారు. సీసీ కెమెరాలు, డ్రోన్లతో పరిశీలన దర్గా ఆవరణలో పోలీస్ అధికారులు సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాలను ఏర్పాటు చేశారు. వీటిని పోలీస్ కంట్రోల్‌రూమ్‌లోని కమాండ్ కంట్రోల్ సిస్టమ్‌కు అనుసంధానం చేశారు. ఇందులో భాగంగా అనుమానాస్పద వ్యక్తులను అదుపులోకి తీసుకొని ఫింగర్ ప్రింట్స్ స్కానింగ్ సిస్టమ్ ద్వారా వారిని పరిశీలించారు. వారి ఫింగర్‌ప్రింట్స్‌ను నేరగాళ్ల వేలిముద్రలతో పోల్చిచూశారు. ఏఎస్పీ శరత్‌బాబు పోలీస్ కంట్రోల్‌రూమ్‌లో ఉంటూ భద్రతను పర్యవేక్షించారు. భద్రత ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ దర్గా, స్వర్ణాల చెరువు, తదితర ప్రాంతాల్లో భద్రత ఏర్పాట్లను ఎస్పీ విశాల్‌గున్నీ పరిశీలించారు. దర్గా ఆవరణలోకి వాహనాలను అనుమతించరాదని, వీఐపీలను సైతం పూర్తిగా తనిఖీ చేసిన అనంతరమే లోపలికి అనుమతించాలని ఆదేశించారు. అధికారుల హెచ్చరికలు బేఖాతరు బారాషహీదులను దర్శించుకునేందుకు ప్రత్యేక మార్గాలను ఏర్పాటుచేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో క్యూలో గంటల తరబడి నిలిచిపోయారు. చక్కదిద్దాల్సిన కొందరు పోలీస్ అధికారులు, సిబ్బంది తమ విధులను పక్కనబెట్టి రౌండ్‌టేబుల్ సమావేశం ఏర్పాటు చేసుకొని పిచ్చాపాటి కబుర్లతో గడిపారు. -
సీఎం పర్యటన నేడు
నెల్లూరు(క్రైమ్): ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో జిల్లా పోలీసు యంత్రాగం అప్రమత్తమైంది. ఎస్పీ విశాల్‌గున్నీ భద్రతా ఏర్పాట్లపై తమ సిబ్బందితో బుధవారం సమావేశం నిర్వహించి తగు ఆదేశాలు జారీ చేశారు. సీఎం సెక్యూరిటీ అధికారి రాజారెడ్డి బుధవారం నెల్లూరుకు చేరుకొని ఎస్పీతో భద్రతా ఏర్పాట్లపై చర్చించారు. అనంతరం ఆయన హెలిప్యాడ్, దర్గా ప్రాంతాలను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు, సలహాలిచ్చారు. సుమారు 2వేల మంది బందోబస్తు విధుల్లో పాల్గొంటున్నారు. సీఎం పర్యటించే ప్రాంతాలన్నింటిలో బాంబ్, డాగ్‌స్క్వాడ్‌లు తనిఖీలు చేపట్టాయి. బుధవారం రాత్రి ట్రయల్కాన్వాయ్ నిర్వహించారు. -
ప్రారంభమైన పండగ
తరలివస్తున్న భక్తులు గంధమహోత్సవం నేడు బాంబు పేలుడు నేపథ్యంలో అడుగడుగునా పోలీసు భద్రత నేడు సీఎం, రేపు జగన్ రాక సాక్షి ప్రతిని«ధి–నెల్లూరు : బారాషహీద్ దర్గా ఆవరణలో బుధవారం రొట్టెల పండగ ప్రారంభమైంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. బుధవారం నుంచి 16వ తేదీ వరకు జరిగే ఈ వేడుకకు 15 లక్షల మంది హాజరవుతారని అంచనా వేసిన మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు పారిశుధ్యం విషయంలో తొలిరోజే ఘోరంగా విఫలమయ్యారు. నెల్లూరు జిల్లా కోర్టు ఆవరణలో బాంబు పేలుడు నేపథ్యంలో వీఐపీలకు సైతం తనిఖీలు తప్పడం లేదు. వాహనాల పాసుల జారీ విషయంలో పోలీసులు, కార్పొరేషన్ అధికారుల మధ్య వివాదం రేగింది. రొట్టెల పండగలో పాల్గొనడానికి గురువారం సీఎం చంద్రబాబు నాయుడు, శుక్రవారం ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నెల్లూరుకు వస్తున్నారు. రొట్టెల పండుగను ప్రభుత్వం రాష్ట్ర పండ గగా ప్రకటించిన నేపథ్యంలో ఈ సారి భారీ ఎత్తున ఏర్పాట్లు చేయడానికి కార్పొరేషన్ రంగంలోకి దిగింది. రూ.