ఎన్నికల్లో బెదిరిస్తే ఓట్లు వేస్తారా? | kotamreddy sridhar reddy slams TDP government | Sakshi
Sakshi News home page

ఎన్నికల్లో బెదిరిస్తే ఓట్లు వేస్తారా?

Apr 15 2019 12:17 PM | Updated on Mar 22 2024 10:57 AM

తనపై టీడీపీ నేతలు చేస్తున్న విష ప్రచారంపై నెల్లూరు రూరల్‌ శాసనసభ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి స్పందించారు. తాను టీడీపీ నేతలను ఎప్పుడూ బెదిరించలేదని స్పష్టం చేశారు. సోమవారం కోటంరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఓటమి భయంతోనే టీడీపీ నేతలు తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. టీడీపీ నేతలను తాను బెదిరించినట్లయితే.. అప్పుడే వారు ఎందుకు ఫిర్యాదు చేయలేదని నిలదీశారు.. టీఎన్‌ఎస్‌ఎఫ్‌ నాయకుడు తిరుమల నాయుడుతో తనకు ఎటువంటి శత్రుత్వం లేదని పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement