కసుమూరు దర్గాలో భక్తుల కోలాహలం
-
సౌకర్యాలు కల్పనలో వక్ఫ్‌బోర్డు నిర్లక్ష్యం
-
భక్తులకు అవస్థలు
కసుమూరు (వెంకటాచలం): దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధి చెందిన కసుమూరు మస్తాన్‌వలి దర్గా ప్రాంగణం బుధవారం భక్తులతో కోలాహలంగా మారింది. నెల్లూరునగరంలోని బారాషహీద్ దర్గా వద్ద జరిగే రొట్టెల పండగకు వచ్చే భక్తులు కసుమూరులోని మస్తాన్‌వలి దర్గాను దర్శించుకోవడం ఆనవాయితీ. మంగâ¶వారం రాత్రి నుంచి భక్తులు మస్తాన్‌వలి దర్గాను దర్శించుకుంటున్నారు. దర్గాలోని మస్తాన్‌వలి సమా«ధి వద్ద భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు. గురు, శుక్రవారాల్లో దర్గాకు వేలాది మంది భక్తులు రానున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాక తమిళనాడు, కర్ణాటక, కేరళ తదితర రాష్ట్రాల నుంచి భక్తులు కసుమూరు దర్గాను సందర్శించారు.
భక్తులకు ఏటా తప్పని అవస్థలు
కసుమూరు దర్గాకు వచ్చే భక్తులకు ఏటా అవస్థలు తప్పడం లేదు. ప్రధాన రోడ్డుమార్గంలో ఇరువైపులా దుకాణాలు ఏర్పాటు చేశారు. దీంతో ఉన్న రోడ్డు కుదించుకుపోయింది. వేలాది సంఖ్యలో వచ్చిన భక్తులు ఇరుకురోడ్డుపై రాకపోకలు సాగేంచేందుకు ఇబ్బందులు పడుతున్నారు. ఆటోలు అటూ, ఇటూ తిరగడంతో ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. ఆటోలను పోలీసులు లోపల అనుమతించడంతో భక్తులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు.
వసతులేవీ?
కసుమూరు దర్గాకు వచ్చే భక్తులను దృష్టిలో ఉంచుకుని భక్తులకు సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత వక్ఫ్‌బోర్డుపై ఉంది. వక్ఫ్‌బోర్డు బుధవారం మధ్యాహ్నం వరకు ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు. వీధులను మాత్రం శుభ్రం చేయించారు. దర్గా ప్రాంగణంలో షామినాలు కూడా ఏర్పాటు చేయకపోవడంతో మధ్యాహ్నం వరకు దర్గాను సందర్శించుకునే భక్తులు ఎండలోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. తాగునీటి సరఫరా కేంద్రాలు కొన్ని చోట్ల మాత్రమే ఏర్పాటు చేయడంతో భక్తులు ఇబ్బందులు పడ్డారు. వక్ఫ్‌బోర్డు వసతులు సక్రమంగా కల్పించక పోవడంతో భక్తులు పొలాల గట్లుపై చెట్ల కింద సేదతీరారు. దర్గా సూపరింటెండెంట్‌ను వివరణ కోరగా భక్తుల సౌకర్యాల కోసం వక్ఫ్‌బోర్డు రూ.లక్ష కేటాయించారని తెలిపారు. తాగునీరు, పారిశుద్ధ్య సమస్య లేకుండా చర్యలు చేపడతామని తెలియజేశారు.