కోటికి పైగా ఖర్చు పెట్టి భక్తుల కోసం మరుగుదొడ్లు, సేద తీరే భవనాలు, రొట్టెలు మార్చుకోవడానికి ఇబ్బంది లేకుండా అనేక ఏర్పాట్లు చేస్తామని ప్రకటించారు. నెల రోజుల ముందు నుంచి మంత్రి నారాయణ, మేయర్ అజీజ్ రొట్టెల పండుగ ఏర్పాట్లపై సమీక్షలు జరిపారు. ఐదు రోజుల్లో 15 లక్షల మంది వస్తారనే అంచనాతో పారిశుధ్యంపై ఎక్కువ దృష్టి పెట్టారు. ఇందుకోసం ఏడు జోన్లు ఏర్పాటు చేసి జోన్ ఇన్‌చార్జ్‌లతో పాటు ఇద్దరు పర్యవేక్షణాధికారులు, 14 మంది మేస్త్రీలను నియమించారు. ఎక్కడా చెత్త కనిపించకుండా చేయాలనే ఉద్దేశంతో 1000 మంది తాత్కాలిక పారిశుధ్య కార్మికులను రంగంలోకి దించారు. అయితే తొలిరోజు ఊహించినంత మంది జనం రాక పోయినా పారిశుద్ధ్యం విషయంలో మాత్రం కార్పొరేషన్ అధికారులు విఫలమయ్యారు. మరుగుదొడ్లు, ఇతర ఏర్పాట్లు బాగానే ఉన్నాయని అనిపించాయి. కృష్ణపట్నం పోర్టు, సీవీ ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో భక్తులకు మజ్జిగ ప్యాకెట్లు సరఫరా చేశారు. ఐదు రోజుల్లో లక్ష మందికి మజ్జిగ పంపిణీ చేస్తున్నట్లు పోర్టు వర్గాలు చెప్పాయి. కార్పొరేషన్ అధికారులు తాగునీరు, వైద్య సహాయ శిబిరాలు ఏర్పాటు చేశారు. మిగిలిపోయిన పనులు శుక్రవారం ఉదయానికి పూర్తి చేయడం కోసం పనులు జరిపిస్తూనే ఉన్నారు. మంత్రి నారాయణ, మేయర్ అజీజ్, కలెక్టర్ ముత్యాల రాజు ఏర్పాట్లను పర్యవేక్షించారు. భక్తులకు ఆహ్లాదం కలిగించడం కోసం పర్యాటక శాఖ బోటు షికారు ఏర్పాటు చేశారు. 1800 మందితో భద్రత జిల్లా కోర్టు ఆవరణలో ఇటీవల బాంబు పేలుడు సంభవించిన నేపథ్యంలో ఎస్పీ విశాల్ గున్ని నేతృత్వంలో పోలీసు శాఖ భారీ భద్రత ఏర్పాటు చేసింది. నగరంలోని ఆర్టీసీ బస్టాండ్, రైల్వే స్టేషన్‌తో పాటు లాడ్జిల మీద నిఘా ఉంచారు. డ్రోన్, సీసీ కెమెరాలతో నిఘా పర్యవేక్షిస్తున్నారు. వీఐపీల వాహనాలను సైతం తనిఖీ చేశాకే దర్గా ప్రాంతంలోకి అనుమతించాలని పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నేడు సీఎం రాక సీఎం చంద్రబాబు నాయుడు బుధవారం మధ్యాహ్నం 3–20 గంటలకు హెలికాప్టర్లో నెల్లూరు పోలీసు పరేడ్ గ్రౌండ్స్‌కు చేరుకుని అక్కడి నుంచి దర్గాకు వెళతారు. సాయంత్రం 4–15 గంటల వరకు రొట్టెల పండగలో పాల్గొని, 4.20 నుంచి 5 గంటల వరకు ఉమేష్ చంద్ర సమావేశ మందిరంలో ప్రజాప్రతినిధులు, అధికారులతో సమావేశం నిర్వహిస్తారు. అనంతరం తిరుపతికి వెళతారు. రేపు జగన్ రాక శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం రొట్టెల పండగలో పాల్గొంటారని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తెలిపారు. మధ్యాహ్నం 12 గంటలకు దర్గాకు చేరుకుని దర్శనం చేసుకున్నాక రొట్టెల పండుగలో పాల్గొని తిరుపతికి తిరుగు ప్రయాణం అవుతారని ఆయన చెప్పారు. -
