సీఎం పర్యటన నేడు
నెల్లూరు(క్రైమ్): ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో జిల్లా పోలీసు యంత్రాగం అప్రమత్తమైంది. ఎస్పీ విశాల్‌గున్నీ భద్రతా ఏర్పాట్లపై తమ సిబ్బందితో బుధవారం సమావేశం నిర్వహించి తగు ఆదేశాలు జారీ చేశారు. సీఎం సెక్యూరిటీ అధికారి రాజారెడ్డి బుధవారం నెల్లూరుకు చేరుకొని ఎస్పీతో భద్రతా ఏర్పాట్లపై చర్చించారు. అనంతరం ఆయన హెలిప్యాడ్, దర్గా ప్రాంతాలను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు, సలహాలిచ్చారు. సుమారు 2వేల మంది బందోబస్తు విధుల్లో పాల్గొంటున్నారు. సీఎం పర్యటించే ప్రాంతాలన్నింటిలో బాంబ్, డాగ్‌స్క్వాడ్‌లు తనిఖీలు చేపట్టాయి. బుధవారం రాత్రి ట్రయల్‌కాన్వాయ్ నిర్వహించారు.