శ్రీధర్ రెడ్డి కార్యాలయం వద్ద ఉద్రిక్తత  | Tension At Kotam Reddy Sridhar Reddy Office in Nellore | Sakshi
Sakshi News home page

శ్రీధర్ రెడ్డి కార్యాలయం వద్ద ఉద్రిక్తత 

Published Mon, Apr 15 2019 5:51 PM | Last Updated on Mon, Apr 15 2019 6:25 PM

Tension At Kotam Reddy Sridhar Reddy Office in Nellore - Sakshi

సాక్షి, నెల్లూరు : నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీఎన్‌ఎస్‌ఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు తిరుమల నాయుడుపై దాడికి సంబంధించి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో చర్చించాలంటూ.. తిరుమలనాయుడి భార్య, తల్లి టీడీపీ కార్యకర్తలతో కలిసి కార్యాలయం ముందు బైఠాయించారు. దాడిపై తాము కేసు నమోదు చేశామని నిందితులను గుర్తించామని పోలీసులు చెబుతున్నా టీడీపీ నేతలు వినలేదు. మరోవైపు అదే సమయంలో అక్కడకు భారీ ఎత్తున వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు చేరుకున్నారు.



దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. పోలీసులు జోక్యం చేసుకుని ఇరువర్గాలను చెదరగొట్టడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. వివిధ కేసులతో సంబంధం ఉన్న టీడీపీ విద్యార్థి సంఘం నేత అమృల్లాను అరెస్ట్ చేయకుండా వదిలివేయడం వల్లే.. ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు చెబుతున్నారు. తిరుమల రెడ్డిపై జరిగిన దాడితో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు..నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి. తెలుగుదేశం పార్టీ నేతలు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.
చదవండి: ‘ఓటమి భయంతోనే టీడీపీ నేతల విష ప్రచారం’

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement