హామీలను విస్మరించిన టీడీపీ | Promises forgotten by TDP | Sakshi
Sakshi News home page

హామీలను విస్మరించిన టీడీపీ

Published Sun, Jul 17 2016 6:23 PM | Last Updated on Mon, Oct 29 2018 8:29 PM

హామీలను విస్మరించిన టీడీపీ - Sakshi

హామీలను విస్మరించిన టీడీపీ

 
–నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి
నెల్లూరు(మినిబైపాస్‌): 
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను టీడీపీ విస్మరించిందని నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి పేర్కొన్నారు. రూరల్‌ మండలంలోని మాదరాజు గూడూరు, కాకుపల్లి, ఆకుతోట ప్రాంతాల్లో ఆదివారం గడపగడపకూ వైఎస్సార్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 900కు పైగా హామీలను ఇచ్చి అ«ధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ నేడు ఆ హామీలను నెరవేర్చలేదన్నారు. ఆ హామీలపై ప్రజాబ్యాలెట్‌ నిర్వహించి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు గడపగడపకూ వైఎస్సార్‌ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ప్రతి పక్ష ఎమ్మెల్యేగా తాను అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నానన్నారు. తనకు ఇచ్చే గ్రాంటు కూడా ప్రభుత్వం ఇవ్వడం లేదన్నారు. అయినా నిరంతరం ప్రజల సమస్యల పరిష్కారం కోసం తన వంతు కషి చేస్తున్నానని తెలిపారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆనం విజయకుమార్‌రెడ్డి మాట్లాడుతూ అధికార పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చుతుందా లేదా అనే విషయాన్ని ప్రజలే నిర్ణయించాలన్నారు. సమస్యల పరిష్కారం కోసం కోటంరెడ్డికి అండాగా ఉంటానన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నగర అధ్యక్షుడు తాటి వెంకటేశ్వరరావు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement