వైఎస్సార్‌సీపీలో వర్గాల్లేవు.. ఉన్నవారంతా జగన్‌ సైనికులే: అనిల్‌ కుమార్‌ | Anil Kumar Yadav meets Kotamreddy Sridhar Reddy in Padayatra | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీలో వర్గాల్లేవు.. ఉన్నవారంతా జగన్‌ సైనికులే: అనిల్‌ కుమార్‌

Published Fri, Apr 15 2022 12:33 PM | Last Updated on Fri, Apr 15 2022 3:29 PM

Anil Kumar Yadav meets Kotamreddy Sridhar Reddy in Padayatra - Sakshi

శ్రీధర్‌రెడ్డితో మాట్లాడుతున్న అనిల్‌  

సాక్షి, నెల్లూరు రూరల్‌: నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి చేపట్టిన జగనన్న మాట – గడపగడపకు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి బాట కార్యక్రమానికి మాజీ మంత్రి, సిటీ ఎమ్మెల్యే డాక్టర్‌ పి.అనిల్‌కుమార్‌ యాదవ్‌ సంఘీభావం తెలిపారు. గురువారం రూరల్‌ పరిధిలోని సజ్జాపురంలో శ్రీధర్‌రెడ్డి పాదయాత్ర చేశారు.

మధ్యాహ్నం విరామ సమయంలో ఆయన్ను అనిల్‌ కలిశారు. ఈ సందర్భంగా అనిల్‌ మాట్లాడుతూ.. నెల్లూరు జిల్లా వైఎస్సార్‌సీపీలో వర్గాలు లేవు. వైఎస్సార్‌సీపీలో ఉన్నవారంతా వైఎస్‌ జగన్‌ సైనికులే. జగనన్న మాట – గడపగడపకు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి బాట కార్యక్రమం ద్వారా కోటంరెడ్డి ప్రజలకు ఆయన మరింత చేరువవుతున్నారన్నారు. ఆయన మూడోసారి కూడా రూరల్‌ నుంచి అత్యధిక మెజార్టీతో ఎమ్మెల్యేగా ఎన్నికవడం ఖాయమని చెప్పారు.  కార్యక్రమంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డి పాల్గొన్నారు.

చదవండి: (గాజువాక తహసీల్దార్‌కు 6 నెలల జైలు శిక్ష: హైకోర్టు ఉత్తర్వులు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement