
సాక్షి, నెల్లూరు : ఓ పత్రిక సంపాదకుడిపై తాను దాడికి పాల్పడినట్టు వస్తున్న వార్తలను నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఖండించారు. తనపై జరుగుతున్న దుష్ప్రచారంపై ఆయన వివరణ ఇచ్చారు. జమీన్ రైతు పత్రిక సంపాదకుడు డోలేంద్ర ప్రసాద్ అసలు పత్రిక సంపాదకుడే కాదని తెలిపారు. అతను కేవలం అక్రమ సంపాదకుడు మాత్రమేనని అని ఆరోపించారు. డోలేంద్రపై తాను హత్యాయత్నానికి పాల్పడిందనే మాటల్లో వాస్తవం లేదన్నారు. అతను బ్లాక్ మెయిలింగ్ చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. అతని గత చరిత్ర గురించి అందరికి తెలుసన్నారు. డోలేంద్ర మద్యం మత్తులో తనపై కేసు పెట్టారని.. అందులో వాస్తవాలు ఉంటే ఎలాంటి శిక్షకైనా తాను సిద్దమని స్పష్టం చేశారు.