అధికారపార్టీ ప్రతిపక్షాన్ని శత్రుదేశంగా చూస్తోందని, ఊరు మారినా.. తీరు మారలేదని, గత మూడేళ్ల దుష్ట సంప్రదాయాన్ని కొత్త అసెంబ్లీలో కూడా కొనసాగించిందని వైఎస్‌ఆర్ సీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి విమర్శించారు. సంఖ్యాబలం ఉందని, అధికార మంద బలంతో శాసనసభలో అధికారపార్టీ నియంతలా వ్యవహరించి ప్రజావాణిని వినిపించే ప్రతిపక్ష గొంతు నొక్కేశారన్నారు.