కసుమూరు దర్గాలో భక్తుల కోలాహలం
సౌకర్యాలు కల్పనలో వక్ఫ్‌బోర్డు నిర్లక్ష్యం భక్తులకు అవస్థలు కసుమూరు (వెంకటాచలం): దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధి చెందిన కసుమూరు మస్తాన్‌వలి దర్గా ప్రాంగణం బుధవారం భక్తులతో కోలాహలంగా మారింది. నెల్లూరునగరంలోని బారాషహీద్ దర్గా వద్ద జరిగే రొట్టెల పండగకు వచ్చే భక్తులు కసుమూరులోని మస్తాన్‌వలి దర్గాను దర్శించుకోవడం ఆనవాయితీ. మంగâ¶వారం రాత్రి నుంచి భక్తులు మస్తాన్‌వలి దర్గాను దర్శించుకుంటున్నారు. దర్గాలోని మస్తాన్‌వలి సమా«ధి వద్ద భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు. గురు, శుక్రవారాల్లో దర్గాకు వేలాది మంది భక్తులు రానున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాక తమిళనాడు, కర్ణాటక, కేరళ తదితర రాష్ట్రాల నుంచి భక్తులు కసుమూరు దర్గాను సందర్శించారు. భక్తులకు ఏటా తప్పని అవస్థలు కసుమూరు దర్గాకు వచ్చే భక్తులకు ఏటా అవస్థలు తప్పడం లేదు. ప్రధాన రోడ్డుమార్గంలో ఇరువైపులా దుకాణాలు ఏర్పాటు చేశారు. దీంతో ఉన్న రోడ్డు కుదించుకుపోయింది. వేలాది సంఖ్యలో వచ్చిన భక్తులు ఇరుకురోడ్డుపై రాకపోకలు సాగేంచేందుకు ఇబ్బందులు పడుతున్నారు. ఆటోలు అటూ, ఇటూ తిరగడంతో ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. ఆటోలను పోలీసులు లోపల అనుమతించడంతో భక్తులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. వసతులేవీ? కసుమూరు దర్గాకు వచ్చే భక్తులను దృష్టిలో ఉంచుకుని భక్తులకు సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత వక్ఫ్‌బోర్డుపై ఉంది. వక్ఫ్‌బోర్డు బుధవారం మధ్యాహ్నం వరకు ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు. వీధులను మాత్రం శుభ్రం చేయించారు. దర్గా ప్రాంగణంలో షామినాలు కూడా ఏర్పాటు చేయకపోవడంతో మధ్యాహ్నం వరకు దర్గాను సందర్శించుకునే భక్తులు ఎండలోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. తాగునీటి సరఫరా కేంద్రాలు కొన్ని చోట్ల మాత్రమే ఏర్పాటు చేయడంతో భక్తులు ఇబ్బందులు పడ్డారు. వక్ఫ్‌బోర్డు వసతులు సక్రమంగా కల్పించక పోవడంతో భక్తులు పొలాల గట్లుపై చెట్ల కింద సేదతీరారు. దర్గా సూపరింటెండెంట్‌ను వివరణ కోరగా భక్తుల సౌకర్యాల కోసం వక్ఫ్‌బోర్డు రూ.లక్ష కేటాయించారని తెలిపారు. తాగునీరు, పారిశుద్ధ్య సమస్య లేకుండా చర్యలు చేపడతామని తెలియజేశారు. -
రైల్వేస్టేషన్లో ప్రత్యేక భద్రత
