
రెండో పంటకు నీళ్లివ్వాలి: వైఎస్సార్‌సీపీ
నెల్లూరు: నెల్లూరు జిల్లాలోని రైతులకు రెండో పంటకు నీళ్లివ్వాలని డిమాండ్ చేస్తూ నగరంలోని నీటిపారుదల శాఖ కార్యాలయం వద్ద బుధవారం ఉదయం వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ధర్నా చేశారు. జోరున వర్షం కురుస్తున్నా లెక్కచేయకుండా రైతులు, వైఎస్సార్‌సీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో ఆందోళనలో పాల్గొన్నారు.