Mla anil kumar
-
గ్రామ వాలంటీర్లు నిబద్ధతతో పనిచేయాలి
సాక్షి, కృష్ణా జిల్లాః నవరత్నాల పథకాలు ప్రజలందరికీ చేరాలంటే వాలంటీర్లు నిబద్ధతతో పనిచేయాలని పామర్రు వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్ పిలుపునిచ్చారు. కృష్ణాజిల్లా పమిడిముక్కల మండలం వీరంకిలాకులు జడ్పీ హైస్కూల్లో గ్రామ వాలంటీర్ల శిక్షణా తరగతుల కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాల పథకాలు ప్రజలందరికీ చేరువవ్వాలనే ఉద్దేశంతో గ్రామ వాలంటీర్ల వ్యవస్థను ప్రవేశపెట్టారని తెలిపారు. తమ విధులను సక్రమంగా నిర్వర్తించి ప్రభుత్వానికి మంచిపేరు తీసుకురావాలని సూచించారు. ప్రతి కుటుంబానికి గ్రామ వాలంటీర్లు చేయూత నివ్వాలని కోరారు. -
‘బాబు’ ప్రచారానికి భక్తులు బలి
♦ అవగాహన లేని మంత్రి నారాయణకు పుష్కర పనుల బాధ్యతలా? ♦ బాధ్యులైన మంత్రులను బర్తరఫ్ చేయాలి ♦ నగర ఎమ్మెల్యే అనిల్‌కుమార్ నెల్లూరు (సెంట్రల్) : రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రచార ఆర్భాటానికి పుష్కరాలకు వచ్చిన సామాన్య భక్తులు బలి కావాల్సి వచ్చిందని నగర ఎమ్మెల్యే పి. అనిల్‌కుమార్‌యాదవ్ విమర్శించారు. బాబు లఘు చిత్రం కోసం వీఐపీ ఘాటు వదిలి పుష్కర ఘాట్‌లోకి రావడం వల్లనే ఈ దుర్ఘటన జరిగిందన్నారు. వైఎస్సార్సీపీ నగర కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మె ల్యే అనిల్ ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై పదే పదే ప్రతిపక్ష నాయకులు చెపుతున్నా పట్టించుకోలేని గుర్తు చేశారు. చంద్రబాబు మాత్రం సంబంధిత దేవాదాయ శాఖ మంత్రిని విస్మరించి బాబే స్వయంగా పనులు చూశారన్నారు. కనీస అవగాహన లేని మంత్రి నారాయణకు పుష్కర పనులు అప్పగించారన్నారు. నారాయణ మం త్రి కాదని చంద్రబాబుకు అకౌంటెంటు గా పని చేస్తున్నాడని విమర్శించారు. మంత్రులపై చర్యలు తీసుకోవాలి గోదావరి పుష్కర ఘటనకు సంబంధించి చంద్రబాబు కమిటీ వేసి కొంద రు అధికారులను బలి చేసేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. అధికారులపై నిందలు వేసి తప్పించుకునే ప్రయత్నం చేయడం సరికాదన్నారు. బాధ్యత తీసుకున్న మంత్రులందరూ ఇక్కడ ఏర్పాట్లు వదిలి విదేశాల్లో పర్యటించారని విమర్శించారు. బాధ్యులైన మంత్రులను బర్తరఫ్ చేయాలన్నారు. సమావేశంలో డిఫ్యూటీ మేయర్ ముక్కాల ద్వారకానాథ్, జిల్లా యువజన అధ్యక్షుడు పి రూప్‌కుమార్‌యాదవ్, కార్పొరేటర్లు ఊటుకూరు మాధవయ్య, ఓబిలి రవిచంద్ర, గోగుల నాగరాజు, మైనార్టీ విభాగం రాష్ట్ర కార్యదర్శి మునీర్‌సిద్ధిక్, నాయకులు వేలూరు మహేష్, వందవాసి రంగ, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. -
ప్రత్యేక హోదాతో భావితరాలకు ప్రయోజనం
నెల్లూరు సిటీ, రూరల్ ఎమ్మెల్యేలు అనిల్‌కుమార్, కోటంరెడ్డి నెల్లూరు(సెంట్రల్) : ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాల్సిందేనని సిటీ, రూరల్ ఎమ్మెల్యేలు పి. అనిల్‌కుమార్ యాదవ్, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి డిమాండ్ చేశారు. నగరంలోని వీఆర్సీ సెంటర్లో ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ జర్నలిస్టులు శుక్రవారం చేపట్టిన 8 గంటల నిరాహార దీక్షకు సిటీ, రూరల్ ఎమ్మెల్యేలు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రత్యేక హోదాతో భావితరాలకు ఎంతో ప్రయోజనమని చెప్పారు. పార్టీలకతీతంగా ప్రతి ఒక్కరూ ప్రత్యేక హోదా కోసం పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. సిటీ ఎమ్మెల్యే పి.అనిల్‌కుమార్‌యాదవ్ మాట్లాడుతూ రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పిన అప్పటి కాంగ్రెస్ నాయకులు, అందుకు మద్దతు పలికిన బీజేపీ నాయకులు ఇచ్చిన మాటను విస్మరించారని ధ్వజమెత్తారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావస్తున్నా ఇంత వరకు ప్రత్యేక హోదాపై స్పష్టమైన హామీ లేకపోవడం దురదృష్టకరమన్నారు. టీడీపీ మంత్రులు కేంద్రంలో కొనసాగుతూ ఇక్కడేమో చంద్రబాబు మొసలికన్నీరు కారుస్తున్నారని ఎద్దేవా చేశారు. ప్రత్యేక హోదా కోసం జర్నలిస్టులు దీక్ష చేయడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో జర్నలిస్టుల నాయకులు చలపతి, వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు, నాయకులు ఓబిలి రవిచంద్ర, ఊటుకూరు మాధవయ్య, గోగుల నాగరాజు, ఎమ్‌డి ఖలీల్‌అహ్మద్, డి.అశోక్, నాయకులు కుంచాల శ్రీనివాసులు, వందవాసి రంగ, గంధం సుధీర్‌బాబు, వంగాల శ్రీనివాసులురెడ్డి, శ్రావణ్, హాజీ, అఖిల్, కాకు హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.