నెల్లూరు(సెంట్రల్): రొట్టెల పండగను పురస్కరించుకొని నెల్లూరు ప్రధాన రైల్వేస్టేషన్లో 100 మందికి పైగా పోలీసులతో భద్రత కల్పిస్తున్నారు. 'ఈ సారైనా భద్రత కల్పిస్తారా?' అనే శీర్షికన సాక్షిలో సోమవారం ప్రచురితమైన కథనానికి రైల్వే ఉన్నతాధికారులు స్పందించారు. ఎప్పుడూ లేని విధంగా ఈ ఏడాది జరిగే రొట్టెల పండగకు నెల్లూరు ప్రధాన రైల్వేస్టేషన్లో భద్రత కోసం డీఎస్పీ, ఒంగోలు , చీరాల జీఆర్పీ నుంచి ఇద్దరు సీఐలు, ముగ్గురు ఎస్సైలు, ఆరుగురు హెడ్‌కానిస్టేబుళ్లు, మరో 90 మంది పోలీసులతో భద్రతను ఏర్పాటు చేశారు. నెల్లూరు ఆర్పీఎఫ్ సీఐతో పాటు మరో ఇద్దరు ఎస్సైలు, ప్రస్తుతం ఉన్న 21 మంది సిబ్బందితో పాటు అదనంగా మరో 10 మంది ఆర్పీఎఫ్ సిబ్బందిని భద్రతకు నియమించారు. రైల్వేస్టేషన్లో నెల్లూరు ఆర్పీఎఫ్ సీఐ రవిశంకర్, ఒంగోలు జీఆర్పీ సీఐ దశరథరామారావు ప్రయాణికులకు ప్రత్యేక సూచనలు చేశారు. ఎలాంటి అసౌకర్యం ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. -
రొట్టెల పండుగ కు భారీగా జనం
నెల్లూరు సమీపంలోని బారీషహీద్ దర్గాలో బుధవారం నుంచి ప్రారంభమైన రొట్టెల పండుగకు భక్తుల రద్దీ పెరుగుతోంది. బుధవారం మధ్యాహ్నం వరకు 50వేల మంది వచ్చి ఉంటారని అంచనా. సాయంత్రానికి ఈ సంఖ్య లక్షకు చేరుకుంటుందని అధికారులు అంటున్నారు. ముఖ్యంగా కర్ణాటక, కేరళ, తమిళనాడు, తెలుగు రాష్ట్రాలతోపాటు విదేశాల నుంచి కూడా ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఇటీవల నెల్లూరు పోర్టులో బాంబు పేలుడు ఘటన నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బాంబు స్వ్కాడ్లను రప్పించారు. -
రొట్టెల పండగను ప్రతిష్టాత్మకంగా నిర్వహించండి
మంతి నారాయణ నెల్లూరు, సిటీ: ఐదు రోజులు పాటు జరిగే రొట్టెల పండగను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని మంత్రి పొంగూరు నారాయణ పేర్కొన్నారు. నగర పాలక సంస్థ కార్యాలయంలోని మేయర్ చాంబర్లో సోమవారం పోలీస్, ఇరిగేషన్, మత్స్యశాఖ, కార్పొరేషన్ అధికారులతో సమీక్షించారు. పండగకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. పార్కింగ్ ప్రాంతాల నుంచి దర్గాకు ఆర్టీసీ బస్సులు నడిపేలా చూడాలన్నారు. గంధమహోత్సవానికి అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యే అవకాశం ఉన్నందున కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలన్నారు. రొట్టెల పండగకు సీయం చంద్రబాబునాయుడు రూ.5 కోట్లు మంజూరు చేశారని, స్వర్ణాలచెరువును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుని వినియోగిస్తామన్నారు. 4 లైన్ రోడ్డును త్వరతిగతిన ప్రారంభించండి నగరంలోని పాతచెక్‌పోస్ట్ నుంచి నాలుగోమైలు రోడ్డు వరకు నాలుగు లైన్ల రోడ్డును నిర్మించేందుకు త్వరితగతిన ప్రారంభించాలని అధికారులకు మంత్రి ఆదేశించారు. సమావేశంలో ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర, జేసీ ఇంతియాజ్, మేయర్ అజీజ్, కమిషనర్ కె వెంకటేశ్వర్లు, టీడీపీ నగర ఇన్చార్జ్ ముంగమూరు శ్రీధర్‌కృష్ణారెడ్డి, చాట్లనరసింహారావు తదితరులు పాల్గొన్నారు. -
భారీ భద్రత
