సాక్షి, కృష్ణా జిల్లా: గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో ఏం జరగలేదంటూ మీడియాపై మంత్రి నారా లోకేష్ చిందులు తొక్కారు. విచారణ జరగక ముందే ఆ కాలేజీ ఏం జరగలేదని ఆయన తేల్చేశారు. ఈ విషయాన్ని సెన్సేషన్ చేయొద్దని మీడియాకు వార్నింగ్ కూడా ఇచ్చేశారు. ‘‘గుడ్లవల్లేరు కాలేజీలో హిడెన్ కెమెరాలు లేవు. ఎక్కడ ఒక వీడియో బయటికి రాలేదు. విద్యాశాఖ మంత్రిని కాబట్టే నా మీద ఫోకస్ పెట్టారు. కావాలని రచ్చ చేస్తున్నారు’’ అని మీడియా ప్రతినిధులపై లోకేష్ ఆగ్రహం వెళ్లగక్కారు.
మరోవైపు, గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల బాలికల వాష్ రూమ్‌ల్లో రహస్య కెమెరాల వ్యవహారంలో యాజమాన్యం, చంద్రబాబు ప్రభుత్వం దొంగాటపై ప్రజలు, మేధావులు మండిపడుతున్నారు. విద్యార్థినుల ఆరోపణల్లో వాస్తవాలు తెలుసుకుని, మనోధైర్యం నింపాల్సిన యాజమాన్యం, ప్రభుత్వం ఎందుకు నిర్బంధంగా వ్యవహరిస్తున్నాయి? అనే దానిపై అనేక అనుమానాలు కలుగుతున్నాయి.
కాగా, ప్రతిపక్ష నేతను పట్టుకుని వాడు, వీడు అంటూ వెకిలిగా మాట్లాడే హోంమంత్రి అనిత గుడ్లవల్లేరు ఎందుకు వెళ్లలేకపోయారు?. చంద్రబాబు కుమారుడు మంత్రి లోకేష్ ఆధ్వర్యంలో నడిచే ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలు ఈ వ్యవహారాన్ని వైఎస్సార్‌సీపీ మీదకు నెట్టేయడానికి ఎందుకు ప్రయత్నించాయి? ఇది ఎవరి ప్రయోజనం కోసం? అని ప్రశ్నిస్తున్నారు.
కాలేజీ యాజమాన్యాన్ని కాపాడేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ప్రజలు గమనిస్తున్నారనే ఇంగితం కూడా ఎల్లో బ్యాచ్‌కు లేకపోవడం శోచనీయం కాదా? రాష్ట్రంలో ఐపీఎస్‌లపై కక్షసాధింపులకు పాల్పడుతున్న కూటమి ప్రభుత్వం శాంతిభద్రతలను గాలికి వదిలేసిందనేది వాస్తవం కాదా?అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment