ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రివిలేజ్ కమిటీ శనివారం అసెంబ్లీ హాల్లో సమావేశమైంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు కొడాలి నాని, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇవాళ మధ్యాహ్నం కమిటీ ఎదుట విచారణకు హాజరయ్యారు.
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రివిలేజ్ కమిటీ శనివారం అసెంబ్లీ హాల్లో సమావేశమైంది. ఈ సందర్భంగా నోటీసులు అందుకున్న ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రు, కొడాలి నాని, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇవాళ మధ్యాహ్నం కమిటీ ఎదుట విచారణకు హాజరయ్యారు. అయిదుగురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కొడాలి నాని, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, జ్యోతుల నెహ్రులకు సభా హక్కులు కమిటీ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. కాగా అనారోగ్యం కారణంగా విచారణకు హాజరు కావడం లేదని ఎమ్మెల్యే రోజా లేఖ పంపారు.
అంతకు ముందు ఎమ్మెల్యే కోటంరెడ్డి మాట్లాడుతూ తానెప్పుడు అప్రజాస్వామికంగా మాట్లాడలేదన్నారు. తనకు సభపై పూర్తి గౌరవం ఉందని, వివపక్షం టార్గెట్గా నోటీసులు ఇవ్వడం సరికాదన్నారు. అధికారపక్ష సభ్యులు ఏం మాట్లాడినా పట్టించుకోరా అని శ్రీధర్ రెడ్డి ప్రశ్నించారు. స్వయంగా సీఎం, మంత్రులే బూతులు మాట్లాడారని, వాళ్లను పట్టించుకోకుండా తమకు మాత్రమే నోటీసులు ఇవ్వడం సమంజసమా అని అన్నారు.