ఆటోడ్రైవర్ వంశీకి ఆర్థిక సాయం
నెల్లూరు(మినీబైపాస్): ప్రమాదంలో గాయపడిన ఆటోడ్రైవర్ వంశీ వైద్యఖర్చుల నిమిత్తం రూ.35 వేలను మాస్టర్‌మైండ్స్ విద్యార్థులు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం అందజేశారు. సింహపురి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వంశీని ఆదివారం ఉదయం ఎమ్మెల్యే పరామర్శించారు. మాస్టర్‌మైండ్స్ తిరుపతి, నెల్లూరు విద్యార్థులు వైద్యఖర్చుల నిమిత్తం రూ.35 వేలను వంశీ భార్య గీతకు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. రెండేళ్లలో మూడు కేసులు తన దృష్టికి వచ్చాయని, టీటీడీ ప్రాణదాన ట్రస్ట్, తిరుపతి సిమ్స్ హాస్పిటల్ సహకారం, దాతలు, సీఎం సహాయనిధి, సింహపురి ఆస్పత్రి ద్వారా వంశీకి పూర్తిస్థాయిలో నయం చేయించగలిగామన్నారు. మాస్టర్ మైండ్స్ విద్యార్థులకు కృతజ్ఞతలను తెలియజేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నగరాధ్యక్షుడు తాటి వెంకటేశ్వరరావు, కర్ణాల వంశీ, కృష్ణ, మాస్టర్‌మైండ్స్ ప్రిన్సిపల్ రవికిరణ్, వైఎస్సార్ విద్యార్థి విభాగ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జయవర్ధన్, జిల్లా ప్రధాన కార్యదర్శి మదనకుమార్‌రెడ్డి, నగరాధ్యక్షుడు శేషు, నగర కార్యదర్శులు ముజామిల్, రాకేష్, రాజా, సిద్ధార్థ, తదితరులు పాల్గొన్నారు.