సర్వీస్ రోడ్డు వచ్చే వరకూ పోరాటం
-
రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్‌రెడ్డి
నెల్లూరు(మినిబైపాస్): రహదారులకు ఓవర్ బ్రిడ్జిలు, పూర్తి స్థాయి సర్వీస్ రోడ్లు నిర్మించాలని రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి డిమాండ్ చేశారు. రూరల్ పరి«ధిలోని బుజబుజ నెల్లూరు నేషనల్ హైవేలో గురువారం రాస్తారోకో నిర్వహించారు. దీంతో కిలో మీటర్ల పోడుగునా వాహనాలు ఆగిపోయాయి. వైఎస్సార్ సీపీ, సీపీఎం, లోకసత్తా, టీడీపీ నాయకులు మద్దతు తెలిపారు. రాస్తారోకో అనంతరం నేషనల్ హైవే అ«ధికారులకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోటం రడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ నగర శివారు ప్రాంతాలైన బుజబుజనెల్లూరు, చిల్డ్రన్ పార్కు ప్రాంతాలు ప్రమాదాలకు నియంగా మారాయన్నారు. ఇప్పటికి అధికారికంగా 52 మంది మృతి చెందారన్నారు. సర్వీసు రోడ్డును విస్మరించడంతో ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయన్నారు. సర్వీస్ రోడ్డు, ఓవర్ బ్రిడ్జిలను నిర్మిస్తేనే ప్రమాదాలు నివారించవచ్చన్నారు. 2003లో ఏర్పాటు చేసిన రహదారికి ఇప్పటి వరకు ఇరుపక్కల ప్రాంతాలను కలిపేందుకు అవసరమైన బాక్సు టైపు బ్రిడ్జి, ప్లయ్ ఓవర్, సర్వీసు రోడ్లను ఏర్పాటు చేయలేదన్నారు. ఇప్పటికైనా ప్రమాదాలు జరుగకుండా దృష్టి ని సారించాలని, ఇవి నిర్మించే వరకు తాత్కాలికంగా అవసరమైన ప్రమాద హెచ్చరిక బోర్డులు, ఇండికేటర్లు, నగరం నుంచి జాతీయ రహదారిని కలిపే బుజబుజనెల్లూరు, గొలగమూడి క్రాస్ రోడ్డు, చింతా రెడ్డి పాళెం, ఎన్టీఆర్ నగర్ క్రాస్ రోడ్లలో ప్రామాదాల నివారణకు తక్షణం చర్యలు చేపట్టాలని కోరారు. పార్టీ రాష్త్ర కార్యదర్శి ఆనం విజయకుమార్ రెడ్డి, సీపీఎం నేత మాదాల వెంకటేశ్వర్లు, కార్పోరేటర్ పిగిలం ప్రవీణ, లోక్ సత్తా నాయకురాలు లత, న్యాయవాది బద్దెపూడి రవీంద్ర, డాక్టర్ వేణుగోపాల్, వైఎస్సారసీపీ నేతలు ఖాదర్ బాషా, శ్రీహరి యాదవ్, జమునమ్మ, టీడీపీ నేతలు పిగిలం నరేష్ , దూడల చిన్ని, సీపీఎం నేత బషీర్, లోక్ సత్తా నాయకురాలు లత పాల్గొన్నారు.