నెల్లూరు: నెల్లూరు సమీపంలోని కనపర్తిపాడు సమీపంలో టోల్గేట్కు ప్రభుత్వం మళ్లీ అనుమతి ఇవ్వడంపై ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఆ ప్రాంతంలో టోల్గేట్ పెడితే చాలా సమస్యలు వస్తాయన్నారు. ప్రభుత్వ వైఖరిపై ఆయన నిరసన వ్యక్తం చేశారు. ఈ టోల్గేట్ అంశంలో జోక్యం చేసుకోవాలని ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి పి.నారాయణను కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి డిమాండ్ చేశారు. టోల్గేట్కు మళ్లీ అనుమతి ఇవ్వడం బాధాకరంగా ఉందని ఆయన అన్నారు.