దర్గాలో మెటల్ డిటెక్టర్ల ఏర్పాటు నెల్లూరు(క్రైమ్): బారాషాహీ«ద్ దర్గాలో ఈనెల 12 నుంచి 16వరకు జరగనున్న రొట్టెల పండగకు జిల్లా పోలీసు యంత్రాంగం భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తోంది. గుంటూర్, ప్రకా«శం జిల్లాలకు చెందిన 2100 మంది పోలీసులు భద్రతా విధుల్లో పాల్గొనున్నారు. ఎస్పీ విశాల్ గున్నీ అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తున్నారు. డ్రోన్‌తో నిఘా దర్గా ఆవరణం, కోటమిట్ట. ప్రధాన కూడళల్లో 40సీసీ కెమెరాలు, 2పిటీజెడ్ కెమెరాలు, నాలుగు డ్రోన్ కెమెరాలను వినియోగిస్తున్నారు. వీటిని నెల్లూరు, విజయవాడల్లోని కమాండ్ కంట్రోల్ సిస్టమ్‌కు అనుసంధానం చేస్తున్నారు. ఉన్నతాధికారులు విజయవాడనుంచే ప్రత్యక్షంగా రొట్టెల పండగను పర్యవేక్షిస్తూ సిబ్బందికి అవసరమైన సలహాలు, సూచనలు ఇస్తారు. ట్రాఫిక్‌పై ప్రత్యేక దృష్టి ట్రాఫిక్‌కు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పక్కా ప్రణాళికలు సిద్ధం చేశారు. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ డైవర్షన్లు ఏర్పాటు చేస్తున్నారు. దర్గా ఆవరణలోకి వీవీఐపీ, వీఐపీ వాహనాలతోపాటు ముందస్తు అనుమతి పొందిన వాహనాలను మాత్రమే అనుమతిస్తారు. మిగిలిన వాహనాలన్నీ పార్కింగ్ ప్రదేశాల్లోనే నిలపాలి. పార్కింగ్ ప్రదేశాలివే మాగుంటలే అవుట్‌లోని పిచ్చిరెడ్డి కల్యాణమంటపం ఎదురుగా ఉన్న స్థలం టీబీ హాస్పిటల్, కస్తూరిదేవిగార్డెన్ అండ్ స్కూల్, గుంటసుబ్బరామిరెడ్డి ఇంటి సమీపంలోని వక్ఫ్‌బోర్డు స్థలం, బట్వాడిపాలెం సెంటర్లోని మదరసా, ఏసి సుబ్బారెడ్డి స్టేడియం(హాకీ ప్లేగ్రౌండ్), కొత్తగా నిర్మిస్తున్న జిల్లా పోలీసు కార్యాలయ ఆవరణం, నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయం, సాల్వేషనార్మి చర్చి ఆవరణలో(ద్విచక్రవాహనాలు నిలపాలి) వాహనాలు నిలపాల్సి ఉంది. ట్రాఫిక్ దారిమళ్లింపు పొదలకూరువైపు నుంచి వచ్చే వాహనాలను పొదలకూరురోడ్డు , కొండాయపాలెం గేటు మీదుగా నగరంలోకి, పొదలకూరు వైపు వెళ్లే వాహనాలు కేవీఆర్ పెట్రోల్ బంక్, బొల్లినేని, కొండాయపాలెం మీదుగా పొదలకూరురోడ్డులోకి వెళుతాయి. -జొన్నవాడ నుంచి వచ్చే వాహనాలు బట్వాడిపాలెం సెంటర్, శాంతినగర్ మీదుగా నెల్లూరు నగరంలోకి, జొన్నవాడ వెళ్లే వాహనాలు అదే మార్గం గుండా జొన్నవాడకు వెళ్లేలా చర్యలు తీసుకొన్నారు. -సుజాతమ్మకాలనీ, ఎస్పీబంగ్లా, ప్రశాంతినగర్, అంబేడ్కర్ నగర వాసులకు మాత్రం వారి ఇళ్లకు వెళ్లేందుకు వాహనాలు అనుమతి ఇస్తామన్నారు. పోలీస్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు దర్గా ఆవరణలో పోలీసు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. 24 గంటలు సిబ్బంది అక్కడ భక్తులకు అందుబాటులో ఉంటారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కల్గినా డయల్ 100, 9440796303, 9440796305, 9440700015కు ఫిర్యాదు చేస్తే తక్షణమే స్పందిస్తారు. -
