నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీఎన్‌ఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్షుడు తిరుమల నాయుడుపై దాడికి సంబంధించి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో చర్చించాలంటూ.. తిరుమలనాయుడి భార్య, తల్లి టీడీపీ కార్యకర్తలతో కలిసి కార్యాలయం ముందు బైఠాయించారు. దాడిపై తాము కేసు నమోదు చేశామని నిందితులను గుర్తించామని పోలీసులు చెబుతున్నా టీడీపీ నేతలు వినలేదు. మరోవైపు అదే సమయంలో అక్కడకు భారీ ఎత్తున వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు చేరుకున్నారు.