ఆయన్ని వదిలేశారు ... మా వాళ్లను సస్పెండ్ చేశారు | Kotamreddy Sridhar reddy takes on AP speaker kodela sivaprasad rao | Sakshi
Sakshi News home page

ఆయన్ని వదిలేశారు ... మా వాళ్లను సస్పెండ్ చేశారు

Published Thu, Mar 19 2015 12:27 PM | Last Updated on Mon, Jul 29 2019 2:44 PM

ఆయన్ని వదిలేశారు ... మా వాళ్లను సస్పెండ్ చేశారు - Sakshi

ఆయన్ని వదిలేశారు ... మా వాళ్లను సస్పెండ్ చేశారు

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో అధికార పార్టీ సభ్యులు, స్పీకర్ వ్యవహార శైలిపై వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి గురువారం హైదరాబాద్లో నిప్పులు చెరిగారు. టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు తమ పార్టీ సభ్యులపై ఉద్దేశించి.. చంపి సమాధి కడతానంటూ నోటికి వచ్చినట్లు మాట్లాడారని.... ఆయనపై చర్యలు తీసుకునేందుకు స్పీకర్ కోడెల శివప్రసాదరావుగారికి చేతులు రాలేదు... కానీ విపక్ష సభ్యులపై సస్పెన్షన్ వేటు వేయడానికి మాత్రం చేతులు మాత్రం వచ్చాయన్నారు.

 రైతుల రుణమాఫీపై తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మాట్లాడుతుంటే... స్పీకర్ మైక్ కట్ చేస్తున్నారని ఆరోపించారు. తమను అన్యాయంగా సస్పెండ్ చేశారని తమ పార్టీ సభ్యులు ఆవేదన తెలిపేందుకు అసెంబ్లీ మీడియా పాయింట్ వద్దకు వస్తుంటే వారిని మార్షల్స్ అడ్డుకున్నారని కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి తెలిపారు. ఇలాంటి అటవీక రాజ్యం, పోలీసు రాజ్యం, రౌడీ రాజ్యంకు తాము భయపడేది లేదని ఆయన స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement