నెల్లూరు సిటీ, రూరల్ ఎమ్మెల్యేలు అనిల్‌కుమార్, కోటంరెడ్డి
నెల్లూరు(సెంట్రల్) : ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాల్సిందేనని సిటీ, రూరల్ ఎమ్మెల్యేలు పి. అనిల్‌కుమార్ యాదవ్, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి డిమాండ్ చేశారు. నగరంలోని వీఆర్సీ సెంటర్లో ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ జర్నలిస్టులు శుక్రవారం చేపట్టిన 8 గంటల నిరాహార దీక్షకు సిటీ, రూరల్ ఎమ్మెల్యేలు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రత్యేక హోదాతో భావితరాలకు ఎంతో ప్రయోజనమని చెప్పారు.
పార్టీలకతీతంగా ప్రతి ఒక్కరూ ప్రత్యేక హోదా కోసం పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. సిటీ ఎమ్మెల్యే పి.అనిల్‌కుమార్‌యాదవ్ మాట్లాడుతూ రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పిన అప్పటి కాంగ్రెస్ నాయకులు, అందుకు మద్దతు పలికిన బీజేపీ నాయకులు ఇచ్చిన మాటను విస్మరించారని ధ్వజమెత్తారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావస్తున్నా ఇంత వరకు ప్రత్యేక హోదాపై స్పష్టమైన హామీ లేకపోవడం దురదృష్టకరమన్నారు.
టీడీపీ మంత్రులు కేంద్రంలో కొనసాగుతూ ఇక్కడేమో చంద్రబాబు మొసలికన్నీరు కారుస్తున్నారని ఎద్దేవా చేశారు. ప్రత్యేక హోదా కోసం జర్నలిస్టులు దీక్ష చేయడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో జర్నలిస్టుల నాయకులు చలపతి, వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లు, నాయకులు ఓబిలి రవిచంద్ర, ఊటుకూరు మాధవయ్య, గోగుల నాగరాజు, ఎమ్‌డి ఖలీల్‌అహ్మద్, డి.అశోక్, నాయకులు కుంచాల శ్రీనివాసులు, వందవాసి రంగ, గంధం సుధీర్‌బాబు, వంగాల శ్రీనివాసులురెడ్డి, శ్రావణ్, హాజీ, అఖిల్, కాకు హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ప్రత్యేక హోదాతో భావితరాలకు ప్రయోజనం
Published Sat, May 16 2015 3:05 AM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM
Advertisement
Advertisement