అధికార టీడీపీ నీచ రాజకీయాల వల్లే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు రావడం లేదని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి, అనిల్కుమార్ యాదవ్ ఆరోపించారు.
నెల్లూరు: అధికార టీడీపీ నీచ రాజకీయాల వల్లే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు రావడం లేదని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి, అనిల్కుమార్ యాదవ్ ఆరోపించారు. మంగళవారం నెల్లూరులో ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి, అనిల్కుమార్ యాదవ్ టీడీపీ నేతలపై మండిపడ్డారు. ప్రకాశం జిల్లాలో ఓటుకు నోటు వ్యవహారంపై జోక్యం చేసుకోవాలని వారు ఎన్నికల కమిషన్ను డిమాండ్ చేశారు. ప్రకాశం జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోటాలో టీడీపీకి మెజార్టీ లేదని ఆరోపించారు. ఈ నేపథ్యంలో మెజార్టీ ఉన్న వైఎస్ఆర్ సీపీ సభ్యులను కొనుగోలు చేసేందుకు టీడీపీ నేతలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి, అనిల్కుమార్ యాదవ్ విమర్శించారు.