రొట్టెల పండుగకు భారీ భద్రత
–2,100మందితో బందోబస్తు డ్రోన్, సీసీ కెమెరాలతో పర్యవేక్షణ ప్రత్యేక పోలీసు సేవాదళ్ ఏర్పాటు గుంటూర్ రేంజ్ ఐజీ ఎన్. సంజయ్ నెల్లూరు(క్రైమ్): నెల్లూరు బారాషాహీద్ దర్గా ఆవరణలో ఈనెల 12 నుంచి జరగనున్న రొట్టెల పండుగకు భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తోన్నట్లు గుంటూర్ రేంజ్ ఐజీ ఎన్. సంజయ్ వెల్లడించారు. శుక్రవారం ఆయన జిల్లా ఎస్పీ విశాల్‌గున్నీ, నగర మేయర్ అబ్దుల్ అజీజ్, ఇతర పోలీసు అధికారులతో కలిసి బారాషాహీద్ దర్గాలో రొట్టెల పండుగ బందోబస్తు ఏర్పాట్లు , కమాండ్కంట్రోల్రూమ్, నూతనంగా నిర్మించిన ఘాట్లను పరిశీలించారు. అనంతరం పండుగ సందర్భగా పోలీసుశాఖ తీసుకొంటున్న భద్రతా ఏర్పాట్లను విలేకరులకు వెల్లడించారు. మతసామరస్యానికి రొట్టెల పండుగ ప్రతీక అన్నారు. దేశవిదేశాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు పండుగలో పాల్గొంటున్నారన్నారు. ఈనెల 12 నుంచి 16వరకు పండుగ జరగనుందన్నారు. గతేడాది 5లక్షల మంది దర్గాను దర్శించారనీ, ఈఏడాది 10లక్షల మందికి పైగా భక్తులు పండగుకు వచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కల్గకుండా జిల్లా పోలీసు యంత్రాగం పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తోందన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా భక్తులు దర్గాను సందర్శించేందుకు అవసరమైన అన్నీ చర్యలు చేపట్టామన్నారు. మునుపెన్నడూ లేని విధంగా అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తోన్నట్లు చెప్పారు. భక్తుల సౌకర్యార్థం దర్గా ఆవరణలో పోలీసు కంట్రోల్‌రూమ్‌ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇది 24గంటలు పనిచేస్తుందన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కల్గినా నేరుగా కంట్రోల్‌రూమ్‌లో ఫిర్యాదు చేస్తే తగిన చర్యలు తీసుకొంటామన్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా ట్రాఫిక్‌కు ఎలాంటి అంతరాయం కల్గకుండా చర్యలు చేపడుతున్నామన్నారు. ఏసిసుబ్బారెడ్డిస్టేడియం, టిబి హాస్పిటల్, కస్తూరిదేవి గార్డెన్స్ తదితర ప్రాంతాల్లో పార్కింగ్జోన్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. 2,100మందిదో బందోబస్తు... పండుగలో భక్తులు ఇబ్బందులు కల్గకుండా ఉండేందుకు భద్రతను కట్టుదిట్టం చేస్తోన్నామన్నారు. జిల్లా పోలీసులతో పాటు గుంటూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన పోలీసు అధికారులు బందోబస్తు విధుల్లో పాల్గొనున్నారని చెప్పారు. ఇద్దరు ఎఎస్పీలు, 13మంది డిఎస్పీలు, 41మంది సిఐలు,113మంది ఎస్ఐలతో పాటు 1698మంద పోలీసు సిబ్బంది, కృష్ణపట్నం పోర్టుకు చెందిన 100మంది సెక్యూరిటీగార్డులు, 100మంది ఎన్సిసి క్యాడెట్లు 24గంటలు షిఫ్టుల వారిగా బందోబస్తు నిర్వహిస్తారన్నారు. దొంగలు