సీఎం పర్యటన నేడు
నెల్లూ(పొగతోట): సీఎం నారా చంద్రబాబునాయుడు గురువారం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 11.30 గంటలకు సీఎం విజయవాడలోని తన నివాసం నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి మధ్యాహ్నం 12.30 గంటలకు కలిగిరి మండలం పెద్దకొండూరు చేరుకుంటారు. 12.45 గంటలకు పెద్దకొండూరులోని జ్వాలముఖి ఆలయాన్ని దర్శించుకుంటారు. అనంతరం పెద్దపాడు చేరుకుని ఉదయగిరి ఎమ్మెల్యే బీవీ రామరావు కుమారుడి వివాహ రిస్పెషన్‌లో పాల్గొంటారు. మధ్యాహ్నం 1.30 గంటలకు హెలిప్యాడ్ వద్దకు చేరుకుని హెలికాప్టర్‌లో బయలుదేరివెళుతారు.
సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన
కలిగిరి: మండలంలోని పెద్దపాడులో గురువారం జరగనున్న ఉదయగిరి ఎమ్మెల్యే బొల్లినేని వెంకట రామారావు కుమారుని వివాహ రిసెప్షన్‌కి సీఎం చంద్రబాబునాయుడు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ ముత్యాలరాజు బుధవారం పెద్దపాడులో సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. హెలిప్యాడ్, సభావేదిక, పార్కింగ్ స్థలం, భోజన వసతులకు కేటాయించిన స్థలాలను పరిశీలించారు. సీఎం పర్యటన సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అప్రమత్తంగా ఉండాలని స్థానిక అధికారులను ఆదేశించారు. ఉదయగిరి, వెంకటగిరి ఎమ్మెల్యేలు బొల్లినేని వెంకట రామారావు, కురుగుండ్ల రామకృష్ణ, ఎమ్మెల్సీలు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, బీద రవిచంద్ర రిసెప్షన్ ఏర్పాట్లను కలెక్టర్‌కు వివరించారు. కలెక్టర్ వెంట జేసీ ఇంతియాజ్, కావలి ఆర్డీఓ ఎంఎల్ నరసింహం, తదితరులు ఉన్నారు.