
సాక్షి, నెల్లూరు జిల్లా: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆమంచర్లలో ‘జగనన్న మాట-గడపగడపకూ కోటంరెడ్డి బాటలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. అరుంధతీ వాడలో సహపంక్తి భోజనం చేసిన అయన అలసటకు గురయ్యారు. అక్కడి నుంచి ఇంటికి చేరుకొన్న కోటంరెడ్డి ఒక్కసారిగా కుప్పకూలిపోయారు.
చదవండి: ఆత్మకూరు ఉప ఎన్నికలో బీజేపీ పోటీ: ఎంపీ జీవీఎల్
నడవలేని పరిస్థితిలో ఉన్న ఆయన్ని కుటుంబసభ్యులు అపోలో ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స అందించిన వైద్యులు చెన్నైకి రెఫర్ చేసారు. సమాచారం అందుకొన్న మంత్రి కాకాణి ఆసుపత్రికి చేరుకుని కోటంరెడ్డిని పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితితిపై వైద్యులను అడిగి తెలుసుకొన్నారు. మెరుగైన వైద్యం కోసం చెన్నైకి కోటంరెడ్డిని తరలించారు.
కోటంరెడ్డి ఆరోగ్య పరిస్థితిపై, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి, ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి ఆరా తీశారు. ఎమ్మెల్యే సోదరుడు గిరిధర్‌రెడ్డితో మాట్లాడి ధైర్యం చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment