ప్రత్యేక హోదా విషయంలో సీఎం చంద్రబాబు నాయుడు చిత్తశుద్ధిపై అనుమానాలున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు.
ప్రత్యేక హోదా విషయంలో సీఎం చంద్రబాబు నాయుడు చిత్తశుద్ధిపై అనుమానాలున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే.. ప్రభుత్వం ప్రవేశ పెట్టిన తీర్మానానికి మద్దతు ఇచ్చామని తెలిపారు. కాలపరిమితితో కేంద్రానికి హెచ్చరిక చేసి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కాకుండా.. ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేస్తోందని తప్పుపట్టారు. స్వప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెడితే చూస్తూ ఊరుకోమని అన్నారు.