విజృంభించే అవకాశం ఉన్న దృష్ట్యా మఫ్టీలో క్రైం సిబ్బందిని ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రత్యేక పోలీసు సేవాదళ్ వికలాంగులు, వృద్దుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని గతంలో ఎన్నడూలేని విధంగా 33మంది పోలీసు సిబ్బందితో ప్రత్యేక పోలీసు సేవాదళ్‌ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. సదరు సిబ్బంది ప్రత్యేక దుస్తుల్లో ఉంటూ దర్గాకు వచ్చే వికలాంగులు, వృద్దులు తదితరులను దగ్గరుండి దర్గాను సందర్శించుకొనేలా చర్యలు చేపట్టామన్నారు. ఇది వారికి ఎంతో ఉపయుక్తంగా ఉంటుందన్నారు. డ్రోన్, సీసీకెమెరాల పర్యవేక్షణ: ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా దర్గా ఆవరణతో పాటు నగరంలోని పలు ప్రధాన కూడళ్ల వద్ద, గంధం వచ్చే రహదారి వెంబడి 36సీసీకెమెరాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. దర్గా ఆవరణలో ప్రత్యేకంగా నాలుగు డ్రోన్ కెమెరాలను ఏర్పాటు చేయనున్నామనీ వీటన్నింటిని కంట్రోల్‌రూమ్‌లోని కమాండ్ కంట్రోల్ సిస్టమ్‌కు అనుసంధానం చేస్తామన్నారు. అక్కడ నుంచి జిల్లా పోలీసు కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్, విజయవాడలోని రాష్ట్ర కమాండ్ కంట్రోల్ సిస్టమ్‌కు అనుసంధానం చేస్తామని పోలీసు ఉన్నతాధికారులు అక్కడ నుంచే రొట్టెల పండుగలో ఏం జరుగుతుందో ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం ఉందన్నారు. సుశిక్షతులైన సిబ్బంది 24గంటల పాటు కమాండ్ కంట్రోల్‌రూమ్‌లో ఉంటూ పత్రి ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించడం జరుగుతుందన్నారు. పండుగ సందర్భంగా ప్రత్యేక భద్రతా ఏర్పాట్లుచేపట్టిన జిల్లా ఎస్పీ విశాల్‌గున్నీని ఈ సదర్భంగా ఐజీ అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎస్బి, నెల్లూరు నగర, ట్రాఫిక్ డిఎస్పీలు ఎన్. కోటారెడ్డి, జి.వి రాముడు, నిమ్మగడ్డ రామారావు, ఒకటి, నాలుగు, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు అబ్దుల్ కరీం, సిహెచ్ సీతరామాయ్య, వెంకటరావు, ఎస్ఐలు గిరిబాబు, శ్రీనివాసరెడ్డి, బలరామయ్య, దర్గా కమిటీ సిబ్బంది తదితరులు çపాల్గొన్నారు. -
అంత ఖర్చు ఆ ఐదు రోజులకేనా ?
బారా షహీద్ దర్గా వద్ద పూర్తి కావచ్చిన 120 మరుగుదొడ్ల నిర్మాణం రొట్టెల పండుగ తర్వాత వీటి నిర్వహణపై గందరగోళం దర్గా నిర్వాహకులకు అప్పగించాలని అధికారుల యోచన ఈ భారం తమకు వద్దంటున్న దర్గా నిర్వాహకులు ముందు చూపులేక పోతే రూ 84 లక్షలు వృథాగా మారే ప్రమాదం రొట్టెల పండుగలో పాల్గొనడానికి తరలివచ్చే లక్షలాది మంది భక్తుల సదుపాయం కోసం రూ 84 లక్షలతో నిర్మిస్తున్న 120 మరుగుదొడ్ల నిర్వహణ విషయంలో గందరగోళం నెలకొంది. పండగ తర్వాత వీటిని దర్గాకు అప్పగించాలని కార్పొరేషన్ యోచిస్తుండగా, ఈ బాధ్యత తమకు వద్దని దర్గా నిర్వాహకులు