గ్రామ వాలంటీర్లు నిబద్ధతతో పనిచేయాలి | MLA Anil Kumar Started A Training Program For Village Volunteers | Sakshi
Sakshi News home page

గ్రామ వాలంటీర్లు నిబద్ధతతో పనిచేయాలి

Published Mon, Aug 5 2019 3:38 PM | Last Updated on Mon, Aug 5 2019 3:44 PM

MLA Anil Kumar Started A  Training  Program For Village Volunteers - Sakshi

పామర్రు వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్‌

సాక్షి, కృష్ణా జిల్లాః నవరత్నాల పథకాలు ప్రజలందరికీ చేరాలంటే వాలంటీర్లు నిబద్ధతతో పనిచేయాలని పామర్రు వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్‌ పిలుపునిచ్చారు. కృష్ణాజిల్లా పమిడిముక్కల మండలం వీరంకిలాకులు జడ్పీ హైస్కూల్లో గ్రామ వాలంటీర్ల శిక్షణా తరగతుల కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌ రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాల పథకాలు ప్రజలందరికీ చేరువవ్వాలనే ఉద్దేశంతో గ్రామ వాలంటీర్ల వ్యవస్థను ప్రవేశపెట్టారని తెలిపారు. తమ విధులను సక్రమంగా నిర్వర్తించి ప్రభుత్వానికి మంచిపేరు తీసుకురావాలని సూచించారు. ప్రతి కుటుంబానికి గ్రామ వాలంటీర్లు చేయూత నివ్వాలని కోరారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement