సాక్షి,విశాఖపట్నం: ఎన్నికలకు ముందు పవన్ కల్యాణ్, చంద్రబాబు రాష్ట్రంలో 30 వేల మందికిపైగా మహిళలు మాయమయ్యారని ప్రచారం చేశారని వైఎస్సార్‌సీపీ అధికారప్రతినిధి, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి గుర్తుచేశారు. ఈ మేరకు శనివారం(నవంబర్ 16) వరుదు కళ్యాణి మీడియాతో మాట్లాడారు.‘వాలంటీర్ల ద్వారా 30 వేలకు పైగా మహిళలు అక్రమ రవాణా అయ్యారంటూ అబద్ధాలు చెప్పారు.
ఇప్పుడేమో అసెంబ్లీ వేదికగా 34 మంది మహిళలే మిస్ అయ్యారని చెప్పారు. పవన్ కల్యాణ్ చంద్రబాబు మాటలు అసత్యమని అసెంబ్లీ వేదికగా తేలిపోయింది. వాలంటిర్లకు చంద్రబాబు పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలి. హిందూస్తాన్ టైమ్స్ ఇంటర్వ్యూలో చంద్రబాబు అబద్ధాలు చెప్పారు.
అబద్ధాలు చెప్పడం చంద్రబాబుకు మొదటి నుంచి అలాటు. ఫేక్ అకౌంట్స్ సృష్టించి విజయమ్మ,షర్మిళపై తప్పుడు ప్రచారం చేసింది టీడీపీనే. పవన్ కల్యాణ్ అమ్మపైన టీడీపీ సోషల్ మీడియా తప్పుడు ప్రచారం చేసింది. తన తల్లిపై లోకేష్ తప్పడు ప్రచారం చేయిస్తున్నారని పవన్ కల్యాణ్ స్వయంగా చెప్పారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న హత్యలు, అత్యాచారాలపై చంద్రబాబు పవన్ కళ్యాణ్ దృష్టి సారించాలి.కూటమి పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది’అని వరుదు కళ్యాణి ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: పోలీసుల తీరు అమానుషం.. గౌతమ్‌రెడ్డి కుమార్తె లిఖిత
Comments
Please login to add a commentAdd a comment