చెబుతున్నారు. కార్పొరేషన్ మంచి ఆశయంతో ఖర్చు చేస్తున్న రూ 84 లక్షలు ఎందుకూ పనికి రాకుండా పోతాయా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సాక్షి ప్రతినిధి – నెల్లూరు నెల్లూరు నగరం బారా షహీద్ దర్గా ఆవరణంలో ఈ నె ల 12 నుంచి 16వ తేదీ వరకు జరిగే రొట్టెల పండుగకు సుమారు 10 లక్షల మంది భక్తులు తరలి వస్తారని అధికారులు అంచనా వేశారు. ప్రతి యేడు లాగే ఈ సారి కూడా మొబైల్ టాయిలెట్స్ ఏర్పాటు చేయాలని తొలుత భావించారు. రూ 84 లక్షలతో రెండు బ్లాక్‌లుగా 12 మరుగుదొడ్లు నిర్మించడానికి అధికారులు ప్లాన్ రూపొందించారు. కౌన్సిల్ ఈ పనులకు ఆమోద ముద్ర వేసింది. పనులకు టెండర్లు పిలవడం, కాంట్రాక్టర్ పనులు ప్రారంభించడం చకచకా జరిగిపోయాయి. ఈనెల 10 తేదీ నాటికి 120 మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేసి కార్పొరేషన్‌కు అప్పగించడానికి పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇందులో వృద్ధులు, వికలాంగుల కోసం ప్రత్యేకంగా 40 మరుగుదొడ్లు నిర్మిస్తున్నారు. ఈ వ్యర్థాలన్ని చెరువులో కలవకుండా ప్రత్యేకంగా మూడు గుంతలు నిర్మించారు. ఒక్కో బ్లాక్‌లో 22వేల లీటర్ల సామర్థ్యంతో రెండు చొప్పున రెండు బ్లాక్‌లకు కలిపి 44వేల లీటర్ల సామర్థ్యంతో నాలుగు ఓవర్ హెడ్ ట్యాంకులు నిర్మించారు. నగరంలోని బుజ్జమ్మ రేవు నుంచి ప్రత్యేకంగా పైప్‌లైన్ నిర్మించి నీటి సరఫరా చేయడానికి పనులు చేస్తున్నారు. రొట్టెల పండుగకు తరలివచ్చే భక్తులకు ఆ ఐదు రోజులు మరుగుదొడ్లు ఎంతో ఉపయోగ పడతాయి. ఆ తర్వాత పరిస్థితి ఏమిటి ? కార్పొరేషన్ లక్షల రూపాయలు ఖర్చు చేసి నగరంలో నిర్మించిన అనేక మరుగుదొడ్లు వృ«థాగా పడివున్నాయి. ప్రధాన కూడళ్లలోని మరుగుదొడ్లు మాత్రం సులభ్ సంస్థకు అప్పగించడంతో వినియోగదారుల నుంచి సొమ్ము వసూలు చేసి నిర్వహిస్తున్నారు. బారాషహీద్ దర్గా వద్ద రూ 84 లక్షలతో నిర్మిస్తున్న 120 మరుగుదొడ్లను సులభ్ లాంటి సంస్థలు తీసుకుని నిర్వహించే అవకాశం లేదు. రొట్టెల పండుగ తర్వాత ఇక్కడికి జనం పెద్దగా రారు. ఈ కారణంగా ఏ సంస్థ కూడా సొంతంగా డబ్బులు ఖర్చు చేసి మరుగుదొడ్లు నిర్వహించేందుకు ముందుకు వచ్చే అవకాశం లేదు. రొట్టెల పండుగ తర్వాత మరుగుదొడ్లను అలాగే వదిలేస్తే అందులోని కుళాయిలు, టైల్స్ కూడా పీక్కు పోయే ప్రమాదం వుంది. దీనికి తోడు ఇవి అసాంఘిక కార్యక్రమాలకు నిలయాలకుగా మారే అవకాశం ఉంటుంది. రూ 84 లక్షలు ఖర్చు చేసి మరుగుదొడ్లు నిర్మిస్తున్న కార్పొరేషన్ అధికారులకు వీటి నిర్వహణ ఎలా? అనే ఆందోళన పట్టుకుంది. పండగ తర్వాత వీటిని దర్గాకు అప్పగించాలని వారు భావిస్తున్నారు. అయితే దర్గా నిర్వాహకులు ఈ భారం తాము మోయలేమని చెబుతున్నారు. పండగ ఐదు రోజులు వీటిని బాగా ఉపయోగించి ఆ తర్వాత కార్పొరేషన్ వర్గాలు షరా మామూలుగా వీటి గురించి మరచిపోతే రూ 84 లక్షల ప్రజాధనం వృథాగా మారే ప్రమాదం వుంది.