'టీడీపీ పాలనకు రోజులు దగ్గరపడ్డాయి'
విశాఖపట్టణం: రాష్ట్రంలో తెలుగుదేశం పరిపాలనకు రోజులు దగ్గరపడ్డాయని, తప్పు మీద తప్పు చేస్తూ సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోందని వైఎస్సార్‌సీపీ పశ్చిమ నియోజయవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్ విమర్శించారు.
నగరంలోని 47వ వార్డులో సోమవారం ఆయన గడపగడపకూ వైఎస్సార్‌సీపీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వ తీరును ఎండగట్టారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను చంద్రబాబు ప్రభుత్వం విస్మరించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.